కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 18
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

యిర్మీయా విషయసూచిక

      • కుమ్మరి చేతిలో బంకమట్టి (1-12)

      • యెహోవా ఇశ్రాయేలుకు వీపు చూపిస్తాడు (13-17)

      • యిర్మీయా మీద కుట్ర; అతని మొర (18-23)

యిర్మీయా 18:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 19:1

యిర్మీయా 18:3

అధస్సూచీలు

  • *

    లేదా “చక్రం.”

యిర్మీయా 18:4

అధస్సూచీలు

  • *

    లేదా “సరైనదని.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 4/2017, పేజీ 1

    కావలికోట,

    4/1/1999, పేజీ 22

యిర్మీయా 18:6

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +రోమా 9:20, 21

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 4/2017, పేజీ 1

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    4/2017, పేజీ 3

    కావలికోట,

    4/1/1999, పేజీ 22

యిర్మీయా 18:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 1:10; 12:14; 25:9; 45:4

యిర్మీయా 18:8

అధస్సూచీలు

  • *

    లేదా “విచారపడతాను.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +1రా 8:33, 34; కీర్త 106:45; యిర్మీ 7:3; 26:3; యెహె 18:21; యోవే 2:13; యోనా 3:5, 10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 4/2017, పేజీ 1

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    4/2017, పేజీ 3

యిర్మీయా 18:10

అధస్సూచీలు

  • *

    లేదా “విచారపడతాను.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2017), 4/2017, పేజీ 1

యిర్మీయా 18:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 1:16; యెహె 18:23

యిర్మీయా 18:12

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:25
  • +ద్వితీ 29:19, 20; యిర్మీ 7:24

యిర్మీయా 18:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:13

యిర్మీయా 18:15

అధస్సూచీలు

  • *

    లేదా “కట్టబడని.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 2:19; 3:21
  • +యిర్మీ 10:14, 15
  • +యిర్మీ 6:16

యిర్మీయా 18:16

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 26:33; యెహె 6:14
  • +1రా 9:8; యిర్మీ 19:8; విలా 2:15; మీకా 6:16
  • +ద్వితీ 28:37

యిర్మీయా 18:17

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 31:17

యిర్మీయా 18:18

అధస్సూచీలు

  • *

    లేదా “ఉపదేశం.”

  • *

    అక్ష., “నాలుకతో అతన్ని కొడదాం.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 11:19

యిర్మీయా 18:20

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 35:7

యిర్మీయా 18:21

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 12:3
  • +విలా 5:3
  • +2ది 36:17

యిర్మీయా 18:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +కీర్త 38:12

యిర్మీయా 18:23

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యిర్మీ 11:19, 20
  • +యిర్మీ 15:15
  • +కీర్త 35:4

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

యిర్మీ. 18:2యిర్మీ 19:1
యిర్మీ. 18:6రోమా 9:20, 21
యిర్మీ. 18:7యిర్మీ 1:10; 12:14; 25:9; 45:4
యిర్మీ. 18:81రా 8:33, 34; కీర్త 106:45; యిర్మీ 7:3; 26:3; యెహె 18:21; యోవే 2:13; యోనా 3:5, 10
యిర్మీ. 18:11యెష 1:16; యెహె 18:23
యిర్మీ. 18:12యిర్మీ 2:25
యిర్మీ. 18:12ద్వితీ 29:19, 20; యిర్మీ 7:24
యిర్మీ. 18:13యిర్మీ 2:13
యిర్మీ. 18:15యిర్మీ 2:19; 3:21
యిర్మీ. 18:15యిర్మీ 10:14, 15
యిర్మీ. 18:15యిర్మీ 6:16
యిర్మీ. 18:16లేవీ 26:33; యెహె 6:14
యిర్మీ. 18:161రా 9:8; యిర్మీ 19:8; విలా 2:15; మీకా 6:16
యిర్మీ. 18:16ద్వితీ 28:37
యిర్మీ. 18:17ద్వితీ 31:17
యిర్మీ. 18:18యిర్మీ 11:19
యిర్మీ. 18:20కీర్త 35:7
యిర్మీ. 18:21యిర్మీ 12:3
యిర్మీ. 18:21విలా 5:3
యిర్మీ. 18:212ది 36:17
యిర్మీ. 18:22కీర్త 38:12
యిర్మీ. 18:23యిర్మీ 11:19, 20
యిర్మీ. 18:23యిర్మీ 15:15
యిర్మీ. 18:23కీర్త 35:4
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
యిర్మీయా 18:1-23

యిర్మీయా

18 యెహోవా వాక్యం యిర్మీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 2 “నువ్వు లేచి, కుమ్మరి ఇంటికి వెళ్లు,+ అక్కడ నీకు నా మాటలు వినిపిస్తాను.”

3 కాబట్టి నేను కుమ్మరి ఇంటికి వెళ్లాను, అతను సారె* మీద పనిచేస్తున్నాడు. 4 అతను బంకమట్టితో చేస్తున్న పాత్ర అతని చేతుల్లో పాడైంది, అప్పుడు ఆ మట్టితో ఏ పాత్ర చేయడం అతనికి మంచిదని* అనిపించిందో ఆ పాత్రను చేశాడు.

5 అప్పుడు యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది: 6 “ ‘ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, ఈ కుమ్మరి చేసినట్టే నేను మీకు చేయలేనా?’ అని యెహోవా అంటున్నాడు. ‘ఇదిగో! కుమ్మరి చేతిలో బంకమట్టి ఎలా ఉందో, ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరూ నా చేతిలో అలానే ఉన్నారు.+ 7 నేను ఒక దేశం గానీ రాజ్యం గానీ పెల్లగించబడుతుందని, కూలగొట్టబడుతుందని, నాశనం చేయబడుతుందని చెప్పినప్పుడు+ 8 ఆ దేశం తన దుష్టత్వాన్ని విడిచిపెడితే, నేను కూడా దాని మీదికి తీసుకురావాలనుకున్న విపత్తు విషయంలో నా మనసు మార్చుకుంటాను.*+ 9 అయితే ఒక దేశం గానీ రాజ్యం గానీ కట్టబడుతుందని, నాటబడుతుందని నేను చెప్పినప్పుడు 10 అది నా దృష్టిలో చెడ్డవైనవి చేస్తే, నా మాట వినకపోతే, నేను దానికి చేయాలనుకున్న మంచి విషయంలో నా మనసు మార్చుకుంటాను.’*

11 “దయచేసి ఇప్పుడు నువ్వు యూదా ప్రజలకు, యెరూషలేము నివాసులకు ఇలా చెప్పు: ‘యెహోవా ఏమంటున్నాడంటే, “నేను మీకు వ్యతిరేకంగా ఒక విపత్తును సిద్ధం చేస్తున్నాను, ఒక పథకాన్ని రూపొందిస్తున్నాను. దయచేసి మీ చెడు మార్గాల నుండి వెనక్కి తిరగండి; మీ మార్గాల్ని, పనుల్ని సరిచేసుకోండి.” ’ ”+

12 కానీ వాళ్లు ఇలా అన్నారు: “అలా కాదు,+ మేము మా సొంత ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాం, మేమంతా మా దుష్ట హృదయాన్నే మొండిగా అనుసరిస్తాం.”+

13 కాబట్టి యెహోవా ఇలా అంటున్నాడు:

“దయచేసి దేశాల్ని అడిగి తెలుసుకోండి.

ఇలాంటిది ఎవరైనా విన్నారా?

ఇశ్రాయేలు కన్య చాలా ఘోరమైన పని చేసింది.+

14 లెబానోను బండల మీద మంచు లేకుండా పోతుందా?

దూరం నుండి ప్రవహించే చల్లని వాగులు ఎండిపోతాయా?

15 కానీ నా ప్రజలు నన్ను మర్చిపోయారు.+

వాళ్లు వ్యర్థమైనవాటికి బలులు అర్పిస్తున్నారు,+

వాళ్లు ఇతరుల్ని తడబడేలా చేస్తూ, పురాతన దారుల్లో నడవకుండా చేస్తున్నారు,+

సమతలంగా, చదునుగా లేని* పక్కదారుల్లో నడిపిస్తున్నారు.

16 కాబట్టి వాళ్ల దేశం భయంకరంగా తయారౌతుంది,+

దాన్ని చూసి ప్రజలు ఎప్పటికీ ఎగతాళి చేస్తారు, ఈల వేస్తారు.+

ఆ దారిన వెళ్లే ప్రతీ వ్యక్తి దాన్ని చూసి ఆశ్చర్యంతో తల ఊపుతాడు.+

17 తూర్పు గాలిలా, నేను వాళ్లను శత్రువు ముందు చెదరగొడతాను.

విపత్తు రోజున నేను వాళ్లకు నా ముఖాన్ని కాదు వీపునే చూపిస్తాను.”+

18 అప్పుడు వాళ్లు ఇలా అన్నారు: “రండి, మనం యిర్మీయా మీద కుట్ర పన్నుదాం.+ ఎందుకంటే మన యాజకుల దగ్గర ధర్మశాస్త్రం,* జ్ఞానుల దగ్గర సలహా, ప్రవక్తల దగ్గర వాక్యం ఉండని పరిస్థితి ఎప్పటికీ రాదు. రండి అతనికి వ్యతిరేకంగా మాట్లాడదాం,* అతను చెప్పేది మనం అస్సలు పట్టించుకోవద్దు.”

19 యెహోవా, నామీద దృష్టిపెట్టు,

నా వ్యతిరేకులు ఏమంటున్నారో విను.

20 మంచి చేస్తే ప్రతిఫలంగా చెడు చేయవచ్చా?

కానీ వాళ్లు నా ప్రాణం తీయడానికి గొయ్యి తవ్వారు.+

నీ కోపాన్ని వాళ్లమీద నుండి తీసేయడానికి

నేను నీ ముందు నిలబడి వాళ్ల గురించి ఎలా మంచిగా మాట్లాడానో గుర్తుచేసుకో.

21 కాబట్టి వాళ్ల కుమారుల్ని కరువుకు, వాళ్లను ఖడ్గానికి అప్పగించు.+

వాళ్ల భార్యలు భర్తల్ని, పిల్లల్ని పోగొట్టుకోవాలి.+

వాళ్ల పురుషులు ప్రాణాంతకమైన తెగులుతో చనిపోవాలి.

వాళ్ల యువకులు యుద్ధంలో కత్తితో చంపబడాలి.+

22 నువ్వు వాళ్లమీదికి హఠాత్తుగా బందిపోటుల్ని రప్పించినప్పుడు

వాళ్ల ఇళ్లలో నుండి ఆర్తనాదాలు వినిపించాలి.

ఎందుకంటే, వాళ్లు నన్ను పట్టుకోవడానికి గొయ్యి తవ్వారు,

నా పాదాల కోసం ఉచ్చు పెట్టారు.+

23 కానీ యెహోవా,

నన్ను చంపడానికి వాళ్లు నామీద పన్నే కుట్రలన్నీ నీకు బాగా తెలుసు.+

వాళ్ల దోషాన్ని కప్పేయకు,

వాళ్ల పాపాన్ని నీ ముందు నుండి తుడిచేయకు.

నువ్వు కోపంతో వాళ్లమీద చర్య తీసుకున్నప్పుడు+

వాళ్లు నీ ముందు తడబడి పడిపోవాలి.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి