కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 10/8 పేజీలు 14-18
  • భాగం 9 మానవ పరిపాలన అంతిమ దశకు చేరుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భాగం 9 మానవ పరిపాలన అంతిమ దశకు చేరుట
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వాగ్దానాలు, వాగ్దానాలు!
  • ఒకటిగా దట్టీకట్టుట
  • రెండో ప్రయత్నం
  • “ఓడిపోవుదురు!”
  • ప్రపంచ మహాధిపత్యముల దీర్ఘకాల ప్రభావము అంతమగుటకు సమీపించినది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఆశ్చర్యకరమైన మర్మము బయల్పర్చబడింది
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
  • ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలోని ఎర్రని మృగం ఎవరు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
తేజరిల్లు!—1992
g92 10/8 పేజీలు 14-18

మానవ పరిపాలనను తూకంవేస్తే

భాగం 9 మానవ పరిపాలన అంతిమ దశకు చేరుట

జాతీయేతర రాజకీయ విధానాలు: సామ్రాజ్యాలు, సమితులు, కూటమిలు, లేక జాతీయ హద్దులు అధికారాలు లేదా అభిమానములు దాటి సార్వజనిక లక్ష్యసాధనకు తాత్కాలిక లేక శాశ్వత ప్రాతిపదికపై దేశ-రాష్ట్రముల మధ్య ఏర్పడే సమాఖ్యలు.

అక్టోబరు 5, సా.శ.పూ. 539 లో బబులోను పట్టణం పండుగ సందడిలో మునిగిపోయింది. రాజగు బెల్షస్సర్‌ పంపిన ఆహ్వానాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వీకరించారు. మాదీయులు పారశీకుల సైన్యము ముట్టడి వల్ల పట్టణం అట్టుడికిపోతున్నా బెల్షస్సరు అతని తోటి వెయ్యిమంది రాజకీయ నాయకులు మాత్రం చెక్కుచెదరలేదు. ఎందుకంటె పట్టణ ప్రాకారాలు అభేద్యమైనవి. అంత భీతిచెందనవసరం లేకుండెను.

అయితే ఏ హెచ్చరిక లేకుండానే, పండుగ సంబరంలో, మానవ హస్తపు వ్రేళ్లు కనబడి రాజనగరపు గోడమీద ఏదో వ్రాత వ్రాయుట కారంభించినవి: మెనే మెనే టెకేల్‌ ఉఫార్సిన్‌. రాజు కాళ్లు గడగడ వణకుట కారంభించి ముఖం తెల్లబడింది.—దానియేలు 5:5, 6, 25.

బెల్షస్సరు, అతని ప్రభుత్వాధికారులు ధిక్కరించే దేవుని ఆరాధికుడును ఇశ్రాయేలీయుడైన దానియేలును పిలిచి దీనిభావం చెప్పవలెననిరి. “ఈ వాక్య భావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాని ముగించెను. టెకేల్‌ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేన్‌ అనగా నీ రాజ్యము నీ యొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారశీకులకును ఇయ్యబడును,” అని దానియేలు చెప్పాడు. ఆ ప్రవచనం నిశ్చయంగా వారికి మంచిని సూచించలేదు. దాని నెరవేర్పు ప్రకారం “ఆ రాత్రియందే కల్దీయుల రాజైన బెల్షస్సర్‌ హతుడాయెను.”—దానియేలు 5:26-28, 30.

ఒకే రాత్రిలో మానవుని ఒక రకపు పరిపాలనకు బదులు మరోరకం వచ్చింది! తూర్పు ఐరోపాలో ఇటీవలి జరిగిన రాజకీయ మార్పుల దృష్ట్యా, బెల్షస్సరుకు సంభవించినదే మన కాలము కొరకును వర్తిస్తుందా యని మనం ఆలోచించవచ్చును. భవిష్యత్తును సూచించు యీ సంఘటన మానవ పరిపాలన యంతటికి సంబంధించి యుండవచ్చునా? ఈ విషయాన్ని గూర్చి మనం గంభీరంగా ఆలోచించుటకు మంచి కారణమున్నది. ఎందుకంటె “సామ్రాజ్యాలన్నీ సర్వనాశనం కాగలవు” అని కొలంబియా యూనివర్శిటి ప్రొఫెసర్‌ జాక్విస్‌ బార్జన్‌ అంటూ ఇంకా ఇలా చెప్పాడు: “గ్రీకు లేక రోమా సామ్రాజ్యాల ఘోరమైన పతనములు కల్పితం కావు.”

మానవులు ప్రతివిధమైన ప్రభుత్వాలను కనిపెట్టారు. వేల సంవత్సరాలుగా చేసిన యీ తప్పులు, ప్రయత్నాల అనంతర ఫలితాలెలావున్నవి? మానవ పరిపాలన సంతృప్తికరంగా ఉన్నదా? పెరిగే మానవ సమస్యలకు పరిష్కార మివ్వగలదా?

వాగ్దానాలు, వాగ్దానాలు!

ఇండియాలోని బొంబాయి నందలి పెద్ద పరిశోధనా కేంద్రం డైరెక్టర్‌ బాకుల్‌ రజనీ పటేల్‌ దీనికి కొంతవరకు సమాధానమిచ్చింది. రాజకీయ నాయకుల “పచ్చివేషధారణ” ను గూర్చి ఆమె నిందిస్తూ ఇలా అంటున్నది: “నాయకులు వేదికలెక్కి ‘అభివృద్ధి’ మరియు ‘పురోభివృద్ధిని’ గూర్చి ఉపన్యాసాలు దంచడం ఇండియాలోను మూడవ ప్రపంచ దేశాల్లోను సరదా అయిపోయింది. ఎటువంటి అభివృద్ధి, పురోభివృద్ధి సాధిస్తున్నారు? మనమెవరిని మోస గిస్తున్నాం? మూడవ ప్రపంచ దేశాలకు సంబంధించిన గణాంక వివరాలను నీవు గమనిస్తే చాలు: ప్రతి రోజు 40,000 మంది పిల్లలు నిరోధించగల రోగం మూలంగా చనిపోతున్నారు.” 8 కోట్లమంది పిల్లలు ప్రతిరాత్రి పస్తులుంటున్నారు లేక పోషకాహారంలేక మాడిపోతున్నారు, అని ఆమె యింకను చెబుతుంది.

‘ఓ నిమిషం ఆగండి రాజకీయనాయకులు చేసే ప్రయత్నాన్నైనా మెచ్చుకోండి. ఈనాడు లోకాన్ని పట్టి పీడించే తీవ్రమైన సమస్యలను పరిష్కరించాలంటే ఏదోక ప్రభుత్వం అవసరమే గదా’ అని నీవు అడ్డుకోవచ్చు. నిజమే, గానీ ప్రశ్న ఏమంటే: అది మానవ స్థాపిత ప్రభుత్వమై యుండవలెనా లేక దేవునిచేత స్థాపించబడినదై యుండవలెనా?

దేవుడేమి జోక్యం చేసుకోడని అనేకులు అనుకున్నట్లు నీవును అనుకుంటూ యీ ప్రశ్న అతి సామాన్యమైనదేనని దాన్ని కొట్టి పారేయవద్దు. సాధ్యమైనంతవరకు మానవులు తమను తామే పరిపాలించుకొనునట్లు దేవుడు దాన్ని వారికే వదిలేశాడని పోప్‌ జాన్‌ పాల్‌ II కూడ నిశ్చయంగా అనుకుంటున్నారు, పది సంవత్సరాల క్రితం ఆయన కెన్యా దేశాన్ని సందర్శించినపుడు ఇలా అన్నాడు: “క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైన సవాలు ఏమనగా రాజకీయ జీవితమే.” ఆయనింకా ఇట్లన్నాడు: “దేశంలోని పౌరులు రాజకీయ జీవితంలో పాలుపంచుకునే హక్కును, విధిని కల్గియున్నారు . . . క్రైస్తవుడు యిలాంటి వాటిలో పాల్గొనకూడదని తలంచుట పొరపాటే.”

ఈ సిద్ధాంతమును అనుసరిస్తూ మానవులు, తరచు మతం యొక్క మద్దతుతో దీర్ఘకాలంగా పరిపూర్ణ ప్రభుత్వం కొరకు వెదికారు. ప్రతి నూతన ప్రభుత్వం పెద్ద వాగ్దానాలతో ప్రారంభమౌతుంది. గానీ శ్రేష్ఠమైనవిగా కనబడే వాగ్దానాలు సహితం అమలు పరచకపోతే అపశృతే పలుకును. (“వాగ్దానాలు, వాస్తవాలు” అనుదానిని 17 వ పుటలో చూడండి.) స్పష్టముగా మానవులు ఉత్తమ ప్రభుత్వాలను సాధించ లేదు.

ఒకటిగా దట్టీకట్టుట

అణుశాస్త్ర వేత్త హెరాల్డ్‌ యూరే దగ్గర దీనికి సమాధానమున్నదా? ఆయన అభిప్రాయపడిన దేమంటే “భూమియంతటి మీద అధికార చట్టాన్ని నెలకొల్పగలిగే ఒక ప్రపంచ ప్రభుత్వం చివరకు వస్తే తప్ప ప్రపంచ సమస్యలకు ఒక కట్టుదిట్టమైన పరిష్కారంలేదు.” అయితే యిలాంటిది పనిచేస్తుందని ప్రతిఒక్కరు అంత రూఢీగా నమ్మలేక పోతున్నారు. గతంలో, అంతర్జాతీయ సంస్థలలోని సభ్యుల మధ్య సమర్థవంతమైన సహకారం అనితరమైంది. ఒక మంచి ఉదాహరణను గమనించండి.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం 1920, జనవరి 16 న, 42 దేశాల సభ్యత్వంతో ఒక అంతర్జాతీయ సంస్థను, నానాజాతి సమితిని స్థాపించారు. ప్రపంచాధిపత్యంగా వుండే బదులు, ముఖ్యంగా దేశాల మధ్య తగాదాలను తీర్చి, యుద్ధాన్ని నివారించే ఒక ప్రపంచ పార్లమెంటుగానే వుండుటకది ఉద్దేశించబడింది. దాని సభ్యత్వం 1934 నాటికి 50 దేశాలకు పెరిగింది.

అయితే, నానాజాతి సమితి సరియైన పునాదిమీద వేయబడలేదు. “గొప్ప ఆశలతో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది, గానీ నిరాశ దూరంలో లేకుండెను,” అని ది కొలంబియా హిస్టరీ ఆఫ్‌ ది వరల్డ్‌ వివరిస్తుంది. “నానాజాతి సమితి మీద నిలిపిన ఆశలన్నీ అడియాసలైనవి.”

సెప్టెంబర్‌ 1, 1939 లో 2 వ ప్రపంచ యుద్ధం ఆరంభమై నానాజాతి సమితిని నిర్వీర్యం చేసింది. ఏప్రిల్‌ 18, 1946 వరకు సంపూర్తిగా తీసివేయబడక పోయినప్పటికీ అన్ని ఉద్దేశాలు సంకల్పాల విషయంలో అది “యుక్తవయస్సులోనే,” కనీసం 20 సంవత్సరాలు రాకముందే చనిపోయింది. దాన్ని అధికారికంగా పాతిపెట్టకముందు, 1945, అక్టోబర్‌ 14 వ తేదీన 51 దేశాల సభ్యత్వముతో దానికి బదులు మరొక అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పడింది. కలిసి దట్టీ కట్టవలెననే యీ నూతన ప్రయత్నం ఎలా ఫలించింది?

రెండో ప్రయత్నం

నానాజాతి సమితి దాని నిర్మాణ లోపంవల్లే విఫలమైందని కొందరంటారు. మరికొందరు సమితిని ముఖ్యంగా నిందించుటలేదు గానీ దానికి సరియైన మద్దతు నివ్వడానికి ఇష్టపడని ప్రభుత్వాలు నిందించబడినవి. ఈ రెండు అభిప్రాయాలలోను నిశ్చయంగా కొంత సత్యమున్నది. ఏదేమైననూ, ఐక్యరాజ్య సమితి, నానాజాతి సమితి లోపాలను పూరించాలని ఆ సమితి అసమర్థత నుండి గుణపాఠం నేర్చుకోవాలని ప్రయత్నించింది.

రచయిత ఆర్‌. బాల్డ్‌విన్‌ ఐక్యరాజ్య సమితిని “ప్రపంచమునకు శాంతి, సహకారాన్ని నెలకొల్పుటకును, చట్టాన్ని మానవ హక్కులను కాపాడుటకును దాని సామర్థ్యములో ఇది పాత నానాజాతి సమితి కన్న గొప్పది” అని అంటున్నాడు. నిజానికి, అందులో విశేష భాగాలుగావున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి పిల్లల విద్యా ధననిధి మరియు ఆహార వ్యవసాయ సంస్థ కొంతవరకు మెచ్చుకోదగిన రీతిలో లక్ష్యసాధన యందు సఫలీకృతమైనవి. అందుకే బాల్డ్‌విన్‌ చెప్పినది సత్యమన్నట్లు కనబడుతుంది ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ 45 సం. నుండి అంటే నానాజాతి సమితికన్న రెండు రెట్లు ఎక్కువ కాలమే పనిచేయగలిగింది.

వలస ప్రాంతాలను తగ్గించడములో ఐక్యరాజ్య సమితి కొనియాడదగినది సాధించింది, “మరోరకంగా వుండబోయేదానిని కొంత క్రమబద్ధం చేసిందని చెప్పుకొనుటకు కనీసం వీలు కల్గించిందని” రిచ్చర్డ్‌ ఐవర్‌ అనే ఓ విలేఖరి అంటున్నాడు. “ఆ సంస్థ ప్రచ్చన్న యుద్ధాన్ని ఊకదంపుడు ప్రసంగాలకే పరిమితం చేయుటకు సహాయపడిన” దని కూడ ఆయన అంటున్నాడు. “ప్రపంచవ్యాప్తంగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకునే పద్ధతిని” అది కలుగజేసిందని ఆయన కొనియాడాడు.

ప్రచ్ఛన్న యుద్ధం రాకుండ ఆపగల్గింది అణు యుద్ధ భయమేగానీ ఐక్యరాజ్య సమితి కాదని కొందరు వాదించుట వాస్తవమే. దేశాలను ఐక్యపరచుట అనే నామములో అమర్చబడిన వాగ్దానాన్ని నెరవేర్చే బదులు వాస్తవంగా యీ సంస్థ తరచూ మధ్యవర్తిగా తప్ప యింకేమీ చెయ్యడంలేదు, కయ్యానికి కాలుదువ్వకుండ అనైక్యమైన దేశాలు ఒకరినొకరు హతమార్చకుండ చూసింది. ఈ మధ్యవర్తిత్వపు స్థానంలో కూడ అది ప్రతిసారి విజయం సాధించలేదు. రచయిత బాల్డ్‌విన్‌ వివరిస్తున్నట్లు, ముందున్న నానాజాతి సమితివలెనే “ఐక్యరాజ్యసమితికి, నిందించబడిన సభ్యదేశము దయదలచి అనుమతించిన దానికంటె అధికంగా చేసే అధికారమే లేదు.”

ఐక్యరాజ్య సమితి సభ్యులు కనబరచే యీ అయిష్టంతోకూడిన మద్దతు కొన్నిసార్లు ఆ సంస్థ నిర్వాహణ ఖర్చులకు ధనసహాయం చేయుటకు అయిష్టత వ్యక్తపరచుటలోనే కనబడుతుంది. ఉదాహరణకు అమెరికా, ఆహార వ్యవసాయ సంస్థకు యివ్వవలసిన బాకీని తీర్చకుండ ఆపివేసింది. ఎందుకంటే ఇశ్రాయేలు దేశాన్ని విమర్శిస్తు, పాలస్తీనాకు వంత పలికి అది చేసిన తీర్మానమును అమెరికా తీవ్రంగా పరిగణించి నందువల్లనే. పిదప ఐక్యరాజ్య సమితి ధనసహాయంతో ఆదుకునే యీ ముఖ్యోద్దేశం దాని ఓటు హక్కును కాపాడుకొనుటకు కావలసినంత ధనాన్ని చెల్లించుటకు అంగీకంచిందేగానీ అప్పులో రెండింట మూడు భాగాలు తీర్చకుండానే మిగిల్చింది.

ఐక్యరాజ్య సమితి పిల్లల విద్యా ధననిధి (యూనిసెఫ్‌) మాజీ డిప్యూటి డైరెక్టర్‌ వారిండ్రా టార్జీ విట్టాచి 1988 లో వ్రాస్తూ, ఐక్యరాజ్య సమితిని ఒప్పుకొనకుండా “దానిని తొలగించ దలచుకున్న సాధారణ పార్టీలో చేరుటకు” తిరస్కరిస్తునట్లు చెప్పాడు. అయిననూ తననొక “నమ్మకమైన విమర్శకునిగా” పిలుచుకుంటూ ఆయన ఇలా అంగీకరిస్తున్నాడు, ఏమనంటే “ఐక్యరాజ్య సమితి ‘వెలగని దీపమని’ దాని ఉన్నత ఆశయాలను నెరవేర్చలేనిదని, శాంతి ఒప్పందాలను అమలుపరచుటలో విఫలమైందని, అభివృద్ధి పథకాలు, ఏదో కొన్ని తప్ప తక్కినవన్నియు ఉనికిలో లేనట్లే పోయినవని చెప్పే ప్రజలు పలుచోట్ల దానిపై దాడి చేస్తున్నారు.”

రచయిత ఐవర్‌ ఇలా వ్రాస్తూ ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్యమైన బలహీనతను బయల్పరచాడు: “ఐక్యరాజ్య సమితి ఇతరత్రా అదేమి చేయగలిగినప్పటికి పాపాన్ని తీసివేయలేదు. అది అంతర్జాతీయ పాపాన్ని యింకా కష్టతరం చేయగలదు, మరి పాపిని యింకా బాధ్యున్ని చేస్తుంది. అయితే దేశాల నాయకులుగానీ దేశ ప్రజలు గాని వారి హృదయాలను మనస్సులను మార్చుకొనేట్లు చేయుటలో అది ఇంకా విజయం సాధించలేదు.”—ఐటాలిక్స్‌ మావి.

ఆ విధంగా, ఐక్యరాజ్యసమితిలోని లోపము అన్ని మానవ పరిపాలనలలోవున్న లోపము ఒకటే. వాటిలో దేనికి కూడ ప్రజలలో విజయానికి అవసరమైన ఎటువంటి నీతియెడల నిస్వార్ధ ప్రేమ, చెడునసహ్యించుకొనుట, అధికారాన్ని గౌరవించుటయనే లక్షణాలను ప్రజల్లో నాటే స్థోమత లేదు. ప్రజలు నీతి సూత్రాలను అనుసరించుటకు కష్టపడితే లోకమంతటనున్న ఎన్ని సమస్యలు పరిష్కరింపబడేవో ఆలోచించండి! ఉదాహరణకు, ఆస్ట్రేలియాలో కలుషితాన్ని గూర్చి ఒక వార్తా సమాచారం ఏమంటుందంటే, సమస్య ఉండేది “నిర్లక్ష్యం వల్లకాదు గానీ చూపే స్వభావం వల్లనే.” దీనికి దురాశే ముఖ్యకారణమంటూ ఆ శీర్షిక ఏమని చెబుతుందంటే “ప్రభుత్వవిధానమే సమస్యను జటిలం చేసింది.”

అసంపూర్ణ మానవులు సంపూర్ణ ప్రభుత్వాలను ఏర్పాటుచేయజాలరు. రచయిత థామస్‌ కార్లిల్‌ 1843 లో ఇలా అన్నాడు: “కాలం గడిచే కొలది ప్రతి ప్రభుత్వం ప్రజల జ్ఞాన అజ్ఞానములను కచ్చితంగా ప్రతిబింబించేదిగానే వున్నది.” అటువంటి కారణ సహిత వాదనను ఎవరు కాదనగలరు?

“ఓడిపోవుదురు!”

ఇప్పుడు, యీ యిరవయ్యో శతాబ్దంలో మాన పరిపాలన అంతిమ దశకు చేరుకున్నది. మానవ ప్రభుత్వాలు, దైవ పాలనకు వ్యతిరేకంగా పటిష్టమైన పోటి పాలనను ఏర్పాటు చేయాలని సమాలోచించి కుట్ర పన్నినవి. (యెషయా 8:11-13 పోల్చుము.) ఒకసారి కాదు రెండుసార్లు అలా చేసినవి, మొదట నానాజాతిసమితిని తర్వాత ఐక్యరాజ్య సమితిని సృష్టించినవి. ప్రకటన 13:14, 15 దానిని “క్రూర మృగముయొక్క ప్రతిమ” యని పిలుస్తుంది. ఆ పేరు తగినదే ఎందుకంటే అది లోకములోవున్న మానవ రాజకీయ విధానమంతటికి ప్రతిబింబమై యున్నది.

నానాజాతి సమితి 1939 లో విఫలమై గతించింది. బైబిలు ప్రవచన నెరవేర్పు ప్రకారం ఐక్యరాజ్య సమితికి అదేగతి పడుతుంది: “మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు . . . నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసికొనినను అది వ్యర్థమగును.”—యెషయా 8:9, 10.

మరి ఎప్పుడు యీ “క్రూరమృగము యొక్క ప్రతిమ మరియు అది సూచించిన మానవ పరిపాలన చివరి ఓటమి పాలగును? తన సర్వాధిపత్యమును సవాలుచేసిన మానవపాలనను యెహోవా ఎప్పుడు అంతమొనర్చును? బైబిలు దీని కొక తేదీని నిర్ణయించి చెప్పడం లేదుగాని బైబిలు ప్రవచనము, లోక సంఘటనలు మాత్రం అలాంటిది అతి త్వరలో జరుగునని చెబుతున్నవి.—లూకా 21:25-32.

చూడాలనుకున్న వారికి గోడమీద వ్రాయబడిన వ్రాత యింకనూ ఉన్నది. బెల్షస్సరు ప్రభుత్వమును త్రాసులో తూచినపుడు తక్కువగా తూగినట్లె, మానవపరిపాలన అంతటిని పరిశీలించగా అందులో లోపమున్నట్లు కనుగొనబడింది. అది రాజకీయ అవినీతిని పెంచి, యుద్ధాలను రేపి, ప్రతి విధమైన వేషధారణను, స్వార్థాన్ని పోషించి దాని మద్దతుదారులకు సరియైన తిండి, బట్ట, విద్య, వసతి, వైద్య సౌకర్యాలను కల్పించుటలో అలక్ష్యం చేస్తుంది.

మానవ పరిపాలన అంతమైనపుడు, ఒక రాత్రిలో పోయినట్లే అదృశ్యమైపోవును. నేడువచ్చింది, నిన్న గతించింది—చివరకు పరిపూర్ణ ప్రభుత్వం, దేవుని రాజ్యం అవతరించింది. (g90 12/8)

[17వ పేజీలోని బాక్సు]

వాగ్దానాలు, వాస్తవాలు

అరాచకత్వాలు హద్దు పద్దూ లేని సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని వాగ్దానం చేస్తున్నవి; వాస్తవానికి ప్రభుత్వమే లేకపోతే పరస్పర ప్రయోజనాల కొరకు ప్రజలు అనుసరించదగిన నియమావళి గాని నిబంధనలుగాని వుండవు; హద్దు పద్దూలేని స్వాతంత్ర్యం వలన అలజడి చెలరేగుతుంది.

ఏకఛత్రాధిపత్యములు, ఒకే సామ్రాట్‌ పాలన క్రింద స్థిరత్వ ఐక్యత వుండునని వాగ్దానం చేస్తున్నవి; వాస్తవానికి స్వల్ప జ్ఞానమున్న మానవ ఆధిపత్యములు వాటికున్న మానవ అసంపూర్ణతలు బలహీనతలను బట్టి బహుశా తప్పుడు ఉద్దేశాలనుబట్టి కూడ మృతతుల్యమౌను; అందుచేత ఎటువంటి స్థిరత్వమైనా ఐక్యతయైనా స్వల్పకాలికముగా ఉండును.

సర్వశ్రేష్ఠులు ఏలుబడులందు శ్రేష్ఠమైన పాలనందిస్తామని వాగ్దానం చేస్తున్నవి; వాస్తవానికి వారికి ఐశ్వర్యం ఉంది గనుక, రక్త సంబంధియైన వారసత్వం లేక అధికారం వున్నందున పాలిస్తున్నారేగానీ ఏదో ప్రజలమీద శ్రద్ధాసక్తులు, ప్రేమ వున్నందున కాదు. లేక జ్ఞానవివేకములు ఉన్నందువలన కాదు; ఏకఛత్రాధిపత్యములోని అసమర్థుడైన పాలకునికి బదులు ఉత్తములైన శ్రేష్ఠులతో కూడిన పరిపాలకులు ఆధిపత్యం వహిస్తారు.

ప్రజాస్వామ్యములు అందరి ప్రయోజనం నిమిత్తం ప్రజలంతా నిర్ణయించవచ్చునని వాగ్దానం చేస్తున్నవి; వాస్తవానికి అందరి ప్రయోజనం కొరకు సరియైన నిర్ణయాలుచేసే జ్ఞానంగాని పవిత్ర ఉద్దేశాలుగానీ పౌరులకు లేవు; ప్రజాస్వామ్యమును ప్లాటో ఇలా వర్ణించాడు, “ఆకర్షణీయంగా కనబడే ప్రభుత్వం, పూర్తిగా గందరగోళంతో నిండినది, సమానులు అసమానులకు ఒకే విధమైన సమానత్వాన్ని అందించేది.”

నిరంకుశ ప్రభుత్వాలు త్వరితగతిన అన్నిపనులు చేపట్టి నెరవేర్చెదమని వాగ్దానం చేస్తున్నవి; వాస్తవానికి జర్నలిస్ట్‌ ఓట్టొ ఫ్రెడరిక్‌ వ్రాసినట్లు “అతి శ్రేష్ఠమైన ఆశయాలు కల్గివున్న పురుషులు కూడ ఒకసారి అధికార రాజకీయాల్లోనికి జొరబడితే సాధారణ పరిస్థితులలో వారు అవినీతియని తలంచే పనులను చేసే అవసరత ఏర్పడుతుంది.” అట్లు “శ్రేష్ఠులైన” నిరంకుశ పాలకులు వారి స్వలాభం లేక స్వప్రయోజనం కొరకు ప్రజల అవసరాలనే పణంగా పెట్టుట కిష్టపడే అధికార దాహమున్నవారిగా మారిపోగలరు.

ఫాసిస్ట్‌ ప్రభుత్వాలు అందరి ప్రయోజనార్ధం ఆర్థిక రంగాన్ని అదుపులో వుంచెదమని వాగ్దానాలు చేస్తున్నవి; వాస్తవానికి ఏ ఒక్క దాన్ని జయప్రదంగా నిర్వహించలేక పోయినవి; చేసినా వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని కాలరాచి యుద్ధాన్ని, జాతీయతను ఉన్నతపరచి అలా చేస్తున్నవి, ముస్సోలిని క్రిందనున్న ఇటలీవలె హిట్లర్‌ క్రిందవున్న జర్మనీవలె అది వాటి పరిపాలనలను రాజకీయ రాక్షసత్వాలుగా మార్చును.

కమ్యూనిస్ట్‌ ప్రభుత్వాలు ఊహా కల్పిత రాజకీయ విధానాన్ని, చట్టపరిధిలో పౌరులంతా సమానత్వం కల్గియున్న సమాజమును వాగ్దానము చేస్తున్నది. అయితే వాస్తవానికి వర్గభేదాలు, అసమానతలు ఇంకనూ వున్నవి మరియు అవినీతిపరులైన రాజకీయ నాయకులు సామాన్య మానవుని దోచుకుంటున్నారు; తత్ఫలితంగా జాతీయతా, చీలిక వర్గాలేర్పడి కంచుకోటను కూలద్రోసి, కమ్యూనిస్టు సిద్ధాంతానే త్రోసిపుచ్చే పరిస్థితి ఏర్పడింది.

[17వ పేజీలోని బాక్సు]

ఐక్యరాజ్య సమితి విషయం

▪ ఐక్యరాజ్య సమితి ఇప్పుడు 160 దేశాల సభ్యత్వం కల్గివున్నది. సభ్యత్వం లేని దేశాలు స్విట్జర్‌ల్యాండ్‌ మరియు ఉభయ కొరియా దేశాలు; 1986 మార్చిలో జరిపిన స్విస్‌ దేశ ప్రజాభిప్రాయ సేకరణలో మూడింట ఒక్క ఓటుతో ఆ దేశ సభ్యత్వం వీగిపోయింది.

▪ దాని ప్రధాన సంస్థతో పాటు అది 55 ఇతర ప్రత్యేక సంస్థలను, ప్రత్యేక ఏజన్సీలను, మానవ హక్కుల కమిషన్‌లను మరియు శాంతి ఒడంబడికలను అమలుపరచు వాటిని నడిపిస్తుంది.

▪ జనరల్‌ అసెంబ్లీలో ప్రతి సభ్య దేశానికి ఒక్క ఓటు వేసే అనుమతి ఉన్నది, అయితే సభ్యదేశాలలో అతి తక్కువ జనాబాగల సెయింట్‌ కిట్స్‌ మరియు నేవిస్‌ దేశాలలోని ఒక్కో నివాసికి, అతి ఎక్కువ జనాబాగల చైనా దేశ నివాసులు 22,000 మంది వున్నారు.

▪ ఐక్యరాజ్య సమితి, 1986 లో అంతర్జాతీయ శాంతి సంవత్సరం జరుపు కున్నప్పుడు ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఎన్నడూ లేనన్ని సాయుధ పోరాటములు అంటే 37 యుద్ధాలు జరిగినవి.

▪ ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలన్నింటిలో 37 శాతం దేశాలు యెహోవాసాక్షుల ఐక్యపరచబడిన అంతర్జాతీయ “జనాంగము” కంటె తక్కువ పౌరులను కల్గివున్నవి; 59 శాతము దేశాలు 1990 సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ కూటమునకు హాజరైన వారి సంఖ్య కంటె తక్కువ జనాబాను కల్గివున్నవి.

[17వ పేజీలోని చిత్రాలు]

నానాజాతి సమితి

ఐక్యరాజ్య సమితి

సంపూర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయుట అసంపూర్ణ మానవుల శక్తికి మించినది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి