కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g93 1/8 పేజీలు 15-17
  • దేవుడు నా ప్రార్థనలకు ప్రత్త్యుత్తరమిస్తాడా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు నా ప్రార్థనలకు ప్రత్త్యుత్తరమిస్తాడా?
  • తేజరిల్లు!—1993
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థనలకు అడ్డంకులు
  • ప్రార్థనను దుర్వినియోగపరచుట
  • “ఆయన చిత్తానుసారముగా” ప్రార్థనలు చేయుట
  • దేవుడెలా ప్రత్యుత్తరమిస్తాడు
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
మరిన్ని
తేజరిల్లు!—1993
g93 1/8 పేజీలు 15-17

యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . .

దేవుడు నా ప్రార్థనలకు ప్రత్త్యుత్తరమిస్తాడా?

“యెహోవా నా ప్రార్థనలకు ప్రత్యుత్తురమిస్తున్నాడా? అన్నది నేను తెలుసుకోవాలి,” అని పదకొండేళ్ల సాన్‌డ్రా అంటుంది. “ఎందుకంటే ఆయన సమాధాన మిస్తున్నాడని నాకు నిశ్చయంగా తెలియదు. ఇదే సమస్యవున్న చాలామంది యౌవనస్థులు నాకు తెలుసు.” పదిహేనేళ్ల ఆలీసాకు ప్రార్థన విషయంలో ఒకప్పుడు అలాంటి సమస్యే ఉండేది. “నాతో నేనే మాట్లాడుకుంటునట్లు నాకు తరచూ అనిపించేది” అని ఆమె ఒప్పుకుంటుంది.

నమూనా పరిశీలన 1988 ప్రకారం, అమెరికాలోని 87 శాతం యౌవనులు ఏదో ఒక సమయంలో ప్రార్థించారు. కానీ వారిలో సగానికి తక్కువే క్రమంగా ప్రార్థిస్తారు. నిజానికి, చాలామంది తమ ప్రార్థనలకు ప్రత్యుత్తరమివ్వబడదని భావిస్తున్నారు. కొన్నిసార్లు, మీ ప్రార్థనలు వినేవాడు లేడనే భావన మీకు కూడా కలుగవచ్చు. కానీ ఎవరైనా విశ్వాసంతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తే “ప్రార్థన ఆలకించువాడు” తప్పక మీ ప్రార్థన ఆలకిస్తాడు అని బైబిలు మనకు అభయమిస్తుంది. (కీర్తన 65:2) ఆయన కేవలం వినువాడు మాత్రమే కాదని, విని, దానికెలాంటి ప్రత్యుత్తరం ఇవ్వకుండ లేదా ఏమి చేయకుండవుండే వాడు కాదని మనకెలా తెలుసు?

దేవున్ని ప్రార్థన ఆలకించువాడని పిలిచిన తరవాత కీర్తనల రచయిత, “మాకు రక్షణ కర్తయైన దేవా, నీతిని బట్టి భీకర క్రియలచేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు” అన్నాడు. (కీర్తన 65:5; పోల్చుము కీర్తన 66:19, 20) మరెందుకు కొందరు తమ ప్రార్థనలకు ప్రత్యుత్తరం దొరకడంలేదని భావిస్తారు?

ప్రార్థనలకు అడ్డంకులు

దానికిగల కారణం బహుశా దేవునితో నిజమైన సంబంధం లేక పోవడమే కావచ్చు. కొందరు యౌవనులు ఆయనను, ఎక్కడో సుదూరమందున్న అస్పష్ట మూర్తిగా దృష్టించుకుంటారు. మరీ అత్యవసర పరిస్థితులలో, వేరే మార్గమేది కనిపించనపుడు చివరి ప్రయత్నంగా కొందరు దేవున్ని ప్రార్థిస్తారు. ఒక కాథొలిక్‌ యువకుడు, “నేను కష్టాలలో ఉన్నపుడు, నాకు సహాయం కావలసినపుడు నేను దేవున్ని నమ్ముతాను, అప్పుడు నేను దేవుని సహాయం కోరుతాను” అని అంటున్నాడు. మరొక యువతి, “కొన్నిసార్లు, నాకు నిజంగా అవసరమున్నపుడే నేను ప్రార్థిస్తాను” అని నిర్మొహమాటంగా అన్నది.

అయిననూ ప్రార్థన అనేది విశ్వాసము, గౌరవము, భక్తి, నమ్మకాలను వ్యక్తపరచేదై యుండాలి—అది కేవలం నిరాశపూర్వకంగా లేక స్వార్థభరితమైన కోరికతో నిండినవై యుండరాదు. దేవుడు ఉన్నాడేమో అని అనుకొని నీవు ప్రార్థించకూడదు. “దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, . . . తనను వెదకువానికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను” అని బైబిల్‌ చెప్పుచున్నది. (హెబ్రీయులు 11:6) అవిశ్వాసుల ప్రార్థనలు ఆలకింపబడవు. (యాకోబు 1:6-8) యెహోవా తన నెరిగి, తనను ప్రేమించేవారి ప్రార్థనలను ఆలకిస్తాడు; వారు తమ ప్రార్థనలు అత్యవసర పరిస్థితులకే పరిమితం చేయరు. 1 థెస్సలొనీకయులు 5:16 ఉద్బోధించులాగున, వారు “ఎడతెగక ప్రార్థనచేయుచున్నారు,” లేక ఏన్‌ అమెరికన్‌ ట్రాన్స్‌లేషన్‌ చెప్పినట్లు, “విడువక ప్రార్థిస్తారు.”

కొందరు యౌవనులు యెహోవాను తెలుసుకున్నారుగాని ఆయనతో నిజమైన స్నేహం పెంపొందించుకోలేదని చెప్పుట విచారకరం. (కీర్తన 25:14) వారి ప్రార్థనలు చాలా తక్కువగా, అరుదుగావుండేవి, వ్యక్తిగత ప్రార్థనలు కావు. కావున చివరికి, వారి ప్రార్థనలకు ప్రత్త్యుత్తరం దొరకకుండా పోతుంది. నీ ప్రార్థనలు కూడా ఇలాగే వున్నావా? అలాగైతే, “దేవునియొద్దకు రండి” (యాకోబు 4:8) అంతకు ముందు చెప్పిన ఆలిసాకు యెహోవాను గూర్చి కొన్ని సంశయాలుండేవి. కానీ వ్యక్తిగత బైబిల్‌ పఠనము క్రమంగా తన అనుమానాలను తీసివేసి, దేవునితో మంచి సంబంధమును ఆమె వృద్ధిచేసికొనుటకు సహాయపడింది.

ప్రార్థనయెడల ఒకని దృష్టి మరియు క్రియలు కూడా ముఖ్యమైన అడ్డంకులు కావచ్చు. కీర్తనల రచయిత ఇలా అన్నాడు: “నా హృదయములో నేను పాపమును లక్ష్యముచేసిన యెడల ప్రభువు నామనవి వినక పోవును.” (కీర్తన 66:18; సామెతలు 15:29) నీవు దేవున్ని బాధపెట్టే క్రియలు చేస్తూ—మాదక ద్రవ్యాలు, ఉపయోగిస్తూ, పొగత్రాగుతూ, అశ్లీల సంగీతాన్ని వింటూ, లైంగిక అవినీతిలో పాల్గొంటూ, నీ ప్రార్థనలకు ప్రత్యుత్తరం కావాలనుకోవడం సమంజసమేనా? కానేకాదు. కాబట్టి ‘వారేమైయున్నారో రహస్యంగా దాచుకొనివుంటూ,’ వేషధారులై ద్వంద జీవితం జీవించే వారి ప్రార్థనలు యెహోవా తృణీకరిస్తాడు. (కీర్తన 26:4 NW) ఆయన “యథార్థమైన ప్రవర్తన గలిగి నీతిననుసరిస్తూ హృదయ పూర్వకముగా నిజము పలుకువాని” ప్రార్థనలు ఆలకించును. (కీర్తన 15:1, 2) కావున, ప్రార్థించేటప్పుడు నీతో నీవే మాట్లాడుతున్నట్లు నీకనిపిస్తే, నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో, బహుశ నీ జీవితంలో కొన్ని మార్పులు చేయవలసి వుందేమో.

ప్రార్థనను దుర్వినియోగపరచుట

ఎలాంటి విషయాలను నీవు దేవున్ని అడుగుతావు? యేసు మనకీ హామీ నిస్తున్నాడు: “మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును.” (యోహాను 16:23) ఏమి అడిగినను—ఈ పదమెంతో ఆకర్షణీయమైనది. దేవుడు నీకు కావలసినప్పుడల్లా నీ కోరికలు తీర్చే జినీ అనే మానవాతీత శక్తిలాంటివాడా? దేవుడు నీ ప్రతికోరికను—తుచ్ఛమైన వాంఛలను కూడా తీరుస్తాడా? యేసు తన బాధాకర మరణమునకు కొన్ని గంటల ముందు హృదయము విప్పి ప్రార్థించాడు. నిశ్చయంగా ఆయన మనసులో పిచ్చి కోరికలేమి లేవు! కావున యాకోబు 4:3 ప్రార్థనను దుర్వినియోగపరచుట విషయమై ఇట్లు హెచ్చరిస్తుంది: “మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకదు.”

ఈనాడు అనేకులు ప్రార్థనల ఆధిక్యతను దుర్వినియోగ పరచుచున్నారు. ఒక పాఠశాల బాస్కెట్‌ బాల్‌ జట్టు ప్రతి ఆట తరువాత, మైదానం మధ్యలో మోకాళ్లూని ప్రార్థించేది. కానీ, దేవుడు బాస్కెట్‌ బాల్‌ అభిమానుడా లేక ఈ తుచ్ఛమైన పోటీలలో ఆయన జోక్యం కలుగజేసుకొని, విజయాన్ని అనుగ్రహిస్తాడని నీవనుకొంటున్నావా? (గలతీయులు 5:26 పోల్చుము.) అదట్లుంచి చెప్పులగూర్చి ప్రార్థించే స్త్రీ మాటేమిటి? ఆవిడ “కొన్నిసార్లు ఆ చెప్పుల దుకాణంలో నా సైజు చెప్పులు ఒకటి లేక రెండు జతలే మిగిలియుండవచ్చును. మరి అప్పుడు నా దగ్గర డబ్బు లేకపోతే, నేను తిరిగి వచ్చేంతవరకూ అవి వుండేలాగున దేవున్ని ప్రార్థించే దాన్ని,” అని అంటుంది. అవసరానికి ప్రార్థించేది వేరు—దేవుడే నీ కొరకు వస్తువులను కొని తెచ్చిపెట్టవలెనని ప్రార్థించేది వేరు.

అదే విధంగా నీకు తగిన శిక్ష ఇవ్వకుండ లేక క్రమశిక్షణ ఇవ్వకుండ నిన్ను రక్షించుమని దేవున్ని ప్రార్థించడం అనుచితం—నిరర్థకం. (హెబ్రీయులు 12:7, 8, 11) కొద్దిపాటి లేక అసలే సిద్ధపాటు లేకుండా నీవు రాసిన పరీక్షలో ఉన్నతశ్రేణి రావాలని దేవుని కోరడంలో నీవేమీ సాధించలేవు.—గలతీయులు 6:7 పోల్చుము.

“ఆయన చిత్తానుసారముగా” ప్రార్థనలు చేయుట

అపొస్తలుడైన యోహాను ప్రార్థనపై ఒక ప్రముఖమైన విషయాన్ని తెలియ జేస్తున్నాడు: “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.” (1 యోహాను 5:14) ప్రార్థనలో ఇమడ్చవలసిన వాటిని గూర్చిన మాదిరిని యేసు తన మాదిరి ప్రార్థనలో (ప్రభువు ప్రార్థన) చూపాడు. ఆయన (1) దేవుని నామము ఘనపరచుటకు (2) దేవుని రాజ్యము వచ్చుటకు (3) దేవుని చిత్తము జరిగించుటకు (4) శారీరక, ఆత్మీయ అవసరతలు తీర్చుటకు మరియు (5) సాతాను ఉరులను తప్పించుకొనుటకు ప్రార్థించెను.—మత్తయి 6:9-13.

ఈ పరిధిలో ప్రార్థించటానికి సరియైన అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి. వాస్తవానికి, క్రైస్తవులను 1 పేతురు 5:7 ఇలా ప్రోత్సహిస్తున్నది: “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.” అంటే మన జీవితాల ప్రతి వాస్తవిక దశను గూర్చి ప్రార్థించడం సమంజసమే! నీ చదువు విషయంలో ఏ కోర్సు ఎన్నుకోవాలనే నిర్ణయం తీసుకోవాలా? దైవిక జ్ఞానంకొరకు ప్రార్థించు. (యాకోబు 1:5) బుద్ధిలేని తప్పులేమైనా చేశావా? అప్పుడు దేవున్ని క్షమాపణ అడుగు.—యెషయా 55:7; 1 యోహాను 1:9.

అయితే నీ ప్రార్థనలకనుగుణంగా ప్రవర్తించాలి. క్లింట్‌ అనే యువకుని ఉదాహరణ తీసుకోండి. ఉన్నత విద్య తరువాత, పూర్తికాల సువార్తికునిగా పనిచేయడానికి మొదలుపెట్టాడు. కొన్ని నెలల వరకు ఆయన బైబిలు పఠించడంలో ఆసక్తివున్న వారినొక్కరినైనా కనుగొనలేదు. కాబట్టి ఆయన ఈ విషయాన్ని ప్రార్థనలో ఉంచాడు. అయితే, బైబిలు విద్యార్థి ఆకాశం నుండి ఊడిపడతాడులే అని ఆయన ఎదురుచూడలేదు. ఆయన ఎడతెగక ఇంటింటి సేవ చేస్తూనే వున్నాడు, కొద్ది కాలంలోనే బైబిలు పఠించడానికి ఆసక్తి కనబరచిన చాలామందిని ఆయన కనుగొనగలిగాడు.

దేవుడెలా ప్రత్యుత్తరమిస్తాడు

కొన్నిసార్లు ప్రార్థించడమే సహాయకరంగా వుంటుంది. సాండి అనే యువతి హస్త ప్రయోగం సమస్యతో బాధపడుతూవుంది. ఆమె అనేదేమంటే, “యెహోవాను పిలిచి ప్రార్థించడం సహాయం చేస్తుంది అని నాకు తెలుసు. ఎందుకంటే, హస్తప్రయోగం చేయకూడదని యెహోవా సహాయం కోరిన తరువాత, అలా చేయకుండా వుండడమే మంచిది.”

అయితే, కొన్నిసార్లు మన ప్రార్థనలకు ప్రత్యుత్తరంగా దేవుడే కొన్ని సంఘటనలు కలుగజేస్తాడని అనిపిస్తుంది. ఒక చిన్న ప్రసంగం ఇవ్వడానికని కెన్‌ అనే యువకుడు యెహోవాసాక్షుల రాజ్యమందిరానికి వెళ్ళవలసి వచ్చింది. అనుకోకుండా ప్రయాణ సౌకర్యం లేక పోయింది. ఆయన ఈ విషయమై తీవ్రంగా ప్రార్థించాడు. కొన్ని నిమిషాల తరువాత, చాలా అరుదుగా వచ్చే తన అక్క వచ్చింది. తన తమ్ముని మతంలో ఆసక్తి లేకపోయినా, రాజ్యమందిరం వరకు తీసుకువెళ్ళడానికి ఆమె ఒప్పుకుంది. ఆయన ప్రార్థనకిది సూటిగా వచ్చిన ప్రత్యుత్తరమా? కావచ్చు. ఏ సందర్భంలోనైనా, మన అనుకూలానికి పనులు జరిగినప్పుడల్లా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఎల్లప్పుడూ సమంజసమే. పౌలు, “ప్రతివిషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,” అని ఉద్బోధిస్తున్నాడు.—1 థెస్సలొనీకయులు 5:18.

అయినప్పటికి, దేవుడు నీ ప్రార్థనకు నాటకీయంగా ప్రత్యుత్తరమిస్తాడని కోరవద్దు. లేక నీకు జరిగిన ప్రతిది, దేవుని చిత్తాన్ని వ్యక్తపరుస్తుందని కూడా భావించవద్దు. సహజంగా మన ప్రార్థనలకు ప్రత్యుత్తరం పరోక్షంగా వస్తుంది: నీవు బైబిలో లేక బైబిలు ప్రచురణో చదివినప్పుడు నీ తల్లిదండ్రులలో లేక తోటి క్రైస్తవుడో నీకు మంచి ఉపదేశాన్నిచ్చినప్పుడు, దానికి ప్రత్యుత్తరం వచ్చినట్లే విశ్వాసపాత్రంగా నీ యెడల దేవుని సంకల్పం తెలుసుకోవడానికి వివేకం అవసరం. సహజంగా, ఇలాంటివన్ని సమయం గడిచే కొలది పరిష్కరింపబడతాయి.

అవును దానికి సమయం పడుతుంది! ఎప్పుడు కూడా నీవు కోరే సమయానికే దేవుడు ఉత్తరమివ్వాలని ఆశించకూడదు. “యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది,” అని యిర్మీయా వ్రాసాడు. (విలాపవాక్యములు 3:26) అంతేగాకుండా, నీ కిష్టమైన సమాధానమే దొరుకుతుందనే అభయం మాత్రంలేదు. పౌలు తన ‘శరీరములో ఒక ముల్లు’ అని పిలిచే సమస్యను తీసివేయుమని దేవుని ముమ్మారు ప్రార్థించాడు. అందుకు దేవుడు అలా జరుగదని సమాధానమిచ్చాడు. (2 కొరింథీయులు 12:7-9) అయినప్పటికి, పౌలు ప్రార్థనా బహుమానంపై తన మెప్పును పోగొట్టుకొనక, యెహోవాసేవలో మానక కొనసాగాడు. “ప్రార్థనయందు నిలకడగా ఉండాలి” అని ఆయన వ్రాశాడు. (కొలొస్సయులు 4:2) కాబట్టి, “అడుగుడి, . . . వెదకుడి, . . . తట్టుడి.” (మత్తయి 7:7) ఇలా చేస్తే, నీవు దేవునికి మరింత దగ్గరవుతావు. అంతేకాదు, నీ ప్రార్థనలకు మంచి ప్రత్యుత్తరం కూడా లభించవచ్చును. (g92 9/22)

[16వ పేజీలోని చిత్రాలు]

ప్రార్థనలో, వస్తుసంబంధ కోరికల నిమిత్తం చేసే అల్పమైన విన్నపములు ఉండకూడదు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి