అద్భుతకాంతులు—ఎక్కడనుండి వస్తున్నాయి
భూమ్యాకర్షణగల ఉత్తర, దక్షిణ ధృవాల దగ్గర జీవిస్తున్న ప్రజలకు ఉత్తర, దక్షిణ ప్రాంతపు కాంతులు లేదా కాంతి పుంజములు ఆశ్చర్య కారకములై యున్నవి. భూమి పరిభ్రమించడం వలన భూమిలో ఉన్న కరిగిన లోహ పదార్థం పెరిగి, తరిగి మరియు మెలి తిరుగుతూ ఉంటుందని యిప్పుడు నమ్ముతున్నారు దీని మూలంగా అయస్కాంత క్షేత్రాలనుత్పత్తి చేసే విద్యుత్ ప్రవాహాలు తయారగుచున్నవి. ఇవి పరిభ్రమిస్తున్న భూమియొక్క అక్షంతో సమాంతరంగా ఉంటాయి. సూర్యుని నుండి భూమికి వచ్చే కాంతి వికరణాలు అయస్కాంత క్ర్షేతం మూలంగా కంటికి కాంతివలే కన్పించేవి అత్యధిక సంఖ్యలో వచ్చినప్పుడు వాటి కాంతి ప్రభావము యింకా పెరుగుతుంది. భూమియొక్క అయస్కాంత క్షేత్రం అనేక కాంతి ప్రాంతాలలోనున్న పరమాణువులను ప్రభావితం చేసి వెలుగు రూపంలోని వివిధ వర్ణాలనుత్పత్తి చేస్తాయి. సూర్యుని నుండి వచ్చే శక్తివలన ఆక్సిజన్, నైట్రోజన్ అణువులు ప్రభావితం చెందినపుడు కాంతి వర్ణాలేర్పడతాయి మరియు ఎరుపు/ఆకుపచ్చ/ఊదారంగులలో కాంతి తరంగములు కనబడతాయి. కొన్నిచోట్ల ఎరుపు ఊదారంగుల్లో ఉన్ననూ ఎక్కువచోట్ల ఈ కాంతిపుంజములు ఆకుపచ్చరంగులో కనబడతాయి. భూమికి ఉత్తర ప్రాంతంలో ఉత్తర ధృవ కాంతిపుంజములని (లాటీన్, ఉత్తర ఉషస్సు) దక్షిణ ధృవంలో అది దక్షిణ ధృవ కాంతి పుంజములని (దక్షిణ ఉషస్సు) పిలువబడుచున్నవి.
“ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి” అని ప్రాచీన కీర్తనల గ్రంథకర్త అంటున్నాడు. (కీర్తన 19:1) ఆకాశముల సృష్టికర్తను గూర్చి మీరు ఎక్కువ తెలుసుకొనగోరితే మీ ప్రాంతమందున్న యెహోవాసాక్షులను దర్శించుటకు వెనుకాడకండి, లేదా ఈ పత్రికయొక్క ప్రకాశకులకు వ్రాయండి.—పేజి 5 చూడండి. (g92 11/8)
[Picture Credit Line on page 32]
NASA photo