కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 2/8 పేజీలు 18-22
  • జెసూట్స్‌ “అందరికి అన్ని విధముల వారేనా”?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జెసూట్స్‌ “అందరికి అన్ని విధముల వారేనా”?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఒక లక్ష్యం గల పురుషులు
  • ప్రొటస్టెంట్లు వ్యాప్తి చెందకుండ చేయుట
  • జెసూట్స్‌ అనుకూల స్వభావం
  • ఒక రాజకీయ సువార్త
  • యేసుయొక్క నిజమైన సంస్థ
తేజరిల్లు!—1993
g93 2/8 పేజీలు 18-22

జెసూట్స్‌ “అందరికి అన్ని విధముల వారేనా”?

స్పెయిన్‌ నందలి అవేక్‌! ప్రతినిధి

జెసూట్స్‌ విచ్చలవిడి తనానికి పేరుగాంచుటకు అభిలషించలేదు. పోప్‌ శాసనము వలన 1540లో స్థాపించబడిన సోసైటీ ఆఫ్‌ జీసస్‌ “ఫర్‌ ది రూల్‌ ఆఫ్‌ ది చర్చ్‌ మిలిటెంట్‌” అనే పేరుపెట్టబడింది.a ఆ సమయంలో ఈ క్రొత్త తిరుగుబాటు విధానం అపుడు చెలరేగిన మత పోరాటముల నుండి కేథోలిక్‌ మతాన్ని రక్షించడానికి తగిన రీతిలో తీర్చిదిద్దబడినట్లు కనబడింది.

“సిలువ పేరున పోరాటం సాగించమని” ఇగ్నేషియస్‌ ఆఫ్‌ లయోలా తన అనుచరులకు ఉద్బోధించినను “అందరికి అన్ని విధముల వారై” యుండమని కూడా బోధించాడు. ఆ రెండవ చెప్పిన దానికి కట్టుబడియుంటే, ముందుచెప్పిన దానిని మరి శ్రేష్ఠముగా సాధించగలమని జెసూట్స్‌ నమ్మేవారు; మృదుత్వం ఎన్నో అవకాశాలకు మార్గమేర్పరచుటకు కీలకమై యుంటుంది.

కొద్దికాలం క్రితం సర్దుకొనిపోగల విద్యావంతులైన జెసూట్స్‌ ఉపాధ్యాయులుగాను, రాజనీతిజ్ఞులుగాను, రాజ పరివార సభ్యులుగాను మరియు పాపనివేదనను వినే గురువులుగాను పనిచేయడానికి అనేకుల వలన పిలువబడేవారు. బహుశ లయోలా ఉద్దేశించిన దానికంటే వీరు మరి ఎక్కువే చేశారు. అనేక రంగాలలో, ముఖ్యంగా రాజకీయ రంగంలో వారు సాధించిన సఫలత వారికి చాలా డబ్బును, అధికారాన్ని సమకూర్చి పెట్టింది. కాని అది వారికి విపత్తును కూడ తెచ్చిపెట్టింది.

పోప్‌ క్లెమెంట్‌ XIV 1773లో ఫ్రాన్స్‌, పోర్చుగల్‌, స్పెయిన్‌ దేశాల వత్తిడికిలోనై జెసూట్ల విధానాన్ని “శాశ్వతంగా” విచ్ఛిన్నం చేశాడు. ఏ ఉద్దేశంతో? “చర్చిలో నిజమైన, శాశ్వత శాంతిని స్థాపించుటకే.” వారి రాజకీయ ప్రభావం వలన జెసూట్స్‌ మోయరాని భారంగా తయారయ్యారు. పోపు చేసిన ఈ తీర్మానాన్ని 41 సంవత్సరాల తరువాత రద్దు చేసినప్పటికి, జెసూట్స్‌ తమ గత వైభవానికెన్నడూ ఎదగలేకపోయారు.

ఈనాడు భూవ్యాప్తంగా 23,000 మంది వున్న జెసూట్స్‌, విమోచనా వేదాంతముకేగాని, రాజకీయాలలో మతగురువుల భాగం విషయమేగాని లేక కుటుంబ నియంత్రణేగాని, కేథోలిక్‌ వివాదములకు వీరే మూల కారణం. వీరి అసమ్మతి పోప్‌ అయిష్టతకు గురైంది. పోప్‌ జాన్‌పాల్‌ II 1981లో తన కిష్టమైన వ్యక్తిని జెసూట్స్‌ ఉన్నతాధికారిగా నియమించడానికి, వారి ఎన్నికల విధానానికి తిలోదకాలిచ్చాడు.

గడచిన కొన్ని సంవత్సరాలలో పోప్‌ తన చర్చికి రక్షణనిచ్చే ఓపస్‌ డేయికిb హత్తుకున్న వారివైపు తన అవధానాన్ని మరల్చాడు. అయినా, జెసూట్స్‌ సామాన్య కేథోలిక్‌ విధానాన్ని అనుసరించే కాథోలిక్కులు కారు. కేథోలిక్‌ల మధ్య కూడ వారెల్లప్పుడు ఎందుకంత వివాదాన్ని రేపేవారు? సోసైటీ ఆఫ్‌ జీసస్‌ అన్న పేరుకు తగినట్లుగా వారు జీవించారా? అసలు వారి లక్ష్యమేమిటి?

ఒక లక్ష్యం గల పురుషులు

ప్రారంభములో తన చిన్న గుంపు ఆ పవిత్ర దేశంలో ఉన్న ప్రజల మతం మార్చాలని లయోలా అభిలషించాడు. కాని 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనలు వారిని మరోదారి పట్టించినవి. ప్రొటస్టెంట్ల చీలిక రోమన్‌ చర్చిని క్షీణింపజేసింది మరియు ప్రాచ్య దేశాలకు, అమెరికాలోనికి క్రొత్త సముద్ర మార్గాలుకూడా తెరవబడ్డాయి. కాబట్టి వీరు ద్విగుణ లక్ష్యాన్ని ఎంచుకున్నారు. క్రైస్తవమత సామ్రాజ్యంలోని “సాంప్రదాయ విరుద్ధతను” ఎదిరించడం మరియు కేథోలిక్‌లు లేని ప్రాంతములో మత మార్పిడి వృద్ధిచేయడం. వారేర్పరచుకున్న లక్ష్యం చాలాగొప్పది, కాని వారి సంఖ్య చాలా చిన్నది, కనుక ప్రతి జెసూట్‌ మంచి తర్ఫీదు పొందాలనే నిర్ణయం లయోలా తీసుకున్నాడు.

ఆయన నాలుగు జెసూట్స్‌ ప్రతిజ్ఞలు స్థాపించాడు, (నేర్చుకునే వారికి) విద్యార్థులకు రాజ్యాంగ చట్టాలను లేక జెసూట్స్‌ ప్రవర్తనా నియమావళిని తయారు చేశాడు. (బాక్స్‌ చూడండి.) వారి సిద్ధాంతం, చర్చికి సంపూర్ణ విధేయత చూపుటే. లయోలా యొక్క ప్రథమ అనుచరులలో ఒకడైన ఫ్రాన్సిస్‌ జేవియర్‌, “హోలీ చర్చ్‌ దీనిని నిషేధించాలని సువార్తలలో వున్నదన్నా నేను నమ్మను” అని అన్నాడు. లక్ష్యసాధనలో వారిని ఆటంకపరచేది లేదు. ‘లయోలా తన మనుష్యులకు’ మీకు వీలైన ఏ మార్గం చొప్పునైనా సరే, జనులు ఎక్కడ కనిపించిన అక్కడ, వారికొరకు పోరాడండి అని చెప్పాడు. మరి వారికి వీలైన మార్గాలేమిటి?

ప్రొటస్టెంట్లు వ్యాప్తి చెందకుండ చేయుట

పెరిగిపోతున్న ప్రొటస్టెంట్ల శక్తిని అరికట్టడానికి జెసూట్స్‌ విద్యను, పాపపు ఒప్పుకోలు విధానాలను ముఖ్య ఆయుధాలుగా ఉపయోగించారు. వారేర్పాటుచేసిన క్రొత్త పాఠశాలలు ఏ యితర సువార్త ప్రచారం కన్నా మిన్నగా రాజులలో, ఉన్నత వర్గీయులలో కేథోలిక్‌ మతాన్ని అయత్న పూర్వకంగా నాటింది. మరి 16వ శతాబ్దంలో వారి రాజ్యంలో ఉండవలసిన మతాన్ని నిర్ణయించ గలిగిన శక్తి ఈ ఉన్నత వంశీయులదే అయ్యింది.c

“రోమా మతోద్దేశాలను వృద్ధిచేసే ఈ విధానం సువార్త ప్రకటన కంటెను మన కాలేజీల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది,” అని లయోలా స్వయంగా అన్నాడు. జెసూట్స్‌ శ్రేష్ఠుల పాఠశాలలు, భవిష్యత్‌ యూరప్‌ పరిపాలకులను విద్యావంతులుగా చేసి వారితో తమ సిద్ధాంతాలను ప్రబోధించే వారు. ఒకసారి వీరు పరిపాలించడం మొదలుపెడితే వారిక ప్రొటస్టెంట్ల అణచివేతకు పూనుకునేవారు. ఈ ప్రథమ సఫలత పాప నివేదనమను నాటకీయ పద్ధతి ద్వారా బలపర్చబడింది. “పాపనివేదనములో జెసూట్స్‌ నివేదకుల మధ్యగల సంబంధం వకీలు—కక్షిదారుని మధ్యగల సంబంధం మాదిరే ఉండేదని” పాల్‌ జాన్‌సన్‌ అనే చరిత్రకారుడు వివరిస్తున్నాడు. ఈ క్రొత్త మార్గము మంచి ప్రఖ్యాతి నొందినదనుటలో ఆశ్చర్యం లేదు. ఇటీవలి వరకు యూరప్‌ చక్రవర్తులు తమకొరకు జెసూట్స్‌ ప్రావీణ్యులను నియమించు కొనిరి, వారు ఉపదేశించిన వారంతా ఎంత పలుకుబడి ఉన్నను వారి మాటవిని పాపనివేదన చేయించుకునే గురువులే.

జెసూట్స్‌ పాపనివేదన వినే గురువులు నైతికత విషయంలో సరళంగా ఉన్నప్పటికి, “సాంప్రదాయ విరుద్ధతను” మాత్రం సహించలేకపోయారు. ఫ్రెంచి రాజు లూయిస్‌ XV యొక్క జెసూట్స్‌ పాపనివేదన వినే గురువు, “మర్యాద దృష్ట్యా” రాజు పడుకునే గదినుండి తన ఉంపుడుగత్తె గదిలోనికి రహస్యపు మెట్లను కట్టించుకోవాలని రాజుకు సలహానిచ్చాడు. అయితే, నాంటెస్‌ శాసనాన్ని (ఫ్రెంచ్‌ ప్రొటస్టెంట్లకు లేక హగ్‌నాట్లకు ఆరాధనలో మితమైన స్వాతంత్ర్యము నిచ్చు చట్టం) రద్దు చేయవలసిందని తన జెసూట్స్‌ పాపనివేదనన వినే గురువు అతని పితరుడైన లూయిస్‌ XIV ను బలవంతపెట్టాడు. ఇది హగ్‌నాట్లపై అదుపులేని హింసను రేపింది. అనేకమంది హగ్‌నాట్లు సామూహికంగా హత్య చేయబడ్డారు.

పాల్‌జాన్‌సన్‌, తన పుస్తకం ఎ హిస్టరీ ఆఫ్‌ క్రిస్టియానిటీ, “అన్నింటిలోకెల్ల, కేథోలిక్‌ ఉద్దేశాలు ఆపదలో ఉన్నప్పుడు నైతిక చట్టాన్ని ఎలాగైనా నిలిపివేసే ఉద్దేశం వ్యక్తపరచుటలో జెసూట్స్‌ సహజంగా సిద్ధహస్తులని పేరుగాంచారు. తమ నైతిక విలువల, మత పోరాటాల ఒత్తిడుల వలన గందరగోళం సృష్టించుటలో జెసూట్స్‌ మంచి మనోబలం గలవారును ఆరితేరిన వారై యుండిరి.”

నైతిక ఆలోచనలో విరుద్ధ భావాలున్నప్పటికి లేక బహుశ అకారణంగానే జెసూట్స్‌ ప్రతి సంస్కారోద్యమంలో ప్రముఖపాత్ర వహించారు. ఈ విధానాన్ని కనుగొన్న 41 సంవత్సరాల తరువాత పోప్‌ గ్రెగరీ XIII యిలా వ్రాసాడు: “మీ పవిత్ర విధానం కంటె గొప్పది, మీ సాంప్రదాయాన్ని నిర్మూలించడానికి దేవుని వలన రూపొందించబడింది ఒక్కటి కూడ యిప్పుడు లేదు.” అధికారం మరియు పలుకుబడిగల ప్రముఖ వ్యక్తులతో పాటు సరళత, “సాంప్రదాయ విరుద్ధతను” ఫలవంతంగా ఎదిరించగలిగారు. ఇది మతం మార్చుకున్న వారిని కూడ గెలువగలదా?

జెసూట్స్‌ అనుకూల స్వభావం

జెసూట్స్‌ యూరప్‌లో మాదిరే మొదట తూర్పు దేశాలలోని రాజులను తరువాత వారి ప్రజలను మార్చాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ గమ్యాన్ని చేరుకోవడానికి అందరికి అన్ని విధములవారై యుండవలెనని చెప్పిన లయోలా ఆజ్ఞను వారు మితిమీరి పాటించారు. ఇండియాలో 17వ శతాబ్దం నందున రాబర్టో డినో బిలీ అనే జెసూట్‌ మిషనరీ ఉన్నత జాతివారికి ప్రకటించడానికి బ్రాహ్మణునివలె జీవించాడు. తోటి బ్రాహ్మణులను బాధపెట్టకుండునట్లు ఆయన ప్రత్యేక ప్రార్థనలప్పుడు యిచ్చే ప్రభువు భోజన ప్రసాదాన్ని లేక పవిత్ర రొట్టెను తక్కువజాతి వారికి అనగా అంటరాని వారికి కర్ర సహాయంతో యిచ్చేవాడు.

ముఖ్యంగా గణిత శాస్త్రంతో మరియు ఖగోళ శాస్త్రంతో తనకుగల ప్రతిభవల్లనే మాటోరిచీ అనే వ్యక్తి చైనా కోర్టులో మంచి పలుకుబడిని సంపాదించగలిగాడు. ఆయన తన మత నమ్మకాలను తనవరకే ఉంచుకున్నాడు. మింగ్‌ కోర్టునందున్న తన తరువాతి జెసూట్‌ అయిన యోహాన్‌ ఆదామ్‌ పాల్‌ ఫాన్‌బెల్‌ ఒక ఫిరంగి కర్మాగారాన్ని స్థాపించి చైనా దళాలకు తుపాకులను (వీటికి కేథోలిక్‌ “సెయింట్లు” అని పేరుపెట్టాడు) పేల్చుట నేర్పించేవాడు. మతం మారిన వారి మెప్పు పొందడానికి జెసూట్స్‌ చైనా కేథోలిక్కులను పూర్వికుల ఆరాధనలను ఆచరించడానికి అనుమతించారు. ఈ వివాదాంశ తీర్మానమును చివరికి పోప్‌ త్రోసివేశాడు. ఇన్ని విధాలుగా జెసూట్స్‌ ఇండియా, చైనా దేశాలలో మతపరంగా ఎంత రాజీ పడిననూ పాలకులను ఒప్పించలేకపోయారు.

దక్షిణ అమెరికాలో వలసవచ్చిన వారిమీద అధికారం చూపే పద్ధతిని ప్రవేశపెట్టారు. వలసవచ్చిన వారు లేని లోతట్టు ప్రాంతాలలో జెసూట్స్‌ స్వస్థావరాలను ఏర్పరచుకున్నారు. వీటిలో గౌరానీ ఇండియన్లు ఉండేవారు, వీరందని జెసూట్స్‌ మతప్రచారకులే అందుకు ప్రతిగా వారు వీరికి వ్యవసాయం, సంగీతం, మరియు మతాన్ని నేర్పించేవారు. ఈ స్థావరాలు అభివృద్ధి చెందినప్పుడు అవిని 1,00,000 మంది స్వదేశీయులకు ఆశ్రయమిచ్చాయి. చివరికి అవి పోర్చుగీస్‌ మరియు స్పానిష్‌ల వ్యాపారాసక్తి వలన వివాదంలో పడి విడిపోయాయి. జెసూట్స్‌ 30,000 మంది ఇండియా సైనికులకు తర్ఫీదునిచ్చి పోర్చుగీస్‌ వారితో కనీసం ఒకసారైనా ముఖాముఖి పోరాటం సల్పినా 1766లో స్థావరాలన్నీ నాశనం చేయబడ్డాయి, జెసూట్స్‌ తరిమివేయబడ్డారు.

అనేక శతాబ్దాలుగా చాలామంది జెసూట్స్‌ అన్ని ప్రాంతాలలో కేథోలిక్‌ మతప్రచారం కొరకు వీరోచితంగా తమ్మును తాము అర్పించుకున్నారు. వారు తీసుకున్న శ్రమలకు ఘోరంగా హతసాక్షులయ్యారు. ముఖ్యంగా జపాన్‌లో అలా జరిగింది. జపాన్‌ చక్రవర్తి వారి కార్యమును నిలిపివేయక ముందు వారు కొంతవరకు సఫలీకృతులయ్యారు.d

జెసూట్స్‌కు మంచి ఆసక్తి, త్యాగనిరతి వంటి లక్షణాలు ఉన్నప్పటికి, వారి స్వంత కుట్రలే లోకాన్ని మార్చడానికి వారు తీసుకున్న శ్రమలను నిష్ఫలం చేశాయి.

ఒక రాజకీయ సువార్త

గతంలో సమస్యలొచ్చినప్పటికి 20వ శతాబ్దపు జెసూట్స్‌ రాజకీయాన్ని రాజకీయ నాయకులను వదలడానికి యిష్టపడలేదు. అయితే, ఒక వ్యతిరేక దృష్టి మాత్రం కనిపించింది. కొన్ని శతాబ్దాలుగా సాంప్రదాయ మితవాద ప్రభుత్వాలకు మద్దతునిచ్చిన వీరు అనగా ఈనాటి జెసూట్స్‌ ఒకవేళ తాము అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తూ ఉంటే అలా మద్దతునిస్తారు. నికరాగువా దీనికొక ఉదాహరణ.

సాన్‌ డీ నెస్టా అధికారానికి వచ్చినప్పుడు మద్దతు కొరకు ప్రభుత్వ సభ్యత్వాన్ని అంగీకరించిన ఫెర్‌ నాన్‌డో కార్డెనల్‌ మరియు ఆల్‌వారో ఆర్‌గ్యాయో అనే యిద్దరు జెసూట్స్‌ మతగురువులపై ఆధారపడ్డారు. “నికరాగువాలో విప్లవమందు పాల్గొనడం ఎవరికైన యిష్టం లేకపోతే వాడు నిశ్చయంగా క్రైస్తవుడే కాదు. ఈనాడు ఒక క్రైస్తవుడిగా ఉండాలంటే, ఒక విప్లవకారుడిగా వుండడం కూడ ఆవశ్యకమే” నని ఆర్‌గ్వాయో తన రాజకీయ పదవిని సమర్థించుకుంటూ అన్నాడు. ఇటువంటి రాజకీయ సువార్త అనేకమంది నిష్కపటులను బాధపెడుతుందనుట తేటతెల్లమే.

మెగాల్‌ డి యునామ్యునో వై జుగో అనే ప్రముఖ స్పానిష్‌ తత్వవేత్త 1930వ దశాబ్దంలో రాజకీయమందు జెసూట్స్‌ జోక్యం యేసు బోధలకు విరుద్ధమని వారిని విమర్శించాడు. “జెసూట్స్‌ యేసుక్రీస్తు యొక్క సామ్యవాద రాజ్యము అనే కథను పదేపదే చెబుతుంటారు. ఈ రాజకీయ సిద్ధాంతముతో వారు రాజకీయ, ఆర్థిక మరియు సాంఘిక సమస్యలతో వ్యవహరించాలను కుంటారు. క్రీస్తుకు సామ్యవాదంలోగాని, వ్యక్తిగత సంపదలోగాని ఆసక్తి లేదు. ఆయన తన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని చెప్పాడు” అని ఆయన వ్రాసారు.

ఈ సిద్ధాంతాల కార్యరంగములో ఆధునిక జెసూట్స్‌ విప్లవాత్మకంగా ఉండాలని కూడ ప్రయత్నిస్తారు. యాజక స్త్రీలపై వాటికన్‌ నియమావళిని ప్రముఖ అమెరికా జెసూట్‌ సభ్యుడు మైకెల్‌ బకెల్‌ బహిరంగముగా విమర్శించాడు. ఎల్‌సాల్వెడార్‌లోని యోన్‌ పోబ్రనో విమోచనా వేదాంతాన్ని మరియు “వేదాంత జ్ఞాన సిద్ధాంతంపై మార్క్స్‌యొక్క ప్రభావమును” సమర్థించాడు. జెసూట్స్‌ పైఅధికారి 1989లో తన బాధ్యతగా భావించి గర్భనిరోధకంపై వాటికన్‌ నియమావళిని ‘విమర్శించరాదని’ ఆజ్ఞాపిస్తూ జెసూట్స్‌ కందరికి ఒక ఉత్తరం పంపాడు.

ప్రస్తుత మరియు గడిచిన జెసూట్స్‌ వృత్తాంతాన్ని బట్టి వారు యేసు యొక్క నిజమైన సంస్థయని చెప్పవచ్చునా?

యేసుయొక్క నిజమైన సంస్థ

“నేను మీకాజ్ఞాపించు వాటిని చేసినయెడల, మీరు నా స్నేహితులై యుందురు,” అని యేసు అన్నాడు. (యోహాను 15:14) ఒక నిజమైన స్నేహితుడు మరియు శిష్యుడు వేరెవ్వరికి కాక క్రీస్తునకు దేవునికి సంపూర్ణ విధేయత చూపబద్ధులై యున్నారు. (అపొ. కార్యములు 5:29) దేవునికి కాక మనుష్యులకు విధేయత చూపుట, యేసు వర్తమానమును దుర్వినియోగపరచి, రాజకీయం చేయడానికి నిశ్చయంగా నడుపును

నిస్సందేహముగా, ప్రొటస్టెంట్లతో చేసిన పోరాటాలలో జెసూట్స్‌ కొన్ని విజయాలు సాధించారు. అయితే అది దేనిమీద ఆధారపడింది? పొరుగువారి మీదనున్న ప్రేమతోకాక, రాజకీయ కుట్ర మీదనే వారి విజయం ఆధారపడింది. వారి బోధలన్నీ రాజకీయ ఉద్దేశాలు, వాంఛలతో కలుషితమైన సువార్త వర్తమానమును వ్యాపింపజేయడానికి సహాయపడింది. లోకాన్ని మార్చే ప్రయత్నంలో జెసూట్స్‌ తామే లోకస్థులై పోయారు. అదేనా యేసు ఆశించింది?

యేసు తన నిజమైన శిష్యులను గూర్చి, “నేను లోక సంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అని అన్నాడు. (యోహాను 17:16) నిజమే, అపొస్తలుడైన పౌలు “అందరికి అన్ని విధముల” వాడయ్యాడు. (1 కొరింథీయులు 9:22) కాని, రాజకీయ పలుకుబడి ఉపయోగించడానికో లేక మతం మార్చడానికో క్రైస్తవ సూత్రాలతో రాజీపడటం కాదుగాని, తనను వినేవారికి అర్థమయ్యే రీతిలో తన వర్తమానమును అందించడమేనని దీని భావము.

జెసూట్స్‌ యేసుక్రీస్తు ప్రతిబింబించే వారిగా ఈ లోకానికి తమ్మును తాము కనుపరచుకోవాలని లయోలా అభిలషించాడు. కానీ ఈ అభిలాష రాజకీయం వలన, వంచన వలన కళంకం చేయబడింది. వారు “అందరికి అన్ని విధముల వారైనా” గాని “సమస్తమును దేవుని మహిమకు చేయలేదు.”—1 కొరింథీయులు 10:31. (g92 11/8)

[అధస్సూచీలు]

a ఇగ్నేషియస్‌ ఆఫ్‌ లయోలా అనే స్పానిష్‌ దేశ వ్యవస్థాపకుడు ఈ విధానానికి సోసైటీ ఆఫ్‌ జీసస్‌ అనే పేరునిచ్చాడు. “జెసూట్స్‌” అనే పదాన్ని సృష్టించింది ప్రొటస్టెంట్లే, కాగా వారు ఆ పేరుతోనే గుర్తించబడుతున్నారు.

b “దేవుని పని” అని లాటిన్‌ భాషలో అక్షరార్థంగా పిలువబడేది, అది ముఖ్యంగా ఉన్నత వంశయాజకుడుండే కేథోలిక్‌ల సంస్థ, దీనిని కేథోలిక్‌ల మతగురువు ఓసా మారియా ఏస్‌క్రేవా స్పెయిన్‌ నందు 1928లో స్థాపించాడు.

c ద పీస్‌ ఆఫ్‌ ఆగస్‌ బర్గ్‌ అని 1555లో ఏర్పాటైన శాంతి ఒప్పందం కుయుస్‌, రెజియో, ఆయుస్‌ రెలీజియో అని లాటిన్‌లొ నిర్వచింపబడింది(రాజ్యమెవనిదో వానిదే మతం).

d స్పానిష్‌ వీరులు మత ప్రచారకులను అనుసరిస్తారనే బెదిరింపుకు ప్రతిగా, జపాన్‌ చక్రవర్తి హిడియోషె, అనేక జెసూట్లను మరియ ఫ్రాన్స్‌ దేశీయులను హతమార్చాడు. ఫిలిప్పినో మరియు జపాన్‌ల స్వచ్ఛంద సేవకుల సహాయముతో చైనాను జయించాలనే జెసూట్స్‌ కుట్ర జపాన్‌ వారి ఉద్దేశాలపై అనుమానాన్ని మరింత రెచ్చగొట్టింది. అప్పుడు 1614లో వచ్చిన అధికారిక నిషేధం మూలంగా కేథోలిక్‌ లక్ష్యము యెడల తమ భయాన్ని వ్యక్తపరిచారు. వారన్న ప్రకారం కేథోలిక్‌ లక్ష్యము “ప్రభుత్వాన్ని మార్చి, ఆ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకొనడమే.”

[19వ పేజీలోని బాక్సు/చిత్రం]

జెసూట్‌ అయ్యేందుకు

నాలుగు ప్రమాణాలు. మూడు ప్రథమ ప్రమాణములున్నాయి: దారిద్ర్యం, పవిత్రత, విధేయత. పండ్రెండు సంవత్సరాల తర్వాత “రోమ్‌లోని పోప్‌ యొక్క ప్రతి ఆజ్ఞకు విధేయుడ” నౌతానని వాగ్దానం చేయడంతో జెసూట్‌ నాల్గవ ప్రమాణాన్ని స్వీకరిస్తాడు.

ఆత్మీయ వ్యాయామం క్రొత్త శిష్యుని జీవిత పర్యంతము జెసూట్‌ ఉద్దేశాలకు సమర్పించుకొనునట్లు చేసే నాలుగువారాల ధ్యాన కార్యక్రమము.

మొదటి వారం ధ్యానములో పాల్గొనేవ్యక్తి తన పంచేంద్రియాలతో నరక కూపపు చిత్రహింసలను గూర్చి ఊహించుకుంటాడు. రెండవవారం, జెసూట్‌గా వుండాలో లేదో అన్నది తీర్మానించుకోవాలి. మూడవవారం యేసు బాధను, గూర్చి ధ్యానించుటకు, ఇక నాల్గవవారం యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్పష్టంగా ఊహిస్తూ “నిమగ్నుడై” యుండుటకు ప్రత్యేకింపబడింది.

ఉపదేశాలన్నీ అంచలంచెలుగా ఇవ్వబడతాయి. ఉదాహరణకు మొదటి వారంలో శిష్యులు “పొగను, గంధకమును, ఏహ్యమైన దుర్గంధమును, నరకకూప క్షయమును పీల్చి ఆ మంటలు ఆత్మను పట్టుకొని ఎలా దానిని దహించివేస్తుందో అనుభవించ” మంటారు.

విధులు ఇగ్నేషియన్‌ ఆఫ్‌ లయోలా తయారుచేసిన నియమ నిష్టలుగల టాల్‌ముడ్‌ (యూదా ధర్మశాస్త్ర) వంటి పుస్తకము. అన్ని విషయాలతోపాటు, చేతులు ఎలా పెట్టాలి, అధికారం చెలాయించే వాని వైపు ఎలా చూడాలో మాయోపాయములను ఎందుకు మానుకోవాలో కూడా చెబుతారు.

అన్నిటికంటే ముఖ్యంగా ఈ విధులు తమ పై అధికారికి జెసూట్స్‌ సంపూర్ణ విధేయత కనుపరచవలసిన అవసరతను నొక్కి తెలుపుతుంది. “క్రింది ఉద్యోగి పై అధికారిచేతిలో చచ్చిన శవం వంటివాడు.”

[22వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఒక జెసూట్‌ ఎందుకు యెహోవాసాక్షి అయ్యాడు

బొలీవియా నందలి చర్చి ఆధిపత్యం క్రిందనున్న ఒక పేద ప్రాంతంలో నేను పనిచేస్తున్నప్పుడు నాకు అనుమానాలు రావడం ప్రారంభించాయి. మొదట్లో ఇవి చర్చిపై కాదు, వాటి ప్రతినిధులపైనే వచ్చాయి. ఉదాహరణకు, ప్రత్యేకమైన ప్రార్థనలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు మొదలైన వాటిలోని వసూళ్లు, చెల్లింపులలో కొంత శాతం ప్రతినెల ప్రాంతీయ బిషప్‌కు నేను ఇవ్వవలసి ఉండేది. నా ప్రాంతమందలి ప్రజలు పేదవారు గనుక, బిషప్‌ వాటా ఎప్పుడూ ఆయన్ని సంతోషపెట్టలేదు. ఆయన కవరు తెరిచి ఛీకొడుతూ, “ఈ నికృష్టమైన చందాయేనా నీవు నాకు తెచ్చేది?” అన్నప్పుడు నాకు చాలా బాధకలిగేది. స్పష్టమైన రీతిగా, “విధవరాలి రెండు కాసులు” ఆయన లెక్కలోనికి రాలేదు.—లూకా 21:1-4, డుయే.

నన్ను కృంగ దీసిన మరో విషయం, నేను పనిచేసే ఆధిపత్యంలో వున్న చర్చిలోని క్రిస్టో డి ల వరాక్రస్‌ (నిజమైన సిలువయొక్క క్రీస్తు) ఆరాధనలో, స్థానిక అన్య సిద్ధాంతాలకు ఆచరణలకు తావిచ్చి వాటిని అంగీకరించడానికి సుముఖత చూపిన కేథోలిక్‌ అధికార విధానమే. చాలా విషయాలలో ఈ ఆచరణలు దయ్యాల మతమౌఢ్యాన్ని సంపూర్ణంగా వ్యక్తపరుస్తున్నాయి దీనితోపాటు మత వేడుకలు సహజంగా త్రాగుబోతుతనం చేరి ఉంటాయి. కానీ ఈ క్రైస్తవాతీత త్రాగుబోతు అట్టహాసానికి విరుద్ధంగా ఏ ఒక్కరు నోరు మెదపలేదు.

శతాబ్దాలు గడిచేకొలది, కాథోలిక్‌ చర్చి బైబిలు సత్యాలన్నింటి నుండి వేరైపోయి, వాటి స్థానంలో మానవ పారంపర్యాచారాలు, తత్వ శాస్త్రము నుంచాయని వ్యక్తులే కాదు ఆ విధానమంతా పాడైనదనే నమ్మకం నాకు కల్గింది. ఆ ప్రకారంగా, హృదయంలో యథార్థంగా నేను కేథోలిక్‌ను కానని గ్రహించాను.—హూలియో ఎన్‌మెస్‌ టా గర్‌నీయe

[అధస్సూచీలు]

e అతని పూర్తి జీవితగాథను, నవంబరు 15, 1982ది వాచ్‌టవర్‌, నందు చూడండి.

[18వ పేజీలోని చిత్రాలు]

జెసూట్స్‌ స్థాపకుడైన ఇగ్నేషియన్‌ ఆఫ్‌ లయోలా మరియు స్పెయిన్‌ నందున్న ఆయన మఠం

[20వ పేజీలోని చిత్రం]

రాజకీయ కుట్రలో పేరుగాంచిన వారు గనుకనే జెసూట్స్‌ 1767లో స్పెయిన్‌ నుండి బహిష్కరించబడ్డారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి