కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • ధర్మశాస్త్రం నిషేధించిన లైంగిక సంబంధాలు (1-30)

        • కనానీయుల్ని అనుకరించకూడదు (3)

        • రక్తసంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు (6-18)

        • రుతుస్రావ సమయంలో (19)

        • స్వలింగ సంపర్కం (22)

        • జంతువుతో సంపర్కం (23)

        • ‘పవిత్రులుగా ఉండండి, లేదంటే దేశం మిమ్మల్ని కక్కేస్తుంది’ (24-30)

లేవీయకాండం 18:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 17:7; నిర్గ 6:7

లేవీయకాండం 18:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 23:24; లేవీ 20:23

లేవీయకాండం 18:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:22; ద్వితీ 4:1

లేవీయకాండం 18:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లూకా 10:27, 28; రోమా 10:5; గల 3:12

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    8/15/2009, పేజీ 6

లేవీయకాండం 18:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “మానాన్ని వెల్లడిచేయడానికి.” ఇక్కడ, అలాగే దీని తర్వాత వచ్చే చోట్లలో ఇదే అర్థం.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:17

లేవీయకాండం 18:8

అధస్సూచీలు

  • *

    అక్ష., “అది నీ తండ్రి మానమే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 35:22; 49:4; లేవీ 20:11; ద్వితీ 27:20; 2స 16:21; 1కొ 5:1

లేవీయకాండం 18:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:17; ద్వితీ 27:22; 2స 13:10-12

లేవీయకాండం 18:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “వాళ్లు నీ మానమే.”

లేవీయకాండం 18:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:19

లేవీయకాండం 18:14

అధస్సూచీలు

  • *

    అక్ష., “మానాన్ని వెల్లడిచేయకూడదు.”

  • *

    లేదా “పెద్దమ్మ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:20

లేవీయకాండం 18:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:12

లేవీయకాండం 18:16

అధస్సూచీలు

  • *

    అక్ష., “అది నీ సహోదరుడి మానమే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:21; ద్వితీ 25:5; మార్కు 6:17, 18

లేవీయకాండం 18:17

అధస్సూచీలు

  • *

    లేదా “అవమానకరమైన ప్రవర్తన; కామాతురత.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:14; ద్వితీ 27:23

లేవీయకాండం 18:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:18

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    3/1/1991, పేజీలు 24-25

లేవీయకాండం 18:20

అధస్సూచీలు

  • *

    లేదా “పొరుగువాడి; తోటివాడి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:10; ద్వితీ 22:22; మత్త 5:27, 28; 1కొ 6:9, 10; హెబ్రీ 13:4

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    2/8/1994, పేజీ 30

లేవీయకాండం 18:21

అధస్సూచీలు

  • *

    లేదా “సమర్పించకూడదు; బలి ఇవ్వకూడదు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:2; ద్వితీ 18:10; 1రా 11:7; 2రా 23:10
  • +లేవీ 20:3

లేవీయకాండం 18:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ఆది 19:5; లేవీ 20:13; న్యా 19:22; రోమా 1:26, 27; 1కొ 6:9, 10; యూదా 7

లేవీయకాండం 18:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 22:19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2003, పేజీ 27

లేవీయకాండం 18:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:23; ద్వితీ 18:12

లేవీయకాండం 18:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:1, 40

లేవీయకాండం 18:27

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 20:17, 18; 2రా 16:2, 3; 21:1, 2

లేవీయకాండం 18:29

అధస్సూచీలు

  • *

    లేదా “చంపబడాలి.”

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 18:2ఆది 17:7; నిర్గ 6:7
లేవీ. 18:3నిర్గ 23:24; లేవీ 20:23
లేవీ. 18:4లేవీ 20:22; ద్వితీ 4:1
లేవీ. 18:5లూకా 10:27, 28; రోమా 10:5; గల 3:12
లేవీ. 18:6లేవీ 20:17
లేవీ. 18:8ఆది 35:22; 49:4; లేవీ 20:11; ద్వితీ 27:20; 2స 16:21; 1కొ 5:1
లేవీ. 18:9లేవీ 20:17; ద్వితీ 27:22; 2స 13:10-12
లేవీ. 18:12లేవీ 20:19
లేవీ. 18:14లేవీ 20:20
లేవీ. 18:15లేవీ 20:12
లేవీ. 18:16లేవీ 20:21; ద్వితీ 25:5; మార్కు 6:17, 18
లేవీ. 18:17లేవీ 20:14; ద్వితీ 27:23
లేవీ. 18:19లేవీ 20:18
లేవీ. 18:20లేవీ 20:10; ద్వితీ 22:22; మత్త 5:27, 28; 1కొ 6:9, 10; హెబ్రీ 13:4
లేవీ. 18:21లేవీ 20:2; ద్వితీ 18:10; 1రా 11:7; 2రా 23:10
లేవీ. 18:21లేవీ 20:3
లేవీ. 18:22ఆది 19:5; లేవీ 20:13; న్యా 19:22; రోమా 1:26, 27; 1కొ 6:9, 10; యూదా 7
లేవీ. 18:23నిర్గ 22:19
లేవీ. 18:24లేవీ 20:23; ద్వితీ 18:12
లేవీ. 18:26ద్వితీ 4:1, 40
లేవీ. 18:27ద్వితీ 20:17, 18; 2రా 16:2, 3; 21:1, 2
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 18:1-30

లేవీయకాండం

18 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 2 “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను మీ దేవుడైన యెహోవాను.+ 3 మీరు ఇంతకుముందు నివసించిన ఐగుప్తు దేశంలోని ప్రజల్లా గానీ, నేను మిమ్మల్ని తీసుకెళ్లబోతున్న కనాను దేశంలోని ప్రజల్లా గానీ మీరు ప్రవర్తించకూడదు.+ మీరు వాళ్ల ఆచారాల్ని పాటించకూడదు. 4 మీరు నా న్యాయనిర్ణయాల్ని, నా శాసనాల్ని పాటించాలి, వాటి ప్రకారం జీవించాలి.+ నేను మీ దేవుడైన యెహోవాను. 5 మీరు నా శాసనాల్ని, నా న్యాయనిర్ణయాల్ని పాటించాలి; అలా పాటించేవాళ్లు వాటివల్ల జీవిస్తారు.+ నేను యెహోవాను.

6 “ ‘మీలో ఎవ్వరూ తన రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి* వాళ్ల దగ్గరికి వెళ్లకూడదు.+ నేను యెహోవాను. 7 నువ్వు నీ తండ్రితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు; నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి, ఆమెతో నువ్వు లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

8 “ ‘నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ అలాచేస్తే నీ తండ్రిని అవమానించినట్టే.*

9 “ ‘నీ సహోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రి కూతురైనా, నీ తల్లి కూతురైనా, ఆమె నీ ఇంట్లో పుట్టిందైనా, కాకపోయినా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+

10 “ ‘నీ కుమారుని కూతురితో గానీ, నీ కూతురి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలాచేస్తే, నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే.*

11 “ ‘నీ తండ్రి భార్య కూతురితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆమె నీ తండ్రి సంతానం, నీ సహోదరి.

12 “ ‘నీ తండ్రి సహోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రికి రక్తసంబంధి.+

13 “ ‘నీ తల్లి సహోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆమె నీ తల్లికి రక్తసంబంధి.

14 “ ‘నువ్వు నీ తండ్రి సహోదరుడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని నీ తండ్రి సహోదరుణ్ణి అవమానించకూడదు.* ఆమె నీ పిన్ని.*+

15 “ ‘నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ ఆమె నీ కుమారుని భార్య, నువ్వు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.

16 “ ‘నీ సహోదరుడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ అలాచేస్తే, నువ్వు నీ సహోదరుణ్ణి అవమానించినట్టే.*

17 “ ‘నువ్వు ఒక స్త్రీతో, అలాగే ఆమె కూతురితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ నువ్వు ఆమె కుమారుని కూతురితో గానీ, ఆమె కూతురి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. వాళ్లు ఆమె రక్తసంబంధులు; అది నీచమైన పని.*

18 “ ‘నువ్వు నీ భార్య బ్రతికి ఉండగానే, ఆమె సహోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఆమెను పెళ్లి చేసుకోకూడదు.

19 “ ‘ఒక స్త్రీ రుతుస్రావ అశుద్ధత సమయంలో ఉన్నప్పుడు, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి నువ్వు ఆమె దగ్గరికి వెళ్లకూడదు.+

20 “ ‘నీ సాటిమనిషి* భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, అలాచేస్తే నువ్వు అపవిత్రుడివి అవుతావు.+

21 “ ‘నీ సంతానంలో ఎవ్వర్నీ మోలెకుకు అర్పించకూడదు.*+ అలా చేసి నువ్వు నీ దేవుని పేరును మలినపర్చకూడదు.+ నేను యెహోవాను.

22 “ ‘స్త్రీతో పడుకున్నట్టు పురుషునితో పడుకోకూడదు.+ అది అసహ్యకరమైన పని.

23 “ ‘ఒక పురుషుడు జంతువుతో సంపర్కం చేయకూడదు, అలాచేస్తే అతను అపవిత్రుడౌతాడు; లేదా ఒక స్త్రీ ఒక జంతువుతో సంపర్కం చేయడానికి దాని దగ్గరికి వెళ్లకూడదు.+ అది సహజ విరుద్ధమైనది.

24 “ ‘వీటిలో దేనివల్లా మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకోకండి. ఎందుకంటే నేను ఏ జనాలనైతే మీ ముందు నుండి వెళ్లగొడుతున్నానో వాళ్లు ఈ పనులన్నీ చేసి తమను తాము అపవిత్రపర్చుకున్నారు.+ 25 దానివల్ల ఆ దేశం అపవిత్రమైపోయింది, ఆ దేశ ప్రజలు చేసిన తప్పుకు నేను వాళ్లను శిక్షిస్తాను, ఆ దేశం దాని నివాసుల్ని బయటికి కక్కేస్తుంది. 26 మీరైతే నా శాసనాల్ని, నా న్యాయనిర్ణయాల్ని పాటించాలి;+ మీరు గానీ, మీ మధ్య నివసిస్తున్న పరదేశి గానీ ఆ అసహ్యకరమైన పనుల్లో దేన్నీ చేయకూడదు. 27 ఎందుకంటే, మీకన్నా ముందు ఆ దేశంలో జీవించిన ప్రజలు ఈ అసహ్యకరమైన పనులన్నీ చేశారు,+ వాటివల్ల ఇప్పుడు ఆ దేశం అపవిత్రంగా ఉంది. 28 మీరు అలాంటి పనులతో ఆ దేశాన్ని అపవిత్రం చేయకుండా ఉంటే ఆ దేశం మీకన్నా ముందున్న ప్రజల్ని కక్కేయబోతున్నట్టు మిమ్మల్ని కక్కేయాల్సిన పరిస్థితి రాదు. 29 ఒకవేళ ఎవరైనా ఆ అసహ్యకరమైన పనుల్లో దేన్నైనా చేస్తే, అలా చేసే వాళ్లంతా తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.* 30 మీరు నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, మీకన్నా ముందున్న ప్రజలు పాటించిన అసహ్యకరమైన ఆచారాల్లో దేన్నీ మీరు పాటించకూడదు. అప్పుడు మీరు వాటివల్ల అపవిత్రులు కాకుండా ఉంటారు. నేను మీ దేవుడైన యెహోవాను.’ ”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి