కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; “నాశనం చేయకు” అనే రాగంలో పాడాలి. దావీదు కీర్తన. మిక్తాము.* దావీదు సౌలు నుండి పారిపోయి గుహలో దాక్కున్నప్పటిది.+
57 దేవా, నా మీద దయ చూపించు, నా మీద అనుగ్రహం చూపించు,
నిన్నే నేను ఆశ్రయంగా చేసుకుంటున్నాను,+
కష్టాలు తీరిపోయేవరకు నీ రెక్కల చాటున దాక్కుంటాను.+
2 సర్వోన్నతుడైన దేవునికి,
నా కష్టాలు తీర్చే సత్యదేవునికి నేను మొరపెట్టుకుంటున్నాను.
3 పరలోకం నుండి ఆయన నాకు సహాయం చేస్తాడు, నన్ను కాపాడతాడు.+
నా మీద దాడిచేసేవాళ్లను అయోమయంలో పడేస్తాడు. (సెలా)
దేవుడు తన విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపిస్తాడు.+
4 సింహాలు నన్ను చుట్టుముట్టాయి;+
నన్ను మింగేయాలని చూస్తున్నవాళ్ల మధ్య నేను పడుకోవాల్సి వస్తోంది,
వాళ్ల పళ్లు ఈటెలు, బాణాలు;
వాళ్ల నాలుక పదునైన కత్తి.+
5 దేవా, నువ్వు ఆకాశానికి పైగా హెచ్చించబడాలి;
నీ మహిమ భూమంతా నిండిపోవాలి.+
వాళ్లు నా దారిలో గుంట తవ్వారు,
అందులో వాళ్లే పడిపోయారు.+ (సెలా)
7 దేవా, నా హృదయం స్థిరంగా ఉంది,+
నా హృదయం స్థిరంగా ఉంది.
నేను పాట పాడతాను, సంగీతం వాయిస్తాను.
8 నా అంతరంగమా,* మేలుకో.
తంతివాద్యమా, మేలుకో; వీణా,* నువ్వు కూడా మేలుకో.
నేను వేకువను నిద్ర లేపుతాను.+
10 ఎందుకంటే నీ విశ్వసనీయ ప్రేమ గొప్పది, అది ఆకాశమంత ఉన్నతమైనది,+
నీ నమ్మకత్వం మేఘాల్ని తాకుతుంది.
11 దేవా, నువ్వు ఆకాశానికి పైగా హెచ్చించబడాలి;
నీ మహిమ భూమంతా నిండిపోవాలి.+