అపాయకరమైన మన కాలముల కొరకున్న దైవిక బోధను పొందండి
ఇది మీకు నిజంగా ఎలా ప్రయోజనమీయగలదు
మీరు యెహోవాసాక్షుల “దైవిక బోధ” జిల్లాసమావేశానికి హాజరవడం ద్వారా దీనిని మీరు పొందగలరు. ప్రపంచ నలుమూలల్లోనున్న పట్టణాల్లో, ఈ వేసవిలో లక్షల కొలదిగా వీటికి హాజరవుతారు. కేవలం అమెరికాలోనే, వీటిలో 150 నాలుగు రోజుల సమావేశాలు మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో జరుగుతాయి.
మీరు వృద్ధులైనా, యౌవనులైనా—భర్త, భార్య, తండ్రి, తల్లి, పెద్దవారైనా పిల్లలైనా—వివరంగా, మనస్సుకు నచ్చేపద్ధతిలో మీకు ప్రయోజనమయ్యే రీతిలో అందించే బోధను మీరు పొందుతారు. “వివాహమును చిరకాల బంధముగా చేయుట,” “మీ కుటుంబ రక్షణ కొరకు కష్టించి పనిచేయుము,” “తలిదండ్రులారా—మీ పిల్లలకు నైపుణ్యంతో కూడిన శ్రద్ధ అవసరం” అనేవి కార్యక్రమం అందించే విషయాల్లో కొన్ని భాగాలై యున్నవి.
యౌవనులు ఎదుర్కొనే సమస్యలు, ఈ అపాయకరమైన మన కాలంలో వారెలా వాటితో వ్యవహరించగలరనే వాటిపై, ప్రత్యేకమైన అవధానం ఇవ్వబడుతుంది. ప్రస్తుతం సృష్టికర్తను గుర్తుకు తెచ్చుకునే యౌవనులు అనే అంశంతోనున్న ఆధునికకాల నాటిక ద్వారా వారు ఖచ్చితంగా ప్రోత్సహించబడతారు. మోసగించబడవద్దు లేదా దేవుని వెక్కిరించవద్దు అనే బాగా రిహార్సస్ చేసిన మరొక నాటిక ఈనాటి ప్రఖ్యాత వీడియో, సంగీతాల కారణంగా క్రైస్తవ యౌవనులు ఎదుర్కొనే సవాలును గూర్చి బోధిస్తుంది.
నిజంగా, మనం అపాయకర కాలములలో జీవిస్తున్నాము. యేసు ముందుగానే ప్రవచించినదేమనగా, “ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును.” (మత్తయి 24:29) ఆ “శ్రమ” ఎప్పుడు కలుగుతుందో, అలాగే సూర్యునికి ఎప్పుడు చీకటి కమ్మిందో వాటి ఆధారాలను సమావేశ కార్యక్రమం చర్చిస్తుంది.
ఈ అపాయకర కాలములలో, జీవిత లక్ష్యమేమైయుంది? అని చాలామంది అడుగవచ్చును. ఈ అంశం పూర్తిగా అన్వేషించబడుతుంది. ఈ విషయానికి సంబంధించి మీరు పొందబోయేదానితో సంతోషిస్తారనుటలో అనుమానం లేదు. ఇంకనూ కార్యక్రమమందలి మరొక భాగం ఆధునిక కాలంలో యెహోవాసాక్షుల చరిత్రను పునఃపరిశీలించి, వారు సాధించినదాన్ని ప్రదర్శిస్తుంది.
సమావేశపు చివరి రోజు “అపాయకరమైన మన కాలానికి సహాయకరమైన బోధ” అనే అంశంపై బహిరంగ ప్రసంగం యివ్వబడుతుంది. దైవిక బోధను గట్టిగా పట్టుకొనియుండుమని” ఉద్బోధిస్తూ కార్యక్రమం ముగుస్తుంది.
నిశ్చయంగా, మీరు నాలుగు రోజులూ హాజరవ్వడం ద్వారా ప్రయోజనం పొందుతారు! మీరు హాజరగుటకు హృదయపూర్వకంగా ఆహ్వానింపబడ్డారు. మీకు అతిసమీపంలోనున్న స్థలాన్ని కనుగొనడానికి, మీ ప్రాంతంలోని యెహోవాసాక్షుల రాజ్యమందిరాన్ని సంప్రదించండి, లేదా ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయండి.