“ఎన్నటికీ విడిచి పెట్టవద్దు”
పుట్టుకతోనే, విల్మా రుడాల్ఫ్ చిన్నగా, రోగంతో పుట్టింది. నాలుగు సంవత్సరాలు నడవగల్గింది. తర్వాత ఆమె ఎర్రని దద్దుర్లతో వచ్చు అంటు జ్వరం మరియు నిమోనియా జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్రతికి బయటపడ్డప్పటికినీ ఆమె ఎడమకాలికి పక్షవాతం వచ్చింది. విల్మా నడుస్తుందనే దృఢనమ్మకంతో తల్లి ఆమె కాలికి మర్ధనచేస్తు తన ముగ్గురు పెద్దపిల్లలు కూడా అలాగే చేయాలని వారికి నేర్పింది. గనుక వారు ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు ఆ నలుగురు “విల్మాకు మర్ధన” చేసేవారు.
విల్మాకు ఎనిమిదేండ్లు వచ్చేసరికి ఆమె తన కట్టుతోవున్న కాలితో నడవగల్గింది. త్వరలో పరుగెత్తి, ఆటలాడ గల్గింది. తన అంగవైకల్యాన్ని ఛేదించాలని ఆమె నిశ్చయించుకున్నది. ఆమెకు వ్యాయామం సహాయపడింది. అలాగే “ఎన్నటికి విడిచి పెట్టవద్దు” అని వాళ్లమ్మ చెప్పిన విషయం కూడ తోడ్పడింది.
విల్మా విడిచిపెట్టలేదు. పందొమ్మిది వందల అరవైలో ఇటలీనందు, రోములో జరిగిన ఒలంపిక్స్‌లో ఆమె మూడు స్వర్ణ పథకాల నందుకున్నది. వంద, 200 మీటర్ల నడకలోను, 400 మీటర్ల రిలేలోను విజయం సాధించింది.
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో, గ్లెన్ కన్నింగ్‌హ్యం ఏడేండ్ల బాలుడై యున్నపుడు అతని కాళ్లుకాలి ప్రాణాపాయ స్థితిలో ఉండెను. నెలల తరబడి అతడు పడకలోనే వుండెను. ఇక అతడు ఎన్నటికి నడువలేడేమోననిరి. అతని తల్లి దెబ్బతిన్న కాలి కండరాలను మర్ధనచేసేది, నడిచి, పరుగెత్తమని బ్రతిమిలాడేది. గ్లెన్ పట్టుదల విడిచిపెట్టలేదు. వాస్తవానికి అతడు మాడిసన్ స్క్వేర్ గార్డన్‌నందు జరిగిన ఒక మైలు పరుగు పందెములో 21/31 లో గెలిచాడు. పందొమ్మిది వందల పదమూడులో మైలు పరుగులో ప్రపంచ రికార్డ్ స్థాపించాడు.
మనందరం జీవితంలో ఏదో ఒకనాడు ఏదో ఒక సమస్య నెదుర్కొంటాము. అనారోగ్య సమస్యే తరచూ వస్తూవుంటుంది. ఓటమి నంగీకరించే బదులు మన పట్టుదల విడిచి పెట్టకుండ వుండుట ఎంత శ్రేష్టం. “మేము అధైర్యపడము,” అని ఆత్మీయ ప్రయత్నములను గూర్చి అపొస్తలుడైన పౌలు వ్రాశాడు: “మా బాహ్యపురుషుడు కృశించుచున్నను (మన శరీరాలు) అంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.”—2 కొరింథీయులు 4:16.
[Picture Credit Line on page 31]
UPI/Bettmann Newsphotos