కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 12/8 పేజీ 29
  • “సహనం అనే పాఠం నేర్చుకొనుట”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “సహనం అనే పాఠం నేర్చుకొనుట”
  • తేజరిల్లు!—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వాతంత్ర్యాలను సంరక్షించడం—ఎలా?
    తేజరిల్లు!—1999
  • సహనం ఒక కొననుండి మరొక కొనకు
    తేజరిల్లు!—1997
  • తేడాలు చూపించకుండా సహనం చూపించండి
    తేజరిల్లు!—2015
  • వేరేవాళ్ల నమ్మకాల్ని, అభిప్రాయాల్ని గౌరవించడం—బైబిలు ఇచ్చే సలహా
    అదనపు అంశాలు
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 12/8 పేజీ 29

“సహనం అనే పాఠం నేర్చుకొనుట”

మనం ఈ 20వ శతాబ్దాంతానికి చేరుకుంటూండగా, సాధారణ మానవజాతి 1914 నుండి కొనసాగుతున్న దాని హింసాత్మక చరిత్రనుండి ఏ పాఠాలనైనా నేర్చుకుందా? యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ) డైరక్టర్‌ జనరల్‌ అయిన ఫెడారికో మేయర్‌ ది యునెస్కో కొరియర్‌కు శీర్షిక వ్రాసినప్పుడు ఆయన భవిష్యత్తులో మంచి జరుగుతుందనే ఉద్దేశంతోలేడు. “ఈ లోకం ఉద్భవించిన తీరును తెలుసుకోవచ్చు. . . . హృదయపూర్వకమైన ఉత్సాహాన్ని అది ప్రేరేపించదు. మత సిద్ధాంతాలు, జాతీయత, జాతి, కుల వైషమ్యాలు, యూదుల యెడల ద్వేషభావం: స్వతంత్రతా వాయువులు ద్వేషాగ్ని కణాలను రగిలించాయి. . . . పాత విధానం కుప్పకూలి అన్ని రకాల నూతన ఆరంభాలకు వీలుకల్పించింది, వాటిలో కొన్ని పూర్తిగా గందరగోళంగా ఉన్నవి, మరి హింసాకాండ పెచ్చుపెరుగుతుంది.”

హింసాకాండ ఎందుకు పెచ్చుపెరుగుతుంది? ప్రజలెందుకు ఇతరులను ద్వేషిస్తారు, కేవలం మత విభేదాలవల్లనా లేక కుల పూర్వరంగాల వల్లనా? యుగోస్లావియా, ఇండియా, ఉత్తర ఐర్లాండ్‌, అమెరికా లేదా ప్రపంచంలో మరెక్కడైనా కాని, పెడత్రోవపట్టించిన విద్యావిధానమే మూల కారణమైనట్లు కనబడుతుంది. ఒకరినొకరు సహించడం, గౌరవించడం నేర్చుకునేందుకు బదులుగా, ప్రజలు అపనమ్మకాన్ని ద్వేషాన్ని తమ తలిదండ్రులనుండి, పాఠశాలనుండి, సమాజంనుండి నేర్చుకుంటున్నారు.

ఫెడారికో మేయర్‌ యిలా చెప్పసాగాడు: “లక్షలాదిమంది మానవులు ఓర్చుకోలేని బీదరికం, ఆకలి, బాధను సహించేందుకు మనకు ఓర్పును దయచేసే సందేహాత్మక సహనాన్ని వదలిపెడదాం. మనమలా చేస్తే, కరుణ, సోదరభావాల తేజోకాంతుల్లోని స్నేహశీలతతో తారసిల్లుతాము.” ఇవి ఉత్తమ అభిప్రాయాలే. కాని తేజోవంతమైందని పిలువబడే మన ప్రపంచంలో దాగియున్న చీకటిని మార్చగల ఏ యోజనకర పద్ధతులున్నాయి?

“నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” యెహోవా యొక్క ఈ మాటలను యెషయా 2,500 సంవత్సరాల పూర్వం వ్రాశాడు. (యెషయా 54:13) “దేవుడు ప్రేమాస్వరూపి” గనుక, ఎవరైతే నిజంగా ఆయన సూత్రాలనుబట్టి జీవిస్తారో వారివెంటే అది ఉంటుంది, తద్వారా వారు యుద్ధానికి బదులు శాంతిని; ద్వేషానికి బదులు ప్రేమను; ఓర్వలేనితనానికి బదులు సహనాన్ని నేర్చుకుంటారు.—1 యోహాను 4:8.

శాంతి, ప్రేమ, సహనాలకు నడిపించే ఈ బోధను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వారి జాతీయత ఏదైనప్పటికి ఐక్యంగా జీవించే ప్రజలెవరైయున్నారు? ద్వేషపూరిత స్వరూపాన్ని పూర్తిగా ప్రేమపూరితంగా మార్చిన బైబిలు విద్యను అందుకున్న వారెవరు? యెహోవాసాక్షులెందుకు నిజంగా ప్రపంచవ్యాప్త ఐక్యతను కల్గియున్నారో కనుగొనడానికి వారి బోధలను, అలవాట్లను పరిశీలించండని మిమ్మల్ని మేము ప్రోత్సహిస్తున్నాము.—యోహాను 13:34, 35; 1 కొరింథీయులు 13:4-8. (g93 9/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి