మా పాఠకుల నుండి
క్యాన్సరు చికిత్సలు “ప్రపంచ పరిశీలన” విభాగంలో (gbr-10-TU) ప్రచురించిన “చికిత్సా విధానములు పోల్చబడినవి” అనే అంశము తీవ్రంగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని నా నమ్మిక. ప్రఖ్యాతి గాంచిన వైద్య కేంద్రాలలో అందించే చికిత్స మాదిరిగానే, వైధికాచార చికిత్స ద్వారా కూడ క్యాన్సరుతో బాధపడే ప్రజలు ప్రయోజనము పొందెదరని ఇది సూచిస్తుంది. మీరు ఆధారంగా చేసుకొని వ్రాసిన ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లోని శీర్షిక ధోరణికి, మీ అంశానికి చాలా తేడా వుంది.
ఎ. ఆర్., ఎమ్.డి., అమెరికా
మా క్లుప్తమైన అంశము కచ్ఛితమైనది, కానీ ఆ అధ్యయనంలోని ఒక కీలకాంశాన్ని మేము ప్రచురించలేదు, అదేదనగా, రోగం బాగా ముదిరిపోయిన వారిలో నాటువైద్యం పొందినవారికంటే సాంప్రదాయిక వైద్యచికిత్స పొందినవారే “మరింత శ్రేష్ఠమైన జీవితము” జీవిస్తున్నట్లు సమాచారమందినది. అయినప్పటికీ, మా శీర్షిక చూపించినట్లు, రోగుల జీవితకాలాన్ని పొడిగించడంలో యీ రెండురకాల చికిత్సలు కూడా పనికిరావు. ఆ అధ్యయనం చెప్పినట్లుగా రోగంముదిరిన కొందరు రోగులకు “ఏవిధమైన చికిత్స” కూడా పనికిరాదు. పాఠకులు గమనించ వలసినదేమంటే, పరిశోధకుల ప్రకారం, ఈ అధ్యయన చిట్కాలు “తీవ్రరూపందాల్చని [క్యాన్సరు] రోగులకు వర్తించవు.” వైద్యపరిశోధకులు కొన్ని నాటువైద్యాలను “తగినరీతిన పరిశోధించుట అవసరమొస్తుందేమోనని” ఈ అధ్యయన రచయితలు ఓ నిర్ణయానికొస్తున్నారు.
మా పాఠకులనుండి నేను “మా పాఠకులనుండి” అనే అంశమును చదువుటకు ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను. మీ సమాధానాల్లో నున్న యుక్తికి నేనెంతో ఆశ్చర్యపోతుంటాను. ఏదైనా అచ్చుతప్పు లేదా పొరపాటున్నట్లయితే, వినయంతో అంగీకరిస్తారు. అయిననూ, పాఠకులు ఎంత కలత చెందినప్పటికీ మీరు దేవుని వాక్యంలోని సత్యాన్ని చెప్పడంలో వెనుకాడరు. మీ వద్ద హాస్య ధోరణి కూడా ఉన్నది! ఫిబ్రవరి 22, 1991, సంచికలో (ఇంగ్లీషు) “మిస్టేకెన్ ఐడెంటిటి” అనే అంశంక్రింద మీరిచ్చిన సమాధానం చూచి నేను చాలా నవ్వుకున్నాను.
సి. డబ్ల్యు., అమెరికా
అస్తవ్యస్థత “వస్తువుల అస్తవ్యస్థత అదుపు తప్పినపుడు” (gbr-8-TU) అనే ప్రేమమయమైన మీ శీర్షికకు వేల కృతజ్ఞతలు. నా పన్నెండేళ్ల వైవాహిక జీవితంలో, నా గదుల్లో (క్లోసెట్స్) వస్తువులు పూర్తిగా నిండిపోయి ఏది ఎక్కడుందో కనుగొనలేని స్థితిలో నేను కొట్టుమిట్టాడాను. (వస్తువులన్నీ కూడబెట్టడానికి నా కనేక కారణాలుండేవి.) మీ శీర్షిక చదివిన తర్వాత, పనికిరాని వస్తువుల సంచుల రాశిని ప్రోగుచేయగల్గాను. మునుపులేని విధంగా శుభ్రం చేయబడిన గదులన్నీ (క్లోసెట్స్) అందంగా కన్పించాయి. వస్తువులిక ఎన్నడును చిందరవందర కాకుండా కాపాడుటకు నేను ఈ శీర్షికను నా గదిలో కన్పించేటట్టు పెట్టుకుంటాను.
ఎల్. డబ్ల్యు., నెదర్లాండ్స్
నేను, నా తల్లి, నా సహోదరి వస్తువుల అస్తవ్యస్థతను సరిచేసే కార్యక్రమాన్ని చేపట్టాము. మా బీరువాలో వున్న చాలా బట్టలను తీసివేశాము. మీ శీర్షికకు హృదయ పూర్వక వందనాలు.
జెడ్. ఎమ్., జమైకా
అపహరించుట“బుద్ధి తక్కువ పనిచేయకు లేదా చంపేస్తా” అనే శీర్షిక కొరకై మీకు కృతజ్ఞతలు. (gbr12-TU) నేను కూడా దోపిడికి గురైనప్పుడు, నా కారులో బంధించబడ్డాను. నేను తదేకంగా యెహోవా నామాన్ని బిగ్గరగా పలికినందువలన నేను యెహోవాసాక్షినన్న విషయం నన్ను అపహరించిన వ్యక్తికి తెలిసింది. అదృష్టంకొద్ది, చేతులు కట్టివేయబడినందుకు మణికట్టు వాయడం మరియు డిక్కీలో పడవేయబడినందుకు కొన్ని గాయాలు తగలడం తప్ప, నాకే శారీరక హానికలుగలేదు. నేను నిశ్శబ్దంగా ఉండి, నా కారు వెనక సీటు వైపునుండి బయటకు రాగలిగాను. ఈ సంఘటన మరియు దాని విచారణ స్థానికంగా పొక్కిపోయింది. నేను తప్పించుకొన గలిగినందుకు నా వకీలు, పొరుగువారు, స్నేహితులు, మరియు కుటుంబీకులు యెహోవాను మహిమపరచారు.
ఇ. ఎమ్., అమెరికా
నేడు దేవుని ప్రజలకు అద్భుతకరమైన సంరక్షణ దొరుకుతుందని బైబిలు వాగ్దానం చేయడంలేదు. అయినను, ఒక క్రైస్తవుడు ప్రాణాపాయ పరిస్థితినుండి తప్పించబడినప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుట సమంజసమే. (1 థెస్సలొనీకయులు 5:18).