కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g92 5/8 పేజీలు 26-27
  • నీవు చాలా అపాయకరమైన డ్రైవరువా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నీవు చాలా అపాయకరమైన డ్రైవరువా?
  • తేజరిల్లు!—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సామాజిక తప్పులు
  • భావోద్రేక సమస్యలు
  • బాగా సర్దుకొని పోయే డ్రైవరు
  • అలసట ట్రక్‌ డ్రైవర్లకు కానరాని ఒక ఉచ్చు
    తేజరిల్లు!—1997
  • మోటారు వాహనాల దుర్ఘటనలు మీరు సురక్షితంగా ఉన్నారా?
    తేజరిల్లు!—2002
  • రోడ్డు రౌద్రం—మీరెలా తట్టుకోగలరు?
    తేజరిల్లు!—1997
  • మీరు సురక్షితంగా డ్రైవ్‌ చేస్తారా?
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1992
g92 5/8 పేజీలు 26-27

నీవు చాలా అపాయకరమైన డ్రైవరువా?

జపానులోని మేల్కొలుపు! విలేఖరి ద్వారా వ్రాయబడినది

“మాకు తెలుసు దుర్ఘటనలు జరిగే అవకాశములున్న రకములు ఏవో” అని జపాను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోలీస్‌ సైన్స్‌లో ట్రాఫిక్‌ సేఫ్టీ చీఫ్‌, హరోయుకీ ఓట్సుకా అన్నాడు. “అయినప్పటికీ డ్రైవరు లైసెన్స్‌ ఇవ్వడానికి మేము తిరస్కరించడంలేదు, అయితే ప్రజలు వారి వ్యక్తిగత తప్పులను గుర్తించి వాటిని మార్చుకోవాలని మేము కోరుతున్నాము.”

చాలా అపాయకరమైన డ్రైవర్లు సర్వ సాధారణంగా వారటువంటివారేనని గ్రహించరు. అయితే స్టీరింగ్‌ వెనుకకు వచ్చేటప్పటికి సులభంగా బయటపడే ఆరు వ్యక్తిగత తప్పులను నిపుణులు గుర్తిస్తున్నారు. ప్రతి రకాన్ని నీవు పరిశీలించినప్పుడు నిన్ను నీవు పరీక్షించుకొనుటకు ప్రయత్నించి నీవెంత జాగ్రత్తగల డ్రైవరువో గమనించుము.

సామాజిక తప్పులు

చాలా అపాయకరమైన వారిలో సామాజికముగా సర్దుబాటు చేసుకొనని రకాలవారున్నారు, ఇతరుల విషయంలో సమస్యలు కలిగియున్నవారు. వారెవరనగా:

స్వయంప్రీతిపరుడు ఇతడు తన ఇష్టప్రకారమే ప్రతిదాన్ని చేయాలని పట్టుపట్టేవ్యక్తి. అతడు చక్రం వెనుక కూర్చుని ‘రోడ్డుకు తానే రాజు’నని అనుకుంటాడు. అతడు తనస్వంత సమయాన్ని పాటించే స్వేచ్ఛ ఉన్నదని అనుకుంటాడు, మితిమీరిన చట్టాలని తాననుకున్న వేటినైననూ లక్ష్యపెట్టడు, తాననుకున్నప్పుడల్లా డంబంగా నడిపిస్తాడు. ఇతర డ్రైవర్లతో పాటు తాను రోడ్డులో నడిపించాలనే విషయం మర్చిపోతాడు. మొండిగా, ఇష్టమొచ్చినట్లు నడిపిస్తూ అతడు దుర్ఘటనలకు కారకుడవుతాడు, ఎందుకంటే రోడ్డుమీద నిరంతరం మారుచున్న పరిస్థితులకు అనుకూలంగా మార్చుకొని వాటికి తగినట్లు నడుచుకొనుటకతడు విఫలమౌతాడు.

సహకరించని వ్యక్తి సహకరించని డ్రైవరు ఇతరుల భావనలను లెక్కచేయడు. వారియెడల కొంచెమే దయచూపిస్తాడు లేదా ఇతరులెలా ఆలోచిస్తారో, తలంచుదురో అతడు గ్రహించడు. ప్రజలతో మెలగుట అతనికి కష్టంగనుక అతడు వారికి దూరంగా ఉండాలనుకుంటాడు. రోడ్డుమీద చూపే అమర్యాద, ఇతర డ్రైవర్ల ఎడల అతడు చూపే నిర్దయనుబట్టి అతని ఈ లక్షణం బయటపడుతుంది—ఈ రెండు చాలా అపాయకరమైన లక్షణాలే. కొంతమందికైతే ఇతరులతో సంబంధమేర్పరచుకొనుటకు సంవత్సరాలు పడుతుంది, మరి యౌవనస్థుల వలన జరిగే అధిక దుర్ఘటనలకుగల కారణం ఇదొకటి.

దురుసు వక్తి డ్రైవింగ్‌ ఇన్‌ స్ట్రక్షన్‌ అకార్డింగ్‌టు యాప్టిట్యూడ్‌ అనే పుస్తకం ప్రకారం, దురుసుగా డ్రైవింగ్‌ చేసే వ్యక్తి యొక్క గుర్తు ఏమంటే “తనకు అందరికంటే ముందుండే హక్కున్నదని డ్రైవరు నమ్మితే ఇక ఇతరులకు మార్గమివ్వడానికి తిరస్కరిస్తాడు. ఇతర డ్రైవర్లు లేక కాలినడకన వెళ్లేవారి పొరపాట్లను చూచిచూడనట్లుండడు, దీనిమూలంగా అరుపులు, ఇతర పనులకు ఆటంకము . . . హార్న్‌మోగించడం . . . చివరకు తన హక్కులను కాపాడుకొనుటకు వెనుదీయడు.” అపోహలుకూడా అతనిని రెచ్చగొట్టును. మరి అతడు ముక్కోపియైతే అతని డ్రైవింగ్‌ తరచూ సాధారణ హద్దులను దాటిపోవును.

భావోద్రేక సమస్యలు

ఇకపోతే భావోద్రేక సమస్యలున్నవి. ఇందులో ఇవి వున్నవి:

నిలకడలేని వ్యక్తి విపరీత భావోద్రేకములను బట్టి నిలకడలేని వ్యక్తిని గుర్తించగలం. పిరికితనం, ఉద్రేకం, నిరాశ అనేవి అతనిని వేధిస్తాయి. దిగులుతో డ్రైవింగ్‌ చేస్తే అపాయాలను గుర్తించలేడు, మరియు క్షేమంగా డ్రైవింగ్‌ చేయాలనే దానికి అతని ప్రతిస్పందనలు చాలా నిదానంగా వుండవచ్చును. అయితే ఉద్రేకంతో నడిపిస్తే లెక్కలేకుండా డ్రైవింగ్‌ చేయవచ్చు. ఈ తరుణంలో ఇచ్చే హెచ్చరికలు అతన్ని తిరుగుబాటుకు నడిపించే అవకాశమున్నది. అతడు తన నిరాశ మాత్రమే అసాధారణమని గుర్తించవచ్చును.

మరీ భయస్తుడు ఇటువంటి రకమైన వ్యక్తి తరచూ ప్రతి విషయానికి దిగులుపడి తన ఆలోచనలలో తాను చిక్కుకొనిపోయేవాడు. డ్రైవింగ్‌ చేసేటప్పుడు అతని మనసంతా “డ్రైవింగ్‌కు సంబంధంలేని విషయాలపై నిమగ్నమైయుంటుంది,” అందుచేత అతడు “ప్రాముఖ్యమైన సమాచారాన్ని పోగొట్టుకుంటాడు లేదా తప్పర్థం చేసుకుంటాడు,” అని రిచార్డ్‌. ఇ. మేయర్‌ మరియు జాన్‌. ఆర్‌. ట్రీట్‌ అనే పరిశోధకులు, అపాయకరమైన డ్రైవరు అనే విషయంపై పరిశోధన జరుపుతూ గమనించారు. క్లిష్టంగాని పరిస్థితులలో అనగా ఒక ట్రక్కు ప్రక్కగా వెళ్లినప్పుడు కూడా ఈ భయస్థుడైన డ్రైవరు కంపించిపోతాడు. ఘోరం జరుగుతుందని అనుకుంటాడు.

ఉద్రేకపూరితుడు ఇటువంటి రకం తొందర పడుతూవుంటాడు. వాస్తవాలను రూఢీపరచుకొని ఓ ఖచ్చితమైన నిర్ణయానికి సమయం తీసుకొనడు. రోడ్డుదాటి ట్రాఫిక్‌ లైట్లకొరకు వేచివుండే సమయం, అతనికి సామాన్యుడు అనుకున్న సమయం కంటె అధికమనే అనుకుంటాడు. అందుకే అతడు విసుగుచెంది తొందరగా సహనం కోల్పోతాడు. సరియైన ఆలోచనలేకుండ చేసే పనిమూలంగా అతడు అపాయకరమైన డ్రైవరు అవుతాడు.

నీవు వీటిలో ఏ రకమునకైనా చెందినవాడవా? నిర్దయగల డ్రైవరు నీ సహనాన్ని పరీక్షించుటకు ప్రయత్నిస్తే నీ ప్రతిస్పందన ఏమిటి? బూటు సరిపోతే దానిని ఖచ్చితంగా తొడుక్కో అనే సామెత ప్రకారం చేయుము. నీ భద్రత కొరకు హెచ్చరికలను లక్ష్యపెట్టుము, నీ బలహీనతలను సరిదిద్దుకొనుము. మంచి డ్రైవరువు కావలెనంటే నీవు నీ స్వభావాలను భావోద్రేకాలను అదుపులో పెట్టుకొనవలసిన అవసరమున్నది.

బాగా సర్దుకొని పోయే డ్రైవరు

అయితే ఏది మంచి డ్రైవరుగా చేస్తుంది? మేల్కొలుపు! పత్రిక చేసిన ఇంటర్వ్యూలో జపాను పోలీస్‌లోని పెద్దపెద్ద పరిశోధకులు, డ్రైవరు ఇతరుల యెడల శ్రద్ధ చూపాలి, ఆలోచించి పనిచేయాలి, పరిస్థితినంతటిని అర్థంచేసుకునే శక్తి వుండాలి అని, ఖచ్చితంగా నిర్ణయం చేసుకునే జ్ఞానం, వివేచన, సాత్వికం, ఆశానిగ్రహం, రోడ్డును వుపయోగించే ఇతరులను పరిరక్షించే విధంగా ప్రవర్తించే విషయాలను గూర్చి నొక్కి తెలిపారు.

అదేవిధంగా, ఒసాకా ప్రిఫెక్చురల్‌ యూనివర్సిటీ నివేదిక వివరణప్రకారం మంచి డ్రైవర్లు “స్థిరమైన భావోద్రేకములు కలిగివుంటారు; వారి శరీర ప్రతిస్పందనల కంటె ఎంతో వేగంగా వారి మానసిక వికాసముయొక్క వివేచనా పద్ధతి పనిచేస్తుంది; వారి ఉద్రేకాలను అదుపులో పెట్టుకోగలరని తెలుస్తుంది”. ఈ వర్ణన నీకు సరిపోతుందా?

వేల సంవత్సరాలనుండి బైబిలు ప్రజలకు వారి జ్ఞానవివేచన, బుద్ధికుశలతలనెట్లు అభివృద్ధి చేసికోవలెనో బోధిస్తుంది. (సామెతలు 2:1-6) అసంపూర్ణులైన మానవులెట్లు “కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు” మానుకొని “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” కల్గివుండవలెనో చూపిస్తుంది. అవును నీవు మంచి డ్రైవరువు అగుటకు కూడా బైబిలు సహాయము చేయగలదు.—కొలొస్సయులు 3:8-10; గలతీయులు 5:22, 23. (g90 6/8)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి