కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 19
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • మట్టి కూజాను పగలగొట్టమని యిర్మీయాకు చెప్పడం (1-15)

        • బయలుకు పిల్లల్ని బలి ఇవ్వడం (5)

యిర్మీయా 19:1

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 18:2

యిర్మీయా 19:2

అధస్సూచీలు

  • *

    అక్ష., “హిన్నోము కుమారుడి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెహో 15:8, 12; 2ది 28:1, 3; యిర్మీ 7:31

యిర్మీయా 19:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2రా 22:16, 17; యెష 65:11
  • +2ది 33:1, 4
  • +2రా 21:16; యెష 59:7; యిర్మీ 2:34; విలా 4:13; మత్త 23:34, 35

యిర్మీయా 19:5

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +2ది 28:1, 3; 33:1, 6; యెష 57:5
  • +లేవీ 18:21; యిర్మీ 7:31; 32:35

యిర్మీయా 19:6

అధస్సూచీలు

  • *

    అక్ష., “హిన్నోము కుమారుడి.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 7:32

యిర్మీయా 19:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 28:25, 26; కీర్త 79:2; యిర్మీ 7:33; 16:4

యిర్మీయా 19:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 9:8; యిర్మీ 18:16; విలా 2:15

యిర్మీయా 19:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:29; ద్వితీ 28:53; విలా 2:20; 4:10; యెహె 5:10

యిర్మీయా 19:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 7:32

యిర్మీయా 19:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 8:1, 2; జెఫ 1:4, 5
  • +యిర్మీ 7:18; 32:29
  • +కీర్త 79:1

యిర్మీయా 19:15

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నెహె 9:17, 29; జెక 7:12

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 19:1యిర్మీ 18:2
యిర్మీ. 19:2యెహో 15:8, 12; 2ది 28:1, 3; యిర్మీ 7:31
యిర్మీ. 19:42రా 22:16, 17; యెష 65:11
యిర్మీ. 19:42ది 33:1, 4
యిర్మీ. 19:42రా 21:16; యెష 59:7; యిర్మీ 2:34; విలా 4:13; మత్త 23:34, 35
యిర్మీ. 19:52ది 28:1, 3; 33:1, 6; యెష 57:5
యిర్మీ. 19:5లేవీ 18:21; యిర్మీ 7:31; 32:35
యిర్మీ. 19:6యిర్మీ 7:32
యిర్మీ. 19:7ద్వితీ 28:25, 26; కీర్త 79:2; యిర్మీ 7:33; 16:4
యిర్మీ. 19:81రా 9:8; యిర్మీ 18:16; విలా 2:15
యిర్మీ. 19:9లేవీ 26:29; ద్వితీ 28:53; విలా 2:20; 4:10; యెహె 5:10
యిర్మీ. 19:11యిర్మీ 7:32
యిర్మీ. 19:13యిర్మీ 8:1, 2; జెఫ 1:4, 5
యిర్మీ. 19:13యిర్మీ 7:18; 32:29
యిర్మీ. 19:13కీర్త 79:1
యిర్మీ. 19:15నెహె 9:17, 29; జెక 7:12
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 19:1-15

యిర్మీయా

19 యెహోవా ఇలా అన్నాడు: “నువ్వు వెళ్లి, కుమ్మరి దగ్గర ఒక మట్టి కూజా కొను.+ ప్రజల పెద్దల్లో, యాజకుల పెద్దల్లో కొందర్ని తీసుకొని 2 కుమ్మరి ద్వారం దగ్గరున్న బెన్‌హిన్నోము* లోయకు+ వెళ్లు. అక్కడ నేను నీకు చెప్పే మాటలు ప్రకటించు. 3 నువ్విలా చెప్పాలి: ‘యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు:

“ ‘ “నేను ఈ స్థలం మీదికి ఒక విపత్తు తీసుకురాబోతున్నాను, దాని గురించి వినేవాళ్ల చెవులు గింగురుమంటాయి. 4 ఎందుకంటే, వాళ్లు నన్ను విడిచిపెట్టారు,+ ఈ స్థలాన్ని గుర్తుపట్టకుండా చేశారు.+ తమకు గానీ, తమ పూర్వీకులకు గానీ, యూదా రాజులకు గానీ తెలియని వేరే దేవుళ్లకు ఈ స్థలంలో బలులు అర్పిస్తున్నారు. వాళ్లు ఈ స్థలాన్ని అమాయకుల రక్తంతో నింపేశారు.+ 5 వాళ్లు ఉన్నత స్థలాలు కట్టి తమ కుమారుల్ని అగ్నిలో కాల్చి బయలుకు సంపూర్ణ దహనబలులుగా అర్పించారు.+ అలా చేయమని నేను ఆజ్ఞాపించలేదు, చెప్పలేదు, కనీసం ఆ ఆలోచన కూడా ఎప్పుడూ నా హృదయంలో రాలేదు.” ’+

6 “ ‘ “కాబట్టి ఇదిగో! అది ఇక తోఫెతు అని గానీ, బెన్‌హిన్నోము* లోయ అని గానీ కాకుండా వధ లోయ అని పిలవబడే రోజులు వస్తున్నాయి” అని యెహోవా అంటున్నాడు.+ 7 “నేను ఈ స్థలంలో యూదా, యెరూషలేముల ఆలోచనలు వ్యర్థమైపోయేలా చేస్తాను. వాళ్లు తమ ప్రాణాల్ని తీయాలని చూస్తున్న శత్రువుల ఖడ్గానికి చిక్కి చనిపోయేలా చేస్తాను. వాళ్ల శవాల్ని ఆకాశపక్షులకు, భూమ్మీది జంతువులకు ఆహారంగా ఇస్తాను.+ 8 నేను ఈ నగరాన్ని భయంకరంగా మారుస్తాను, ప్రజలు దాన్ని చూసి ఈల వేసేలా చేస్తాను. ఆ దారిన వెళ్లే ప్రతీ వ్యక్తి ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ఉండిపోతాడు, దాని తెగుళ్లన్నిటినీ చూసి ఈలవేస్తాడు.+ 9 వాళ్లు తమ కుమారుల, కూతుళ్ల మాంసాన్ని తినేలా చేస్తాను; వాళ్ల శత్రువులు, వాళ్ల ప్రాణాలు తీయాలని చూసేవాళ్లు చుట్టూ ముట్టడి వేసినప్పుడు ఆ ముట్టడిని బట్టి, దానివల్ల కలిగిన ఇబ్బందిని బట్టి వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ తోటివాడి మాంసం తింటారు.” ’+

10 “తర్వాత నువ్వు, నీతోపాటు వచ్చినవాళ్ల కళ్లముందు ఆ కూజాను పగలగొట్టి 11 వాళ్లకు ఇలా చెప్పు: ‘సైన్యాలకు అధిపతైన యెహోవా ఏమంటున్నాడంటే: “ఒక వ్యక్తి, తిరిగి బాగుచేయలేనంతగా మట్టి పాత్రను పగలగొట్టినట్టే నేను ఈ ప్రజల్ని, ఈ నగరాన్ని పగలగొడతాను; తోఫెతులో ఇక స్థలం లేకుండా పోయేవరకు శవాల్ని పాతిపెడుతూ ఉంటారు.” ’+

12 “ ‘ఈ నగరాన్ని తోఫెతులా మార్చడానికి నేను ఈ స్థలానికీ, దాని నివాసులకూ అలానే చేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నాడు. 13 ‘యెరూషలేములోని ఇళ్లు, యూదా రాజుల ఇళ్లు, అవును ఏయే ఇళ్లమీద వాళ్లు ఆకాశ సైన్యమంతటికీ బలులు అర్పించారో,+ ఇతర దేవుళ్లకు పానీయార్పణలు అర్పించారో+ ఆ ఇళ్లన్నీ ఈ తోఫెతులాగే అపవిత్రమౌతాయి.’ ”+

14 యిర్మీయా తోఫెతు నుండి, అంటే ప్రవచించమని యెహోవా తనను పంపించిన స్థలం నుండి తిరిగొచ్చిన తర్వాత, అతను యెహోవా మందిర ప్రాంగణంలో నిలబడి ప్రజలందరికీ ఇలా చెప్పాడు: 15 “ఇశ్రాయేలు దేవుడూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ఈ నగరం మీదికి, దాని పట్టణాలన్నిటి మీదికి నేను చెప్పిన విపత్తు అంతటినీ రప్పిస్తున్నాను. ఎందుకంటే, వాళ్లు మొండిగా నా మాటలు వినడానికి ఇష్టపడలేదు.’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి