ది వాచ్‌టవర్ మరియు అవేక్!—అభినందనలు పొందినవి
డచ్ వార్తాపత్రిక యన్ఆర్సి హ్యండిల్స్ బ్లాడ్, జూలై 24, 1990లో ఓ రచయిత వ్రాస్తూ అవేక్! దాని జత పత్రిక ది వాచ్‌టవర్‌ను గూర్చి ఇలా చెప్పెను:
అవేక్! మరియు ది వాచ్‌టవర్ పత్రికలు [యెహోవాసాక్షులు ప్రచురించేవి] అంత విలువైనవి కావని నావలెనే అనుకుంటున్నవారు యీమధ్య వాటిని చదివే అవకాశం పొందితే వారు ఆశ్చర్యపడతారు. అవి వాటి ఆకృతిలోను, సమాచారములోను చాలా మార్పుచెందియున్నవి.
‘అంతకుముందు యీ రెండు పత్రికలలోను డ్రాయింగ్లు ఒకనిని ఆకర్షించేవి: న్యూస్ ప్రింట్ కాగితంమీద ఒకేరంగుతో బొమ్మలుండేవి. వాటిల్లోని కథల విషయానికివస్తే, నాకు నిజంగా జ్ఞాపకమున్నంతవరకు, సువార్తకు సంబంధించి రీడర్స్ డైజెస్ట్ పత్రికలో మాదిరిగనే వుండేవి, యుద్ధం, మాదకద్రవ్యాలు, లైంగిక అవినీతి, రాజకీయాలు మొదలగు ప్రపంచంలోని ముఖ్య సమస్యలను అప్పుడప్పుడు మాత్రమే తెల్పేవి.
‘అదంతా ఇప్పుడు మారిపోయింది. రెండుపత్రికలు క్లుప్తరీతిలో ప్రస్తుత సంఘటనలనుగూర్చి వ్యాఖ్యానములు చేసేవిగా వున్నవి. రంగురంగుల ఫోటోగ్రాఫ్‌లు వాటిలో విస్తారంగా వున్నవి . . . ప్రభువురాత్రి భోజనముయొద్ద అపొస్తలులు ఉన్న సంఘటన (1990 జూలై 1, వాచ్‌టవర్‌లో) శిక్షణనిచ్చు ఒక కళాత్మక రీతిలో చిత్రీకరించారు, ఇలాంటివి అప్పుడప్పుడూ కన్పిస్తూవుండుట ఒకడు మెచ్చుకొనవచ్చును, అయితే సాధ్యమైనంతవరకు ఫోటోగ్రాఫ్‌లు ఉపయోగించబడుచున్నవి. అవేక్! విజ్ఞాన విషయాలను చాలా చర్చిస్తుందనుట గమనార్హం. జూలై 8 సంచికలో గత సంవత్సరం ఆగస్టు 16న జరిగిన చంద్రగ్రహణమును గూర్చి, తల్లిపాలను గూర్చిన చిన్న వ్యాసం, ఖనిజ లోపాలవల్ల ఎముకలలో మెత్తదనం కల్గుటకు రక్తంలో మాంగనీసు స్థాయికి మధ్యగల సంబంధమునుగూర్చి, చివరిదేగానీ త్రోసిపుచ్చేదేమి కానటువంటి జంతువులనుగూర్చి పరిశోధన మూడు భాగాలుగా వుండే శీర్షికలు వెలువడినవి.’
ఆ రచయిత యింకను యీ వ్యాఖ్యానం చేస్తున్నాడు: ‘61 భాషల్లో 1 కోటి 19 లక్షల 30 వేల ప్రతులు [ప్రస్తుతం 67 భాషల్లో 1 కోటి 31 లక్షల 10 వేల ప్రతులు] పంపిణీ అవుతున్న అవేక్! అనేకమంది పాఠకులకు విజ్ఞానశాస్త్ర పరిజ్ఞానమునిచ్చుటలో అంచనాలకు మించిన మూలమైయున్నది.’
నిజమే, ది వాచ్‌టవర్, అవేక్! లలో ఆకారంలో మాత్రం ‘చాలామార్పు’ వచ్చిందిగానీ సమాచారములో కాదు. ఇప్పటికీ ఎన్నో దశాబ్దములుగా, యీరెండు పత్రికలు దేవునిరాజ్యమే మానవజాతికి ఏకైక నిరీక్షణయని చక్కగా పరిశోధన చేయబడిన శీర్షికలను అందిస్తూనేవున్నవి. అయితే మా పత్రికల అందమైన ఆకృతిలో వచ్చిన మార్పునుబట్టి వాటిని అనేకమంది చదివి జీవమునిచ్చే సమాచారమునుబట్టి ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నాము. (g91 7/22)
[9వ పేజీలోని చిత్రాలు]
“వాచ్‌టవర్,” “అవేక్!” డచ్ సంచికలు