కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహెజ్కేలు 19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యెహెజ్కేలు విషయసూచిక

      • ఇశ్రాయేలు ప్రధానుల గురించి శోకగీతం (1-14)

యెహెజ్కేలు 19:3

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 36:1

యెహెజ్కేలు 19:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 23:31-34; 2ది 36:4; యిర్మీ 22:11, 12

యెహెజ్కేలు 19:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 22:17

యెహెజ్కేలు 19:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 28:15

యెహెజ్కేలు 19:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “నీ రక్తంలో ద్రాక్షవల్లిలా.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 80:8; యెష 5:7

యెహెజ్కేలు 19:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 5:5; యెహె 15:6
  • +2రా 23:34; 24:6; 25:5-7
  • +ద్వితీ 32:22; యెహె 15:4

యెహెజ్కేలు 19:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:48; యిర్మీ 17:5, 6; 52:27

యెహెజ్కేలు 19:14

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహె 17:16, 18

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యెహె. 19:32ది 36:1
యెహె. 19:42రా 23:31-34; 2ది 36:4; యిర్మీ 22:11, 12
యెహె. 19:6యిర్మీ 22:17
యెహె. 19:7సామె 28:15
యెహె. 19:10కీర్త 80:8; యెష 5:7
యెహె. 19:12యెష 5:5; యెహె 15:6
యెహె. 19:122రా 23:34; 24:6; 25:5-7
యెహె. 19:12ద్వితీ 32:22; యెహె 15:4
యెహె. 19:13ద్వితీ 28:48; యిర్మీ 17:5, 6; 52:27
యెహె. 19:14యెహె 17:16, 18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యెహెజ్కేలు 19:1-14

యెహెజ్కేలు

19 “ఇశ్రాయేలు ప్రధానుల గురించి నువ్వు శోకగీతం పాడుతూ 2 ఇలా అను:

‘మీ అమ్మ ఎలాంటిది? ఆమె సింహాల మధ్య ఆడసింహం లాంటిది.

ఆమె బలమైన కొదమ సింహాల మధ్య పడుకుంది, అక్కడే తన పిల్లల్ని పెంచింది.

 3 ఆమె పెంచిన పిల్లల్లో ఒకటి బలమైన కొదమ సింహం అయింది.+

అది వేటాడడం నేర్చుకుని,

చివరికి మనుషుల్ని కూడా మింగేసింది.

 4 జనాలు దాని గురించి విని, దాన్ని తమ గోతిలో చిక్కించుకున్నాయి,

దానికి కొక్కేలు తగిలించి ఐగుప్తు దేశానికి తీసుకెళ్లాయి.+

 5 దాని తల్లి దానికోసం ఎదురుచూసీ చూసీ, అది ఇక రాదని గ్రహించి,

తన పిల్లల్లో ఇంకొకదాన్ని తీసుకొని, దాన్ని బలమైన కొదమ సింహంలా తయారుచేసింది.

 6 అది కూడా సింహాల మధ్య తిరుగుతూ, బలమైన కొదమ సింహం అయింది.

అది వేటాడడం నేర్చుకుని చివరికి మనుషుల్ని కూడా మింగేసింది.+

 7 అది వాళ్ల పటిష్ఠమైన బురుజుల మధ్య తిరుగుతూ వాళ్ల నగరాల్ని నాశనం చేసింది,

అలా నిర్జనమైన ఆ దేశమంతా దాని గర్జనతో నిండిపోయింది.+

 8 చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలు దానిమీదికి వచ్చి తమ వలను విసిరాయి,

అది వాళ్ల గోతిలో చిక్కింది.

 9 వాళ్లు దానికి కొక్కేలు తగిలించి, బోనులో పెట్టి, బబులోను రాజు దగ్గరికి తీసుకెళ్లారు.

అక్కడ దాన్ని బంధించి, ఇశ్రాయేలు పర్వతాల మీద ఇక దాని స్వరం వినిపించకుండా చేశారు.

10 మీ అమ్మ, నీళ్ల పక్కన నాటబడిన ద్రాక్షవల్లిలా* ఉండేది.+

నీళ్లు సమృద్ధిగా ఉండడంవల్ల అది ఫలించింది, దాని నిండా తీగలు వచ్చాయి.

11 దానికి బలమైన కొమ్మలు వచ్చాయి, అవి పాలకుల రాజదండాలకు తగినవి.

అది పెరిగి మిగతా చెట్లకన్నా ఎత్తుగా ఎదిగింది,

అది ఎత్తుగా ఉండడం వల్ల, దానికి విస్తారమైన ఆకులు, కొమ్మలు ఉండడం వల్ల దూరం నుండి కూడా కనిపించేది.

12 అయితే అది, కోపంతో పెకిలించబడి+ నేలమీదికి విసిరేయబడింది,

దాని పండ్లు తూర్పు గాలికి వాడిపోయాయి.

దాని బలమైన కొమ్మలు తెగిపోయి, ఎండిపోయాయి;+ అగ్ని వాటిని కాల్చేసింది.+

13 ఇప్పుడు అది ఎడారిలో

నీళ్లులేని, ఎండిపోయిన దేశంలో నాటబడింది.+

14 దాని కొమ్మల నుండి అగ్ని వ్యాపించి, దాని రెమ్మల్ని, పండ్లను కాల్చేసింది;

ఒక్క బలమైన కొమ్మ గానీ, పరిపాలించడం కోసం రాజదండం గానీ మిగల్లేదు.+

“ ‘ఇది శోకగీతం, ఇది శోకగీతంలా వాడుకలోకి వస్తుంది.’ ”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి