కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 6/8 పేజీలు 27-28
  • ప్రత్యామ్నాయ మాతృత్వం క్రైస్తవులకు తగునా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రత్యామ్నాయ మాతృత్వం క్రైస్తవులకు తగునా?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రత్యామ్నాయ మాతృత్వం అనగా ఏమిటీ?
  • ప్రత్యామ్నాయత వల్ల సమస్యలు
  • ప్రత్యామ్నాయ మాతృత్వం వివాహాన్ని ఘనపరుస్తుందా?
  • మా పాఠకులనుండి
    తేజరిల్లు!—1994
  • పెళ్లి తర్వాత జీవితం
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • సంతానం కలిగియుండుట—ఒక బాధ్యత, ఒక బహుమానం
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • పిల్లలు పుట్టినప్పుడు దంపతులకు ఎదురయ్యే సవాళ్లు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 6/8 పేజీలు 27-28

బైబిలు ఉద్దేశము

ప్రత్యామ్నాయ మాతృత్వం క్రైస్తవులకు తగునా?

“ఒక వ్యక్తి విశిష్టమైనవాడైతే, అతను ఏ తలిదండ్రులకు జన్మించాడన్నది ప్రాముఖ్యం కాదు” అని ప్రాచీన రోమా కవియగు హొరేస్‌ అన్నప్పుడు ప్రత్యామ్నాయ మాతృత్వం గురించి అతనికి ఎంతమాత్రం తెలియదు. ఫ్రెంచ్‌ రచయిత 17వ శతాబ్దంలో వ్రాసిన “నీతివైశిష్ట్యం లేనిచోట జననానికి విలువలేదు,” అను లోకోక్తి, ప్రత్యామ్నాయ జననతర్కం చట్టబద్దమైన ఊబిగా తయారవ్వక ముందే రాయబడింది. కాని, యీ నూతన సంతానోత్పత్తికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానంవల్ల, “గుడ్డును ఉత్పత్తి చేయుట, శిశువుగా మారుతున్న పిండాన్ని గర్భంలో పెంచటం, మరియు శిశువు జన్మించిన తరువాత దాని ఆలనా పాలనా చూసుకొడం అను ప్రక్రియలను” ఇద్దరు లేక ముగ్గురు “తల్లులు” పంచుకొన వచ్చునని మేరి తోమ్‌ ఎమ్‌ఎస్‌ పత్రికలో నివేదించింది. “నీతివైశిష్ట్యం” మరియు “ఫలితం” అనువాటిని గూర్చిన ప్రశ్న సందిగ్థంగా, జటిలంగా తయారయ్యింది.

ప్రత్యామ్నాయ తల్లులనుపయోగించుట డెబ్భైయవ దశకం మధ్యభాగంలో, ముందెన్నడూ లేని సాంఘీక, నైతిక, మరియు చట్టబద్ధమైన సమస్యలను ఉత్పన్నం చేస్తూ ఆకస్మికంగా ప్రపంచమంతటా వ్యాపించింది. పిల్లలు కలుగని కొందరు దంపతులు పారంపర్య విరుద్ధమైన ఈ సంతానోత్పత్తి విధానంవల్ల ప్రయోజనం పొందాలని ఆతురత పడ్డారు. ఇంకోవైపు, మతపరంగా వచ్చిన నైతిక ప్రశ్నలకు జవాబునిచ్చు సూత్రాలను ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో వైదులు, న్యాయవాదులు, శాసనసభ సభ్యులు విస్తరిస్తున్న ఫలదీకరణ సాంకేతిక విజ్ఞానం యొక్క వేగాన్నందుకోడానికి పోరాడారు.

ప్రత్యామ్నాయ మాతృత్వం అనగా ఏమిటీ?

ప్రత్యామ్నాయ, లేక ఒప్పంద, మాతృత్వం అనగా ఒక స్త్రీ కొరకు శిశువును కనుటకై మరొక స్త్రీకి కృత్రిమంగా బీజద్యావాపము చేయుట. ఆమెతో ఒప్పందం చేసుకున్న దంపతులలో భర్తనుండి తీయబడిన వీర్యకణంద్వారా కృత్రిమ బీజద్యావాపంవల్ల యీ ప్రత్యామ్నాయ తల్లిని గర్భవతిని చేయుటవల్ల పారంపర్య ప్రత్యామ్నాయమని పిలువబడేది సంభవిస్తుంది. కావున, ప్రత్యామ్నాయ స్త్రీయే శిశువు యొక్క జన్యుసంబంధమైన తల్లి. ఇన్‌-వెట్‌రొ (టెస్ట్‌-ట్యూబ్‌) ఫలదీకరణ అను ప్రక్రియద్వారా భార్య యొక్క గుడ్డును భర్త వీర్యంతో ఐక్యపరచి, అందుమూలంగా తయారైన ఆ పిండాన్ని గర్భదారణకై ప్రత్యామ్నాయ స్త్రీ గర్భకోశంలో ఉంచడాన్ని ప్రత్యామ్నాయ గర్భధారణం అంటారు.

ప్రత్యామ్నాయ మాతృత్వం ఎందుకు పెచ్చుపెరిగిపోతుంది? ఒక విషయమేమంటే, స్త్రీలు సంతానోత్పత్తి చేయడానికి సహాయం చేయుటకై ఉన్నత సాంకేతిక విజ్ఞానం అనేక మార్గాలను కనుగొన్నది. దంపతులు పిల్లలను ఎంతగానో కోరుకొనవచ్చు, కాని గొడ్రాలితనం, ఆసౌకర్యం, లేదా దత్తత తీసికొనడానికి ఆరోగ్యమైన శిశువులు చాలినంత మంది లేకపోవడం వలన వారు పిల్లలను పొందలేకున్నారు. కాబట్టి పిల్లలను పొందడానికి వారు వేరేవ్యక్తి శరీరాన్ని అద్దెకు తీసుకుంటారు. ఎక్కువ డబ్బు దొరుకుతుంది గనుక, ప్రత్యామ్నాయత “అసమ్మతితో కూడిన దాస్యం, బానిసత్వం” మరియు “బీదల ఫలదీకరణ శక్తిని దోచుకొనుట” అని నిర్మొహమాటంగా వర్ణించబడింది.

అమెరికాలోని, న్యూ జెర్సీ సుప్రీంకోర్టు ధనికులు బీదలను తమ స్వార్థానికై ఉపయోగించుకొనుటకుగల అవకాశాలను గ్రహించి ప్రత్యామ్నాయతకు సంబంధించిన తగాదాకు ఇలా తీర్మానం చెప్పింది: “క్లుప్తంగా చెప్పాలంటే, ధనికులు తమకు కావలసినది బహుశా అది శ్రమ, ప్రేమ, లేక జీవంవంటిది ఏది కావాలంటే దాన్ని కొనడానికి అనుమతించడంకంటే, సమాజం ఎంతో అమూల్యమైనవని ఎంచే విలువలున్నాయి” ప్రత్యామ్నాయ మాతృత్వం అనేది స్త్రీ శరీరాన్ని అతిక్రమించడమని, “మానవ శరీరం కౌలుకివ్వబడదు, అద్దెకివ్వబడదు, అమ్మబడదని” ఫ్రాన్స్‌ సుప్రీంకోర్టు చెప్పింది.

ప్రత్యామ్నాయత వల్ల సమస్యలు

ప్రత్యామ్నాయత అనేక సమస్యలను తెస్తుంది. జన్మనిచ్చే స్త్రీ శిశువును తాను ఉంచుకుంటానంటే కోర్టులో నీచమైన గొడవలు మొదలయ్యే అవకాశం మెండుగా వున్నది. ఆ శిశువు ఎవరిది, జన్మనిచ్చిన స్త్రీదా లేక గుడ్డునిచ్చిన స్త్రీదా? ఒక శిశువు జననం సాధారణంగా ఆనందకరమైన సమయం, కాని కొన్నిసార్లది కోర్టు గొడవలకు దారితీస్తుంది. ఇంకొక సమస్య: ప్రత్యామ్నాయ తల్లులగుటకు ఒప్పుకున్న కొందరు స్త్రీలు, ఒప్పందం కుదుర్చుకున్న శిశువు గర్భంలో పెరగడం, పుట్టడంతో వారి భావాలు మారుతున్నట్లు గ్రహిస్తున్నారు. కొన్ని నెలలక్రితం చేయబడిన ఒప్పందాన్ని అంగీకరించడానికి ఇప్పుడు కష్టతరమౌతుంది. తల్లి మరియు ఆమెలోని శిశువు మధ్య ఒక శక్తివంతమైన అనురాగబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధాన్ని ముందుగా గుర్తించని ఒక ప్రత్యామ్నాయ తల్లి, శిశువును ఇచ్చివేయుటను గూర్చిన తన భావాలను ఇలా వివరించింది: “ఎవరో చనిపోయినట్లు ఉంది. నా శరీరం నా కూతురు కొరకు రోధిస్తూ ఉండింది.”

ఇంకా, అటువంటి జననం ప్రత్యామ్నాయ స్త్రీ యొక్క ఇతర పిల్లలు, ఆ శిశువును స్వీకరించిన కుటుంబం, మరియు ఆ శిశువుపై కూడా అది ఎటువంటి దీర్ఘకాల ప్రభావాన్ని కలిగియుండగలదు? లేక ప్రత్యామ్నాయ తల్లికి జన్మించిన శిశువుకు పుట్టుక లోపం ఉంటే ఏమి సంభవిస్తుంది? తండ్రి ఆ శిశువును తప్పక తీసుకొనవలసిందేనా? ఒకవేళ అతడు తీసుకొనకపొతే శిశువు పోషణా భారాన్ని ఎవరు భరిస్తారు? మరియు ప్రత్యామ్నాయ మాతృత్వంపై దేవుని అభిప్రాయమేమిటి అన్నది ఇంకా ప్రాముఖ్యమైన ప్రశ్న?

ప్రత్యామ్నాయ మాతృత్వం వివాహాన్ని ఘనపరుస్తుందా?

దేవుడు వివాహాన్ని పరిశుద్ధమైన దానిగా పరిగణిస్తాడని ఆయన వాక్యం చెబుతోంది. ఉదాహరణకు, హెబ్రీయులు 13:4 ఇలా చెప్తుంది: “వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.”a అందరు క్రైస్తవులు వివాహాన్ని ఘనమైనదిగా పరిగణించి ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు. వివాహాన్ని ఏది కళంకితం చేస్తుంది? వివాహంకాక ముందు వ్యభిచారం దాన్ని అగౌరవపరుస్తుంది, వివాహం అయిన తరువాత జారత్వం దాన్ని అగౌరవపరుస్తుంది.

ప్రత్యామ్నాయ మాతృత్వం వివాహాన్ని ఘనపరచి, పానుపును నిష్కల్మషంగా ఉంచుతుందా? సామాన్యంగా చెప్పాలంటే, ఉంచదు. పారంపర్య ప్రత్యామ్నాయంలో స్త్రీలో దాత వీర్యంతో బీజద్యావాపము చేయవలసిన అవసరం ఉంది. బైబిలు అభిప్రాయం కనబర్చే లేవీయకాండము 18:20, ఇలా చెప్తుంది: “నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొన కూడదు.” సంపర్కం ద్వారా జరిగే బీజద్యావాపానికి మరియు కృత్రిమంగా దాత ద్వారాపొందిన వీర్యంచేత బీజద్యావాపం చేయబడుదానికి ఉన్న తేడాను తెలిపే బైబిలు సంబంధిత ఆధారం లేదు. కావున, ఈ రెండు విషయాలలోను, స్త్రీ యొక్క చట్టబద్ధమైన భర్తచేతకాక ఇతర పురుషులచేత బీజద్యావాపం చేయబడినట్లైతే వ్యభిచారం లేక జారత్వం జరిగినట్లే.

ప్రత్యామ్నాయ గర్భధారణం విషయమేమి? ఇది కూడా వివాహ పానుపును కళంకం చేస్తుంది. నిజమే, ఫలదీకరణ చెందిన గ్రుడ్డు భార్యాభర్తల కలయిక వల్ల వచ్చినదే, కాని అది తరువాత వేరే స్త్రీ యొక్క గర్భకోశంలో ఉంచబడుటవల్ల ఆమె గర్భవతి అవుతుంది. ఈ గర్భం ప్రత్యామ్నాయ స్త్రీ మరియు ఆమె స్వంత భర్తమధ్య జరిగిన లైంగిక కలయికవల్ల వచ్చినదికాదు. కావున, ఇప్పుడా సంతానోత్పత్తి అవయవాలు ఆమె స్వంత భాగస్వామి చేతకాక మరొకరిచేత ఉపయోగింప బడుతున్నాయి. ఒక స్త్రీ తన స్వంత భర్తకొరకే పిల్లలను కనాలన్న బైబిలు నైతిక కట్టడకు ఇది భిన్నంగా ఉంది. (ద్వితీయోపదేశకాండము 23:2ను పోల్చుము.) ప్రత్యామ్నాయ స్త్రీ యొక్క స్వంత భర్తకాక వేరే వ్యక్తి ఆమె సంతానోత్పత్తి అవయవాలను ఉపయోగించడం సమంజసం కాదు. అది వివాహ పానుపు యొక్క దుర్వినియోగం. కావున, ప్రత్యామ్నాయ మాతృత్వం క్రైస్తవులకు తగదు. (g93 2/8)

[అధస్సూచీలు]

a హెబ్రీయులు 13:4లోని “పానుపు” అంటే వివాహిత స్థితేకాకుండా వివాహం యొక్క ఉపయోగం కూడా కళంకం కాకూడదని న్యూ టెస్టమెంట్‌ వర్డ్‌ స్టడీ రిఫరెన్స్‌ వర్క్‌ చూపిస్తుంది.

[Picture Credit Line on page 27]

Pastel by Mary Cassatt, The Metropolitan Museum of Art, Gift of Mrs. Ralph J. Hines, 1960. (60.181)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి