కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 2/8 పేజీ 11
  • సంపద సంతోషాన్ని కొనగలదా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంపద సంతోషాన్ని కొనగలదా?
  • తేజరిల్లు!—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఐశ్వర్యం మీకు సంతోషాన్ని ఇవ్వగలదా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • సంతృప్తి, ఉదారంగా సహాయం చేసే లక్షణం
    తేజరిల్లు!—2018
  • నిజమైన సంతోషాన్ని ఎలా పొందవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • సంతోషం కోసం అన్వేషణ
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 2/8 పేజీ 11

సంపద సంతోషాన్ని కొనగలదా?

ఎక్కువ డబ్బు కలిగి ఉండడం ప్రజలను సంతోషవంతులుగా చేయదనేది స్పష్టం. సైకాలజీ టుడే అనే పత్రిక ఇలా చెబుతుంది: “ఒకసారి, దారిద్ర్యరేఖకు ఎగువన చేరుకున్నను, ఆశ్చర్యకరంగా, ఆదాయ పెరుగుదలకు వ్యక్తిగత సంతోషానికి సంబంధమే లేదు.”

అక్టోబరు 29, 1993 న్యూయార్క్‌ టైమ్స్‌లోని మరణవార్త దీనిని రూఢి చేసింది, ఆ వార్తాశీర్షిక ఇలా ఉంది: “సంతోషాన్ని కొనలేని గొప్ప సంపదకు వారసురాలైన 80 ఏండ్ల డారిస్‌ డ్యూక్‌ మరణించింది.” ఆ శీర్షిక ఈ విధంగా చెప్పింది: “తన విస్తారమైన సంపద సంతోషానికి కొన్ని విధాల్లో ప్రతిబంధకమయ్యిందని రోమ్‌నందు, 1945లో అప్పట్లో 33 ఏండ్లున్న కుమారి డ్యూక్‌ ఒక సాయంకాలం ఒక స్నేహితురాలితో చెప్పింది.”

“కొన్నిసార్లు ఆ డబ్బంతా ఒక సమస్యగానే ఉంటుంది,” అని డ్యూక్‌ తన స్నేహితురాలితో రహస్యంగా చెప్పింది. “నేను ఒక పురుషునితో కొన్నిసార్లు బయటకు వెళ్ళిన తర్వాత, ఆయన నన్నెంతగా ప్రేమిస్తున్నాడో చెప్పనారంభించాడు. కాని ఆయన నిజంగానే చెబుతున్నాడని నేనెలా తెలుసుకోగలను? నేనెలా నిశ్చయపరచుకోగలను?” టైమ్స్‌ ఈ విధంగా చెప్పింది: “ఆమె సంపద ఆమె జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, గాయపరచిందని కూడా ఆ రాత్రి ఆమె చెప్పిన మాటలు చూపిస్తున్నాయి.”

అదే విధంగా, ఒకప్పుడు ప్రపంచంలో అమిత ఐశ్వర్యవంతుడని పేరుగాంచిన జాన్‌ పాల్‌ జెట్టీ ఈ విధంగా చెప్పాడు: “డబ్బుకు సంతోషంతో తప్పనిసరిగా ఏదైనా సంబంధముండాలని లేదు. అయితే అసంతోషంతో సంబంధం ఉండవచ్చు.” పందొమ్మిది వందల డెబ్బైయవ పడిలో ఒక్కో సినిమాకు ఐదు లక్షల డాలర్ల చొప్పున తీసుకున్న ప్రసిద్ధ హాలీవుడ్‌ నటియైన జేన్‌ ఫాండా ఈ విధంగా చెప్పింది: “నేను సంపదను, అలాగే భౌతిక వస్తువులనన్నింటిని అనుభవించాను. వాటికి ఏ అర్థమూ లేదు. ధనవంతులు మానసిక వైద్యులను సంప్రదించవలసి వస్తుంది. మరి విడాకుల సంగతి మరియు తల్లిదండ్రులను ద్వేషించే పిల్లల సంగతి చెప్పనవసరమే లేదు.”

సంపద మాత్రమే సంతోషాన్ని తేలేకపోయినట్లే, అతి పేదరికం కూడా సంతోషాన్నివ్వ లేదు. కాబట్టి ఎంతో కాలం క్రితం ఒక జ్ఞాని ఈ విధంగా చెప్పాడు: “పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ చేయకుము.” (సామెతలు 30:8, 9) ఒక వ్యక్తి సంతోషంగా ఉండేందుకు “సంతుష్టి సహితమైన దైవభక్తి” అవసరమని, “మనమీ లోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము,” అని మరొక బైబిలు రచయిత వ్రాశాడు.—1 తిమోతి 6:6-10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి