కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 20
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • ఇశ్రాయేలు తిరుగుబాటు చరిత్ర (1-32)

      • ఇశ్రాయేలు పునరుద్ధరణ వాగ్దానం (33-44)

      • దక్షిణ భాగానికి వ్యతిరేకంగా ప్రవచనం (45-49)

యెహెజ్కేలు 20:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:12, 15; యెహె 14:3

యెహెజ్కేలు 20:4

అధస్సూచీలు

  • *

    లేదా “వాళ్లమీద తీర్పు ప్రకటించడానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 16:51; 22:2; లూకా 11:47

యెహెజ్కేలు 20:5

అధస్సూచీలు

  • *

    అక్ష., “విత్తనంతో.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 7:6
  • +నిర్గ 4:31; 6:7, 8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2012, పేజీలు 24-25

యెహెజ్కేలు 20:6

అధస్సూచీలు

  • *

    లేదా “వేగుచూసిన.”

  • *

    లేదా “ఆభరణంలా ఉండేది.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 3:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2012, పేజీలు 24-25

యెహెజ్కేలు 20:7

అధస్సూచీలు

  • *

    ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం పేడకు సంబంధించినది. తిరస్కార భావాన్ని వ్యక్తం చేసేందుకు దాన్ని వాడతారు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:3; ద్వితీ 29:16, 17; యెహో 24:14
  • +లేవీ 20:7

యెహెజ్కేలు 20:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:4

యెహెజ్కేలు 20:9

అధస్సూచీలు

  • *

    అంటే, ఇశ్రాయేలీయుల్ని.

  • *

    అంటే, ఇశ్రాయేలీయులకు.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:13-16; ద్వితీ 9:27, 28; 1స 12:22
  • +నిర్గ 32:11, 12; యెహో 2:9, 10; 9:3, 9; 1స 4:7, 8

యెహెజ్కేలు 20:10

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 13:17, 18; 15:22

యెహెజ్కేలు 20:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:8
  • +ద్వితీ 8:3; 30:16

యెహెజ్కేలు 20:12

అధస్సూచీలు

  • *

    లేదా “సబ్బాతు రోజుల్ని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 31:13; 35:2
  • +నిర్గ 20:8-10; లేవీ 23:3, 24; 25:4, 11

యెహెజ్కేలు 20:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:8; సం 14:22, 23
  • +సం 14:11, 12

యెహెజ్కేలు 20:14

అధస్సూచీలు

  • *

    అంటే, ఇశ్రాయేలీయుల్ని.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 7:9; యెహె 36:22

యెహెజ్కేలు 20:15

అధస్సూచీలు

  • *

    లేదా “ఆభరణం లాంటి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 13:26, 27
  • +సం 14:30; కీర్త 95:11; 106:26, 27

యెహెజ్కేలు 20:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 32:1, 4; సం 25:1, 2; అపొ 7:42

యెహెజ్కేలు 20:17

అధస్సూచీలు

  • *

    అక్ష., “నా కన్ను.”

యెహెజ్కేలు 20:18

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 14:33
  • +కీర్త 78:8

యెహెజ్కేలు 20:19

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 4:1

యెహెజ్కేలు 20:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 17:22
  • +నిర్గ 31:13

యెహెజ్కేలు 20:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సం 25:1; ద్వితీ 9:23
  • +యెష 63:10

యెహెజ్కేలు 20:22

అధస్సూచీలు

  • *

    అంటే, ఇశ్రాయేలీయుల్ని.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 78:38
  • +కీర్త 25:11; 79:9; యిర్మీ 14:7; దాని 9:19

యెహెజ్కేలు 20:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:33; కీర్త 106:26, 27

యెహెజ్కేలు 20:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:15, 16
  • +యిర్మీ 2:7

యెహెజ్కేలు 20:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 81:12

యెహెజ్కేలు 20:26

అధస్సూచీలు

  • *

    అక్ష., “అగ్ని గుండా దాటించడం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 18:21; యిర్మీ 7:31

యెహెజ్కేలు 20:28

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతపర్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 23:5
  • +ద్వితీ 12:2

యెహెజ్కేలు 20:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 16:24, 25

యెహెజ్కేలు 20:30

అధస్సూచీలు

  • *

    లేదా “విగ్రహాలతో ఆధ్యాత్మిక వ్యభిచారం చేయడానికి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 2:19; 2ది 21:13; యిర్మీ 13:26, 27

యెహెజ్కేలు 20:31

అధస్సూచీలు

  • *

    అక్ష., “అగ్ని గుండా దాటిస్తూ.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 18:10, 12; కీర్త 106:36-38; యిర్మీ 7:31
  • +యెష 1:15
  • +జెక 7:13

యెహెజ్కేలు 20:32

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 44:17

యెహెజ్కేలు 20:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 21:5; యెహె 8:18

యెహెజ్కేలు 20:34

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 27:13; యెహె 34:16

యెహెజ్కేలు 20:35

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:9

యెహెజ్కేలు 20:37

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 27:32; యెహె 34:17

యెహెజ్కేలు 20:38

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 34:20, 21
  • +యెహె 13:9

యెహెజ్కేలు 20:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +న్యా 10:14; కీర్త 81:12
  • +యెష 1:13; యెహె 23:39

యెహెజ్కేలు 20:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 2:2, 3; 66:20
  • +యెష 56:7; జెక 8:22
  • +మలా 3:4

యెహెజ్కేలు 20:41

అధస్సూచీలు

  • *

    లేదా “శాంతపర్చే.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 11:11; యిర్మీ 23:3
  • +యెష 5:16; యెహె 38:23

యెహెజ్కేలు 20:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 11:17
  • +యెహె 36:23

యెహెజ్కేలు 20:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:40; యెహె 6:9; 16:61
  • +యిర్మీ 31:18

యెహెజ్కేలు 20:44

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 79:9; యెహె 36:22, 23

యెహెజ్కేలు 20:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 32:22; యిర్మీ 21:14
  • +యెష 66:24

యెహెజ్కేలు 20:48

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 7:20; విలా 2:17

యెహెజ్కేలు 20:49

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2007, పేజీ 14

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 20:3యెష 1:12, 15; యెహె 14:3
యెహె. 20:4యెహె 16:51; 22:2; లూకా 11:47
యెహె. 20:5ద్వితీ 7:6
యెహె. 20:5నిర్గ 4:31; 6:7, 8
యెహె. 20:6నిర్గ 3:8
యెహె. 20:7లేవీ 18:3; ద్వితీ 29:16, 17; యెహో 24:14
యెహె. 20:7లేవీ 20:7
యెహె. 20:8నిర్గ 32:4
యెహె. 20:9సం 14:13-16; ద్వితీ 9:27, 28; 1స 12:22
యెహె. 20:9నిర్గ 32:11, 12; యెహో 2:9, 10; 9:3, 9; 1స 4:7, 8
యెహె. 20:10నిర్గ 13:17, 18; 15:22
యెహె. 20:11ద్వితీ 4:8
యెహె. 20:11ద్వితీ 8:3; 30:16
యెహె. 20:12నిర్గ 31:13; 35:2
యెహె. 20:12నిర్గ 20:8-10; లేవీ 23:3, 24; 25:4, 11
యెహె. 20:13నిర్గ 32:8; సం 14:22, 23
యెహె. 20:13సం 14:11, 12
యెహె. 20:14యెహో 7:9; యెహె 36:22
యెహె. 20:15సం 13:26, 27
యెహె. 20:15సం 14:30; కీర్త 95:11; 106:26, 27
యెహె. 20:16నిర్గ 32:1, 4; సం 25:1, 2; అపొ 7:42
యెహె. 20:18సం 14:33
యెహె. 20:18కీర్త 78:8
యెహె. 20:19ద్వితీ 4:1
యెహె. 20:20యిర్మీ 17:22
యెహె. 20:20నిర్గ 31:13
యెహె. 20:21సం 25:1; ద్వితీ 9:23
యెహె. 20:21యెష 63:10
యెహె. 20:22కీర్త 78:38
యెహె. 20:22కీర్త 25:11; 79:9; యిర్మీ 14:7; దాని 9:19
యెహె. 20:23లేవీ 26:33; కీర్త 106:26, 27
యెహె. 20:24లేవీ 26:15, 16
యెహె. 20:24యిర్మీ 2:7
యెహె. 20:25కీర్త 81:12
యెహె. 20:26లేవీ 18:21; యిర్మీ 7:31
యెహె. 20:28యెహో 23:5
యెహె. 20:28ద్వితీ 12:2
యెహె. 20:29యెహె 16:24, 25
యెహె. 20:30న్యా 2:19; 2ది 21:13; యిర్మీ 13:26, 27
యెహె. 20:31ద్వితీ 18:10, 12; కీర్త 106:36-38; యిర్మీ 7:31
యెహె. 20:31యెష 1:15
యెహె. 20:31జెక 7:13
యెహె. 20:32యిర్మీ 44:17
యెహె. 20:33యిర్మీ 21:5; యెహె 8:18
యెహె. 20:34యెష 27:13; యెహె 34:16
యెహె. 20:35యిర్మీ 2:9
యెహె. 20:37లేవీ 27:32; యెహె 34:17
యెహె. 20:38యెహె 34:20, 21
యెహె. 20:38యెహె 13:9
యెహె. 20:39న్యా 10:14; కీర్త 81:12
యెహె. 20:39యెష 1:13; యెహె 23:39
యెహె. 20:40యెష 2:2, 3; 66:20
యెహె. 20:40యెష 56:7; జెక 8:22
యెహె. 20:40మలా 3:4
యెహె. 20:41యెష 11:11; యిర్మీ 23:3
యెహె. 20:41యెష 5:16; యెహె 38:23
యెహె. 20:42యెహె 11:17
యెహె. 20:42యెహె 36:23
యెహె. 20:43లేవీ 26:40; యెహె 6:9; 16:61
యెహె. 20:43యిర్మీ 31:18
యెహె. 20:44కీర్త 79:9; యెహె 36:22, 23
యెహె. 20:47ద్వితీ 32:22; యిర్మీ 21:14
యెహె. 20:47యెష 66:24
యెహె. 20:482ది 7:20; విలా 2:17
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
  • 48
  • 49
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 20:1-49

యెహెజ్కేలు

20 ఏడో సంవత్సరం, ఐదో నెల, పదో రోజున కొంతమంది ఇశ్రాయేలు పెద్దలు యెహోవా దగ్గర విచారణ చేయడానికి నా దగ్గరికి వచ్చి నా ముందు కూర్చున్నారు. 2 అప్పుడు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 3 “మానవ కుమారుడా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీరు నా దగ్గరికి విచారణ చేయడానికి వచ్చారా? ‘నా జీవం తోడు, నేను మీకు జవాబు ఇవ్వను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.” ’

4 “వాళ్లకు తీర్పు తీర్చడానికి* నువ్వు సిద్ధంగా ఉన్నావా? మానవ కుమారుడా, వాళ్లకు తీర్పు తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వాళ్ల పూర్వీకులు చేసిన హేయమైన పనుల్ని వాళ్లకు తెలియజేయి.+ 5 వాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలును ఎంచుకున్న రోజున,+ యాకోబు ఇంటివాళ్ల సంతానంతో* ఒక ప్రమాణం చేశాను; ఐగుప్తు దేశంలో నన్ను నేను వాళ్లకు వెల్లడిచేసుకున్నాను.+ అవును, ‘నేను మీ దేవుడైన యెహోవాను’ అంటూ వాళ్లతో ప్రమాణం చేశాను. 6 వాళ్లను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చి, నేను వాళ్లకోసం వెదికిపెట్టిన* దేశానికి, అంటే పాలుతేనెలు ప్రవహించే దేశానికి వాళ్లను తీసుకొస్తానని ఆ రోజు వాళ్లకు ప్రమాణం చేశాను.+ అది దేశాలన్నిట్లో అతి సుందరమైన దేశం.* 7 అప్పుడు నేను వాళ్లకు ఇలా చెప్పాను, ‘మీలో ప్రతి ఒక్కరూ మీ కళ్ల ముందున్న హేయమైనవాటిని తీసిపారేయండి; ఐగుప్తు అసహ్యమైన విగ్రహాలతో* మిమ్మల్ని అపవిత్రపర్చుకోకండి.+ నేను మీ దేవుడైన యెహోవాను.’+

8 “ ‘ “కానీ వాళ్లు నాకు ఎదురుతిరిగారు, నా మాట వినడానికి ఇష్టపడలేదు. తమ కళ్ల ముందున్న అసహ్యమైనవాటిని తీసిపారేయలేదు, ఐగుప్తు హేయమైన విగ్రహాల్ని విడిచిపెట్టలేదు.+ కాబట్టి ఐగుప్తు దేశంలో వాళ్లమీద నా ఆగ్రహాన్ని కుమ్మరిస్తానని, నా కోపాన్ని పూర్తిగా వెళ్లగక్కుతానని నేను చెప్పాను. 9 అయితే వాళ్లు ఎవరి మధ్య నివసిస్తున్నారో ఆ జనాల ముందు నా పేరు అపవిత్రం కాకూడదని నా పేరు కోసం చర్య తీసుకున్నాను.+ ఎందుకంటే నేను వాళ్లను* ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఆ జనాల ముందు నన్ను నేను వాళ్లకు* వెల్లడిచేసుకున్నాను.+ 10 కాబట్టి నేను వాళ్లను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చి ఎడారిలోకి నడిపించాను.+

11 “ ‘ “తర్వాత నేను వాళ్లకు నా శాసనాల్ని ఇచ్చాను, నా న్యాయనిర్ణయాల్ని తెలియజేశాను;+ ఎందుకంటే వాటిని పాటించే వ్యక్తి వాటివల్ల బ్రతుకుతాడు.+ 12 అంతేకాదు, యెహోవానైన నేనే వాళ్లను పవిత్రపరుస్తున్నానని వాళ్లు తెలుసుకునేలా నాకూ వాళ్లకూ మధ్య సూచనగా విశ్రాంతి రోజుల్ని*+ కూడా వాళ్లకు ఇచ్చాను.+

13 “ ‘ “అయితే ఇశ్రాయేలు ఇంటివాళ్లు ఎడారిలో నాకు ఎదురుతిరిగారు.+ వాళ్లు నా శాసనాల ప్రకారం నడుచుకోలేదు, నా న్యాయనిర్ణయాల్ని తిరస్కరించారు; నిజానికి వాటిని పాటించే వ్యక్తి వాటివల్ల బ్రతుకుతాడు. వాళ్లు నా విశ్రాంతి రోజుల్ని ఘోరంగా అపవిత్రపర్చారు. కాబట్టి ఎడారిలో వాళ్లమీద నా ఉగ్రతను కుమ్మరించి వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేస్తానని అన్నాను.+ 14 కానీ, నేను ఎవరి కళ్లముందు వాళ్లను* బయటికి తీసుకొచ్చానో ఆ జనాల ముందు నా పేరు అపవిత్రం కాకూడదని నా పేరు కోసం చర్య తీసుకున్నాను.+ 15 అంతేకాదు, నేను వాళ్లకు ఇచ్చిన దేశానికి, అంటే దేశాలన్నిట్లో అతి సుందరమైన* దేశానికి, పాలుతేనెలు ప్రవహించే దేశానికి+ వాళ్లను తీసుకెళ్లనని ఎడారిలో వాళ్లతో ప్రమాణం చేశాను.+ 16 ఎందుకంటే వాళ్లు నా న్యాయనిర్ణయాల్ని తిరస్కరించారు, నా శాసనాల ప్రకారం నడుచుకోలేదు, నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు; ఎందుకంటే వాళ్ల మనసు తమ అసహ్యమైన విగ్రహాల పైనే ఉంది.+

17 “ ‘ “అయితే నేను* వాళ్లమీద జాలిపడ్డాను, అందుకే వాళ్లను నాశనం చేయలేదు; ఎడారిలో వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేయలేదు. 18 ఎడారిలో నేను వాళ్ల పిల్లలతో+ ఇలా చెప్పాను, ‘మీ పూర్వీకుల కట్టుబాట్ల ప్రకారం నడుచుకోకండి,+ వాళ్ల న్యాయనిర్ణయాల్ని పాటించకండి, వాళ్ల అసహ్యమైన విగ్రహాలతో మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకోకండి. 19 నేను మీ దేవుడైన యెహోవాను. నా శాసనాల్ని అనుసరించండి, నా న్యాయనిర్ణయాల్ని పాటిస్తూ వాటి ప్రకారం జీవించండి.+ 20 నా విశ్రాంతి రోజుల్ని పవిత్రంగా ఎంచండి,+ నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకునేలా అవి నాకూ మీకూ మధ్య సూచనగా ఉంటాయి.’+

21 “ ‘ “కానీ వాళ్ల పిల్లలు కూడా నాకు ఎదురుతిరగడం మొదలుపెట్టారు.+ వాళ్లు నా శాసనాల ప్రకారం నడుచుకోలేదు, నా న్యాయనిర్ణయాల్ని పాటించలేదు, వాటి ప్రకారం జీవించలేదు; నిజానికి వాటిని పాటించే వ్యక్తి వాటివల్ల బ్రతుకుతాడు. వాళ్లు నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు. కాబట్టి ఎడారిలో వాళ్లమీద నా ఆగ్రహాన్ని కుమ్మరిస్తానని, నా కోపాన్ని పూర్తిగా వెళ్లగక్కుతానని చెప్పాను.+ 22 కానీ నేను అలా చేయలేదు;+ నేను ఎవరి కళ్లముందు వాళ్లను* బయటికి తీసుకొచ్చానో ఆ జనాల ముందు నా పేరు అపవిత్రం కాకూడదని నా పేరు కోసం చర్య తీసుకున్నాను.+ 23 అంతేకాదు, నేను వాళ్లను జనాల మధ్యకు చెదరగొడతానని, దేశాల మధ్యకు వెళ్లగొడతానని ఎడారిలో వాళ్లతో ప్రమాణం చేశాను.+ 24 ఎందుకంటే వాళ్లు నా న్యాయనిర్ణయాల్ని పాటించలేదు, నా శాసనాల్ని తిరస్కరించారు,+ నా విశ్రాంతి రోజుల్ని అపవిత్రపర్చారు, తమ పూర్వీకుల అసహ్యమైన విగ్రహాల్ని అనుసరించారు.+ 25 అంతేకాదు, నేను వాళ్లను మంచివికాని కట్టుబాట్లను, జీవాన్ని ఇవ్వలేని న్యాయనిర్ణయాల్ని అనుసరించనిచ్చాను.+ 26 తమ బలుల ద్వారా, అంటే తమ మొదటి సంతానాన్ని అగ్నిలో వేసి కాల్చడం* ద్వారా+ వాళ్లను అపవిత్రం కానిచ్చాను; నేను యెహోవానని వాళ్లు తెలుసుకునేలా వాళ్లను నాశనం చేయడానికి అలా జరగనిచ్చాను.” ’

27 “కాబట్టి మానవ కుమారుడా, ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీ పూర్వీకులు కూడా ఇదే విధంగా, నాపట్ల నమ్మకద్రోహంగా ప్రవర్తించడం ద్వారా నన్ను దూషించారు. 28 నేను వాళ్లకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి వాళ్లను తీసుకొచ్చాను.+ అయితే వాళ్లు ప్రతీ ఎత్తైన కొండను, ప్రతీ పచ్చని చెట్టును+ చూసి బలులు, అర్పణలు అర్పించడం మొదలుపెట్టి నాకు కోపం తెప్పించారు. వాళ్లు అక్కడ తమ బలుల ఇంపైన* సువాసనల్ని, పానీయార్పణల్ని అర్పించారు. 29 కాబట్టి నేను వాళ్లను ఇలా అడిగాను: ‘మీరు ఈ ఉన్నత స్థలానికి ఎందుకు వెళ్తున్నారు? (అది ఈ రోజు వరకు ఉన్నత స్థలం అని పిలవబడుతోంది.)’ ” ’+

30 “ఇప్పుడు ఇశ్రాయేలు ఇంటివాళ్లతో ఇలా చెప్పు, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మీ పూర్వీకుల అసహ్యమైన విగ్రహాల్ని పూజించడానికి* వాటి వెంట వెళ్తూ వాళ్లలాగే+ మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకుంటున్నారా? 31 మీ అసహ్యమైన విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ, మీ పిల్లల్ని అగ్నిలో వేసి కాలుస్తూ,*+ మీరు ఈ రోజు వరకు మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకుంటున్నారా? ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు ఇలా చేస్తున్నా, మీరు విచారణ చేసినప్పుడు నేను జవాబివ్వాలా?” ’+

“ ‘నా జీవం తోడు, నేను మీకు జవాబివ్వను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.+ 32 ‘మీరు మీ మనసుల్లో, “మనం చెక్కలనూ రాళ్లనూ పూజించే జనాల్లా, వేరే దేశాల ప్రజల్లా తయారౌదాం” అని అనుకుంటున్నారు కదా?+ అది ఎప్పటికీ జరగదు.’ ”

33 “ ‘నా జీవం తోడు, నేను బలమైన చేతితో, చాచిన బాహువుతో, కోపాన్ని కుమ్మరిస్తూ+ మీ మీద రాజుగా పరిపాలిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 34 ‘నేను మిమ్మల్ని ఆయా జనాల మధ్య నుండి బయటికి తీసుకొస్తాను, మీరు చెదిరిపోయిన దేశాల మధ్య నుండి మిమ్మల్ని బలమైన చేతితో, చాచిన బాహువుతో, కోపాన్ని కుమ్మరిస్తూ సమకూరుస్తాను.+ 35 మిమ్మల్ని జనాల ఎడారిలోకి తీసుకొచ్చి అక్కడ ముఖాముఖిగా మీతో వాదిస్తాను.+

36 “ ‘నేను ఐగుప్తు దేశ ఎడారిలో మీ పూర్వీకులతో వాదించినట్టే మీతో కూడా వాదిస్తాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు. 37 ‘మిమ్మల్ని కాపరి కర్ర కింద నుండి వెళ్లేలా చేసి,+ మిమ్మల్ని ఒప్పందం కిందికి తెస్తాను. 38 అయితే మీలో నుండి తిరుగుబాటుదారుల్ని, నాకు వ్యతిరేకంగా పాపం చేసేవాళ్లను తీసేస్తాను.+ తాము పరదేశులుగా నివసిస్తున్న దేశం నుండి వాళ్లను బయటికి రప్పిస్తాను, కానీ వాళ్లు ఇశ్రాయేలు దేశంలో అడుగుపెట్టరు;+ అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.’

39 “ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘మీలో ప్రతి ఒక్కరూ వెళ్లి, మీ అసహ్యమైన విగ్రహాల్ని పూజించుకోండి.+ కానీ ఆ తర్వాత మీరు నా మాట వినకపోతే, ఇకమీదట మీ బలుల ద్వారా, మీ అసహ్యమైన విగ్రహాల ద్వారా మీరు నా పవిత్రమైన పేరును అపవిత్రపర్చలేరు.’+

40 “ ‘ఎందుకంటే, నా పవిత్ర పర్వతం మీద, అంటే ఇశ్రాయేలులోని ఒక ఎత్తైన పర్వతం+ మీద ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ దేశంలో నన్ను సేవిస్తారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు. ‘అక్కడ నేను వాళ్లను బట్టి సంతోషిస్తాను; మీ కానుకల్ని, మీ అర్పణల్లోని ప్రథమఫలాల్ని, మీ పవిత్రమైన వాటన్నిటినీ స్వీకరిస్తాను.+ 41 నేను మిమ్మల్ని ఆయా జనాల మధ్య నుండి బయటికి తీసుకొచ్చి, మీరు చెదిరిపోయిన దేశాల మధ్య నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు+ మీ బలుల ఇంపైన* సువాసనను బట్టి నేను మీ విషయంలో సంతోషిస్తాను; జనాల కళ్లముందు, మీ మధ్య నన్ను నేను పవిత్రపర్చుకుంటాను.’+

42 “ ‘నేను మిమ్మల్ని ఇశ్రాయేలు దేశంలోకి అంటే మీ పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలోకి తీసుకొచ్చినప్పుడు+ నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.+ 43 అక్కడ మీరు మీ ప్రవర్తనను, మిమ్మల్ని అపవిత్రపర్చిన మీ పనుల్ని గుర్తుచేసుకుంటారు,+ మీరు చేసిన చెడ్డ పనులన్నిటిని బట్టి మీ మీద మీకే అసహ్యం వేస్తుంది.+ 44 ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీ దుష్ట ప్రవర్తన బట్టో, మీ తప్పుడు పనుల బట్టో కాకుండా, నా పేరు కోసం నేను చర్య తీసుకున్నప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”+

45 తర్వాత యెహోవా వాక్యం మళ్లీ నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 46 “మానవ కుమారుడా, దక్షిణ భాగం వైపు తిరిగి, దక్షిణం వైపు ప్రకటించు; దక్షిణం వైపున్న అడవి ప్రాంతానికి ప్రవచించు. 47 దక్షిణం వైపున్న అడవితో ఇలా అను, ‘యెహోవా చెప్పేది విను. సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేను నీలో అగ్ని రాజేస్తున్నాను,+ అది నీలో ఉన్న ప్రతీ పచ్చని చెట్టును, ఎండిన చెట్టును దహించేస్తుంది. ఆ మంటలు ఆరిపోవు,+ దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపు వరకు ప్రతి ఒక్కరికీ ఆ సెగ తగులుతుంది. 48 యెహోవానైన నేనే దానికి ఆరిపోని నిప్పు అంటించానని మనుషులందరూ తెలుసుకుంటారు.” ’ ”+

49 అప్పుడు నేను ఇలా అన్నాను: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా! వాళ్లు నా గురించి, ‘ఇతను పొడుపు కథలు చెప్తున్నాడు’ అని మాట్లాడుకుంటున్నారు.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి