కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 6/8 పేజీలు 21-23
  • ముచ్చటైన కిమోనో వస్త్రవాడుక నిలుస్తుందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ముచ్చటైన కిమోనో వస్త్రవాడుక నిలుస్తుందా?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆ దేశపు వాడుక దుస్తులు
  • కిమోనో ధరించుట
  • దారం మరియు నేత
  • కాలానుగుణ్య మార్పులు
  • దీనులను యెహోవా సత్యంవైపు ఆకర్షిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • పట్టు “దారాల్లో రాణి”
    తేజరిల్లు!—2006
  • మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • పరిశుభ్రత యెహోవాకు మహిమను తెస్తుంది
    మన రాజ్య పరిచర్య—2002
తేజరిల్లు!—1992
g92 6/8 పేజీలు 21-23

ముచ్చటైన కిమోనో వస్త్రవాడుక నిలుస్తుందా?

This caption is missing in vernacular

ఈ రోజు ఆ చిన్నారి క్యోకోకు ప్రత్యేకమైన రోజు. ఆమె మొట్టమొదటి సారిగా తన పట్టు కిమోనో తొడుక్కోబోతోంది. అది గులాబీ రంగులో ఉండి, ముదురు-ఎరుపు రంగుల పూలున్న గౌను.

ప్యూరిసోడి అనబడే జాలువారే చేతులు దాదాపు చేతి అంచుల వరకు వచ్చును. ఆమె జుట్టు ముడివేసి, కిమోనో రంగుకు సరిపడే రిబ్బన్లతో కట్టుకుంది. ఎర్రని జరీపట్టీగల జోరి లేక పాదరక్షలతో వయ్యారంగా నడుస్తూవున్న ఆ చిన్నారి సొగసుకు సోపానం.

“కిమోనో వేసుకుంటే నేనేదో పెద్దదానినన్నట్లు అనిపిస్తుంది నాకు” అని క్యోకో అంటుంది. అవును మరి ఆ గౌనులో అమ్మాయి అందంగానే అగుపిస్తుంది.

ఆ దేశపు వాడుక దుస్తులు

కిమోనో అనేది జపానులోని స్త్రీపురుషులు ధరించే ఆ దేశపు వాడుక వస్త్రమే. ఆ మాటకు “వస్త్రము(లు) ధరించుట” అని సాధారణ అర్థం.

అయితే జపాను వారికి కిమోనో అంటే ఏదో అందం కొరకు వేసుకునే వస్త్రమే కాదు. అది వారి జీవిత విధానానికి చిహ్నము, వారి సంస్కృతిలో ఓ భాగం. సాంప్రదాయ కళ అయిన పూలాలంకరణ మరియు తేనీటివిందుతోపాటు కిమోనో వస్త్రాలంకరణ, వారి సౌందర్యం, ప్రేమ, మర్యాద, మరియు దైనందిన జీవితములోని అనుగుణ్యతకు ప్రతిరూపమైయున్నది.

కిమోనో బిగువైన వస్త్రం. దాన్ని ఓబి అనే దట్టితో నడుంచుట్టు బిగించి కట్టుకుంటారు. చేతులు వదులుగా నిండుగా వుండి, చేతులు చాపితే రెండు రెక్కలవలె కనబడును. ఈ వస్త్రం సన్నగా పొడవుగా వుండి, కాలి చీలమండల వరకు జారివుంటుంది, మరి దీనికి కలిపికట్టినట్లు చీలికలుండవు. ఈ కిమోనోలను తొడుగుకున్న అమ్మాయి ఎంతో అందంగా తిరుగుటలో ఆశ్చర్యంలేదు!

వాటిని ధరించే స్త్రీల వయస్సును బట్టి కిమోనోల రంగు, డిజైన్‌ సాంప్రదాయంగా నిర్ణయించబడును. ఆకర్షణీయమైన రంగులు చిత్రవిచిత్ర ఆకృతులు మరియు జాలువారే పొడవాటి చేతులున్నవి కన్యల పొంగిపొరలే వయస్సుకు తగినవి. వారు పెరిగే కొలది వారి వయస్సుకు తగినట్లు వస్త్రాన్ని తెలుపుచేసి తిరిగి రంగు అద్దించవచ్చును. స్త్రీలలో 20 మరియు 30 ఏండ్ల పైబడినవారు సాధారణంగా తేలికైన పాచీరంగులు వివిధ నమూనాలతో కూడిన కిమోనోలను ధరిస్తారు. వివాహితులైన పెద్దవారు వేర్వేరు పట్టీలను కట్టుకొని గౌనుపై వివిధరంగుల డిజైన్లుగల నల్లని కిమోనోలను అధికంగా ధరిస్తారు.

కిమోనోలను ప్రతిరోజు ధరించే వారు ఇక ఇప్పుడు చాలా తక్కువమంది అవుతున్నను కొంతమంది వాటిని ప్రతి సంవత్సరం బయటికి వేసికొని వచ్చే సందర్భాలు చాలా వున్నవి. అటువంటి సందర్భాలలో ఒకటి జనవరి 15 నాడు, దానిని సెయిజిన్‌ నొహై లేదా వయోజనుల రోజు అని అంటారు. 20 సంవత్సరముల వయస్సునకు వచ్చేవారి కొరకున్న సంవత్సరమే అది. కిమోనోను సంవత్సరములో ధరించే ఇతర సందర్భాలేమంటే పట్టభద్రులైన రోజు, షోగాట్సు లేక నూతన సంవత్సరపు రోజు. అవును ప్రపంచయావత్తులో ఉన్న స్త్రీలు అలా విశేషమైన దుస్తులు ధరించాలని ఇష్టపడుతూ వుంటారు.

వివాహం, శవసంస్కారం వంటి ఆచారసందర్భాలలో వాటికి తగినట్టు కిమోనోలు ధరించుట చూడవచ్చును. ఇతర సందర్భాల్లో పురుషులుకూడా కొన్నిసార్లు హోరి అని పిలువబడు ముప్పాతిక భాగం పొడవున్న కోటుతో సహా కిమోనోలను ధరిస్తారు. మగవారి కిమోనో సర్వసాధారణంగా బూడిద, నీలి లేక గోధుమ వంటి ముదురు రంగుతో వుంటుంది. ఈ హోరితో పాటు హకామా అని అనబడే అంగీవలె వదులుగా ఉండు పంట్లామును ఒక వాడుకగా ధరిస్తారు.

పిల్లలు షిచి-గో-సాన్‌ (ఏడు-ఐదు-మూడు) అని నవంబర్‌ నెలలో వచ్చే పండుగ నాడు ఈ కిమోనో దుస్తులు వేసుకుంటారు. ఈ రోజే ఏడు, ఐదు, లేదా మూడు సంవత్సరాల వయస్సున్న ఆడ, మగ పిల్లలు మొదటిసారిగా కిమోనో వస్త్రాలను తొడుక్కుంటారు. ముఖ్యమైన రంగు ఎరుపే, అయిననూ దుస్తులమీద నీలిరంగు లేదా ఊదారంగుతో ఉన్న పూలు, పక్షులు, మూసిన విసనకర్రలు, లేక మద్దెల వంటి ఆకారాలు చిత్రించబడి వుండును. హోరికి సరిపడే తెల్లని చారలుగల హకామాను ధరించి అందంగా ఉందని అనుకుంటూ తన పాదరక్షలతో తడబడినడిచే పిన్నవాన్ని గమనించండి. నిశ్చయంగా నిన్ననే పిల్లవాడు తన జీన్స్‌, టి-షర్టు మరియు కాన్‌వాస్‌ బూట్లతో చాలావరకు సౌక్యంగా వుండెను! గానీ పిల్లవాడు షిచి-గో-సాన్‌ రోజుతీసిన ఫోటోలను తర్వాత చూచినపుడు అతడు ఎంతో సంతోషంచును.

ప్రత్యేక సందర్భాలలోనే ఈ కిమోనో వస్త్రాలు ధరించాలని కొందరనుకుంటూ వుంటారు నిజమేగాని, అది తప్పనిసరేమి కాదు. ఇతరులు వారి నమ్మకాలను, లేదా మనస్సాక్షిని బట్టి అటువంటి ‘ప్రత్యేక సందర్భాలను’ పాటించకుండ వుండవచ్చును మరియు వారిదృష్టిలో సరిగ్గా సరిపోయే దుస్తులు ధరిస్తారు.

కిమోనో ధరించుట

నీవు దాన్ని ధరించటానికి ప్రయత్నిస్తావా? కొందరనుకున్నట్లు అదంత సులభమేమి కాదు. సరే నగజుబాన్‌ అని పిలువబడు పొడవైన లోపలి ఉడుపును గూర్చి పరిశీలిస్తాం. దాన్ని సరిగ్గా కుదిరేటట్టు తయారుచేసికోవాలి లేకపోతే కిమోనో శరీరానికి సరిగ్గా కుదరదు. ఈ వస్త్రానికి అడ్డంగా వుండే పట్టి గట్టిగా వుండి కిమోనో పైబాగాన్ని పట్టుకొని బిగువుగా వుంటుంది. మెడకువెనుక పట్టి పూర్తిగాసరిగ్గా వున్నదో లేదో ఖచ్చితంగా చూచుకొనండి.

