యోబు
25 అప్పుడు షూహీయుడైన బిల్దదు+ ఇలా అన్నాడు:
2 “రాజ్యాధికారం, భీకర శక్తి ఆయన సొంతం;
పరలోకంలో* ఆయన శాంతిని స్థాపిస్తాడు.
3 ఆయన సైన్యాల్ని లెక్కపెట్టడం సాధ్యమా?
ఆయన వెలుగు ఎవరి మీదైనా ప్రకాశించకుండా ఉంటుందా?
4 అలాంటిది, మామూలు మనిషి దేవుని ముందు నీతిమంతుడిగా ఎలా ఉండగలడు?+
5 ఆయన దృష్టికి చంద్రుడు ప్రకాశవంతంగా లేడు,
నక్షత్రాలు పవిత్రంగా లేవు,
6 అలాంటప్పుడు, పురుగు లాంటి మనిషి,
కీటకం లాంటి మనిషి ఆయన దృష్టికి ఎలా పవిత్రుడిగా ఉండగలడు?”