‘వారు పరిహసిస్తుండేవారు’
బైబిలును గూర్చి మాట్లాడుచున్న వారినిచూచి ఇటీవలి కాలం వరకు ప్రజలు అపహాస్యము చేస్తుండేవారు అని హంగేరిలో సైనిక దళమునందు పనిచేయుచున్న ఒక వ్యక్తి చెప్పుచున్నాడు. కాని కాలం మారిపోయింది. ఈ సైనికుడు ఇటీవల బుడాపెస్ట్‌లోని వాచ్‌టవర్ సొసైటి కార్యాలయమునకు వ్రాయుచు యిట్లనెను:
“కొన్నిరోజుల క్రితం, మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అను సాహిత్యమును చదివాను. నేను దానిని చదువుట ముగించేంత వరకు ఎవరో ఒకాయన నాకు దానిని అరువుయిచ్చారు. ఆ పుస్తకములో వ్రాయబడిన విషయాలు నాలో లోతుగా నాటుకొని నన్ను ఆలోచింపజేసినవి.” ఆ సైనికుడు బైబిలును తదితర సమాచారమును కోరెను. తూర్పు ఐరోపాలో అట్టి ప్రతిస్పందన ఇప్పుడు సర్వసాధారణమయ్యింది.
బుడాపెస్ట్ కార్యాలయమునకు వచ్చిన మరో ఉత్తరము తెల్పునదేమనగా: “మరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అను పుస్తకమును నేను చదివాను. ఆ పుస్తకము నాపై గొప్ప ప్రభావమును చూపింది, నేను ఒక క్రమమైన బైబిలు పఠనము చేయుటకుగాను ఎవరైనా ఒక సాక్షి మా గృహమును సందర్శించాలని మిమ్మును అడుగుటకు ఈ ఉత్తరము వ్రాస్తున్నాను.”
మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అను పుస్తకము బైబిలు సమాధానములను మీకు చూపిస్తూ ఒక నిరీక్షణను కలుగజేయును. అనేకుల జీవితాలను మార్చుటకు అది పరికరముగా ఉపయోగపడినది. మీరును ఒక ప్రతిని పొందగోరినయెడల ఈ కూపను నింపి పంపండి.
[32వ పేజీలోని చిత్రం]
మంచి కారణముతో తలిదండ్రులు తాము ప్రేమించిన బిడ్డ బాధాకరమైన శస్త్రచికిత్సను పొందుటకు అనుమతింతురు. దేవుడు కూడ మంచి కారణములతో మానవులు బాధనొందుటకు తాత్కాలికముగా అనుమతించుచున్నాడు