కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 12/8 పేజీలు 30-31
  • ప్రపంచ పరిశీలన

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రపంచ పరిశీలన
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యూరోపియన్‌ న్యాయస్థానం గ్రీకు సాక్షులకు అనుకూలంగా తీర్మానించింది
  • నిద్ర రుణం
  • వయస్సుతో పనిలేదు
  • ఉద్యోగస్థలాల్లో స్త్రీలను వేధించుట
  • జపానీయుల విశ్వవిద్యాలయంలో బైబిలు తరగతులు
  • ఎయిడ్స్‌ నిరోధించడం కష్టమా?
  • ఆసియాలో బాల వ్యభిచారం పెచ్చుపెరిగిపోతుంది
  • హడావుడి ఆరాధన
  • జంతువుల కొరకు ఆరాధన
  • కళ్ల నొప్పిని తగ్గించుట
  • చర్చీలు అమ్మబడును
  • పరుగెత్తడంవల్ల వచ్చే అలసట
  • డెంగ్యూ—ఒక్క కాటుతో వచ్చే జ్వరం
    తేజరిల్లు!—1998
  • ఎయిడ్స్‌—నేను అపాయంలో ఉన్నానా?
    తేజరిల్లు!—1993
  • ఎయిడ్స్‌—యౌవనస్థులకొక క్లిష్టమైన సమస్య
    తేజరిల్లు!—1992
  • ఎయిడ్స్‌—తలిదండ్రులు, పిల్లలు దాన్నిగూర్చి ఏమి తెలుసుకోవాలి
    తేజరిల్లు!—1992
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 12/8 పేజీలు 30-31

ప్రపంచ పరిశీలన

యూరోపియన్‌ న్యాయస్థానం గ్రీకు సాక్షులకు అనుకూలంగా తీర్మానించింది

ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో మే 25, 1993న యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానం నిర్ణయించిన తీర్మానంలో యెహోవాసాక్షులు చట్టపరమైన ఘనవిజయం పొందారు. ఇది చట్టవిరుద్ధంగా మతమార్పిడిచేస్తున్నాడనే నేరంతో ఖైదుచేయబడ్డ మినోస్‌ కోకినాకిస్‌ అనే 83 సంవత్సరాల సాక్షికి సంబంధించిన కేసు. మార్చి 20, 1986లో క్రేతులోని లెసిథి క్రిమినల్‌ కోర్టుద్వారా ఆయనకు నాలుగు నెలల జైలుశిక్ష విధించబడింది. అయినను, ఆరుగురు న్యాయవాదులు, ముగ్గురు న్యాయవాదులకు వ్యతిరేకంగా చేసిన తీర్మానంలో యూరోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానం అతని జైలుశిక్షను తారుమారు చేసింది. గ్రీకు ఆర్థొడాక్స్‌ చర్చి ప్రభావం దృఢంగావున్న గ్రీసు ప్రభుత్వం, చట్టవిరుద్ధంగా మతమార్పిడిచేస్తున్నారనే ఆరోపణలతో, శతాబ్దాలుగా యెహోవాసాక్షులకు జైలుశిక్ష విధించడానికి కారణమయ్యింది. ఈ కేసులో గ్రీకు ప్రభుత్వం కోకినాకిస్‌గారి హక్కులను అతిక్రమించిందని యూరోపియన్‌ కన్వెన్షన్‌ కనుగొంది. ఈ తీర్మానం వారి హింసను అంతంచేసి, చట్టబద్ధంగా వారు చేస్తున్న పరిచర్యను సమాధానంగా కొనసాగించుటకు వీలుకల్పిస్తుందని గ్రీసులో 26,000కంటే ఎక్కువగావున్న సాక్షులు నిరీక్షిస్తున్నారు. (g93 8/22)

నిద్ర రుణం

“తగినంతగా నిద్రపోని వారు కూడ మిగిలిన వారివలే నడవగలరు, వినగలరు, చూడగలరు. అయినప్పటికి, పరిశోధన వెల్లడిచేసేదేమంటే హేతుబద్ధంగా ఆలోచించే సామర్థ్యం, నిర్ణయాలుచేసే శక్తి, చురుకుగా ఉండే శక్తి సన్నగిల్లిపోతుందని” వేజా అనే పత్రిక చెబుతుంది. అవసరమైనంత నిద్రపోకుండా ఉండటంవల్ల వచ్చే ప్రమాదాలను గూర్చి హెచ్చరిస్తున్న నిపుణుల వ్యాఖ్యానాలను ఈ శీర్షిక పేర్కొంది. నిద్రకు సంబంధించిన బ్రెజీలియన్‌ సంస్థకు అధ్యక్షుడైన డేనిస్‌ మార్టినెజ్‌ చేసిన పరిశోధన చూపేదేమంటే, “ఉద్యోగాల్లో జరిగే ప్రమాదాల్లో పదింట రెండు రాత్రివేళ తగినంతగా నిద్రపోనందువల్లనే.” కొంచెం మాత్రమే నిద్రించే వారిని “ఉదాహరణకు, మూడుచోట్ల ఉద్యోగంచేసేవాళ్లంతా . . . వారి ఆరోగ్యాన్ని ఉద్యోగ సంతలో అమ్ముకుంటున్నారని” డా. మార్టినిజ్‌ హెచ్చరిస్తున్నారు. (g93 8/22)

వయస్సుతో పనిలేదు

‘విద్యకు వయస్సుతో పనిలేదు.’ ఈ పాత సామెత నిజమే అన్నట్టు, బెర్నాబా అవాన్హాలెస్టా అనే చురుకైన 93 ఏళ్ల వృద్ధుడు, తన విశ్వవిద్యాలయ చదువుల్ని మరో రెండు సంవత్సరాల్లో పూర్తిచేయటానికి ఎదురుచూస్తున్నాడు. ఆయన స్పెయిన్‌లోని వేలెన్సియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్‌ చదువుతున్నాడు, మరి ఆయన చదువులకు అంకితమైనందువల్ల విద్యావిషయంగా సాధించినదాని నిమిత్తం ఇప్పటికే ఆయనకు బహుమతి లభించింది. “చదువుకోవడం కంటే మనోహరమైనదేముంది,” అంటూ బెర్నాబా వివరిస్తున్నాడు, ఆయన ప్రతి ఉదయం 8 గంటలకు విశ్వవిద్యాలయం చేరుకుని, తరచూ తన సాయంకాల తరగతులను 9 గంటల వరకూ కూడ ముగించడు. చదువుకోడానికి వృద్ధులకు మంచి అవకాశాలున్నాయని బెర్నాబా నమ్ముతాడు. “నీకు జీవితంలో చదువుకోడానికి సమయముండేది ఇప్పుడే,” అని ఆయన అంటున్నాడు. ఎప్పుడూ చురుకుగా ఉండటమనేది ఆయన జీవితానికి ఒక అర్థాన్నిస్తుందని అతని భార్య సృతికలుపుతుంది. (g93 8/22)

ఉద్యోగస్థలాల్లో స్త్రీలను వేధించుట

పని చేస్తున్న సమయాల్లో లైంగికంగా వేధించబడుతున్నామని అందులో పనిచేస్తున్న స్త్రీలలో 70 శాతంమంది ఫిర్యాదు చేశారని కెనడాలోని టొరాంటోలోవున్న టొరాంటో ఆసుపత్రిలో జరిపిన ఇటీవలి అధ్యయనం వెల్లడిచేసింది. ది టొరాంటో స్టార్‌ పత్రిక ప్రకారం, స్త్రీలలో 2 శాతంమంది అత్యాచారం చేయబడ్డారని, స్త్రీలలో 1 శాతంమంది లైంగికంగా మోసగించబడ్డారని రిపోర్టు చేశారు. “అగౌరవంగాను లేదా సంస్కారం లేని రీతిలో పిలువబడుతున్నారని,” వారిలో పలువురు స్త్రీలు చెబుతుండగా, “భూతుమాటలతో ఆటపట్టిస్తున్నారని” మరి అనేకమంది ఫిర్యాదు చేశారు. ఈ స్టార్‌ పత్రిక నివేదించేదేమంటే, ఉద్యోగం చేసే స్త్రీలలో షుమారు 60 శాతంమంది ఈ ఆసుపత్రిలో “కొన్నిచోట్ల అప్పుడప్పుడు భద్రతలేకుండా ఉన్నట్లు భావించారు.” (g93 9/8)

జపానీయుల విశ్వవిద్యాలయంలో బైబిలు తరగతులు

జపాన్‌లో గౌరవప్రదమైన వాసెడా యూనివర్సిటీలో సాహిత్య విభాగానికి చెందిన విద్యార్థులపై జరిపిన ఇటీవలి అధ్యయనం వెల్లడి చేసేదేమంటే, “చాలామంది విద్యార్థులు పురాతన గ్రంథాలను ప్రాముఖ్యంగా పాశ్చాత్య సంస్కృతులను అవగాహన చేసుకోడానికి చాలా విలువైనదని భావించిన బైబిలును గూర్చి ఎక్కువగా అధ్యయనం చేయాలని ఆతురపడ్డారని” ది డైలీ యోమియూరి రిపోర్టుచేస్తుంది. అప్పటికే సాహిత్యరంగంలో ఉన్నతస్థానం పొందిన ఈ యూనివర్సిటీ, దాని కోర్సులకు 1993 వసంతకాల విద్యాసంవత్సరంతో బైబిలు తరగతులను కూడ చేర్చింది. రెండు సంవత్సరాల క్రితం విద్యామంత్రిత్వశాఖ యూనివర్సిటీలకు వాటి బోధనా కార్యక్రమాలను సరిచేసుకోడానికి ఎక్కువ స్వతంత్రత నిచ్చినప్పటినుండి, పాఠశాల యొక్క పాఠ్యప్రణాళికను తయారుచేయుటలో విద్యార్థులు భాగంవహించేలా వారిని అనుమతించడం జపాన్‌లో ఇది మొట్టమొదటి సంఘటన. (g93 9/8)

ఎయిడ్స్‌ నిరోధించడం కష్టమా?

ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఎయిడ్స్‌ వ్యాధి ప్రస్తుతం నిరోధించలేనంత కష్టంగావుందా? అయ్యుండవచ్చు, అని అమెరికాలోని హార్వార్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్లోబల్‌ ఎయిడ్స్‌ పాలిసి సమిష్టిసంఘం సంగ్రహించిన 1,000 పేజీల నివేదిక వివరిస్తుంది. ది గార్డియన్‌ వీక్లీ ప్రకారం, నివేదిక వెల్లడిచేసేదేమంటే, ఏ దేశం కూడ ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టలేకపోయింది, మరి ఐరోపాలో ఈ వ్యాధి తగ్గుముఖం పట్టిందని చెప్పినవారు పొరబడియుండవచ్చు. అదే నివేదిక యిలా వివరిస్తుంది: “ఈ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ అంటురోగం నూతనంగా, మరెక్కువ ప్రమాదకరమైన రూపం దాల్చుతుంది. భూవ్యాప్తంగా భయం పెరుగుతుండగా, వృద్ధవుతుందనే విషయం తెలియకుండానే సంభరపడిపోవడం, తదేకంగా కాదనడం, విజృంభిస్తుందనే విచక్షణ అనే సూచనలనేకం ఉన్నాయి. (g93 9/8)

ఆసియాలో బాల వ్యభిచారం పెచ్చుపెరిగిపోతుంది

“నీవు పదవ యేట యౌవనురాలివి, ఇరవయ్యో యేట వృద్ధస్త్రీవి, ముప్పయ్యో యేట చచ్చినదానవు.” నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ట్రేవలర్‌ అనే పత్రిక ప్రకారం అది థాయిలాండ్‌లోని బాంకాక్‌లో బాల వ్యభిచారులను గూర్చి చెప్పే ఒక సాధారణ సామెత. ఆసియాలో షుమారు 10 లక్షలమంది బాల వ్యభిచారులున్నారు, వారిలో అనేకమంది పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్నవారే. పెచ్చుపెరుగుతున్న ఈ చట్టవిరుద్ధ పరిశ్రమను విహారయాత్రలే పోషిస్తున్నాయని ఈ పత్రిక పేర్కొంటుంది. అనేకమైన బాల వ్యభిచార సంస్థలు ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా, పశ్చిమ ఐరాపాల్లోని ‘అవినీతి విహారయాత్రీకులను’ ఆసియా దేశాలకు వెళ్లేటట్లు ప్రోత్సహిస్తున్నాయి. ఇటీవల లండన్‌లో ది టైమ్స్‌ పత్రిక రిపోర్టు చేసిందేమంటే, ప్రతి సంవత్సరం దాదాపు 5,000 మంది ఆడపిల్లలను నేపాల్‌ పర్వత ప్రాంతాలనుండి ఇండియాలోని బొంబాయినందలి వ్యభిచార గృహాలకు వ్యభిచారిణిలుగా “క్రొత్తగా చేర్చుకుంటున్నారు.” షుమారు 2,00,000 మంది ప్రస్తుతం అక్కడున్నారు, వారిలో సగంమందికి ఎయిడ్స్‌ వ్యాధిని కలుగజేసే హెచ్‌ఐవి వైరస్‌ సోకింది. బాగా సంస్థీకరించబడిన వ్యాపార సంస్థల ద్వారా ఆడపిల్లలను పశ్చిమ ఐరోపా, అమెరికా దేశాలకు కూడ పంపిస్తున్నారు. (g93 9/8)

హడావుడి ఆరాధన

“చర్చి సేవ ఉదయం 11 గంటలకు మొదలై, ఓ గంట లేదా కొంచెం ఎక్కువ మాత్రమే ఎందుకుంటుంది?” ఇది ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక బాప్టిస్ట్‌ పరిచారకుడు అడిగిన ప్రశ్న, మరి టైమ్స్‌ వెస్ట్‌ వర్జీనియన్‌లో అసోసియేటెడ్‌ ప్రెస్‌ ప్రచురించిన రిపోర్టు ప్రకారం, ఈ ప్రశ్న ఊహించదగిన పరిష్కారానికే నడిపింది. తాను “ప్రసంగించడానికి, పాటలను పాడించడానికి, లేఖనాలు చదవడానికి, ప్రార్థన చేయడానికి తన సంఘం చర్చిని విడిచిపెట్టడానికి సరిపడే 22 నిమిషాల చిన్న ఒప్పందిత ఆరాధనా కార్యక్రమం” అందిస్తానని మతగురువు చెబుతున్నాడు. అసోషియేటెడ్‌ ప్రెస్‌ ప్రకారం, “హడావుడిగా [ఫాస్ట్‌ ఫుడ్‌ రెస్టారెంట్‌] మేక్‌డోనాల్డ్‌ ఆహారానికి చేసినట్టే చర్చికి కూడా చేయడానికి” మతగురువుకు అవకాశమిచ్చేలా ప్రసంగం కేవలం ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయినను, ఈ రిపోర్టు యింకా చెప్పేదేమంటే, “చందా గిన్నెను అందరికీ అందించడానికి మాత్రం కావలసినంత సమయం వెచ్చించబడుతుంది.” (g93 9/8)

జంతువుల కొరకు ఆరాధన

ఇటీవల ఇటలీ మతగురువుల నుండి జంతువులు ప్రత్యేక అవధానాన్ని అందుకుంటున్నట్లుగా కనబడుతుంది. “జంతువులు ప్రేమించే సామర్థ్యం లేనివని” చెబుతున్నందువల్ల జెసూట్‌లను “నాస్తికులు,” “సృష్టికి విరోధులు” అని ఫ్రాన్సిస్కోలోని మతవిధానం ఇటీవల నిందించింది. మారియో కాంచాని అనే ఉత్తమ కాథోలిక్కు మతాధికారి, చర్చి దృక్పథాన్ని ఈ విధంగా చెప్పాడు: “[కాథోలిక్కు] చర్చి అనేది అన్ని జీవరాసులనూ అనుమతిస్తుంది.” కాబట్టి, లా రిపబ్లికా అనే ఇటాలియన్‌ వార్తాపత్రిక ప్రకారం, రోమ్‌లో చర్చికి వెళ్లేవారు ఎంతోకాలంగా తమ “పెంపుడు జంతువు”లకు కూడా ఆశీర్వాదాలను సంపాదించేవారు. అలాంటి అవకాశం గురించి ఈ పత్రిక ప్రకటిస్తూ, వివరించేదేమంటే, “క్రైస్తవులని యుక్తంగా పిలువబడే వారితోపాటు, ఆశీర్వాదాలు పొందాలని కోరుకునే పిల్లులు, కుక్కలు, చిలుకలు, కుందేళ్లు, ఆ ప్రాంతంలోని మరితర జంతువులన్నీ కూడ ఆరాధనకు హాజరుకావచ్చును.” (g93 8/22)

కళ్ల నొప్పిని తగ్గించుట

మీ టీవీ లేదా కంప్యూటర్‌ తెరను చూడటంవల్ల మీ కళ్లు నొప్పితో బాధపడుతుంటే, మీరు కేవలం తెరను క్రిందకు దించడం, మరియు పైకి పెట్టడంతో ఉపశమనం పొందవచ్చు. క్రిందివాలుగా చూచినప్పటికంటే సమాంతరంగా చూచినప్పుడు ప్రజలు తమ కళ్లను తక్కువగా మిటకరిస్తూ, పెద్దగా తెరుస్తారనే దానిపై ఆధారం చేసుకుని, న్యూ ఇంగ్లాండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ నుండి, ఈ సలహా యివ్వబడింది. తక్కువగా మిటకరించడమంటే కళ్లు తడిగావుండే స్వభావం తక్కువగా వుంటుందని, వాటిని పెద్దగా తెరవడమంటే కంటి రక్షకపొరకున్న తేమ తొందరగా ఆరిపోతుందని దాని భావం. (g93 9/8)

చర్చీలు అమ్మబడును

ఇటలీలోని రోమన్‌ కాథోలిక్కు చర్చి ఆధ్వర్యంలో ఎన్ని మతసంబంధ భవనాలున్నాయో కచ్చితంగా తెలియదు గాని, అది వాటన్నింటిని సంరక్షించలేక పోతుందనే విషయం మాత్రం వాస్తవం. నెమ్మదిగా పాడైపోతున్నటువంటి విడిచిపెట్టబడ్డ చర్చి భవనాల సంఖ్య ప్రతిరోజూ పెరిగిపోతుంది. కాబట్టి, మతకార్యక్రమాలకు ఉపయోగించని ప్రత్యేక భవనాలను అమ్మాలా అనేది చర్చి నిర్ణయిస్తుందని, కౌన్సిల్‌ ఫర్‌ ది కల్చరల్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ ఇటాలియన్‌ చర్చ్‌ అధ్యక్షుడైన పియెట్రో ఆంథోనియో గార్లాటో చెప్పాడు. ఎన్ని చర్చీలు అమ్మకంలో పెట్టబడతాయి? ఇటలీలోని 95,000 కంటే అధికంగావున్న చర్చీలలో “10 శాతం సూచించే సంఖ్యను ప్రాథమిక అంచనా వేసిందని” ఎల్‌ మెసాజెరో అనే వార్తాపత్రికలో బిషప్‌ వివరించాడు. (g93 9/8)

పరుగెత్తడంవల్ల వచ్చే అలసట

జర్మనీలోని బెర్లిన్‌ ఆర్థోపెడిక్‌ యూనివర్సిటీ క్లినిక్‌ నుండి వచ్చిన అధ్యయనం ప్రకారం, సైకిలు తొక్కడంవల్ల శరీరంలో కీళ్లకు వచ్చే అలసట కంటే పరుగెత్తడంవల్ల వచ్చే అలసట పది రెట్లు అధికంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే కృత్రిమంగా తయారుచేసిన తుంటికీలు సాధనాన్నుపయోగించి, ఈ యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు మొదటిసారిగా వేర్వేరు పనులు చేసినప్పుడు ఒక్కొక్క కీలుకు కలిగే అలసటను కొలువగల్గారు. “సాధారణంగా సైకిలు తొక్కేవారికంటే పరుగెత్తేవారే తమ కండరాల నరాలకు, కీళ్లకు అలసట పుట్టిస్తారని ఇంతకుముందే సాధారణంగా ఊహించినప్పటికి, అంత ఎక్కువ విభిన్నతను చూచి పరిశోధకులు కూడ ఆశ్చర్యపోయారని” సూడొయిస్చె జెయిథంగ్‌ అనే జర్మను వార్తాపత్రిక రిపోర్టుచేస్తుంది. (g93 9/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి