ప్రపంచ పరిశీలన
దైవదూషణ టైర్లా?
జపానులోని యోకోహామలో ఒక పెద్ద రబ్బరు కంపెనీ వాహనాల టైర్ల ఉత్పత్తిని నిలిపివేసింది, ఎందుకంటే వాటి మూలంగా ముస్లింలు అభ్యంతరపడ్డారు. వాటి అచ్చు విధానం అరబ్బీ భాషలో “అల్లా” పదాన్ని పోలివుందని ముస్లింలు ఫిర్యాదు చేశారు. ఆ కంపెనీకి ఇస్లాం మతాన్ని గురించి సరిగా తెలియనందువల్ల క్షమాపణను కోరిందనియు, వాహనాలను అత్యంత సురక్షితంగా నడిపించడానికి ఒక కంప్యూటర్ ఆ విధమైన అచ్చును రూపొందించినట్లు ఆ కంపెనీ వివరించిందని ఆసాహి ఈవెనింగ్ న్యూస్ పత్రిక తెల్పింది. అందులో అల్లాను దూషించడం లేదా ఎదిరించడం అంటూ ఏమీలేదు. ఈ కంపెనీ ఇస్లాం దేశాలన్నింటిలోనున్న టైర్లను తిరిగి రప్పిస్తుంది లేదా మార్పిడిచేస్తోంది. (g93 3/8)
ఒక మంచి వ్యాపారం
అర్జెంటీనాలో, జంతు, నరబలులను గూర్చిన ఫిర్యాదులు ప్రజలు విచారించేటట్లు చేశాయి. క్లారిన్ వార్తాపత్రిక ప్రకారం, అర్జెంటీనాలో అభిచారం, సాతాను మాంత్రికత్వము మరితర విధమైన మంత్రతంత్రాలను గూర్చిన శాస్త్రాలలో తలదూర్చిన 5,000 మత శాఖలున్నాయి. ప్రతిమల వాడకం అనేది ఈ మతశాఖలలో చాలావాటిలో ప్రాముఖ్యమైయుంది. అర్జెంటీనా ముఖ్యపట్టణమైన బూనొస్ ఏర్స్‌లో దయ్యాల విగ్రహాలుండే షెల్ఫ్‌లోనే, యేసుక్రీస్తు మరియు కెథోలిక్కు “స్వాముల” ప్రతిమలను ప్రదర్శించే షాపులను చూడటం అసాధారణ విషయమేమి కాదు. “క్షుద్ర దేవుళ్లందరిలోనూ అత్యంత భయంకరమైనవాడు, వారందరికి నాయకుడైన లూసిఫర్” అనే ప్రతిమ పేరుగాంచినది. సాతాను సంబంధమైన ప్రతిమలతోపాటు కెథోలిక్కుల ప్రతిమలను కూడా ఈ పంపిణీదారులు పంపిణీచేస్తారని క్లారిన్ వార్తాపత్రిక పేర్కొంటుంది. కెథోలిక్కుల ప్రతిమలను, సాతాను ప్రతిమలను అమ్మడం అనేది ఒక “మంచి వ్యాపారమని” ఒక షాపు యజమాని ఒప్పుకున్నాడు. (g93 2/22)
పురాతన ఐగుప్తులో మందులు
“ఐగుప్తీయుల శవాలను భద్రపరచే పెట్టెలలో హాషిష్, కెకాయిన్, నికొటిన్ అనే మత్తుపదార్థాల చిహ్నాలను మ్యూనిక్ మరియు ఉల్మ్ [జర్మనీలోని] విశ్వవిద్యాలయాలలోని శాస్త్రవేత్తలు కనుగొన్నారని” ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్జ్‌మెయిని జెయిటంగ్ అనే జర్మన్ వార్తాపత్రిక నివేదిస్తుంది. పరిశోధకులు సా.శ.పూ. 1,070 నుండి సా.శ. 395 మధ్యకాలానికి సంబంధించిన శవాలనుండి తీసిన అస్థి, రోమం, మరియు కణాలను పరిశీలించారు. పురాతన ఐగుప్తీయుల జీవనాన్ని గూర్చి ఈ శాస్త్రీయ అన్వేషణలు మనకేం చెబుతున్నాయి? “ఏడ్చేపిల్లలను ఊరడించడానికి సహితం ఐగుప్తీయులు ఔషధాలనుపయోగించారని” ఆ వార్తాపత్రిక చెబుతుంది. మరి శాస్త్రవేత్తలకు ఎలా తెలుసు? ఈగల మలం, గసగసాల మిశ్రమం ఒక బలమైన ఉపశమనంగా పనిచేసేదని పాపిరస్ పత్రమొకటి వర్ణిస్తుంది. (g93 3/8)
“ఈగలు లేని నగరం”
చైనాలోని బీజింగ్ నివాసులు ఈగలతో యుద్ధాన్ని ప్రకటించారని ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నివేదిస్తుంది. “ఈగలు లేని నగరాన్ని నిర్మించడమే మా ధ్యేయమని, అయితే మేము ఊరకనే ఈగలను చంపం. కాని శుభ్రమైన నగరాల్ని నెలకొల్పడమే మా కోరిక” అని ఒక ఉన్నత ఆరోగ్యాధికారి చెప్పారు. “ప్రజల్ని సంఘటితం” చేయాలనే ప్రయత్నంలో, పట్టణవాసులు దీన్నిగురించి ప్రకటిస్తూ పతాకాలు కట్టారు మరియు రెండు మిలియన్ల కరపత్రాలను పంచిపెట్టారు. ఈ ప్రకటన తదుపరి, ఈగలనెదుర్కొనే ఒక ప్రత్యేక “వారంలో” ఈ నగరం 15 టన్నుల క్రిమిసంహారక మందులను, ఈగలను పట్టే 2,00,000 పరికరాలను పంచిపెట్టింది. తరువాత నెలలో ఈగలనెదుర్కొనే మరొక వారంలో 8,000 కిలోగ్రాముల విషంతో 1,000 జట్లుగా పెద్దవారు, పిల్లలు కలసి ఈగలకు వ్యతిరేకంగా యుద్ధంచేశారు. జూన్‌లో బీజింగ్‌లోని కొన్నిప్రాంతాల్లో గదికి 33 చొప్పున ఎక్కువగానే ఈగల సంఖ్య నిండిపోయింది. వారి గురి యేమనగా వాటి సంఖ్యను 100 గదులకు రెండు ఈగలకంటె తక్కువ చేయడమే. (g93 3/8)
హింసాత్మక చలనచిత్రాల ప్రభావం
వాజా అనే బ్రెజిలియన్ పత్రిక ద్వారా జరిపిన పరిచయకార్యక్రమంలో, చలనచిత్ర దర్శకుడు స్టీవెన్ స్పెల్‌బెర్గ్‌ను, హింసాత్మక వినోదం ప్రేక్షకులపై ఏ ప్రభావం కల్గి ఉంటుందని అడిగారు. దానికి స్పెల్‌బెర్గ్ ఇలా చెప్పాడు: “నిజజీవితంలో లేదా టివి వార్తలలో చూసినదానికంటే, టివిలో లేదా చలనచిత్రాల్లో చూసిన హింస ప్రేక్షకులు దానిని అనుకరించేటట్లు రేకెత్తిస్తుంది. చలనచిత్రాలలో హింసయనేది ప్రణయగాథలతోపాటు మందగతి, అద్భుత సన్నివేశాలు, మరియు మంచి కాంతులతో చిత్రీకరించబడుతుంది. అయినను, హింస ఎంత భయంకరం కాగలదో గ్రహించేశక్తిని ప్రజలు కల్గివున్నారు, మరియు వార్తలలో హింస చలనచిత్రాల్లోలేని రీతిగా ఉపయోగించబడుతున్నది.” స్పెల్‌బెర్గ్ ఇంకా చెప్పేదేమంటే తన చిత్రాలు ఎంతో హింస, రక్తపాతంతో నిండిన కారణంగా, పేరుగాంచిన కొన్ని చిత్రాలను (జాస్ అనే ఇండియానా జోన్స్ సిరీస్) ఇంతవరకూ తన చిన్న కుమారుడు చూడటానికి అనుమతించలేదు. (g93 3/8)
“అర్థంలేని సమృద్ధి”