నీవు పశ్చిమ దేశాలకు సంబంధించిన మహిళవైతే నీ రవికెను లేక కోటును కుడినుండి ఎడమవైపు మూసి వేసినట్లే ఈ వస్త్రాన్నికూడ ముందు భాగం అటువైపునుండి బహుశా మూసివేసికుంటావు. “కాదు, కాదు!” అని మన జపానీ స్నేహితురాలు అంటుంది. “ఇక్కడ శవాలను మాత్రమే కుడినుండి ఎడమ వైపుకు చుట్టి వేస్తారు.” గనుక నీ నగజూబాన్‌ను ఎడమనుండి కుడివైపుకు చుట్టి, దాన్ని సన్నని దట్టితో నడుముచుట్టూ బిగించాలి.

ఇప్పుడు నీవు కిమోనో ధరించుటకు సిద్ధమయ్యావు. అది చాలా పొడవుగా ఉందని అనుకుంటున్నావా? “పర్వాలేదు,” మనమింకా ప్రథమ దశలోనే వున్నాం” అని అంటుంది మన స్నేహితురాలు. కిమోనోను చూట్టూ చుట్టుకో—జ్ఞాపకముంచుకొనండి, ఎడమనుండి కుడికి—దట్టీతో కట్టుకో. ఇప్పుడు కట్టిన దట్టీమీద అధికంగా వున్న వస్త్రాన్ని లాగి నేలను తాకే అంచుపైకి వచ్చేవరకు దాని పొడవును సరిచేసుకొనండి. మెడపట్టిని చక్కగా పెట్టుకొని ముందు భాగాన్ని నునుపుచేసి మిగిలిన వస్త్రాన్ని శుభ్రంగా వ్రేలాడనివ్వండి, దాన్ని మరో దట్టీతో కట్టండి.

ఇప్పుడు చాలా చిక్కైన భాగం—ఓబి అనేది వస్తుంది. ఇది దళసరమైన దానితో చేయబడి 30 సెంటి మీటర్ల వెడల్పు 4 మీటర్ల పొడవు వుంటుంది, దీన్ని వెనుకభాగంలో కట్టే పద్ధతులు కొన్ని వందలున్నవి. ఎవరి సహాయము లేకుండా కట్టు కోవాలంటే సవాలుతో కూడినదే గాని మన జపాను స్నేహితురాలు సహాయము చేయుటకు సంతోషిస్తుంది. ఈ ఓబిని కట్టునపుడు ప్రతి చుట్టును బిగించి పట్టుకోవడానికి ఒక త్రాడు లేక దట్టీవంటింది కావాలి. దీన్ని దాని స్థానంలో కట్టి వుంచడానికి చివరిగా వాడే దాన్ని, ముందు భాగంలో చక్కగా వుండునట్లు కడతారు.

సరే, కిమోనో తొలిసారిగా ధరించినపుడు ఎటువంటి అనుభూతి కలుగుతుంది? ‘చాలా అందంగా వున్నదిగాని కదలడానికి అననుకూలంగా వుందని’ నీవు నిస్సందేహంగా అంటావు.

దారం మరియు నేత

కిమోనోకు కావలసినది అతి ప్రియమైనది ఎల్లపుడూ స్వచ్ఛమైన పట్టుదారమే. అది మృదుత్వమునకు, అందానికి నాణ్యతకు సాటిలేనిది. వివిధ రాష్ట్రాలు వాటివాటి నేతల విషయంలో అద్దకము విషయంలో ప్రత్యేకతను కల్గివున్నవి.

ఉదాహరణకు, క్యూషూకు దక్షిణాన వున్న అమామి-ఓ-షిమా అనే ద్వీపంలో ఒక విశేష అద్దక పద్ధతివుంది, ఇందుకు ఆ ద్వీపంలో ఇనుపరజనుతో మిళితమైయున్న బురదను, టెచీ అనే చెట్టు బెరడును వుపయోగించి తయారుచేస్తారు, ఈ పద్ధతినే ప్రభుత్వం “జాతి యొక్క అమూల్యమైన ప్రజా సొత్తు” అని సిఫారసు చేసింది.

ఓకినావా ద్వీపంనుండి బిన్‌గాటా అనే నేత పద్ధతివస్తుంది. బిన్‌ అంటే ఎరుపు, గానీ పూలు, పక్షులు, నదులు, వృక్షాలుగల ఆకారాలు చేయడానికి ఇతర ఆకర్షణీయమైన రంగులను కలుపుతారు. జపాను ప్రాచీన ముఖ్యపట్టణమైన క్యోటో కూడ కిమోనో వస్త్రాలకు ప్రసిద్ధి చెందినది.

ఈ కాలంలో యంత్రాలతోనే అధికంగా నేతనేస్తున్నప్పటికీ, చిత్రవిచిత్రడిజైన్లు ఇంకా చేతితోనే వేయబడుచున్నవి. వస్త్రం మీద డిజైను వేసిన తర్వాత అతి జాగ్రత్తగా ప్రత్యేక అచ్చువేసిన రీతిగా చేతితో రంగులు వేస్తారు. బంగారు, వెండి పూత కలుపవచ్చును మరియు కొన్ని భాగాలకు చేతితో ఎంబ్రాయిడరీ వేయవలసివుంటుంది. తత్ఫలితంగా నిజమైన కళానైపుణ్యం కనబడుతుంది.

కాలానుగుణ్య మార్పులు

అయిననూ ఇటీవలి సంవత్సరాలలో కిమోనోల మీద మోజు తగ్గింది. యొమూరి వార్తాపత్రిక చేసిన ఒక పరిశోధన తెలియజేయునదేమంటే పరిశోధించబడిన వారిలో 64 శాతం నూతన సంవత్సరం రోజున కిమోనో ధరించగా, 3 శాతం మాత్రమే మామూలుగా ధరించుటకు ఎన్నుకున్నారు. “కిమోనోలకు చాలా వరకు గిరాకి పడిపోయినందువల్లనే పట్టు పరిశ్రమకు సంబంధించిన యంత్రాలను నాశనం చేస్తున్నట్లు” ఒక వార్తా పత్రిక తీసిన కార్మికుల ఫొటోలను చూస్తేనే వాటి గిరాకి తగ్గిపోయినట్లు వ్యక్తమౌతుంది.

ఎందుకంతగా గిరాకి తగ్గిపోతుంది? ఇందుకు ప్రాశ్చాత్య దేశాల అనువైన, జనాదరణ పొందిన వస్త్రాలు ఒక కారణమైతే, కిమోనో పట్టు వస్త్రాల అధిక ధర మరొక కారణం. నిజానికి అవి అయిదు లక్షల యెన్‌ల ఖరీదు (షుమారు 2,000 అమెరికా డాలర్లు) కావచ్చును, దానికి సరిపడే ఓబి ఖరీదు అందులో సగం ధర అవుతుంది. దీనికి తోడు జోరి అనే పాదరక్షలు, టాబి (జోరితో పాటు వేసుకునే సాక్స్‌) పర్స్‌, తలజుత్తు ఆభరణాలు మొదలగు వాటి ఖరీదు అంతా చూస్తే మరి పట్టు కిమోనో ధరించుట ఎంత ఖరీదో నీవు అర్థం చేసుకోవచ్చును.

కొన్ని కుటుంబాల వారు ఆడపిల్ల పుట్టినప్పటినుండే, ఆమె పెద్దదై మంచి కిమోనో ధరించడానికి అవసరమయ్యే డబ్బును దాచుటకారంభిస్తారు. అటువంటి కిమోనో వస్త్రం తరచూ ఒక తరం నుండి మరోతరం వారికి అందించబడుతూ వుంటుంది.

అయితే మరో విషయమున్నది. సోడొ కిమోనో అకాడమీ ఛైర్మన్‌, నోరియొ యమనాకా ఇలా వ్యాఖ్యానించాడు: “మాదైనందిన జీవితం చాలా రద్దీగా వున్నది. . . . జపానువారు, ముఖ్యంగా పురుషులు యుద్ధానంతర దినములలో పొట్ట సంపాదనకే అధికసమయం గడిపేవారు. వారు కిమోనోలను కొనేంత వీలులేకుండ శ్రమించుటలో నిమగ్నమైరి.” చాలా పూర్వికులనుండి వచ్చే పారంపర్యాచారములను పాటించుటకు తీరిక-లేని ఈ నవసమాజమునకు సమయమే దొరకడంలేదు.

అందమైన కిమోనో వస్త్రాలంకరణ ఈ నాటి నవసమాజ వత్తిళ్లను అధిగమించగలదో లేదో కాలమే నిర్ణయిస్తుంది. అయితే జపాను దేశము యొక్క అందమైన వస్త్రం లోకమంతట కనబడే వైవిధ్యమైన దుస్తుల అందచందాలకు ఇంకా ఎక్కువ చక్కదనాన్ని చేకూర్చుతుంది. (g91 2/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి