యోబు
2 దాసునిలా అతను నీడ కోసం తపిస్తాడు,
కూలివాడిలా తన జీతం కోసం ఎదురుచూస్తాడు.+
3 కొన్ని నెలలపాటు వ్యర్థమైన జీవితం నాకు నియమించబడింది,
కష్టాలతో నిండిన రాత్రులు నాకోసం లెక్కించబడ్డాయి.+
4 నేను పడుకున్నప్పుడు, ‘ఎప్పుడు లేస్తానో?’ అని అనుకుంటాను,+
అయితే రాత్రి గడిచేకొద్దీ, తెల్లారే* వరకు నిద్రపట్టక అటూఇటూ దొర్లుతుంటాను.
8 ఇప్పుడు నన్ను చూసే కళ్లు ఇంకెప్పుడూ నన్ను చూడవు;
నీ కళ్లు నా కోసం చూస్తాయి, కానీ నేను ఉండను.+
11 అందుకే నేను మౌనంగా ఉండను.
12 నువ్వు నా మీద కాపలా ఉంచడానికి
నేను సముద్రాన్నా? భారీ సముద్రప్రాణినా?
13 నేను, ‘నా మంచం నన్ను ఓదారుస్తుంది;
నా పరుపు నాకు ఉపశమనాన్ని ఇస్తుంది’ అని అనుకున్నప్పుడు
14 నువ్వు కలలతో నన్ను భయపెడతావు,
దర్శనాలతో నన్ను బెదరగొడతావు,
15 ఇంతకన్నా ఊపిరాడక చావడమే నాకు మేలు,
అవును, ఈ శరీరంతో బ్రతకడం కన్నా చావడమే నయం.+
16 నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది;+ ఇక బ్రతకాలని లేదు.
నన్నిలా వదిలేయి, ఎందుకంటే నా రోజులు ఊపిరిలాంటివి.+
17 నువ్వు మనిషి గురించి ఇంతగా పట్టించుకోవడానికి,
అతని మీద దృష్టి నిలపడానికి అతను ఏపాటివాడు?+
18 నువ్వు ప్రతీ ఉదయం అతని మీద ఎందుకు దృష్టిపెడుతున్నావు?
ప్రతీక్షణం అతన్ని ఎందుకు పరీక్షిస్తున్నావు?+
19 నువ్వు నా మీద నుండి నీ దృష్టి పక్కకు తిప్పుకోవా?
కనీసం గుటక వేసేంత సేపైనా నన్ను విడిచివెళ్లవా?+
20 మనుషులు చేసే ప్రతీది గమనించే దేవా,+
ఒకవేళ నేను పాపం చేసినా, నీకెలా హాని చేయగలను?
నన్నెందుకు గురిగా చేసుకున్నావు?
నేను నీకు భారంగా తయారయ్యానా?
21 నువ్వు నా అపరాధాన్ని ఎందుకు మన్నించవు?
నా తప్పును ఎందుకు క్షమించవు?
త్వరలోనే నేను మట్టిలో నిద్రిస్తాను,+
నువ్వు నాకోసం చూస్తావు, కానీ నేను ఉండను.”