కోతి బుద్ధి కుశలత
పశ్చిమాఫ్రికా నందలి సియర్రాలియోన్ నందు ఒక సామెత ఉంది: “కోతి తన పిల్లతో నన్ను ‘గట్టిగా పట్టుకో!’ అని చెప్పదు, ‘క్రిందికి చూడు’ అని చెబుతుంది.”
చెట్లపై ఎంతో ఎత్తున తన తల్లి పొట్టను పట్టుకొని వ్రేలాడుతున్న కోతిపిల్ల చిత్రాన్ని యిది మన మదికి తెస్తున్నది. ఈ సామెత వెనుకున్న తలంపు ఏమిటంటే గట్టిగా పట్టుకో అని మాత్రమే తల్లి చెబితే, ఆ పిల్ల కొంతసేపు మాత్రమే పట్టుకొంటుంది, అయితే ఆమె యిచ్చిన ఆజ్ఞ వెనుక నున్న కారణమేమిటో దానికి తెలియదు గనుక, వెంటనే మర్చిపోయి తన పట్టు సడలించ వచ్చును.
అయితే, పిల్ల క్రిందికి చూస్తే, నేలనుండి తానెంత ఎత్తులో ఉన్నానో చూచుకొని, తన ప్రాణం యిమిడియున్నందున, దానిని మనస్సులో ఎంతగానో ముద్రించుకొనును. ఎందుకంటే, తాను తీవ్రంగా గాయపడవచ్చు లేదా చనిపోవచ్చును! ప్రమాదాన్ని మరింతగా గ్రహించినదై, తాను గట్టిగా పట్టుకొనే దృఢమైన వైఖరిని కల్గియుంటుంది. ఇప్పుడు దానికి తోడు ఏమైనా సలహా లేదా ఆ దేశముంటే ఎంతో గౌరవంగా స్వీకరించబడుతుంది.
ఇతరులకు బోధించుటలో, ముఖ్యంగా పిల్లలకు బోధించుటకు ఎంతమంచి సూత్రము. ఈ కథలోని నీతి ఏమంటే ఆజ్ఞలు జారీచేసేకంటే, అవగాహన చేసికొనునట్లు చేయడం ప్రాముఖ్యం.
అయితే దానిని మొదటిగా చేసేందుకు సరిపడునంత సమయము కొన్ని సందర్భాలలో లేక పోవచ్చును. ఉదాహరణకు, వాహన రాకపోకలతో నిండియున్న వీధిలో మీ పిల్లవాడు అటూయిటూ చూడకుండా వీధిని దాటి వెళ్ళడానికి ప్రారంభిస్తే, ఆగమని, వెంటనే వెనక్కి రమ్మని మీరు ఆజ్ఞాపించవచ్చును. ఇక్కడ మొదట ఆజ్ఞ జారీ చేయడం ముఖ్యం. పిమ్మట పిల్లవాడు ఎట్టి ప్రమాదములో ఉండెనో దాని వివరణ యిస్తే అతనికి అవగాహన అవుతుంది.
ఇట్టి ప్రయత్నముయొక్క ప్రయోజనము కేవలం ఆజ్ఞాపించడమే కాదు అవగాహన కూడా అందించాలి—అనేది బైబిలు సామెత నందున్నది: “ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు.”—సామెతలు 28:7. (g91 10/8)