స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఇటీవల జరిగిన సమావేశంలో, “ప్రపంచవ్యాప్త పోషకాహారలోపాన్ని సరిదిద్దటానికి ఎన్నడూ తలపెట్టని అతిపెద్ద కార్యక్రమాన్ని చేపట్టుటలో” వారు కలసికట్టుగా ప్రయత్నిస్తామని ఐక్యరాజ్యసమితికి సంబంధించిన రెండు ఏజెన్సీలు ప్రకటించాయి. “అర్థంలేని సమృద్ధి” అని పిలిచేదాన్ని అధిగమించడానికి వారు చర్యతీసుకుంటారని ఆహార, వ్యవసాయ సంస్థ మరియు ప్రపంచ ఆరోగ్యసంస్థ చెప్పాయని లీ మొండ్ అనే ప్యారిస్ దినపత్రిక నివేదించింది. మానవ కుటుంబమంతటి పోషకాహార అవసరాల్ని తీర్చడానికి సరిపడే ఆహారాన్ని భూమి ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, ఈ అవసరాలకు అనుగుణ్యంగా ఆహారసామగ్రి పంచిపెట్టబడటంలేదు. ఆఫ్రికాలో, కరువు ప్రతిరోజూ 4 కోట్లమంది జీవితాలను బలిగొంటుంది. పోషకాహారలోపమనేది 19 కోట్ల 20 లక్షలమంది పిల్లలపై ప్రభావం చూపుతుంది కాగా వారిలో రోజుకు 40,000 మంది చనిపోతున్నారు. (g93 2/22)
సీసము అత్యంత విలువైనది
రెండు వేల సంవత్సరాల క్రితం, సార్డీనియన్ తీరప్రాంతంలో మునిగిపోయిన రోమీయుల ఓడశిథిలాల్లో కనుగొన్న సీసపుకడ్డీల సరుకు “అత్యంత విలువైనదని” ఎల్ మెసాజారో అనే ఇటలీ వార్తాపత్రిక వివరించింది. పురాతన రోమ్‌లో, అనుకున్న గమ్యానికి ఈ సరుకు చేరుతుందని, ఈ లోహం “పైపుల తయారీకి, జలవాహక లోహాలను అతుకుటకు, తూనికరాళ్లను పోతపోయుటకు” చాలా విలువైనదిగా ఉంటుందని తలంచారు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం ఆ పరిశోధన ఇంకా యెక్కువ విలువైనదని గుర్తిస్తున్నది. ఈ లోహపు కడ్డీలు సముద్రపుటడుగున పడివున్నాయి గనుక, “దట్టమైన ఇసుకపొర” గుండా వచ్చే కాస్మిక్ కిరణాల ప్రభావాలనుండి కాపాడబడ్డాయి, కాలం రేడియోధార్మికతకు సంబంధించిన జాడలను లేకుండా చేసింది. ఈ రక్షితకవచాలు వారి ప్రయోగశాలల్లోని సున్నితమైన కొలతలపై ఏ ప్రభావం కూడా చూపవు గనుక, మరెక్కడైనా కనుగొనుటకు కష్టమైన ఈ స్వచ్ఛమైన సీసం, పరిశోధన జరిపే భౌతికశాస్త్ర శాస్త్రవేత్తలకు గణనీయమైన విలువ కల్గివుంది. (g93 3/8)
వృద్ధుల యెడల తక్కువ గౌరవము
ఆసియాలో వృద్ధజనాభా విశేషంగా పెరుగుతోంది. జపానులో రాబోయే 30 సంవత్సరాలలో 65, ఇంకా అంతకంటె ఎక్కువ వయస్సు గల వారి సంఖ్య ఇప్పుడున్న 1కోటి 55లక్షలనుండి 3కోట్ల 20లక్షలకు పెరుగబోతుందని కొంతమంది భావిస్తున్నారు. ఏసియావీక్ ప్రకారం, 2,020వ సంవత్సరం నాటికి ప్రతి నలుగురు జపానీయులలో ఒకరు వృద్ధులౌతారు. ఏసియావీక్ ఇంకా ఇలా అంటున్నది: “9% కంటె ఎక్కువ మంది సింగపూర్ నివాసులు తమ 60వ జన్మదినాన్ని చేరుకున్నారు. ఈ శతాబ్దాంతానికి, దాదాపు 15 లక్షలమంది మలేషీయులు వృద్ధులౌతారు.” పెద్దల యెడల గౌరవమర్యాదల వంటి తత్‌సాంప్రదాయాలు హరించుకుపోతున్న సమయంలో ఈ అభివృద్ధి జరుగుతున్నది. సింగపూర్‌లోని వృద్ధపౌరుల న్యాయవాది అయిన హెన్రీ లిం ఇలా అన్నాడు: “వృద్ధుల యెడల శ్రద్ధ తగ్గిపోతున్న ధోరణి వుంది.” యౌవనస్థులు సాధారణంగా “తమ తలిదండ్రుల కంటె పెంపుడు కుక్కలతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.” (g93 2/22)
బాల శ్రామికులు
“బ్రెజిల్ పిల్లలకు, యౌవనస్థులకు 80వ దశాబ్దం అనుకూలమైంది కాదని ఫౌండేషన్ ఆఫ్ ది బ్రెజీలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జాగ్రఫీ అండ్ స్టాటిస్టిక్స్ ముగించింది,” అని జోర్‌నల్ డా టార్‌డే నివేదించింది. ఆ అధ్యయనం తెలిపిందేమంటే 5.97 కోట్ల మందిలో 3.2కోట్లమంది పిల్లలు, అమెరికా కనీస వేతనమైన 40 డాలర్లలో సగంకంటె తక్కువ తలసరి సంవత్సరాదాయం గల కుటుంబాలకు చెందినవారు. దాదాపు ఒక కోటిమంది బ్రెజిల్ పిల్లలు 10 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సుగల 17.2 శాతంమంది పాఠశాల కెళ్లటానికి బదులు దురవస్థలోనున్న తమ కుటుంబాలకు ఆర్థికసహాయం చేయటానికి పనిచేస్తున్నారు. ఫలితం? “ఈ పరిస్థితి విస్తరించి శాశ్వతపేదరికానికి దారితీస్తుంది” అని సమాజస్వభావ శాస్త్రజ్ఞురాలైన రోజా రైబెరో అన్నది. సరైన విద్యలేకుండా ఒకపిల్లవాడు తన సాంఘికపరిస్థితిని మార్చుకొనే అవకాశంలేదు.” (g93 3/8)
రోగుల భయం
ది న్యూ యార్ టైమ్స్ ప్రకారం తమ రోగులనుండి జబ్బులు వస్తాయన్న భయం ఆరోగ్యసిబ్బంది ప్రవర్తనను బాగా ప్రభావితం చేస్తుండవచ్చును. రోగులకు చికిత్సచేస్తున్న సమయంలో వైద్యపరికరాలచే చర్మంతెగడం లేదా అనుకోకుండా గ్రుచ్చుకోవడంద్వారా ఎయిడ్స్ లేక హెపటైటిస్ (కాలేయపు వాపు జబ్బు) వంటివి సంక్రమించవచ్చని చాలమంది వైద్యులు భయపడుతున్నారు. ఇట్టి భయానికి సాక్ష్యాధారమున్నది. క్రమంగా క్షయవ్యాధికి చికిత్సచేసే వైద్యులలో దాదాపు 60 శాతంమంది ఆ వ్యాధికి గురైనట్లు ఒక న్యూయార్క్ పట్టణ ఆసుపత్రిలో జరుపబడిన పరిశోధన తెలియజేసింది. ప్రతి సంవత్సరం దాదాపు 12,000మంది వైద్యసిబ్బందికి తమ రోగులనుండి కాలేయవ్యాధి సంక్రమిస్తోంది. ఎయిడ్స్ అంటువ్యాధి మొదలైననాటి నుండి, అమెరికాలో దాదాపు 47 మంది వైద్యసిబ్బంది తమ రోగులవల్ల ఆ వ్యాధికి గురయ్యారు. (g93 2/22)
వక్కపొడి, క్యాన్సరు
“వక్కపొడి వేసుకోవాలా వద్దా . . . అదీ ప్రశ్న.” వక్కపొడి నమిలే విషయాన్ని గూర్చి పాపువా న్యూ గినియా వార్తాపత్రిక అయిన పోస్ట్-కొరియర్‌లో యీ ప్రశ్న వచ్చింది. వక్కపొడి నమిలేవారికి చికిత్సచేయడంలో అనుభవంగల శస్త్రచికిత్స నిపుణుడైన డా. బార్రీ మిల్‌రాయ్: “పపువా న్యూ గినియాలో ఉన్న రెండు ప్రముఖ సమస్యలలో ఒకటి విలక్షణమైన మలేరియా, మరోటి వక్కపొడి నమలడానికి ప్రత్యక్ష సంబంధం వున్న నోటిక్యాన్సర్” అని అన్నారు. వక్కపొడి వేసుకునే అలవాటున్న వారిలో చిన్నపిల్లలు కూడ వున్నారు. ‘ఒకరు వక్కపొడి నములుతున్నారంటే వారికి క్యాన్సరు వస్తుందా అన్నది కాదు, ఎప్పుడు వస్తుంది అన్నదే ప్రశ్న’ అన్నారు డా. మిల్‌రాయ్. “వక్కపొడి నమిలేవారు ఆ పని మానాల్సిందే కాని వారికి ఇతర వైద్యపరమైన సహాయం ఏమిలేదు” అని కూడ ఆయనన్నారు. (g93 2/22)
గొప్ప నకిలీదారులు
అనుమానించుటకు వీలులేని దుకాణదారుడు లేక బ్యాంకు ఉద్యోగి చేతిలోనుండి నకిలీ డబ్బు చెలామణీ కావడం అన్నది ఒక విషయం. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నొద్ద డబ్బును కాపాడే అధునాతన పరికరాన్ని మోసపుచ్చడం ఇంకో విషయం,” అని ది వాల్ స్ట్రీట్ జర్నల్ తెలియజేసింది. అయినప్పటికీ, అమెరికా కరెన్సీలో 100 డాలర్ల నోట్లకట్లను తయారు చేయడం జరిగింది. “అతి శ్రేష్ఠమైంది” అని పిలవబడిన యీ నకిలీ ద్రవ్యం ప్రపంచమంతటా హఠాత్తుగా కనిపిస్తోంది. కష్టతరమైన ముద్రణాశైలిని ఉపయోగిస్తూ, స్పష్టంగా కనబడే ఎరుపు నీలం దారాలు గల బట్టతో చేసిన పేపరు, ప్రత్యేకమైన అయస్కాంత శక్తిగల సిరా అన్నింటిని కూడ ఎంతో చాకచక్యంగా కాపీచేస్తు అసలు నోట్లలాగా తయారు చేయబడుతున్నాయి. ఆ నకిలీవి ఎంత బాగున్నాయంటే, బ్యాంకులు సిఫారసు చేసే నకిలీనోట్లను నిరాకరించే మామూలు పద్ధతిని పాటించే బదులు అమెరికా ప్రభుత్వం ఆ నష్టాన్ని భరిస్తోంది. నకిలీనోట్లు ఒక ఉగ్రవాద గుంపో లేక విదేశీహస్తంపనో అని అధికారులు భయపడుతున్నారు. (g93 2/22)
ఉబ్బస మరణాల పెరుగుదల
“ఉబ్బసవ్యాధివల్ల [జర్మనీలో] చనిపోయేవారి సంఖ్య విశేషంగా పెరుగుతోంది” అని సూడియట్‌స్కే జ్యీటంగ్ దినపత్రిక తెలియజేసింది. శ్వాససంబంధ అనారోగ్యాలవల్ల ఆ దేశంలో 1991లో 5,000 కంటె ఎక్కువ మంది చనిపోయారని జర్మన్ రెస్పిరేటరీ ట్రాక్ లీగ్ ఆర్గనైజేషన్ తెలియజేసింది. ఈ సంఖ్య 1970 మధ్యకాలానికి, సంవత్సరానికి 2,000కు చేరింది. దాదాపు 2కోట్లమంది జర్మనునివాసులు యీ అలర్జీలతోను, ప్రతి ముగ్గురిలో ఒకరు శ్వాససంబంధ అలర్జీలతోను బాధపడుతున్నారు. (g93 2/22)