కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 1 థెస్సలొనీకయులు 4
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

1 థెస్సలొనీకయులు విషయసూచిక

    • 4

      • లైంగిక పాపాల విషయంలో హెచ్చరిక  (1-8)

      • ఒకరి మీద ఒకరు పూర్తిస్థాయిలో ప్రేమ చూపించుకోండి  (9-12)

        • “ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు” (11)

      • క్రీస్తు శిష్యులుగా చనిపోయినవాళ్లు ముందు బ్రతికించబడతారు (13-18)

1 థెస్సలొనీకయులు 4:2

అధస్సూచీలు

  • *

    లేదా “ఆజ్ఞలు.”

1 థెస్సలొనీకయులు 4:3

అధస్సూచీలు

  • *

    గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—పుస్తకం, పాఠం 41

    కావలికోట,

    7/15/1997, పేజీ 18

    5/1/1990, పేజీ 22

1 థెస్సలొనీకయులు 4:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “పాత్రను.”

1 థెస్సలొనీకయులు 4:6

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 7/2019, పేజీ 3

    తేజరిల్లు!,

    1/2007, పేజీ 19

    కావలికోట,

    6/15/2002, పేజీలు 20-21

    1/15/2001, పేజీలు 6-7

    7/15/1997, పేజీ 18

1 థెస్సలొనీకయులు 4:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    6/2023, పేజీలు 12-13

1 థెస్సలొనీకయులు 4:8

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 7/2019, పేజీ 3

1 థెస్సలొనీకయులు 4:10

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    2/1/2003, పేజీలు 13-14

1 థెస్సలొనీకయులు 4:13

అధస్సూచీలు

  • *

    అక్ష., “మరణంలో నిద్రిస్తున్నవాళ్ల.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    తేజరిల్లు!,

    5/8/1994, పేజీ 23

    కావలికోట,

    10/15/1994, పేజీ 32

1 థెస్సలొనీకయులు 4:15

అధస్సూచీలు

  • *

    పదకోశం చూడండి.

  • *

    అక్ష., “మరణంలో నిద్రిస్తున్నవాళ్ల.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2007, పేజీ 28

    4/15/1993, పేజీ 5

    ప్రకటన ముగింపు, పేజీలు 103-104

1 థెస్సలొనీకయులు 4:16

అధస్సూచీలు

  • *

    ఇది ఊదే పరికరం.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    బైబిలు ప్రశ్నలకు జవాబులు, ఆర్టికల్‌ 121

    కావలికోట,

    1/1/2007, పేజీ 28

    4/15/1993, పేజీలు 5-6

    ప్రకటన ముగింపు, పేజీలు 103-104, 181

1 థెస్సలొనీకయులు 4:17

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/15/2015, పేజీలు 18-19

    9/15/2008, పేజీ 29

    1/1/2007, పేజీ 28

    4/15/1993, పేజీలు 4-6

    ప్రకటన ముగింపు, పేజీలు 103-104, 211

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
1 థెస్సలొనీకయులు 4:1-18

1 థెస్సలొనీకయులు

4 చివరిగా సోదరులారా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీరు ఎలా నడుచుకోవాలో మీకు చెప్పాం, నిజానికి మీరు ఇప్పుడు అలాగే నడుచుకుంటున్నారు. అయితే, ఇంకా పూర్తిస్థాయిలో అలా నడుచుకోమని యేసు ప్రభువు పేరున మిమ్మల్ని అర్థిస్తున్నాం, బ్రతిమాలుతున్నాం. 2 యేసు ప్రభువు పేరున మేము మీకు ఏ నిర్దేశాలు* ఇచ్చామో మీకు తెలుసు.

3 మీరు పవిత్రులుగా ఉంటూ లైంగిక పాపాలకు* దూరంగా ఉండాలన్నదే దేవుని కోరిక. 4 మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా ఉండాలంటే మీలో ప్రతీ ఒక్కరికి మీ శరీరాన్ని* ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసివుండాలి. 5 మీరు దేవుడు తెలియని ప్రజల్లా అత్యాశతో కూడిన లైంగిక వాంఛతో రగిలిపోకూడదు. 6 ఎవ్వరూ హద్దులు దాటి ప్రవర్తించకూడదు, పవిత్రత విషయంలో తోటి సోదరుని హక్కులకు భంగం కలిగించకూడదు. ఎందుకంటే వీటన్నిటి విషయంలో యెహోవా* తగిన శిక్ష విధిస్తాడు. దీని గురించి మేము ఇంతకుముందు కూడా చెప్పాం, గట్టిగా హెచ్చరించాం. 7 మనం అపవిత్రంగా జీవించాలని కాదుగానీ, పవిత్రంగా జీవించాలని దేవుడు మనల్ని పిలిచాడు. 8 కాబట్టి ఎవరైనా ఈ విషయాన్ని లెక్కచేయకపోతే, అతను మనిషిని కాదుగానీ, మీకు తన పవిత్రశక్తిని ఇచ్చే దేవుణ్ణే లెక్కచేయనట్టు.

9 ఇక సోదర ప్రేమ విషయానికొస్తే, దాని గురించి మేము మీకు రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పిస్తున్నాడు. 10 నిజానికి, మీరు మాసిదోనియ అంతటా ఉన్న సోదరులందరి మీద ప్రేమ చూపిస్తున్నారు. అయితే సోదరులారా, ఇంకా పూర్తిస్థాయిలో అలా ప్రేమ చూపిస్తూ ఉండమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. 11 మేము మీకు ఇంతకుముందు చెప్పినట్టు, ప్రశాంతంగా జీవించాలని, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని, మీ చేతులతో కష్టపడి పనిచేయాలని గట్టిగా తీర్మానించుకోండి. 12 అప్పుడు మీరు బయటివాళ్ల దృష్టిలో గౌరవప్రదంగా నడుచుకుంటారు, మీకు ఏ లోటూ ఉండదు.

13 అంతేకాదు సోదరులారా, చనిపోయినవాళ్ల* భవిష్యత్తు గురించి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అది అర్థంచేసుకుంటే, మీరు నిరీక్షణలేని ప్రజల్లా దుఃఖంలో మునిగిపోకుండా ఉండగలుగుతారు. 14 యేసు చనిపోయి బ్రతికించబడ్డాడనే నమ్మకం మనకుంటే, యేసు శిష్యులుగా చనిపోయినవాళ్లను దేవుడు యేసుతోపాటు ఉండేందుకు బ్రతికిస్తాడని కూడా నమ్ముతాం. 15 యెహోవా* వాక్యం ఆధారంగా మేము మీకు చెప్పేదేమిటంటే, మనలో ఎవరైతే ప్రభువు ప్రత్యక్షత కాలంలో ఇంకా బ్రతికివుంటారో వాళ్లు ఏ విధంగానూ ఇప్పటికే చనిపోయినవాళ్ల* కన్నా ముందు బ్రతికించబడరు; 16 ఎందుకంటే, ప్రభువు తానే స్వయంగా అధికారం ఉట్టిపడే స్వరంతో, ప్రధానదూత స్వరంతో, దేవుని బాకా* శబ్దంతో పరలోకం నుండి దిగివస్తాడు. ముందు, క్రీస్తు శిష్యులుగా చనిపోయినవాళ్లు బ్రతికించబడతారు. 17 ఆ తర్వాత, బ్రతికివున్న మనం వాళ్లతో కలిసి ఉండడానికి, ప్రభువును కలవడానికి గాలిలో మేఘాల మీద వెళ్తాం; అలా మనం ఎప్పుడూ ప్రభువుతోనే ఉంటాం. 18 కాబట్టి, ఈ మాటలతో ఒకరికొకరు ఊరటను ఇచ్చుకుంటూ ఉండండి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి