తప్పించుకొని పారిపోయిన జింక
దక్షిణాఫ్రికాలోని అవేక్! ప్రతినిధి ద్వారా
ఆఫ్రికా యొక్క లేడి జాతికి చెందిన జింక, (స్టీన్‌బాక్) సహజప్రవృత్తితోనే ఆరోగ్యసూత్రాల విషయంలో మంచి మాదిరి చూపిస్తుంది. ప్రొఫెసర్ జాన్ స్కిన్నర్, సౌత్ ఆఫ్రికన్ యానిమల్స్ ఇన్ ది వైల్డ్ అనే తన పుస్తకంలో ఇలా వివరిస్తున్నాడు, “జింక యొక్క విశేష లక్షణమేమిటంటే,” “అవి మలవిసర్జన లేక మూత్రవిసర్జన చేయక మునుపు అవి వాటి ముందరి గిట్టలతో ఒక గుంట త్రవ్వుకొని, తరువాత మళ్లీ మట్టితో కప్పిపెడతాయి.” అవును, ఇశ్రాయేలు సైనికులకివ్వబడిన నియమావళిని ఈ చిన్న జీవి మించిపోయింది. (ద్వితీయోపదేశకాండము 5:1; 23:13, 14) అది దాని మూత్రాన్ని కూడ కప్పివేస్తుంది.
జింక యొక్క సున్నితమైన ఈ పారిశుధ్య అలవాట్లు దాని నాజూకైన రూపానికి తగినట్లున్నాయి. “ఆఫ్రికా మగలేడిలలో ఈ జింక నాకెంతో ఇష్టమైనది, మనోజ్ఞమైనది,” అని వ్రాశాడు లారెన్స్ వాన్ డెర్ పోస్ట్. ది హార్ట్ ఆఫ్ ది హంటర్ అనే తన పుస్తకంలో వాన్‌డెర్ పోస్ట్, ఆఫ్రికా యొక్క కాలాహారి ఎడారిలో నివసించే క్షామస్థితిలో ఉన్న ఒక జాతివారి కొరకు తాను ఎలా ఒక జింకను వేటాడటానికి ప్రయత్నించాడో ఆయన వివరించాడు. ఆ అన్వేషకుడు ఇలా వ్రాశాడు, “సున్నితమైన చెవులు” నా వైపే కేంద్రీకరించబడి ఉన్నాయి, ఊదారంగు విశాల నేత్రాలు జీవితపు ఈ దూర ప్రాంతంలో ఈ వింత దృశ్యాన్ని చూసిన ఆశ్చర్యంతో మెరుస్తూ, ఏమాత్రం భయంలేకుండా, చూస్తున్నాయి. . . . అది గుర్తించేలోగా లేక కాల్చాలన్న నా ఇష్టం బలహీనమవ్వక ముందే, నేను దాన్ని కాల్చేసాను. అంత దగ్గరలో ఉన్నదానిని నేను గురి తప్పనని అనుకున్నాను కాని నేను గురితప్పాను. నా బరువైన తుపాకీ నుండి వెలువడిన ప్రేలుడు శబ్దాన్ని విని తట్టుకోవటానికి తన సున్నితమైన తలను చురుకుగా అటు కదిల్చింది.”
ఇంకా కొన్ని కాల్పుల తరువాత, మానవ సహచర్యం ప్రమాదకరమని భావించి అది పారిపోయింది. అవసరమైన ఆహారాన్ని పోగొట్టుకున్నప్పటికీ, వాన్‌డెర్ పోస్ట్‌తో పాటు ఆకలిగొని ఉన్న ఆదిమవాసులు ఇదంతా చూసి సంతోషించారు. ఎందుకు? జింక యొక్క విధానాల పట్ల వారికి గౌరవభావం ఉంది, మరియు ఇది వారి అంచనాలకు తగినట్లు ప్రవర్తించింది. వాన్ డెర్ పోస్ట్ ఇంకా ఇలా తెలియజేశారు:“నా తుపాకి నుండి వెనువెంట వెలువడుతున్న కాల్పులకు చెదరక బెదరక నిలబడిన ఆ బుల్లి జింక రూపం ఆ ఉష్ణతాప దినమంతా నా మదిలో మెదులుతూనే ఉంది.” (g93 1/8)