ఆస్ట్రేలియా కేంద్రప్రాంతానికి సఫారి బస్సుల్లో ప్రయాణం
ఆస్ట్రేలియాలోని అవేక్! ప్రతినిధి ద్వారా
మీరు ఎన్నడైనా మొసళ్లతో నిండివున్న నదిలో ప్రయాణించారా? నాగరికతకు వందల మైళ్లదూరంలో, ఒక వెన్నెలరాత్రిలో గుంపుగా కలసి పాడుటయందు మీరెప్పుడైనా ఆనందించారా? గంటకు 100కిలోమీటర్ల వేగంతో రహదారిపై ప్రయాణిస్తూనే క్రైస్తవ కూటంలో మీరెన్నడైనా భాగం వహించారా? ఆస్ట్రేలియాలోని తీక్షణమైన వేడిమిగల కేంద్రప్రాంతమైన ఆలిస్ స్ప్రింగ్స్‌లో జరిగే యెహోవాసాక్షుల జిల్లాసమావేశానికి, వేర్వేరు ప్రాంతాలనుండి బస్సులో (సఫారి కోచ్‌లో) ప్రయాణిస్తున్న వందల కొలది ప్రతినిధులు ఆనందించిన అనుభవాలలో ఇవి కేవలం కొన్ని మాత్రమే.
“‘సఫారి’ అనే పదం సరియైనదే” అని ఒక ప్రతినిధి అన్నారు, “ఎందుకంటే ఇద్దరు నిద్రపోడానికి సరిపోయే గుడారాల్లో ఆరుబయటే మేము నిద్రపోయాం. మేము ఆలిస్ స్ప్రింగ్స్‌కు చేరుకునేటప్పటికి, మూడు నిమిషాల లోపులోనే మేము మా గుడారాలను వేయగల్గాం! అది దాదాపు ఒక అతివేగంగా తిరిగే వీడియోను తిలకిస్తున్నట్లుగానే వుంది: బస్సులు అలా ఆగిపోతాయ్, ఒక ఖాళీ వనం అకస్మాత్తుగా ఏర్పడిన డజన్లకొద్దీ చిన్నచిన్న గుడారాలతో నిండిపోతుంది.”
“ది ఆలిస్”కు స్వాగతం
ఎర్ర ఎడారితో చుట్టుముట్టిన ఆలిస్ స్ప్రింగ్స్ (స్థానికులంతా “ది ఆలిస్” అని పిలుస్తారు.) వర్థిల్లుతున్న ఒక నీటిబుగ్గ (ఒయాసిస్). అది 23,000 జనాబాను కల్గి, ఆస్ట్రేలియా ఖండానికి భౌగోళిక కేంద్రంలో దక్షిణాన ఉంది. అది ప్రస్తుతం ఒక పర్యటనా కేంద్రంగా వుండి, ఆస్ట్రేలియాలోని స్వదేశీ ఆదిమవాసి ప్రజలను, వారి ప్రత్యేక కళను ప్రధానమైన అంశంగా ఉపయోగిస్తున్నది.
అయినను, సాక్షులకు మాత్రం సఫారి అనేది వారి మూడు దినముల సమావేశమే మొత్తం వారికి ఉన్నతాంశమైయుంది. వారిలో కొందరికి, చాలామందిని తిరిగి కలసుకొనే ఆనందభరిత అవకాశమైంది. ఒక కప్పు పొగలుకక్కే వేడి టీ అనేది ఆస్ట్రేలియా గ్రామీణప్రాంతంలో ఆతిథ్యమిచ్చే గుర్తులలో ఒకటైయుంది, ఆ సమావేశం ఈ ఆచారాన్ని పాటిస్తూ అది ప్రత్యేక బిల్లీ టీ అండ్ డేంపర్ అల్పాహారాన్ని ఏర్పాటు చేసింది. బిల్లీ టీ అనేది కేవలం నిప్పులపై నల్లగా మసిపట్టి బిల్లీ అనబడే టిన్ కేన్‌తో బట్టీపట్టి చేసినదే. కొన్నిసార్లు మరుగుతున్న నీటిని యూకలిప్టస్ లేదా గమ్ చెట్టు చిన్నకొమ్మలను టీ ఆకులతో పాటు బిల్లీలో వడపోస్తారు. యూకలిప్టస్ చిన్నకొమ్మనొకదాన్ని బిల్లీకి పైన ఉంచడంద్వారా అది పొగను టీలోకి పోకుండా అడ్డుతుంది.
డేంపర్ అనేది కేవలం సాధారణమైన రొట్టె. దానికి కావలసిన సరుకులేమనగా కేవలం పులిసినపిండి, నీరు, ఉప్పు. వేడిగా వుండగానే, డేంపర్ను దళసరి ముక్కలుగా కోసి, తర్వాత దానికి వెన్న, తేనెలాంటి పానకం పూస్తారు. బిల్లీ టీ అండ్ డేంపర్ అందించబడిన స్థలం సమావేశ స్థలమంతటిలోనూ మంచి పేరుపొందింది.
ఏకాంత ప్రాంతంలో విశ్వాసంగా సేవించుట
ఆలిస్ స్ప్రింగ్స్ సంఘం 72మంది సాక్షులను కల్గి, 2,00,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సేవచేస్తుంది. ఉత్తరానికి దాదాపు 1,800 కిలోమీటర్ల దూరంలో డార్విన్, దక్షిణానికి 1,600 కిలోమీటర్ల అడిలయిడ్ పట్టణాలున్నాయి. గ్రామీణప్రాంతాల్లో జీవించడమనేది సుదూరత, తదేకంగావుండే వేడి, బూడిద, ఏకాంతతల దృష్ట్యా, అది ఎలాంటి సవాలుతో కూడినదో ప్రయాణ ప్రతినిధులు స్వయంగా చూసి ఆశ్చర్యపోయారు.
యురేనియం గనులు కల్గిన ప్రాంతమైన జాబెరూ అనేది ఒక విశిష్టమైన ఉదాహరణ. కేవలం ఒక్క సాక్షి మాత్రమే ఇక్కడ నివసిస్తున్నది, ఆమెకు అతిసమీపంలోనున్న సంఘం 260 కిలోమీటర్ల దూరంలోవుంది. అయినను, ఏకాంతత ఆమె ఆత్మీయతను బలహీనం చేయలేదు. ఆమె సమావేశానికి రావడమనేది చాలామంది ఇతరులకు ప్రోత్సాహకరమైంది. ఈ సమావేశంలో బాప్తిస్మం తీసుకున్న 26మందిలో నలుగురు బైబిలు విద్యార్ధులు, ఆర్న్హెమ్ ప్రదేశపు అంచులలో ఉత్తరార్ధప్రాంతంలో జీవించే ప్రాచీన ఆదిమవాసి జాతియైన జిల్క్మింజెన్ నుండి వచ్చారు.
ప్రతినిధులు తమ వెలుగును ప్రకాశింపజేయుట
సమావేశం ముగిసింది, అన్ని బస్సులు ఆస్ట్రేలియా ఖండానికి ఎగువ చివరి భాగంలోని ఉత్తరప్రాంతానికి ప్రయాణం సాగించాయి. ఈ సఫారి బస్సు పర్యటన భాగంలో ఉన్నతాంశమేమనగా, కాకాడూ అనే జాతీయ పార్క్ దారిలో కెథొరిన్ జార్జి అనే స్వచ్ఛమైన నీళ్లున్న సరస్సులో పడవపై పయనించడమే. ఇది ప్రయాణీకులకు మొట్టమొదటిసారిగా నిర్జన ప్రదేశంలో మొసళ్లను చూడటానికి అవకాశాన్నిచ్చింది. ఇది వింత కల్గించేదే, కాని కొంచెం భయంపుట్టించేది కూడ! పిదప, డార్విన్ పట్టణ ఉత్తరప్రాంతంలో ఉల్లాసవంతమైన రాత్రి గడిపిన తర్వాత, సఫారి బస్సులు ఆగిన స్థలం మాటెరెంకె స్టేషన్, అది దాని మంచినీటి వాగులు, కొలనులతో చుట్టుముట్టి బారులు తీరిన మొగలి జాతి చెట్లకు ప్రసిద్ధి.
అయినను, ప్రకృతిని తిలకించడంలో ఆత్మీయ కార్యకలాపాలను ప్రక్కకు పెట్టలేదు. బస్సులు కదిలే రాజ్యమందిరాలుగా మారాయి. ప్రతిదినమూ ఒక లేఖనం, ప్రింట్‌చేసిన వ్యాఖ్యానం చర్చించబడేది, సాధారణంగా జరిగే వారపు సంఘకూటములు ప్రయాణమార్గంలోనే జరుపబడేవి. బస్సు డ్రైవర్లలో సాక్షికాని ఒకడు దానిని తనమనస్సులో ఎంతగానో నాటుకున్నాడు, తనకు తానుగా, ఒక ఎక్స్టెన్షన్ కార్డ్, మైక్రోఫోను, ప్లగ్‌ను కొని మైక్ సిస్టమ్‌కు కలిపి తద్వారా చర్చ జరిగే సమయంలో వ్యాఖ్యానాలు స్పష్టంగా విన్నాడు.
పర్యటనా సమయంలో, ఒక వృద్ధ ప్రయాణీకురాలు చాలా నీరసపడినందున ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకుని వెళ్లవలసి వచ్చింది. ఒక స్నేహితురాలు ఆమెతోనే వుండిపోయింది, కాని కోచ్‌లు ముందుకు సాగిపోయాయి. రెండు రోజుల పిమ్మట, ఆమె కోలుకున్న తర్వాత, ఆమె, తన స్నేహితురాలు దిగులుచెంది, మిగిలిన సఫారీ బస్సులతోపాటు ప్రయాణం చేయలేక పోయినందువల్ల చాలా బాధపడ్డారు. కాని క్రైస్తవ ప్రేమ వారి దుఃఖాన్ని తగ్గించింది.
ఆ ప్రాంతానికి చెందిన పైలట్లైన ఇద్దరు సహోదరులు ఆ విషయాన్ని తెలుసుకున్నారు. తర్వాత పనులు చాలా చురుకుగా జరిగిపోయాయి. వెంటనే నలుగురూ బస్సులను చేరుకోవాలని తేలికైన విమానంలో పోర్ట్ ఆగస్టాకు పయనించారు. ప్రయాణీకులలో ఒకామె ఈవిధంగా భావోద్రేకంతో ఆశ్చర్యపోయింది: “మేము అద్భుతమైన సహోదరత్వానికి చెందినందువల్ల, ప్రేమతోను, మెప్పుదలతోను నిండిపోయాం!” అంతేకాదు. మేము చేరుకునే సరికి, కొంతమంది ప్రతినిధులు వచ్చి, స్వయంగా పైలట్స్ పెట్టిన ఖర్చును భరించుటకు ఆర్ధికంగా చందా యిచ్చుటలో భాగంవహించారు! సహోదర ప్రేమ ప్రదర్శించుట కళ్లారా చూసి, ఇలాంటిది క్రితమెన్నడూ ఆయన చూడలేదంటూ బస్సు డ్రైవర్ మనసు కరిగిపోయింది.
“ఆలిస్ స్ప్రింగ్స్‌లో గడపిన మూడువారాలను గూర్చి తలపోస్తూ,” ప్రయాణీకులలో ఒకాయన యిలా చెప్పాడు: “ఇది నేను ఎన్నడూ పొందని ఒక అత్యంత ప్రోత్సాహకరమైన, విశ్వాసాన్ని బలపరచే అనుభవం. కలసివుండే స్ఫూర్తి అనేదే మేమందరం ఆనందించిన వాటన్నింటికంటే ప్రత్యేకమైనది. మేము భౌగోళికంగా ఎక్కడకు వెళ్లామన్నది కాదుగాని—ఆత్మ, మనస్సుల ఐక్యతయే నిజమైన నిధియైయుంది!” (g93 6/8)
[22వ పేజీలోని చిత్రం]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
ఆలిస్ స్ప్రింగ్స్ సమావేశం నుండి సఫారి బస్సులో పర్యటన వరకు మార్గాలు
పశ్చిమ ఆస్ట్రేలియా
ఉత్తరపు ప్రాంతము
క్వీన్స్లాండ్
న్యూ సౌత్ వేల్స్
దక్షిణ ఆస్ట్రేలియా
విక్టోరియా
టస్మేనియా
డార్విన్
పెర్తె
ఆలిస్ స్ప్రింగ్స్
బ్రిస్బేన్
సిడ్ని
అడిలయిడ్
మెల్బోర్న్
హోబర్ట్
యూలూరూ (ఆయెర్స్ రాక్)
పోర్ట్ ఆగస్టా
కాకాడూ జాతీయ ఉద్యానవనం
[20,21వ పేజీలోని చిత్రం]
ఆలిస్ స్ప్రింగ్స్ జిల్లాసమావేశంలో బాప్తిస్మం తీసుకొనడానికి వేచియున్నవారి మధ్యనున్న ఆదిమవాసులు
[21వ పేజీలోని చిత్రం]
బిల్లీ టీ, డేంపర్తోవున్న నిప్పులకుంపటి
[21వ పేజీలోని చిత్రం]
కాకాడూ జాతీయ ఉద్యానవనం దగ్గర ఎండలో చలికాచుకుంటున్న మొసలి
[22వ పేజీలోని చిత్రాలు]
ఆలిస్ స్ప్రింగ్స్‌కు నైరుతి దిక్కులో 470కిలోమీటర్ల దూరంలోనున్న యూలూరూ (ఆయెర్స్ రాక్)
కాకాడూ జాతీయ ఉద్యానవనంలో విలక్షణ దృశ్యం