యోబు
26 అప్పుడు యోబు ఇలా అన్నాడు:
2 “శక్తిలేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు!
బలంలేని చేతిని ఎంత చక్కగా బలపర్చావు!+
3 తెలివిలేని వాడికి ఎంత గొప్ప సలహా ఇచ్చావు!+
నీ ఆచరణాత్మక తెలివిని* ఎంత ఉదారంగా వెల్లడిచేశావు!
4 నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు?
అలా మాట్లాడేలా ఎవరు నిన్ను ప్రేరేపించారు?*
5 చనిపోయి శక్తిహీనంగా ఉన్నవాళ్లు వణికిపోతున్నారు;
వాళ్లు జలాల కన్నా, వాటిలోని ప్రాణుల కన్నా కింద ఉన్నారు.
7 ఆయన ఉత్తరం వైపున్న ఆకాశాన్ని* శూన్యం మీద పరుస్తున్నాడు,+
భూమిని ఏ ఆధారం లేకుండా వేలాడదీస్తున్నాడు.
8 మేఘాలు వాటి బరువు వల్ల పగిలిపోకుండా ఉండేలా,
నీళ్లను తన మేఘాల్లో మూటకడుతున్నాడు;+
9 తన సింహాసనం కనబడకుండా ఉండేలా,
తన మేఘంతో దాన్ని కప్పుతున్నాడు.+
11 ఆయన గద్దించినప్పుడు ఆకాశ స్తంభాలు కంపిస్తాయి, వణికిపోతాయి.
12 ఆయన తన శక్తితో సముద్రంలో అలజడి రేపుతాడు,+
13 ఆయన ఊపిరి* ఆకాశాన్ని తేటపరుస్తుంది;
ఆయన చెయ్యి పాకే సర్పాన్ని పొడుస్తుంది.
14 ఇవి ఆయన మార్గాల అంచులు మాత్రమే.+
ఆయన గురించి మనం విన్నది కేవలం గుసగుస శబ్దమే!
అలాంటిది, ఆయన మహా గర్జనను ఎవరు అర్థం చేసుకోగలరు?”+