కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; తంతివాద్యాలతో పాడాలి. దావీదు కీర్తన.
61 దేవా, సహాయం కోసం నేను పెట్టే మొర విను.
నా ప్రార్థన ఆలకించు.+
నా కన్నా ఎత్తుగా ఉన్న బండ మీదికి నన్ను తీసుకెళ్లు.+
3 ఎందుకంటే నువ్వే నా ఆశ్రయం,
శత్రువు నుండి నన్ను కాపాడే బలమైన బురుజు నువ్వే.+
5 దేవా, నువ్వు నా మొక్కుబళ్లను విన్నావు.
నీ పేరుకు భయపడేవాళ్లకు+ వచ్చే స్వాస్థ్యాన్ని నాకు ఇచ్చావు.
6 నువ్వు రాజు ఆయుష్షును పొడిగిస్తావు,+
అతను తరతరాలపాటు జీవిస్తాడు.