కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; “నాశనం చేయకు” అనే రాగంలో పాడాలి. దావీదు కీర్తన. మిక్తాము.*
58 మనుషులారా, మీరు మౌనంగా ఉంటూ నీతి గురించి ఎలా మాట్లాడగలరు?+
నిజాయితీగా ఎలా తీర్పు తీర్చగలరు?+
3 దుష్టులు పుట్టినప్పటి* నుండే దారి తప్పుతారు;*
వాళ్లు పుట్టుకతోనే తప్పుదారిలో వెళ్తారు, అబద్ధాలాడతారు.
5 పాములోడు ఎంత నేర్పుగా మంత్రం వేసినా,
అది అతని స్వరం వినదు.
6 దేవా, వాళ్ల పళ్లు రాలగొట్టు!
యెహోవా, ఈ కొదమ సింహాల దవడలు విరగ్గొట్టు!
7 పారే నీళ్లలా వాళ్లు కనబడకుండా పోవాలి.
ఆయన తన విల్లును వంచి, తన బాణాలతో వాళ్లను పడగొట్టాలి.
8 వాళ్లు, వెళ్తూవెళ్తూ కరిగిపోయే నత్తలా ఉండాలి;
గర్భంలోనే చనిపోయి ఎప్పుడూ సూర్యుణ్ణి చూడని బిడ్డలా ఉండాలి.
9 ముళ్లకంపల సెగ మీ వంటపాత్రలకు తగలకముందే,
ఆయన పచ్చి కట్టెల్ని, మండే కట్టెల్ని పెనుగాలి ఊడ్చేసినట్టు ఊడ్చేస్తాడు.+
10 దేవుడు దుష్టుల మీద పగ తీర్చుకోవడం చూసి నీతిమంతులు సంతోషిస్తారు;+
నీతిమంతుల పాదాలు వాళ్ల రక్తంతో తడుస్తాయి.+
11 అప్పుడు ప్రజలు ఇలా అంటారు: “నీతిమంతులు ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతారు.+
నిజంగా లోకానికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు.”+