మన కాలాభివృద్ధి, అధునాతన సంగతులను గూర్చిన జ్ఞానం
యెహోవాసాక్షుల జర్మనీ బ్రాంచీ కార్యాలయానికి 77 సం.ల వయస్సుగల ఒక కేథోలిక్ సాధువు నుండి ఒక ఉత్తరం వచ్చింది. అతనిలా వివరించాడు:
“నా సన్యాసిమఠం 25 ఏళ్ళక్రితం మూసివేయబడినప్పటి నుండి నేను వృద్ధుల గృహంలో ఉంటున్నాను. నేను మీ నమ్మకాలలో అన్నింటితో ఏకీభవించను, కాని ఈ రోజు కావలికోటలో నేను చదివిన విషయాలు మన కాలాభివృద్ధి, అధునాతన సంగతులను గూర్చిన జ్ఞానం మీకున్నదని నేను ఒప్పుకునేలా చేస్తున్నాయి. ‘బైబిలు ప్రవచనాలను నెరవేరుస్తున్న ప్రపంచ సంఘటనలను ఇది పరిశీలిస్తుందని’ రెండవ పేజీ వాగ్దానం చేసినట్లు, మీరు నిజంగానే ఒక కావలికోటవలె ఉన్నారు.
“మీరు 1 థెస్సలొనీకయులు 5:3లోని పౌలు మాటలను ధైర్యంగా, సహేతుంగా వివరిస్తున్నారు, ‘లోకులు—నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును.’ మా చర్చీలో ఎక్కడా కూడ అటువంటి వివరణ నేను కనుగొనలేదు. యెహోవా సాక్షులపై పరిశుద్ధాత్మ పనిచేస్తుందన్న విషయాన్ని ఒకడు కాదనలేడు. . . . మీ పత్రికలను క్రమంగా చదవడానికి నేను ఇష్టపడతాను.”
ఈ కేథోలిక్ సాధువు ఉదాహరణను అనుసరిస్తూ, లోక సంఘటనలు బైబిలు ప్రవచనాలను ఎలా నెరవేరుస్తున్నాయి మరియు దేవుని రాజ్యం దుష్టత్వాన్ని నిర్మూలించి ప్రపంచవ్యాప్త పరదైసును ఎలా సృష్టిస్తుందో మీరు కూడా తెలుసుకొవచ్చు.
మీకు యెహోవా సాక్షులలో ఒకరి ద్వారా ఇంకా ఎక్కువ సమాచారం కావాలనుకుంటే లేక ఉచిత గృహ బైబిలు పఠనం కావాలనుకుంటే Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah.కు లేక 5 వ పేజీలోని అడ్రస్‌కు దయచేసి వ్రాయండి.
[32వ పేజీలోని చిత్రం]
కావలికోట
యెహోవా రాజ్యమును ప్రకటించుచున్నది
మన మహోన్నత సృష్టికర్తయందు ఆనందించుట