కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; “జ్ఞాపకార్థ లిల్లీ పువ్వు” అనే రాగంలో పాడాలి. మిక్తాము.* దావీదు కీర్తన. బోధించడం కోసం. దావీదు అరామ్నహరాయిము, అరమోజబా సైన్యాలతో పోరాడినప్పుడు, యోవాబు తిరిగొచ్చి ఉప్పులోయలో 12,000 మంది ఎదోమీయుల్ని చంపినప్పటిది.+
60 దేవా, నువ్వు మమ్మల్ని తిరస్కరించావు; మమ్మల్ని చెదరగొట్టావు.+
మామీద కోపగించుకున్నావు; ఇప్పుడు మళ్లీ మమ్మల్ని అంగీకరించు!
2 నువ్వు భూమిని కంపింపజేశావు; దాన్ని బద్దలు చేశావు.
అది పడిపోయేలా ఉంది, దాని పగుళ్లను బాగుచేయి.
3 నువ్వు నీ ప్రజల్ని కష్టాలపాలు చేశావు.
తూలేలా చేసే ద్రాక్షారసాన్ని మాతో తాగించావు.+
4 నీకు భయపడేవాళ్లు పారిపోయి బాణాన్ని తప్పించుకునేలా
ఒక సంకేతం ఇవ్వు.* (సెలా)
5 నువ్వు ప్రేమించేవాళ్లు రక్షించబడేలా,
నీ కుడిచేతితో మమ్మల్ని కాపాడి, మాకు జవాబివ్వు.+
6 దేవుడు తన పవిత్రతను బట్టి* ఇలా అన్నాడు:
8 మోయాబు నేను కాళ్లు కడుక్కునే పాత్ర.+
ఎదోము మీదికి నా చెప్పు విసిరేస్తాను.+
ఫిలిష్తియను జయించి విజయోత్సాహంతో కేకలు వేస్తాను.”+
9 ముట్టడి వేయబడిన* నగరానికి నన్ను ఎవరు తీసుకెళ్తారు?
ఎదోము వరకు నన్ను ఎవరు నడిపిస్తారు?+
10 దేవా, నువ్వే మమ్మల్ని నడిపిస్తావు;
కానీ నువ్వు మమ్మల్ని తిరస్కరించావు, ఇప్పుడు నువ్వు మా సైన్యాలతో పాటు బయల్దేరడం లేదు.+
11 కష్టాల్లో మాకు సహాయం చేయి,
రక్షణ కోసం మనుషుల మీద ఆశపెట్టుకోవడం వృథా.+
12 దేవుణ్ణి బట్టి మేము బలం పొందుతాం,
ఆయన మా శత్రువుల్ని అణగదొక్కుతాడు.+