మనిషికి, మృగానికి మధ్య సమాధానమునకు ఆటంకములు
ఈ పత్రిక అట్టమీద ఉన్నటువంటి బొమ్మలంటే పిల్లలకెంతో ఇష్టం. పెద్దలు కూడ అట్టి దృశ్యములంటే తరచుగా ఆకర్షింపబడతారు.
ఈవిధంగా మానవులెందుకు ప్రతిస్పందిస్తారు? మనిషికి క్రూర మృగానికి మధ్య సమాధానము ఒక పిచ్చి స్వప్నంవంటిదేనా? లేక అది నిజమయ్యే రోజులొస్తున్నాయా?
మనిషే ఒక ఆటంకము
అట్టి సమాధానానికి మనుష్యుడే ఒక పెద్ద ఆటంకం. పురాతన సామెత ఒకటి ఇలా అంటుంది: “ఒకడు మరియొకనిపై అధికారియై తనకు హానితెచ్చుకొనును.” (ప్రసంగి 8:9) అతడు స్వజాతికే హాని కల్గిస్తున్నాడను మానవుని చరిత్ర అతడు జంతువులను పరామర్శించు పద్దతిని ప్రతిబింబించినది.
ఉదాహరణకు, ప్రాచీన రోమాలోని జంతువుల ఆటలస్థలాల్లో అనేక కౄరమృగాలను పట్టి వాటికి అక్కడ పోటీపెట్టేవారు. సా. శ. 106 సం.లో రోమా చక్రవర్తి ట్రాజాన్, రక్తపిపాసగల ప్రేక్షకుల దాహంతీర్చడానికి 10,000 మంది ఆటగాళ్లను 11,000 మృగాలను హతమార్చే ఆటలను నిర్వహించాడట.
నిజమే, అలాంటి ప్రత్యేక వినోదం ఈనాడు వాడుకలో లేదు. కాని అంతరించిపోతున్న, అపాయంలోనున్న జంతుజాలముల సంఖ్య పెరిగి పోతున్న దృష్ట్యా మనుష్యుడు కౄరమృగాలను పరామర్శించే విధానంలో ఏదో లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మానవజనాభ విపరీతంగా పెరిగిపోతోంది, మృగజాతులు తరిగిపోతున్నవి. మానవుని దురాశవలన, విదేశి జంతువుల చర్మాలకు, కొమ్ములకు, తొండముకు విపరీతమైన గిరాకి పెరిగింది. అతిపెద్ద జంతుజాలములలో కొన్ని నామమాత్రంగానే మిగిలి చివరకవి జంతు ప్రదర్శనశాలలకు పరిమితమైవుండును అని నిపుణులు భయపడుతున్నారు.
మనుష్యుని తినేవి
సమాధానానికి మరో ఆటంకం కొన్ని కౄరమృగాలే అన్నట్లు కనిపించవచ్చు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కౄరమృగాలు మనుష్యులపై దాడిచేసి చంపిన సందర్భాలను గూర్చి చదువుట అసాధారణమేమికాదు. ది గిన్నెస్ బుక్ ఆఫ్ యానిమల్ ఫాక్ట్స్ అండ్ ఫీట్స్ తెలిపేదేమంటే పులిజాతికి సంబంధించినవి ఏటా దాదాపు 1,000 చావులకు బహుశా కారణమైయున్నవి. ఒక్క ఇండియాలోనే పులులు తి ఏటా 50 కంటే ఎక్కువ మందిని చంపుతున్నవి. ఆ దేశంలోనేకొన్ని చిరుతపులులు మనుష్యుని—తినేవిగా తయారయినవి.
ఆ చిరుతలు రోగపు తెగుళ్లమూలంగా చచ్చిన మానవ కళేబరాలను శుభ్రంగా తినివేసిన తరువాత కొన్నిసార్లు ఇక మనుష్యులను తినేవిగా తయారగుచున్నవని రోజర్ కారస్, డేంజరస్ టు మ్యాన్ అనే తన పుస్తకంలో వివరిస్తున్నాడు. తరచుగా అటువంటి తెగుళ్ల తరువాత “మానవ మాంసానికి కొత్తగా రుచిమరిగిన ఈ చిరుతలు వారిని చంపుటకారంభించి నెలల తరబడి భయానక పరిస్థితిని సృష్టించాయి” అని ఆయన వివరిస్తున్నాడు.
అయితే రోగపు తెగుళ్లే చిరుతలు చేసే అన్నిదాడులకు మూలము కాదు అని కారస్ అంటున్నాడు. ప్రాముఖ్యముగా పిల్లల దగ్గర ఉన్నపుడు ఆ జంతువు చూపే ఉద్రేకస్వభావము దీనికి మరొక కారణము.
ది మ్యాన్ ఈటింగ్ లెపర్డ్ ఆఫ్ రుద్రప్రయాగ్ అనే తనపుస్తకంలో కల్నల్ జిమ్ కార్బెట్ తెల్పినట్లు ఇండియాలో 1918-26 సంవత్సరముల మధ్య ఒక చిరుత 125 మందిని చంపింది. దశాబ్దముల తరువాత మనుష్యులను తినే చిరుతలు బగల్పూర్ జిల్లాలో కనీసం 82 మందిని పొట్టనబెట్టుకున్నవి.
రూపోండా గ్రామప్రాంతాల్లో ప్రజలను భయాక్రాంతులను చేసిన ఒక మనుష్యులను—తినే చిరుతను కాల్చి చంపడానికి 1950 సం. లో ఏడునెలలు తానెట్లు తంటాలు పడ్డాడో టాంగన్యికా (ఇప్పుడు టాంజేనియాలోని భాగం) లోని అటవీ అధికారి తెలియజేశాడు. 18 మంది పిల్లలను చంపిన తర్వాత దాన్ని ఒక ఆఫ్రికా గ్రామస్తుడు పట్టుకున్నాడు. మరో చిరుత మసాగుర గ్రామంలో 26 మంది స్త్రీలను పిల్లలను చంపింది.
మరి ఆఫ్రికా సింహముంది. అది మనుష్యులను తినుటకారంభిస్తే ఇక తరచు పురుషులలో పెద్దవారే దానికి బలౌతారు. మాంబాస్ అండ్ మ్యాన్-ఈటర్స్ అను తన పుస్తకములో సి. ఐయొనైడ్స్ వ్రాస్తూ “నేను నలభైకంటే ఎక్కువ సింహాలను కాల్చిచంపాను, వాటిలో అధిక భాగం మనుష్యులను—తినేవే, మిగతావి మనుష్యులను—తినుటకై ఆరంభించనైయున్నవో లేక పశువులను ఎత్తుకొనిపోవునవైయున్నవి. ఐయొనైడ్స్ ప్రకారం మానవుడు వాటి సహజ ఆహారాన్ని మట్టుపెట్టుచున్నందువలన సింహాలు మానవుల పాటి మృత్యువుగా తయారయినవి.
భూవ్యాప్త సమాధానమును గూర్చి ముందే తెలుపబడినది
మనుష్యుడు మృగములమధ్య సమాధానానికట్టి అవరోధాలున్నప్పటికి బైబిలిట్లు చెబుతుంది: “ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను.”—యాకోబు 3:7.
బైబిలు యెహెజ్కేలు 34:24 నందిట్లు తెల్పింది: “అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములో లేకుండ చేయుదును.”
అటువంటి బైబిలు ప్రవచనాలు వట్టి కలయేనా? మనుష్యునికి మృగానికి మధ్య సమాధానముంటుందనే ఆశను తిరస్కరించక ముందు బైబిలు చెప్పే కొన్ని నగ్నసత్యాలను పరిశీలించండి. వాటినిపెంచే మానవులకును చాలా ఆప్యాయకరమైన మృగాలకు మధ్యనున్న సామరస్యమును గూర్చిన కొన్ని ఆశ్చర్యకరమగు ఉదాహరణలు చరిత్ర పుటల్లోనికెక్కినవి. (g91 4/8)