కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 3/8 పేజీలు 12-16
  • భాగం 2 రాజులు, నక్షత్రములవలె, ఏలి కూలుదురు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భాగం 2 రాజులు, నక్షత్రములవలె, ఏలి కూలుదురు
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఏకఛత్రాధిపత్యము ద్వారా ఐక్యత
  • మతముసుగులో రాజరికము
  • ఏకఛత్రాధిపత్యాలే పూర్తిగావున్న యుగం
  • “దేవుళ్లు” నామమాత్రపు వ్యక్తులుగా అధోస్థితికి దిగజార్చబడిరి
  • అసంతృప్తికరమైనవిగా కనుగొనబడినవి
  • మరో రకమైన నక్షత్రము
  • భాగం 5: అపరిమిత అధికారం ఆశీర్వాదమా, లేక శాపగ్రస్థమా?
    తేజరిల్లు!—1992
  • భాగం 10 తుదకు పరిపూర్ణ ప్రభుత్వం!
    తేజరిల్లు!—1992
  • అధికారానికి ఏమి సంభవించింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • సకల యుగముల రాజైన యెహోవాను ఆరాధించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 3/8 పేజీలు 12-16

మానవ పరిపాలన తూకం వేస్తే

భాగం 2 రాజులు, నక్షత్రములవలె, ఏలి కూలుదురు

ఏకఛత్రాధిత్యము: ఒక రాజు లేక చక్రవర్తి, అతని వంశములోని ముఖ్యుడు దేశాన్ని పాలించే ప్రభుత్వము; రాజ్యము: ఒక రాజు లేక రాణి ఏక ఛత్రాధిపత్యంగా పాలించే ప్రభుత్వం; సామ్రాజ్యం: సాధారణంగా చక్రవర్తి క్రింద పాలించబడునది అనగా ఒక సామ్రాట్‌ క్రింద ఉన్న కొన్ని రాజ్యాలు, దేశాలు లేక ప్రజలు కలిసివున్న విశాల ప్రాంతం.

“షీనారు రాజైన అమ్రాపేలు దినములలో.” ఆదికాండము 14 అధ్యాయములో ప్రారంభించినట్లు బైబిలు మొట్టమొదటిసారిగా ఇచ్చట “రాజు” అనే పదాన్ని వుపయోగిస్తుంది. కొందరంటున్నట్లు అమ్రాపేలు అనేవాడు హమ్మురాబీ అనే బబులోనుయొక్క పేరుగాంచిన రాజు యొక్క మరో పేరో కాదో మనకు తెలియదు. మనకు తెలిసినదొక్కటే అదేమంటే, అతడెవరైనా కావచ్చును గానీ మానవ పరిపాలన మాత్రం అమ్రాపేలుతో ఆరంభంకాలేదు. కొన్నివందల సంవత్సరాల క్రితం, నిమ్రోదు, రాజు అని పిలువబడక పోయినప్పటికినీ, నిజానికి మానవ చరిత్రలో మొట్టమొదటి రాజు అతడే.—ఆదికాండము 10:8-12.

నిజమే, నిమ్రోదు రాజును లేక అమ్రాపేలు రాజును గూర్చి తెలిపే వస్తు కళాఖండాల ఆధారాలేమీ మనకు లేవు. “మెసొపొటోమియా యొక్క అతి ప్రాచీన పాలకుడు ఎన్మెబర్గాసి అను కీషు దేశపు రాజును గూర్చిన నమ్మదగిన చెక్కడములున్నవి” అని ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తెలియజేస్తుంది. మెసొపొటోమియాలోని ప్రాచీన పట్టణ—దేశమగు కీషునుండి పరిపాలకుడు అనే సుమేరియన్‌ పదం వచ్చింది. అనగా “గొప్పమనిషి” అని దాని అర్థం. ఎన్మెబారాగెసి పరిపాలన కాలం, బైబిలు చరిత్రతో ఏకీభవించనప్పటికినీ, బైబిలు అనుమతించిన కాలమును, ముఖ్యంగా బైబిలు చెప్పినరీతిగనే భూమియందు మానవ పరిపాలన ప్రారంభమైన స్థలాలని చెప్పబడు వాటినే షుమారు అదికూడ తెలియజేస్తుంది.

ఏకఛత్రాధిపత్యము ద్వారా ఐక్యత

చైనాలోని షాంగ్‌ లేక ఇన్‌ రాజవంశం సా. శ. పూ. 18-16 శతాబ్దముల మధ్యకాలంలో ప్రారంభమైందని సాధారణంగా అనుకుంటున్నారుగానీ ఆ తేది అనిశ్చయమైనదే. ఏదిఏమైననూ మానవుని అతి ప్రాచీన పరిపాలనా పద్ధతులు ఏకఛత్రాధిపత్యములే. అవికూడ లోకవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినవి.

మోనోస్‌ అంటే “ఒక్కటి” యని ఆర్కె అంటే “పాలన” యని అర్థమిచ్చు గ్రీకు పదములనుండి “మోనార్క్‌” అనే పదం వచ్చింది. దాన్నిబట్టి, ఏకఛత్రాధిపత్యము, ఒకేవ్యక్తి దేశాధినేతగా తానే హక్కుదారుడని భావించి పాలించే అత్యున్నత అధికారాన్ని అతనికి ఆపాదిస్తున్నది. సంపూర్ణ ఏకఛత్రాధిపతిగా రాజాజ్ఞయే ఓ శాసనం. అంటే తానే సమస్తం అన్నట్లు పాలిస్తాడు.

ఏకఛత్రాధిపత్యములు దేశాలను కట్టుబాటులో వుంచుటకుపయోగపడునని ఎప్పుడూ పరిగణించబడేవి. మధ్యయుగపు ఐరోపా చరిత్రను బోధించు జాన్‌ హెచ్‌. ముండీ తెలిపేదేమంటే, మధ్యయుగ కాలములో రాజకీయ సిద్ధాంతం “వాదించునదేమనగా అది ఆ ఫలాని విభాగములయందే అతిశయించినందువలన ఏకఛత్రాధిపత్యము నెలకొల్పుట ద్వారా వివిధ, పరస్పర విరుద్ధమైన స్థానిక పరిస్థితులున్న” ఈ పెద్దపెద్ద ప్రాంతాలు తరచూ రాజులే యోధులైనందువలన, వారు జయించిన యుద్ధ ఫలితాలమూలముగా ఆక్రమించినవే. నిజానికి, చరిత్రకారుడైన డబ్ల్యు. యల్‌. వారెన్‌ తెల్పునదేమంటే యుద్ధంలో విజయమొందుట “రాజ్యపరిపాలనకే తొలివిజయముగా పరిగణించుట సర్వసాధారణం.”

ఆవిధంగా, ఏకఛత్రాధిపత్యపు పాలనవంటి ప్రభుత్వము, ప్రపంచ సామ్రాజ్యాలు అంటే అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ క్రింద గ్రీకుల సామ్రాజ్యము, కైసరు క్రింద రోమా సామ్రాజ్యము మరియు ఇటీవలి బ్రిటీష్‌ సామ్రాజ్యములు విరాజిల్లుటకు వీలుకల్గించినవి. చిట్టచివరి సామ్రాజ్యము ఈ 20వ శతాబ్దారంభంలో తన ఉచ్ఛస్థాయికి చేరి ప్రపంచ జనాబాలో మూడవంతు, భూభాగంలో నాల్గవవంతునకు స్వయంగా ప్రాతినిధ్యం వహించింది.

మతముసుగులో రాజరికము

పలు ప్రాచీన రాజులు దైవత్వమున్నవారిగా చెప్పుకొనెడివారు. చరిత్రకారుడగు జార్జి సాబిన్‌ ఇట్లన్నాడు: “అలెగ్జాండర్‌తో మొదలుపెట్టి గ్రీకుల రాజులు గ్రీకు పట్టణములందున్న దేవుళ్లలోని సభ్యులుగా పరిగణించబడిరి. దైవత్వమున్న రాజు తూర్పుప్రాంతాల్లో విశ్వవిఖ్యాతి పొంది చివరకు రోమా చక్రవర్తులు దాన్ని స్వీకరించాల్సి వచ్చింది.” రాజే దైవమనే ఈ విశ్వాసం ఐరోపాలో “ఏదోకరూపములో ఇప్పటివరకు” కొనసాగుచుండెనని అయన చెబుతున్నాడు.

దక్షిణ, మధ్య అమెరికాలో ఆజ్‌టెక్‌ మరియు ఇన్‌కా రాష్ట్రాలు పవిత్ర రాజ్యాధిపత్యములుగా పరిగణించబడినవి. ఆసియాలో జపాను చక్రవర్తియగు కీర్తిశేషులు హిరోహిటోగారు తాను అమటేరాసు ఓకామీ అను సూర్యదేవత యొక్క 124వ మానవ వంశస్థుడని చెప్పుకొనుట 1946 సం. లోనే మానుకున్నాడు.

రాజులంతా తాము దైవత్వము గల వారని చెప్పుకొనకపోయినప్పటికి కనీసం వారికి దైవ మద్దతువున్నదని మాత్రం చెప్పుకున్నారు. భూమిపై దేవుని ప్రతినిధిగావుండుట ఆచార్య అనుగ్రహం పొందేది. “రాజులే ఆచార్యులని ప్రాచీన భావం పశ్చిమ దేశాల్లో ప్రాకిపోయి, రాజే తన చర్చికి ప్రధమ నిర్వాహకుడు, దాని శిష్యబృందానికి డైరెక్టర్‌ అయ్యాడని,” జాన్‌ హెచ్‌. ముండీ వివరిస్తున్నాడు. “చర్చీ, రాజకీయాల మేలుకలయిక మూలంగా ఉత్పన్నమయిన (సా.శ. నాల్గవ శతాబ్దములో) కాంస్టాంటేనియన్‌కు సంబంధమున్న మరియు చర్చి నియోప్లాటోనిక్‌ అభిప్రాయాన్ని దానిలోనికి అంగీకరించినందువలన వచ్చిన సమాంతరమైయున్న” ఒక మతసిద్ధాంతమైయుండెను. పట్టాభిషేక సమయంలో అనుగ్రహించు మతసంబంధమైన దీవెన రాజు పరిపాలనకు చట్టపరిపాలనబద్దమైన గౌరవానిచ్చిందేగాని లేకపోతే ఆగౌరవం దక్కేదికాదు.

ఇంగ్లాండ్‌ రాజైన హెన్రీ II 1173 సంవత్సరములో “దైవానుగ్రహమున్న రాజు” అనే బిరుదునుపయోగించుట కారంభించాడు. దీనినే రాజుల దైవహక్కుయని అటుతర్వాతి కాలంలో పిలిచెడివారు, అనగా రాజ్యాధికారం పారంపర్యహక్కు. పుట్టుక సమయంలోనే దేవుడతన్ని ఎన్నుకున్నాడని భావించెడివారు. 1661 సంవత్సరంలో ఫ్రాన్స్‌ రాజు లాయిస్‌ XIV, ఈ అభిప్రాయాన్నే అతిగా అమలుపరస్తూ ప్రభుత్వంపై పూర్ణాధికారం చేపట్టాడు. ప్రతిపక్షాన్ని అతడు తాను ప్రాతినిధ్యం వహించు దేవుని దృష్టికి పాపులుగా పరిగణించాడు. “లెయిటాట్‌ సెస్ట మోయి!” [నేనే రాజ్యాన్ని] అని అతడు అతిశయించాడు.

షుమారు అదేసమయంలో స్కాట్‌లాండ్‌లో కూడ అటువంటి అభిప్రాయమే వెల్లడయింది. 1603 సం.లో ఇంగ్లాండుకు జేమ్స్‌ I రాజుగా ఏలకముందు తాను జేమ్స్‌ VI గా దాన్ని పాలిస్తూ ఈ రాజు ఇలా రాశాడు: “రాజులు దేవుళ్లని పిలువబడుచున్నారు . . . ఎందుకంటే భూమిమీద దేవుని సింహాసనము మీద కూర్చొని ఆయనకు బాధ్యులైయున్నారు. జేమ్స్‌ బైబిలును ఆంగ్లంలో అనువదించుటకై ఆయనను ఈ విశ్వాసం ఎంతవరకు ప్రభావితం చేసిందో మనకు తెలియదు. దానిమూలంగా ప్రొటెస్టెంటు వారు కింగ్‌జేమ్స్‌ వర్షన్‌ను ఇప్పటికి విరివిగా వుపయోగిస్తున్నారు.

ఏకఛత్రాధిపత్యాలే పూర్తిగావున్న యుగం

తొలి మధ్య యుగాలనుండి ఏకఛత్రాధిపత్యాలే ఆనాటి ప్రభుత్వవిధానము. ప్రముఖులైన జమీందారులకు అధికారాన్ని అప్పచెప్పి వారిద్వారా రాజులు చౌకబారు, అనుకూల పరిపాలనను వృద్ధిచేశారు. తర్వాత ఇవే జమీందారి పాలన అని పిలువబడే రాజకీయ, సైనిక పద్దతిని ఏర్పరచినవి. సైనిక మరియు ఇతర సేవలకు బదులు ఈ జమీందారులు తమ క్రిందనున్న ప్రజలకు పొలాన్నిచ్చారు. జమీందారు ఎంత శక్తివంతంగా, ఫలభరితంగా తయారయితే అంత ఎక్కువగా ఆ రాజ్యములు వేర్వేరు జమీందారీ శక్తులుగా విడిపోయేవి.

అంతేకాక, జమీందారీ పద్ధతి ప్రజల పరువు ప్రతిష్ట, స్వేచ్ఛాజీవనాన్ని హరించివేసింది. ఎవరి ఆదాయానికి వారు ముఖ్యకారకులయ్యారో అట్టి సైనిక జమీందారులకే ఈ ప్రజలు ఊడిగం చేయవలసి వచ్చింది. విద్యా, సామాజిక అవకాశాలను పొందలేక “దాసుడు తన భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం జరుపుటకు ఏవో కొన్ని హక్కులు కల్గివుండెను” అని కోలియర్స్‌ ఎన్‌సైక్లోపిడియా అంటుంది. “అతడు పెండ్లి చేసుకొనకూడదు, ఆ హక్కును తన వారసులకు ఇవ్వకూడదు, లేక మిరాసి భూమిని జమీందారి ఇష్టములేకుండ వదలిపెట్టకూడదు.”

సంపూర్ణ ఏకఛత్రాధిపతులుగా పాలించేపద్ధతి ఇదొకటేకాదు. కొంతమంది రాజులైతే అధికారాన్ని కొందరు వ్యక్తులకిచ్చేవారు, వారిని అవసరమనుకుంటే తర్వాత ఎప్పుడైనా వారిని ఆస్థానములనుండి తొలగించవచ్చును. ఇతర రాజులు స్థానికపాలనను సాంఘిక ఆచార వత్తిడి మూలంగా పాలించే స్థానిక సంస్థలకు అప్పచెప్పారు. అయితే ఈ పద్ధతులన్నీ ఏదో ఒకవిధంగా అసంతృప్తికరమైనవే. అయినప్పటికీ 17 వ శతాబ్ది రచయితలు, అనగా ఇంగ్లాండుకు చెందిన సర్‌ రాబర్ట్‌ ఫిల్మర్‌, ఫ్రాన్స్‌కు చెందిన జాక్వీస్‌-వెనైన్‌ బోసెట్‌ అనువారు ఈ పూర్ణాధిపత్యమే ప్రభుత్వానికి ఉత్తమమైన ఏకైక పరిపాలనాపద్ధతియని ప్రకటించారు. అయినను దానికి కాలంచెల్లింది.

“దేవుళ్లు” నామమాత్రపు వ్యక్తులుగా అధోస్థితికి దిగజార్చబడిరి

ఈ రాజ్యాధినేతలు దేవునికే బాధ్యులని సర్వదా నమ్మకమున్నప్పటికినీ మానవ చట్టాలకు, పద్ధతులకు అధికారులను వీరినే బాధ్యులుగా పరిగణించాలనే వత్తిడి చాలాకాలంనుండి పెరుగుతూవచ్చింది. 18 వ శతాబ్దానికి, “ఈ రాజ్యాధినేతలు పదిహేడవ శతాబ్దినాటికి పరిపాలనకు విభిన్నమైన అలంకార పద్ధతి నొకదాన్ని అనుసరించారు” అని ది కొలంబియా హిస్టరీ ఆఫ్‌ ది వర్‌ల్డ్‌, అంటూ, అయిననూ, ఆ అలంకారపద్ధతి క్రింద వెనుక వారంతా సర్వాధిపతులే”నని ఇంకను చెప్పబడుతుంది. అదింకను వివరించునదేమనగా, “ఫ్రెడరిక్‌ ది గ్రేట్‌ ‘ఆ దేశానికి మొదటి సేవకుడు’ తానేయని చెప్పుకున్నపుడు రాజుల దైవాభిషేకాన్ని తిరస్కరించినపుడు, అధికారం మీద తన పట్టును వదలాలనే తలంపు అతనికి రాలేదు.

అయిననూ, 1688 లో ఇంగ్లాండునందు, 1789 లో ఫ్రాన్స్‌లో జరిగిన తిరుగుబాటు అనంతరం, ఈ పూర్ణాధిపత్యము చాలవరకు గతించింది. క్రమేణి, ఈ పూర్ణ ఏకఛత్రాధిపత్యాలు, రాజ్యాంగ చట్టాలు, లేక శాసనాలు లేక ఈ రెండు కలిసియున్న చిన్నచిన్న ప్రభుత్వాలకు మార్గమేర్పరచినవి. “రాజు చేసేదే రాజరికము, దాని ప్రజలు దాన్ని సమ్మతించుటకు సిద్ధపడిరి” అనే 12 శతాబ్దపు పరిపాలనకు పోలిస్తే ఈనాటి రాజుల, రాణుల అధికారం బహుస్వల్పమని” చరిత్రకారుడైన డబ్ల్యు. యన్‌. వారెన్‌, చెప్పినదాన్ని మనం ప్రస్తావించవచ్చును.

నిజమే, ఏ కొన్నో ఏకఛత్రాధిపత్యములు ఇంకను అధికారాన్ని చెలాయిస్తున్నవి గానీ మొత్తానికి వాటిలో చాలావరకు వాటి “దైవత్వపు” మహిమలను ఎప్పుడో కోల్పోయినవి మరియు ప్రజల రాజభక్తితో వాటి చుట్టు పరుగులెత్తుచున్నట్లు ప్రోత్సహించ గలిగే ప్రధాన శక్తులుగా, వట్టి ఆకారాలుగా వుండుటలోనే సంతృప్తి పడుచున్నవి. ఒక వైపు వాటి వాస్తవ అధికారాన్ని ప్రజాపరిపాలకులకు అప్పగించుటద్వారా వాటి విరుద్ధ వైఖరులను విడనాడుచూ, కొన్ని ఏకఛత్రాధిపత్యములు చక్రవర్తి పాలనా పద్ధతులను నిలబెట్టుటకు ప్రయత్నించినవి.

కొద్దిపాటి రాజరికములుండుట మంచిదే అన్న తలంపు ఇంకను సర్వజనికమై యున్నది. ఈ మధ్యనే 1983 లో నేపాల్‌లోని నేపాలి కాంగ్రెస్‌ నాయకుడైన క్రిష్ణ ప్రసాద్‌ భట్టరాయ్‌ గారు ‘ఏకఛత్రాధిపత్యము అలజడికి అడ్డుబండ’ అంటే ‘రాజ్యాన్ని ఏకం చేయుటకు రాజే అగత్యం’ అనే భావంలో మాట్లాడాడు. 1987 సంవత్సరంలో ఫ్రెంచ్‌ తిరుగుబాటుకు 200 వార్షికోత్సవము జరుపుకొనుటకై ఫ్రెంచ్‌ తుది ఏర్పాట్లన్నీ చేసుకున్నప్పటికినీ ఓట్లువేసిన వారిలో 17 శాతం మరల రాజుపాలన వస్తే బాగుంటుదని ఇష్టం వ్యక్తపరచారు. ఏకఛత్రాధిపత్యపు గుంపులో ఒక సభ్యుడిట్లన్నాడు: “రాజకీయ పోరాటంతో ఎంతగానో చీలిపోయిన దేశాన్ని రాజు మాత్రమే ఏకం చేయగలడు.”

అదే సమయంలో, టైమ్‌ పత్రిక ఇలా వ్రాసింది: “రాచరికం రాజభక్తిని కోరుచున్నది, బహుశా ఎందుకంటే మన ఈ ప్రజాయుగంలో ఈ ఏకఛత్రాధిపతులే గొప్ప మూర్తులు, ఎక్కడో రహస్యంగా జీవిస్తూ ఇంకా నమ్మకాన్ని రేకెత్తించగల సుదీర్ఘ-కాల జీవులు. దేవుడు మృతుడైతే, రాణి సదాకాల జీవి!” కానీ ఈ విషయాలను ఇంకా వాస్తవదృక్పథముతో చూస్తూ అది ఇట్లన్నది: “(బ్రిటిష్‌) రాణి యొక్క సర్వాధిపత్యము ఆమె అనాధికార మెరుపులోనే వున్నది.”

అసంతృప్తికరమైనవిగా కనుగొనబడినవి

పూర్ణ ఏకఛత్రాధిపత్యములు అసంతృప్తికరమైనవే. అసలు వాటి నైజాన్నిబట్టి అవి అస్థిరమైనవి. ఇప్పుడో ఎప్పుడో ప్రతి పాలకుడు చావవలసిందే, వారసుడు ఆస్థానాన్ని ఆక్రమించవలసిందే, ఆ వారసున్ని, అతని గొప్ప నైతిక విలువలను బట్టి లేక శక్తిసామర్ధ్యాలనుబట్టి ఎన్నుకొనరు. కొడుకు తన తండ్రివంటి ఉత్తముడని ఎవరు హామీ ఇవ్వగలరు? లేదా తండ్రి చెడ్డవాడైతే తన కొడుకు అతని కంటే మంచివాడౌతాడా?

అదియునుగాక, క్రిష్టియానో గ్రోటానెల్లి తెల్పినట్లు “రాజ్యవారసుని ఎంపిక రాజవంశీయులలో అర్హులైన వారిమధ్య పోటీ ఏర్పడునట్లు” తరచూ “నామమాత్రంగానే జరుగుతుంది.” ఆ విధంగా, రాజు మరణాంతరము వచ్చుకాలం సర్వసాధారణంగా అటు అక్షరార్థంగాను ఇటు అలంకారికంగాను సాంఘిక అలజడికి కారణమౌతుంది.

ఒకరి పాలనే గనుక, పూర్ణ ఏకఛత్రాధిపత్యము యొక్క ప్రతిభ దాన్ని పాలించు పాలకుని ప్రతిభమీద ఆధారపడివుంటుంది. అతని పాలనా నిపుణతలు, శక్తిసామర్థ్యములు అతని ప్రభుత్వంలో ప్రతిబింబించును, అలాగే బలహీనతలు, హద్దులు, అజ్ఞానం కూడ బయటపడుతుంది. రాజవంశీయులు సహితము అసంపూర్ణులే. చెడ్డ రాజులు చెడ్డ ప్రభుత్వాలను నెలకొల్పుతారు, మంచి రాజులు బహుశ కొంచెం మంచి వాటిని స్థాపించగలరు. గానీ పరిపూర్ణుడగు రాజు మాత్రమే మానవజాతి కోరునటువంటి ప్రభుత్వాన్ని స్థాపించగలడు.

ప్రజాస్వామ్యములు లేక కొద్దిపాటి ఏకఛత్రాధిపత్యములు కూడ అయోగ్యమైనవే. యునైటెడ్‌ కింగ్‌డంలో లోకమెన్నడు ఎరుగని అతిగొప్ప మహాశక్తివంతమైన సామ్రాజ్యము ఈ శతాబ్దంలోనే చిన్నాభిన్నమగుట ఇంగ్లాండు దేశపు ఒకనాటి రాజులు రాణులు చూశారు.

మరో రకమైన నక్షత్రము

రాజులు, నక్షత్రములవలె ఒకరు మినహా, ఏలుదురు కూలుదురు. యేసు క్రీస్తు తాను “దావీదు వేరు చిగురును, ప్రకాశమానమైన వేకువ చుక్కనైయున్నానని” తనను గూర్చి చెప్పుకుంటున్నాడు. (ప్రకటన 22:16) శారీరకంగా దావీదు రాజుయొక్క సంతానముగా యేసు, దేవుని దైవప్రభుత్వానికి రాజై వుండే అర్హత కలిగి వున్నాడు. “ప్రకాశమానమైన వేకువ చుక్కగా” యేసు, పేతురు అన్నట్లు ఉదయమును కలుగజేయుటకు వచ్చు “పగటి దీపం” కూడ.—2 పేతురు 1:19; సంఖ్యాకాండము 24:17; కీర్తన 89:34-37.

ఈ వాస్తవముల దృష్ట్యా, నడిపింపు కొరకు కూలిపోవు నక్షత్రములైన ఈ రాజులవైపు ఎదురు చూచుట ఎంతటి అవివేకము? బదులుగా మనం “రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును, ఆయనమాత్రమే అమరత్వముగల వాడును” దేవుని నియమిత రాజైన యేసు క్రీస్తునందు మన నిరీక్షణ ఉంచుట జ్ఞానయుక్తం. (1 తిమోతి 6:15, 16) ఇప్పటికే పరలోకమందు ఆయన అదృశ్య రాజుగా ఏలనారంభించి, ఆయన నూతన లోకము అను ఉదయాన్ని ఉదయింప జేస్తాడు. ఆయనే ఒక నక్షత్రము—ఒకరాజు—ఆయనిప్పుడు ఏలుచున్నాడు, ఎన్నటికి కూలడు! (g90 8/22)

[13వ పేజీలోని చిత్రం]

మరణించినపుడు ఒక ఉత్తమ రాజు కూడా తన పనిని అనిశ్చిత చేతులో వదలి వెళ్లును.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి