కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహోషువ విషయసూచిక

      • పశ్చిమాన మనష్షే గోత్రానికి వచ్చిన భూమి (1-13)

      • యోసేపు వంశస్థులకు అదనంగా భూమి రావడం (14-18)

యెహోషువ 17:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 41:51; 46:20; 48:17, 18
  • +సం 33:54
  • +ద్వితీ 21:17
  • +ఆది 50:23; సం 26:29; 1ది 7:14
  • +యెహో 13:31

యెహోషువ 17:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:11
  • +సం 26:29-32

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2007, పేజీలు 12-13

యెహోషువ 17:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 26:33

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2007, పేజీలు 12-13

యెహోషువ 17:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 27:1, 2; 34:17; యెహో 14:1
  • +సం 27:7, 11
  • +సం 36:6, 12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    11/15/2007, పేజీలు 12-13

యెహోషువ 17:5

అధస్సూచీలు

  • *

    అంటే, తూర్పు వైపు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 13:29

యెహోషువ 17:7

అధస్సూచీలు

  • *

    అక్ష., “కుడి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 20:7; 24:1; 1ది 6:66, 67
  • +యెహో 16:5, 6

యెహోషువ 17:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 16:8

యెహోషువ 17:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 16:9
  • +యెహో 16:8

యెహోషువ 17:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 34:2, 6

యెహోషువ 17:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 9:27
  • +యెహో 12:7, 23
  • +1స 28:7
  • +యెహో 12:7, 21

యెహోషువ 17:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 1:30; 2ది 8:8
  • +నిర్గ 23:33; సం 33:55; ద్వితీ 20:16, 17; యెహో 23:12, 13

యెహోషువ 17:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 33:54
  • +ఆది 48:19; సం 26:34, 37

యెహోషువ 17:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 33:2
  • +ఆది 15:18-20
  • +యెహో 24:33

యెహోషువ 17:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఇనుప రథాలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 6:33
  • +ద్వితీ 20:1; న్యా 1:19

యెహోషువ 17:18

అధస్సూచీలు

  • *

    అక్ష., “ఇనుప రథాలు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 20:7; న్యా 4:5
  • +ద్వితీ 31:6; సామె 21:31

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహో. 17:1ఆది 41:51; 46:20; 48:17, 18
యెహో. 17:1సం 33:54
యెహో. 17:1ద్వితీ 21:17
యెహో. 17:1ఆది 50:23; సం 26:29; 1ది 7:14
యెహో. 17:1యెహో 13:31
యెహో. 17:2న్యా 6:11
యెహో. 17:2సం 26:29-32
యెహో. 17:3సం 26:33
యెహో. 17:4సం 27:1, 2; 34:17; యెహో 14:1
యెహో. 17:4సం 27:7, 11
యెహో. 17:4సం 36:6, 12
యెహో. 17:5యెహో 13:29
యెహో. 17:7యెహో 20:7; 24:1; 1ది 6:66, 67
యెహో. 17:7యెహో 16:5, 6
యెహో. 17:8యెహో 16:8
యెహో. 17:9యెహో 16:9
యెహో. 17:9యెహో 16:8
యెహో. 17:10సం 34:2, 6
యెహో. 17:112రా 9:27
యెహో. 17:11యెహో 12:7, 23
యెహో. 17:111స 28:7
యెహో. 17:11యెహో 12:7, 21
యెహో. 17:13న్యా 1:30; 2ది 8:8
యెహో. 17:13నిర్గ 23:33; సం 33:55; ద్వితీ 20:16, 17; యెహో 23:12, 13
యెహో. 17:14సం 33:54
యెహో. 17:14ఆది 48:19; సం 26:34, 37
యెహో. 17:15నిర్గ 33:2
యెహో. 17:15ఆది 15:18-20
యెహో. 17:15యెహో 24:33
యెహో. 17:16న్యా 6:33
యెహో. 17:16ద్వితీ 20:1; న్యా 1:19
యెహో. 17:18యెహో 20:7; న్యా 4:5
యెహో. 17:18ద్వితీ 31:6; సామె 21:31
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహోషువ 17:1-18

యెహోషువ

17 తర్వాత మనష్షే గోత్రం+ పేరు మీద చీటి+ పడింది. ఎందుకంటే అతను యోసేపు మొదటి సంతానం.+ మనష్షే పెద్ద కుమారుడూ గిలాదుకు తండ్రీ అయిన మాకీరు+ యోధుడు కాబట్టి అతనికి గిలాదు, బాషాను ప్రాంతాలు వచ్చాయి.+ 2 మనష్షే వంశస్థుల్లో మిగతావాళ్లకు వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం అంటే అబీయెజరు కుమారుల,+ హెలెకు కుమారుల, అశ్రీయేలు కుమారుల, షెకెము కుమారుల, హెపెరు కుమారుల, షెమీదా కుమారుల పేర్ల మీద చీట్లు పడ్డాయి. కుటుంబాలవారీగా యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో మగవాళ్లు వీళ్లు.+ 3 మనష్షే కుమారుడు మాకీరు, మాకీరు కుమారుడు గిలాదు, గిలాదు కుమారుడు హెపెరు, హెపెరు కుమారుడు సెలోపెహాదు.+ అయితే, సెలోపెహాదుకు కూతుళ్లే కానీ కుమారులు లేరు. అతని కూతుళ్ల పేర్లు: మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. 4 వాళ్లు యాజకుడైన ఎలియాజరు,+ నూను కుమారుడైన యెహోషువ, ప్రధానుల ఎదుటకు వచ్చి ఇలా అన్నారు: “మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యాన్ని ఇవ్వమని యెహోవాయే మోషేకు ఆజ్ఞాపించాడు.”+ కాబట్టి, యెహోవా ఆదేశించినట్టు, యెహోషువ వాళ్ల తండ్రి సహోదరుల మధ్య వాళ్లకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు.+

5 యొర్దానుకు అవతలి వైపు* ఉన్న గిలాదు, బాషాను ప్రాంతాలే కాకుండా ఇంకో పది వాటాలు మనష్షేకు వచ్చాయి.+ 6 ఎందుకంటే, మనష్షే కూతుళ్లకు అతని కుమారులతో పాటు భూమి వారసత్వంగా వచ్చింది. గిలాదు ప్రాంతం మనష్షే వంశస్థుల్లో మిగతావాళ్ల ఆస్తి అయ్యింది.

7 మనష్షే గోత్రంవాళ్ల సరిహద్దు ఆషేరు నుండి షెకెముకు+ ఎదురుగా ఉన్న మిక్మెతాతు+ వరకు ఉంది, అక్కడి నుండి దక్షిణం* వైపు ఏన్తప్పూయ నివాసుల ప్రాంతం వరకు కొనసాగింది. 8 తప్పూయ ప్రాంతం+ మనష్షే గోత్రానికి వచ్చింది, కానీ మనష్షే సరిహద్దు మీద ఉన్న తప్పూయ నగరం ఎఫ్రాయిము వంశస్థులకు వెళ్లింది. 9 ఆ సరిహద్దు కిందికి దిగి, కానా వాగు దక్షిణం వైపుకు సాగింది. మనష్షే నగరాల మధ్య ఎఫ్రాయిము నగరాలు కూడా ఉన్నాయి.+ మనష్షే గోత్రం సరిహద్దు వాగుకు ఉత్తరం వైపు కొనసాగి, సముద్రం దగ్గర ఆగిపోయింది.+ 10 దక్షిణం వైపు ప్రాంతం ఎఫ్రాయిము వాళ్లది, ఉత్తరం వైపు ప్రాంతం మనష్షే వాళ్లది. సముద్రం మనష్షేవాళ్ల సరిహద్దు.+ మనష్షేవాళ్ల ప్రాంతం ఉత్తరం వైపు ఆషేరువాళ్ల ప్రాంతం వరకు, తూర్పు వైపు ఇశ్శాఖారువాళ్ల ప్రాంతం వరకు వెళ్లింది.

11 ఇశ్శాఖారు, ఆషేరు ప్రాంతాల్లో బేత్షెయాను, ఇబ్లెయాము,+ దోరు,+ ఏన్దోరు,+ తానాకు,+ మెగిద్దో నగరాలు, వాటిలోని నివాసులు, ఆ నగరాల చుట్టుపక్కల పట్టణాలు మనష్షే గోత్రానికి ఇవ్వబడ్డాయి. మూడు కొండ ప్రాంతాలు మనష్షేకు ఇవ్వబడ్డాయి.

12 కానీ మనష్షే వంశస్థులు ఈ నగరాల్ని స్వాధీనం చేసుకోలేకపోయారు; కనానీయులు మొండిగా అక్కడే ఉండిపోయారు. 13 ఇశ్రాయేలీయుల బలం పెరిగినప్పుడు, వాళ్లు కనానీయుల చేత వెట్టిచాకిరి చేయించుకున్నారు,+ కానీ వాళ్లను పూర్తిగా వెళ్లగొట్టలేదు.+

14 యోసేపు వంశస్థులు యెహోషువతో ఇలా అన్నారు: “మాకు కేవలం ఒక్క చీటితో, ఒక్క వాటా భూమి మాత్రమే ఎందుకు ఇచ్చావు?+ మేము చాలామందిమి, ఎందుకంటే ఇప్పటివరకు యెహోవా మమ్మల్ని దీవించాడు.”+ 15 దానికి యెహోషువ వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు చాలామంది ప్రజలైతే, వెళ్లి పెరిజ్జీయుల,+ రెఫాయీయుల దేశంలో+ అడవి నరికి అక్కడ నివసించండి. ఎందుకంటే ఎఫ్రాయిము పర్వత ప్రాంతం+ మీకు చాలా ఇరుకుగా ఉంది.” 16 అప్పుడు యోసేపు వంశస్థులు ఇలా అన్నారు: “మాకు పర్వత ప్రాంతం సరిపోవడం లేదు, లోయలో ఉంటున్న కనానీయులందరి దగ్గర అంటే బేత్షెయాను, దాని చుట్టుపక్కల పట్టణాల్లో, అలాగే యెజ్రెయేలు లోయలో+ ఉంటున్నవాళ్ల దగ్గర చక్రాలకు ఇనుప కత్తులుగల యుద్ధ రథాలు* ఉన్నాయి.”+ 17 కాబట్టి యెహోషువ యోసేపు ఇంటివాళ్లకు, అంటే ఎఫ్రాయిము వాళ్లకు, మనష్షే వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు చాలామంది ఉన్నారు, మీకు చాలా శక్తి ఉంది. మీకు వచ్చేది ఒక్క చీటి మాత్రమే కాదు, 18 పర్వత ప్రాంతం కూడా మీది అవుతుంది.+ అది అడవే అయినా మీరు దాన్ని నరుకుతారు. అది మీ ప్రాంత సరిహద్దు అవుతుంది. కనానీయులు బలవంతులైనా, వాళ్ల దగ్గర చక్రాలకు ఇనుప కత్తులుగల యుద్ధ రథాలు* ఉన్నా మీరు వాళ్లను వెళ్లగొడతారు.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి