వ్యాధిలేని లోకం
“మలేరియా ఎవరూ ఊహించని దానికన్నా చాలా చురుకైనది,” ఇమ్యూనోలజిస్ట్ అయిన డా. డాన్ గోర్డన్ యిలా అంటున్నాడు. “ఈ సమస్యకు ఒక పరిష్కారం కొరకు మేం ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనేవున్నాము.”
హావార్డ్ హగ్స్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లోని బారీ బ్లూమ్ ఇలా అంటున్నారు, “ఇప్పటికీ [క్షయవ్యాధికి కారణమైన సూక్ష్మక్రిముల] రసాయనిక మార్పులను గూర్చి మాకు సరిగ్గా తెలియదు, ఏ మందు ఎలా పనిచేస్తుందో మాకు తెలియదు. మాకు నిజంగా తెలియదు.”
“సురక్షితమైన లైంగికత” అనే ప్రచారాల ద్వారా సిఫిలిస్‌ను తగ్గించడంలో పొందిన పరాజయాన్ని అవలోకిస్తూ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రతినిధి యిలా విలపిస్తున్నాడు, “జ్ఞానం నడవడిని తప్పనిసరిగా మార్చకపోవచ్చు.” పైన చెప్పబడిన మాటలు సూచిస్తున్నట్లు, మలేరియాకు, క్షయవ్యాధికి, సిఫిలిస్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటాలు నిరాశాజనకంగా ఉన్నాయి. భవిష్యత్తు యీ వ్యాధులకు మెరుగైన చికిత్సా విధానాలను తెస్తుందా?
బహుశా తేవచ్చు. అయితే మానవుడు కొన్ని వ్యాధులను నివారిస్తూ మరి కొన్నింటిని సులభంగా వ్యాపించడానికి అనుమతిస్తున్నాడు, తాను వ్యాధికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో పూర్తిగా విజయం సాధించలేకపోవడానికి ఒక ప్రాథమిక కారణముంది.
వ్యాధికి మూల కారణం
వ్యాధినెదుర్కోవడంలో పరాన్నజీవులతో, సూక్ష్మక్రిములతో పోరాడేకన్నా ఎక్కువే ఉంది. మన మొదటి మానవ తండ్రి నుండి వారసత్వంగా పొందిన పాపం నుండే మరణం పరిణమించిందని బైబిలు వివరిస్తుంది. (రోమీయులు 5:12) మానవునికి తన సృష్టికర్తతోగల సంబంధాన్ని పాపం చెరపడమే కాక, అతడు మానసికంగా, భావోద్రేకంగా, శారీరకంగా కూడా క్షీణించడానికి నడిపించింది. అలా, భూపరదైసులో పరిపూర్ణతయందు కొనసాగడానికి బదులుగా, మానవులు అపరిపూర్ణులై, మరణించే వరకు వారు కృశించిపోయారు.—ఆదికాండము 3:17-19.
మానవుడు శ్రేష్ఠమైన ఏ మందుతో కూడ తన పాపభరితమైన పరిస్థితినిగానీ, దాని ఫలితాలనుగానీ మార్చలేడు. ఈ క్లిష్టపరిస్థితి మానవున్ని “దాస్యములో” [“హద్దుల్లో,” ఫిలిప్స్] ఉంచుతుంది. (రోమీయులు 8:20) వ్యాధిని జయించే విషయంలో కూడ ఇది నిజమే. వైద్య రంగంలో ప్రాణాన్ని-రక్షించడంలో కలిగిన పురోగతి తరచూ ప్రాణభీతిని కల్గించే సమూహ నాశనంవలన నిరర్థకంగా చేయబడింది.
డిస్కవర్ అనే పత్రికలో జెరాల్డ్ ఎమ్. లోన్‌స్టీన్ యిలా వ్రాస్తున్నాడు, “మనం సందిగ్ధావస్థలో పడ్డాం. మనం వ్యాధికి వ్యతిరేకంగా పోరాడడంలో, మానవ ఆయుస్సును పెంచడంలో ఎంతగా విజయం సాధించామో, మన నాశనం కూడ అంత ఎక్కువగా కన్పిస్తుంది.” దీనికిగల కారణం జనాబా పెరుగుదల, పర్యావరణ క్షీణదశయే.
నిజమైన స్వస్థత
రోగానికి నిజమైన చికిత్స మానవుల నుండి లభించదుగానీ, అది సృష్టికర్త నుండే లభిస్తుంది. అందుకే కీర్తన రచయిత యిలా అన్నాడు: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి.” బైబిలు యింకా యిలా చెబుతుంది: “ఎవడు తన దేవుడైన యెహోవామీద ఆశపెట్టుకొనునో వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని . . . సృజించినవాడు.” (కీర్తన 146:3, 5, 6) రోగాన్ని దాని వేరుతోపాటు నిర్మూలించగల శక్తి దేవునికి మాత్రమే ఉంది. బైబిలులో చెప్పబడినట్లు, ఆయన అలా చేయడానికే సంకల్పించాడు. ఆ సమయం సమీపిస్తుంది.
మనం ప్రస్తుత విధానాంతంలోను, రాబోయే నూతన లోకానికి ముందుగాను జీవిస్తున్నామని నిరూపించే సూచనల్లో ఒకటిగా యేసుక్రీస్తు “తెగుళ్ళను” గూర్చి ప్రవచించాడు. అలాగే, యుద్ధం, కరువు, అక్రమం వంటి, వ్యాధి విజృంభించడానికి కారణమయ్యే పరిస్థితులు పెరుగుతాయని ఆయన ప్రవచించాడు.—లూకా 21:11; మత్తయి 24:3, 7, 12; 2 తిమోతి 3:1-5, 13.
యేసు భూమిమీద ఉన్నప్పుడు, రోగులను ఆయన అద్భుతంగా స్వస్థపర్చాడు, అలా, “అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను” అన్న ప్రవచనాన్ని నెరవేర్చడం ఆరంభించాడు. (యెషయా 53:4; మత్తయి 8:17) త్వరలో ఆ విధంగా దేవుడు భూవ్యాప్తంగా ఏమి చేయాలని సంకల్పించాడో, ఆయన స్వల్ప రీతిలో చేసి చూపించాడు. యేసునుగూర్చి బైబిలు ఈ విధంగా చెబుతుంది: “బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను. మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడిరి.”—మత్తయి 15:30, 31.
ఆ అద్భుతాలు చూసిన ప్రజలు దేవున్ని మహిమపర్చారు ఎందుకంటే అద్భుతాలు చేయడానికి యేసుకు ఆయనే శక్తిని అనుగ్రహించాడని వారు గ్రహించారు. యేసుకు లభించిన శక్తీ, మహాద్భుతమైన యీ విశ్వాన్ని సృష్టించడానికి ఉపయోగించబడిన శక్తీ ఒక్కటే. అదే దేవుని పరిశుద్ధాత్మ, ఆయన చురుకైన శక్తి.—ఆదికాండము 1:1, 2; ప్రకటన 4:11.
“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు” అనే సమయం వస్తుందని యెషయా ప్రవక్త వ్రాశాడు. (యెషయా 33:24) ప్రకటన 21:4, 5 యిలా అంటుంది: “‘ఆయన [దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను’ అని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు—‘ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని’ చెప్పెను.”
మార్పు వచ్చే కాలంలో మనం జీవిస్తున్నామని బైబిలు చూపిస్తుంది. (1 యోహాను 2:15-17) రోగం, దుఃఖం, నేరం, దౌర్జన్యం, మరణంతోపాటు, ఈ లోకం త్వరలోనే గతించనైవుది. ఈ భూమి మీద “నీతి నివసించు” ఒక నూతన లోకం కొరకు మార్గాన్ని సుగమం చేయడానికి దేవుడు దాన్ని, దాని వైపరీత్యాలన్నింటిని తీసివేస్తాడు. (2 పేతురు 3:11-13) ఏదేనులోని మొదటి పరదైసు తోటవలె భూమ్యంతా ఉంటుంది గనుకనే యేసు రానున్న ఆ నూతన లోకాన్ని “పరదైసు” అని పిలిచాడు.—లూకా 23:43; ఆదికాండము 2:7, 8.
కాబట్టి క్రైస్తవులకు తాత్కాలిక చికిత్సను గూర్చిన నిరీక్షణే కాక, అపరిపూర్ణత నుండి, వ్యాధి నుండి, మరణం నుండి శాశ్వతమైన విడుదల లభిస్తుందన్న నిరీక్షణకూడ ఉంది. వారు దేవుని వాగ్దానాల పూర్తి నెరవేర్పుకొరకు ఎదురుచూస్తున్నారు: “నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే.” “నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.”—నిర్గమకాండము 15:26; 23:25. (g93 12⁄8)
[9వ పేజీలోని చిత్రాలు]
యేసు చనిపోయినవారిని లేపడానికి రోగులను స్వస్థపరచడానికి దేవుని నుండి శక్తిని పొందాడు