మా పాఠకులనుండి
టివి “దూరదర్శిని—ప్రపంచాన్నే మార్చివేసిన పెట్టె,” అనే శీర్షికల కొరకు మీకు వందనాలు (gbr-6-TU) నాకు దూరదర్శినితో ఎప్పుడూ సమస్య ఉందేది; దాని ఆపుచేయగల నిగ్రహం నాలో లేదు. మీ సలహాలు సహాయపడ్డాయి. నేనెంత సేపు దూరదర్శిని తిలకిస్తున్నానో గమనించబోతున్నాను. నా టివిని సామానుల గదిలో పెట్టేసాను కూడా. కాబట్టి దానిని తిలకించాలని నేను కోరినప్పుడు, అలా చేయడం మూలంగా కలిగే లాభ నష్టాలను నేను మొదట తూచి చూడగలను. మరోసారి మీకు వందనములు.
డబ్ల్యు. హెచ్,. అమెరికా
లాటరీపిచ్చి నేను క్రైస్తవుడను కాకమునుపు నేను కల్గియున్న జూదమాడే స్నేహితులను గూర్చి లాటరీపిచ్చి అనే మీ శీర్షికలు (gbr-5-TU) నాకు జ్ఞాపకం చేశాయి. జూదమాడేందుకు పోర్జరీ చేసినందున ఒకవ్యక్తి జైలుకు పంపబడ్డాడు. మరొకడు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించనందుకు వడ్డీవ్యాపారులచే కొట్టబడి అంగవికలుడు చేయబడ్డాడు. నిజమే జూదం ప్రజల జీవితాలను పాడుచేస్తుంది.
ఆర్. బి., అమెరికా
నీవేమైయున్నావో మార్చుకొనుట “నీవెవరివైయున్నావో నీవు మార్చుకొనవలెనా?” (gbr-7-TU) అనే అనుబంధ శీర్షికలలో మీరిచ్చిన అద్భుతమైన సలహాల కొరకు నేను మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెల్పగోరుచున్నాను. నా వ్యక్తిత్వంలో కొన్ని మార్పులు నేను చేసికొనవలసి యున్నదని గ్రహించాను, కాని అలా చేయుటకు నాకు ప్రోత్సాహము లేదు. మీరిచ్చిన సలహాను అన్వయించుటకు నేనిప్పుడు ప్రయత్నిస్తున్నాను. అది ఎంతో ప్రయోజనకరంగా ఉన్నట్లు నేనిప్పటికే గ్రహించాను.
ఎస్. సి., ఇటలీ
హాస్పిటల్‌లో మానసిక చికిత్సా వార్డునుండి వచ్చిన తరువాత ‘మార్చుకొనుటను’ గూర్చిన శీర్షికలను నేను చదివాను. అది సూటిగా గురి చేరిందని చెప్పనక్కర్లేదు! నేను నిజంగా ఏమైయున్నానో యిప్పుడు నేను చూచుకొనగల్గుతున్నాను, నా సమస్యేమిటో యిప్పుడు నాకర్థమయ్యింది. నన్ను నేను అదుపు చేసికొనే చర్యలను తీసుకొనగలను.
జె. డి., అమెరికా
ఊపిరితిత్తులు నాకు 13 సంవత్సరాలు. ఐదవ తరగతిలో ఉన్నప్పుడు ఊపిరితిత్తులను గూర్చి చదివినట్లు నాకు జ్ఞాపకము. గాని దానిలో ఎన్నో విషయాలను నేను మరచిపోయాను. “ఊపిరితిత్తులు—ఒక అద్భుత నిర్మాణం” (gbr-6-TU) అన్న మీ శీర్షిక నా జ్ఞాపకశక్తిని తేటపరిచింది. అది చాలా చక్కగా వ్రాయబడింది. ఆ చిత్ర లేఖనము కచ్చితంగా ఉంది. యెహోవా యొక్క అద్భుత సృష్టి కొరకు మన మెప్పుదలను అధికం చేయుటకు సహాయపడగల యిట్టి శీర్షికల కొరకు మీకు ఎనలేని వందనములు.
ఎ. ఎమ్., అమెరికా
“ఊపిరితిత్తులు—ఒక అద్భుత నిర్మాణం” (gbr-6-TU) అనే శీర్షిక కొరకు మీకు నేను కృతజ్ఞతలు తెల్పకుండా ఉండలేకపోతున్నాను. యెహోవా దేవుని అద్భుత కార్యము యెడల ఆశ్చర్య భావాలను అది నాలో రేకెత్తించింది. ఆ శీర్షిక ఎంతో నేర్పుతో వ్రాయబడి సంక్లిష్టమైన సంగతులను అతి సూక్ష్మంగా గ్రహించేలాగున అది నాకు సహాయపడింది.
బి. టి. ఎ., బ్రెజిల్
వృధాప్రసంగం వృధాప్రసంగమును గూర్చిన సమయానుకూల శీర్షిక కొరకు మీకు వందనాలు. (gbr-11-TU) ఇటీవల నేను ద్వేషపూరిత వృధాప్రసంగానికి లోనయ్యాను, మత్తయి 18:15-17 నందలి లేఖన సూత్రాన్ని అన్వయించుట ద్వారా, నాపై నిందవేసిన వానితో సంగతులను చక్కదిద్దుకోగలిగాను.
బి. సి., ఆస్ట్రేలియా
ఆ శీర్షికలు సమాచారముతో కూడినవని, చక్కగా వ్రాయబడ్డాయని నేను తలంచాను. అయితే మీరు ఉపయోగించిన ఫొటోలను చూచి నేను విస్మయమొందాను. వాటిలో నాలుగు చిత్రాలు స్త్రీలు వృధాప్రసంగం చేస్తున్నట్లు చిత్రీకరించబడ్డాయి. వృధా ప్రసంగమనేది స్త్రీకున్న ఒక లక్షణమని అవి సందేశాన్నిస్తున్నాయి.
హెచ్. డబ్ల్యు., అమెరికా
స్త్రీలనుగాని, పురుషులనుగాని ప్రతికూలంగా చిత్రీకరించాలని మా తలంపుకాదు. వాటిలో రెండు ఫొటోలు పురుషులు వృధాప్రసంగం చేస్తున్నట్లున్నవి. మరో ఫొటోచూస్తే యిద్దరు స్త్రీలు ప్రోత్సాహకరమైన సంభాషణలో పాల్గొన్నట్లు చిత్రీకరించబడింది. ఒక స్త్రీ వృధాప్రసంగాన్ని కేవలం వినడానికి కూడా నిరాకరిస్తున్నట్లు చూపబడింది.—ప్రకా.