కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 9/8 పేజీలు 13-14
  • అశ్లీల సాహిత్యం ఎందుకు ప్రమాదకరము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అశ్లీల సాహిత్యం ఎందుకు ప్రమాదకరము
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కోరికలను రేకెత్తించుకొనుట తప్పా?
  • దాని బంధకములను త్రెంచుట ఎలా
  • పోర్నోగ్రఫీ కలిగిస్తున్న హాని
    తేజరిల్లు!—2003
  • పోర్నోగ్రఫీని ఎందుకు చూడకూడదు?
    యువత అడిగే ప్రశ్నలు
  • పోర్నోగ్రఫీ—ప్రమాదకరమైనదా, కాదా?
    కావలికోట: పోర్నోగ్రఫీ—ప్రమాదకరమైనదా, కాదా?
  • పోర్నోగ్రఫీ—కేవలం హానిరహితమైన కాలక్షేపమా?
    తేజరిల్లు!—2002
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 9/8 పేజీలు 13-14

బైబిలు ఉద్దేశ్యము

అశ్లీల సాహిత్యం ఎందుకు ప్రమాదకరము

అశ్లీల సాహిత్యము, ఇప్పుడిక బూతు పుస్తకాలను అమ్మే షాపులకు, లైంగిక ప్రదర్శనా స్థలాలకే పరిమితము కాదు. అది సామాన్య ప్రజలకు బహిరంగమయ్యింది. ఒక్కొక్క దేశములో పత్రికలు, వార్తాపత్రికలు, పుస్తకాలు, టివి కార్యక్రమాలు, చలన చిత్రాలు, వీడియోల ద్వారా అది సామాన్య పౌరుని ఎదుటికి త్రోయబడింది. అంత బహుళ వ్యాప్తమైనది ప్రమాదకరము కాగల్గునా?

ఇంతకు అశ్లీలత అంటే ఏమిటి? “లైంగిక ఉద్రేకమును (చిత్రాలు, వ్రాతలద్వారా) కల్గించడానికి వర్ణించే కామవికార వర్ణన” అని అశ్లీలత నిర్వచించబడింది. ఆ నిర్వచనము తేటగా నున్నది. అయితే ఏది లైంగిక ఉద్రేకమును కల్గిస్తుంది, ఏది కల్గించదు అనే చోటనే వాగ్యుద్ధములు ఉత్పన్నమౌతాయి. చూచే వ్యక్తి దృష్టిలో అశ్లీలమనబడునదే అశ్లీలమనుట కొంతమేరకు వాస్తవమే. మరోమాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తిని లైంగికంగా ఉద్రేకపర్చేది వేరొక వ్యక్తిని చేయజాలక పోవచ్చును. అయినప్పటికిని జర్మనీలో ఇటీవల 5,000 మంది వ్యక్తులపై జరిపిన సర్వేలో ఏదొక స్థాయిలో ఈ కామోద్రేక సమాచారము స్త్రీ, పురుషులలో ప్రతి ఒక్కరిని ప్రభావితము చేయునని బయల్పరచబడింది.

కోరికలను రేకెత్తించుకొనుట తప్పా?

ఒక న్యాయమైన కోర్కె అది ఎటువంటిదైనా సరే—దానిని సరియైన రీతిలో సంతృప్తి పరచుకొనే మార్గము లేనట్లయిన దానిని రేకెత్తించుకొనుట అజ్ఞానము. ఉదాహరణకు, మీకు అతి ప్రియమైన ఆహార పదార్థములలో ఒకటి లభ్యముకాకుంటే, దాని చిత్రాలను పత్రికలలో లేదా పుస్తకాలలో అదేపనిగా చూస్తున్నంత మాత్రమున మీరు తృప్తినొందజాలరు. మరో విషయమేమంటే మీ ఆరోగ్య కారణాలచేత దానిని తినడానికి మీరు అనుమతించబడకపోతే, దానినే మీరు తలంచుచూ ఉన్నట్లయితే, అది ప్రమాదకరమైన పర్యవసానములకు దారితీయగలదు. ఆలాగే, పొగత్రాగే అలవాటును మానుకోదల్చిన వ్యక్తి ఇతరులు పొగత్రాగుచుండగా అపేక్షతోచూస్తూ, అధిక సమయము గడుపుతూ ఉంటే, దానిని విడిచిపెట్టే అవకాశాన్ని మెరుగు పర్చుకొనలేడు.

బైబిలు దృక్పథమునుబట్టి, లైంగిక కోరికలను ప్రేమగల కుటుంబ జీవితంలోనే సరియైనరీతిలో తీర్చుకుంటే సంతోషము కల్గును. (1 కొరింథీయులు 7:2-5; హెబ్రీయులు 13:4) కాబట్టి అవివాహితుడు తాను తీర్చుకొనజాలని కోరికను రేకెత్తించుకొనుట ఎంత అవివేకం! అది కేవలం కలతకు, లేదా అంతకన్నా హీనంగా, హస్తప్రయోగమునకు లేదా వ్యభిచారమునకు దారితీసి తద్వారా దైవిక శాసనములను, సూత్రములను ధిక్కరించునట్లుగా దానిని తృప్తిపరచుకొనుటకు నడిపించును.—1 థెస్సలొనీకయులు 4:3-7.

మీరు వివాహితులైతే అశ్లీల సాహిత్యము మీకు ప్రమాదకరము కాదని దీని భావమా? నిశ్చయంగా కాదు, లేఖన సంబంధమైన అట్టి ప్రవర్తనా నియమాలు వివాహితులకు కూడా వర్తించును. అంతేకాకుండా, అశ్లీల సాహిత్యము మోసపూరిత మోహము, వ్యక్తిగత కోరికలను తృప్తిపరచుకొను ఆశను రేకెత్తించును, ప్రేమ అయితే ఒకని జతయొక్క అవసరతలను తృప్తిపరచుటపై కేంద్రీకృతమై యుండును. అశ్లీలత వివాహ బాంధవ్యమందు కూడ యితరుల మనోభావమును లక్ష్యపెట్టక తన స్వంత లైంగిక తృష్ణను తీర్చుకొనుటకు కూడ నడుపగలదు, అప్పుడు వివాహము అర్థరహితంగా, ప్రేమలేని దానిగా తయారగును.—1 కొరింథీయులు 13:5.

అశ్లీల సాహిత్యం దాంపత్య ప్రేమను పటిష్టముచేసే బదులు, దానిని దిగజార్చి అనర్థాల పాలుజేసి నాశనము చేయును. అశ్లీల సాహిత్యములలో చిత్రీకరించబడిన లైంగిక సంబంధములు అతినీచమైన ఊహకల్పనలు, ఎందుకంటె అది వివాహ సాన్నిహిత్యములను గూర్చి వాస్తవవిరుద్ధమైన హానికరమగు వర్తమానములను అందించును. అంతేకాకుండా, నిజ జీవిత బాంధ్యవ్యాలు లైంగిక తృప్తికంటె మిన్నయైనవి; అవి అనురాగము, హాస్యము, పరస్పరం సంభాషించుకొనుట, శ్రద్ధ చూపుకొనుటపై నిర్మితమగును. దానికి భిన్నంగా అశ్లీల సాహిత్యమనేది వివాహ దంపతులను విడదీసే ఉలి వంటిది కాగలదు.

అశ్లీల సాహిత్యము కేవలం నిర్దేశిత ప్రవర్తనా నియమావళి కల్గిన జంతువుల స్థాయికి మానవులను దిగజార్చును. దేవుని ఆత్మఫలమైన ఆశానిగ్రహమును అది ప్రోత్సహించదు. (గలతీయులు 5:22, 23) లైంగిక విశృంఖలతకు అది దారితీయవచ్చును. అయితే క్రైస్తవుడు అశ్లీల సాహిత్యమును ఎందుకు అసహ్యించుకొనవలెనో అనుదానికి యివి కొన్ని కారణములు మాత్రమే.

అందునుగూర్చి బైబిలిచ్చు జ్ఞానయుక్త సలహా ఏమనగా “నీ యౌవన కాలపు భార్యయందు సంతోషింపుము . . . నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేల బద్ధుడవైయుందువు. పర స్త్రీ రొమ్ము [అక్షరార్థముగా గాని లేక అశ్లీల సాహిత్యమును చదివిగాని] నీవేల కౌగలించు కొందువు?”—సామెతలు 5:15-20.

అట్లయితే, ఒక వ్యక్తి అశ్లీల సాహిత్యపు బంధకముల నుండి ఎలా తప్పించు కొనగలడు లేదా స్వతంత్రుడు కాగలడు?

దాని బంధకములను త్రెంచుట ఎలా

అశ్లీల ఆకర్షణను ప్రతిఘటించుటకు బైబిలు యిలా సలహానిచ్చుచున్నది: “భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, చంపివేయుడి.” (కొలొస్సయులు 3:5) ఇచ్చట “చంపివేయుడి” అను మాట అట్టి కళంకమునకు వాడబడు ఏ శరీర భాగమునైనను—కేవలం అణచివేయుడని కాదుగాని—నిస్సందేహముగా చావగొట్టుడనే తలంపును యిస్తున్నది.

అయితే, దీనిని అక్షరార్థ భావములో కాదుగాని, అలంకార భావములో అర్థం చేసికోవాలి. క్రైస్తవులు తమ శరీరములను అంగహీనము చేయకూడదు. అనుచితమైన లైంగిక తలంపులను మనము కడతేర్చి ‘చంపివేస్తే’ అశ్లీల సాహిత్యపు వశము కాకుండా ఉండగలము, తద్వారా కన్నులవంటి మన శరీర అవయవాలను చెడుమార్గమున ఉపయోగించకుండా ఉండగలము. (మత్తయి 5:29, 30 పోల్చుము.) అందుచేత అనుచితమైన కోరికల స్థానే “ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో” వాటిని పెట్టి ఆ పిమ్మట “వాటి మీద ధ్యానముంచుకొనుడి” అని బైబిలు సలహానిస్తున్నది.—ఫిలిప్పీయులు 4:8.

మరింకేమి సహాయపడగలవు? ఈ క్రింద ఇయ్యబడినటువంటి బైబిలు లేఖనములను మనస్సు నందుంచుకొనుట—బహుశ జ్ఞాపకమునకు తెచ్చుకొనుటకూడ చేయవచ్చును.

“వ్యర్థమైన వాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము.”—కీర్తన 119:37.

“లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.”—1 యోహాను 2:16.

“ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.”—యాకోబు 1:14, 15.

మరణముతో అంతమొందించే ఎడతెగని ప్రతిచర్యను ప్రారంభించేదేమైనా నిశ్చయంగా ప్రమాదకరమని చెప్పవచ్చును. అశ్లీల సాహిత్యమునకు ఆ వర్ణన సరిపోతుంది! గుర్తుంచుకోండి: “తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంటకోయును.” మీ నిత్యజీవమును అశ్లీల సాహిత్యము దోచుకొనునట్లు అనుమతించకండి!—గలతీయులు 6:8. (g91 9/8)

[14వ పేజీలోని చిత్రం]

అశ్లీల సాహిత్యం దాంపత్య ప్రేమను పటిష్టము చేసే బదులు దానిని దిగజార్చి, అనర్థాలు పాలుజేయును

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి