ఎయిడ్స్—తలిదండ్రులు, పిల్లలు దాన్నిగూర్చి ఏమి తెలుసుకోవాలి
ఎయిడ్స్ వ్యాధికిగురైన అనేకమంది యౌవనస్థులు, ఎయిడ్స్‌ను గూర్చి అంతగా తెలియని అనేకమంది పెద్దల అర్థరహితమగు ఆలోచన మూలంగా తరచూ సమస్యల వలయంలో చిక్కుకుపోతున్నారు. అనేక సందర్భాలలో తల్లిదండ్రులు తమ స్వంత పిల్లలమనస్సును, వ్యాధి సోకిన వారిని గూర్చి చెడుగా చెప్పుచూ పాడుచేస్తున్నారు. వీరివలన అపాయమేమీ లేదని డాక్టర్లు చెప్పినప్పటికీ, పాఠశాల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాల్లు, ఎయిడ్స్ వ్యాధి సోకిన విద్యార్ధులను బడిలో చేర్చుకొనుటకు తిరస్కరించియున్నారు. ఆవిధంగా, హెచ్ఐవి సోకిన పిల్లల తలిదండ్రులనేకులకు దానిని రహస్యంగా ఉంచడమే గత్యంతరం. సరైనకారణముతోనే కొన్ని సందర్భాలలో, తమ పిల్లలు సంఘ బహిష్కరణకు నిందకు లేదా మరెక్కువ అవమానమునకు గురౌతారేమోనని తలిదండ్రులు భయపడుచున్నారు.
ఉదాహరణకు, ఎయిడ్స్ వ్యాధిగల కూతురున్న ఓ తల్లి తన పొరుగువారికి భయపడి తనకూతురును వారి పిల్లలతో ఆట్లాడుకోకుండా దూరంగావుంచేది. “నీ బిడ్డకు ఎయిడ్స్ సోకిందని నీ చుట్టు నివసించే ప్రజలు తెలిసికొనగోరవు, ఎందుకనగా ప్రజలు వికారంగా ప్రవర్తించగలరు.” రిపోర్టుల ప్రకారం ఇదంతా అతిశయోక్తి కాదు. వారి మంచి మిత్రులు పొరుగువారు తలిదండ్రులతో సహవాసము మానుకున్నారు. వీధిలో కలిసే స్నేహితులు మాటవరసకైన పలకరించకుండ ముఖం చాటేసుకుని పోతున్నారు. ఎయిడ్స్ మచ్చ ఎంత లోతుగా పోయిందంటే ఎయిడ్స్ వ్యాధి సోకిన పిల్లలతో తల్లిదండ్రులు రెస్టారెంట్స్లోనికి ప్రవేశిస్తే అక్కడికి వచ్చినవారు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడనుండి బయటికెళ్లి పోతున్నారు. తండ్రులు తమ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. కొందరు బాంబు బెదిరింపులకు గురయ్యారు. మరికొందరి ఇండ్లు తగులబెట్టబడినవి.
ఎయిడ్స్ వ్యాధిగల పిల్లలు, తోటి విద్యార్ధుల నీచమైన పరిహాసమునకు బలైపోతున్నారు. రక్తమార్పిడి మూలంగా ఆ రోగానికి గురైన ఒక ఎయిడ్స్ రోగి పురుషసంయోగియని పలుమార్లు తన తోటి విద్యార్థులచేత నిందించబడెను. “మాకు తెలుసు, నీకు నిజంగా ఎయిడ్స్ ఎలావచ్చిందో.” ఆ కుటుంబాన్ని వారి చర్చి సభ్యులు చర్చికి రానివ్వలేదు. అసభ్యకరమైన ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చేవి. వారి ఇంట్లోని పచ్చికమైదానంలో చెత్తాచెదారం కుప్పలుగా పడవేయబడింది. ముందరి కిటికిలోనుండి ఎవరో ఓ బుల్లెట్ ప్రేల్చారు.
“అది అతి గోప్యమైన విషయం, అదే దాన్ని ఎంతో ఒంటరితనాన్ని కలుగజేసేదిగా చేస్తుంది.” అని ఎయిడ్స్ సోకిన బిడ్డయొక్క తల్లి అన్నది. ది న్యూయార్క్ టైమ్స్ యింకను ఇలా అంటుంది: “ఎయిడ్స్ వున్నదని నిర్థారించబడిన 13 సం. లోపు వయస్సున్న 1,736 మంది అమెరికా దేశపు పిల్లలను వారి రోగాన్ని బట్టి దూరంగా వుంచారు. వారి సహవాసాన్ని మానుకుంటారేమోనని ఆరోగ్యంగా వున్న వారి స్నేహితులకు లేక తోటి విద్యార్థులకు వారి పరిస్థితిని గూర్చి చెప్పకుండ గుప్తంగా వుంచవలసివచ్చింది.” మరి చివరికి ది టొరాంటో స్టార్ నందు యీ వ్యాఖ్యానం వచ్చింది: “ఓ బాలుడు చనిపోతే కూడ అనేక కుటుంబాలవారు ఆ సత్యాన్ని బయటికి చెప్పడానికి భయపడుచున్నారు. తమ బాలున్ని పోగొట్టుకొనుటవలన కలిగే నష్టంతో పాటు బాధ అధికమై ఒంటరితనం మిగిలిపోతుంది.”
నీవేమి తెలుసుకోవాలి
ఎయిడ్స్, వ్యక్తులను గౌరవించేది కాదనే విషయాన్ని నీవంగీకరించాలి. అది ధనికులను, పేదలను, పిల్లలను, పసిపిల్లలను మరియు వృద్ధులను విడిచిపెట్టకుండ అంటుకుంటుంది. కొన్ని దేశాల్లోని యౌవనస్థులకు ఎయిడ్స్‌ను గూర్చి సరిగ్గాతెలియదు. చాలామంది ప్రజలకు “యౌవనస్థుల పాలిట ఎయిడ్స్ ఎంతటి మహా అపాయకరంగా పరిణమిస్తుందోననే ఊహకూడలేదు” అని న్యూయార్క్ సిటి లోని ఎయిడ్స్ నిపుణుడొకరన్నారు.
ఉదాహరణకు, ఎయిడ్స్‌ను తొలిదశలో కనుగొని చికిత్సచేస్తే నయంచేయవచ్చునని సర్వేచేసినవారిలో 30 శాతం మంది నమ్మినట్లు ఓ పెద్ద అమెరికా పట్టణంలో యౌవనస్థులమీద చేసిన అధ్యయనం బయలు పరచుచున్నది. ఎయిడ్స్‌ను నయంచేసే మందును ఇప్పటికీ కనిపెట్టలేదు. ఆ రోగిని ఊరక తాకుటవలన లేదా అతని దువ్వెన వాడుటవల్ల ఎయిడ్స్ అంటుకొనదనే విషయం వారిలో మూడు భాగముల యౌవనస్థులకు తెలియదు. అమెరికాలోని మరోభాగం 16-19 మధ్యవయస్సున్న 860 మంది యౌవనస్థుల మీద చేసిన అదనపు సర్వే ప్రకారం వీర్యమువలన ఎయిడ్స్ వైరస్ అంటుకుంటుదనే విషయం వారిలో 22 శాతము మందికి తెలియదు, మరియు యోని నుండి వెలువడే స్రావం వలన అది అంటుకుంటుందనే సంగతి 29 శాతం మంది ఎరుగరు.
ఆ రోగక్రిములు ఎదిగేకాలములోనూ, ఎయిడ్స్ నిజంగా బయటికి కనబడినపుడును, అది సోకినవారు అంటు రోగులై, ఆ ఎయిడ్స్ వైరస్‌ను ఇతరులకు అంటించగలరు. అయినను, కరచాలనముచేయుటవల్ల లేదా ఎయిడ్స్ రోగిని ఆలింగనము చేయుటవల్ల అది అంటుకొనదు. ఎందుకంటే శరీరానికి వెలుపల దాని క్రిమి త్వరగా నశించిపోతుంది. అలాగే కొందరు భయపడుచున్నట్లు దాని క్రిమి మరుగుదొడ్డిలో కూర్చుండే సీట్లమీద జీవించియుండలేదు. పాఠశాల ముఖ్యాధ్యక్షులు మరియు సూపరింటెండెంట్లు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులుపయోగించే నీటికొళాయిలను ఆ వ్యాధి లేని విద్యార్థులుపయోగిస్తే, అది వారికి అంటుకుంటుందని భయపడ్డారా? దాని వైరస్, అంటుకొనని వారి రక్తంలోనికి ప్రవేశించే అవకాశం అక్కడలేనందువలన యిటువంటి భయములకు తావులేదని నిపుణులు అంటున్నారు.
సూదులువుపయోగిస్తూ చెవులు కుట్టుకుంటున్నందు వలన గలిగే అపాయమునుగూర్చి డాక్టర్లను తరచూ విచారిస్తున్నారు. నిపుణులు అంగీకరించేదేమనగా కలుషిత ఉపకరణాలనుపయోగిస్తే, ఎయిడ్స్ వైరస్ సోకే మార్గం సుగమము కావచ్చును. మరి చుంబనము విషయమేమిటి? “ఎయిడ్స్ రోగికానీ హెచ్ఐవి అంటుకున్న వ్యక్తిగానీ నిన్ను ముద్దుపెట్టుకుంటే నీ అధరాలమీద లేదా నీ నోటిలో ఎక్కడైనా రక్తం కారునంతటి పుండు లేక తెగివుంటే అప్పుడారోగం అంటుకోవచ్చును, గానీ అంత కచ్చితంగా చెప్పలేము” అని ఒక నిపుణుడు అన్నాడు. అయినను అది అంటుకునే అవకాశముంది.
అనుమానాస్పద లక్షణాలు కొన్ని బయటపడిన తర్వాతకూడ నీకది అంటుకున్నదా లేదాయని తెలుసుకునే మార్గమొక్కటే, డాక్టరు దగ్గరకెళ్ళి క్షుణ్ణంగా పరీక్షచేయించుకొని, రక్తపరీక్ష చేయించుకొనడమే.
ఇక చివరిగా నీవు పిల్లవాడివైతే నీ తలిదండ్రులతో సత్యం చెప్పు. ఇతరులంతా నిన్ను విడనాడినప్పుడును వారే నీకు తోడైయుండి నీ కవసరమైన ఓదార్పును సహాయాన్ని చేయగల్గేవారు. జ్ఞానివై మాదక ద్రవ్యాలను వివాహానికి ముందే లైంగికానుభూతిని పొందుటకును తిరస్కరించుము. అది నీ ప్రాణాన్ని కాపాడగలదు. లైంగిక సుఖం వలనగానీ కలుషితమైన సూదుల మూలంగా ఎయిడ్స్ వైరస్ అంటుకున్న యౌవనస్థులు అంగీకరించేదేమనగా వారు చెడు సహవాస ప్రభావానికి గురయ్యారు. నిశ్చయంగా, అపొస్తలుడైన పౌలు మాటలు వారికిప్పుడు గంభీరమైన భావాన్ని కలిగియున్నవి. “మోసపోకుడి. దుష్టసాంగత్యం మంచి నడవడిని చెరుపును.” కొన్నిసార్లు నీ ప్రాణాన్నే హరించివేయగలదు.—1 కొరింథీయులు 15:33 (g91 7/22)