కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎఫెసీయులు 1
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

ఎఫెసీయులు విషయసూచిక

    • 1

      • శుభాకాంక్షలు (1, 2)

      • పవిత్రశక్తి దీవెనలు (3-7)

      • క్రీస్తులో అన్నిటినీ ఐక్యం చేయడం  (8-14)

        • నియమిత కాలంలో “వ్యవహార నిర్వహణ” (10)

        • పవిత్రశక్తితో ముద్ర వేయడం ‘ముందుగా ఇచ్చిన గుర్తు’ (13, 14)

      • పౌలు ఎఫెసీయుల విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలపడం, వాళ్ల కోసం ప్రార్థించడం  (15-23)

ఎఫెసీయులు 1:4

అధస్సూచీలు

  • *

    అక్ష., “(విత్తనం) పడకముందే,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టకముందే.

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2009, పేజీలు 27-28

    1/15/2005, పేజీ 6

    6/15/2002, పేజీ 5

ఎఫెసీయులు 1:5

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    10/15/2009, పేజీలు 27-28

    8/15/2008, పేజీ 27

    1/15/2005, పేజీ 6

    6/15/2002, పేజీ 5

ఎఫెసీయులు 1:6

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/15/2002, పేజీలు 5-6

ఎఫెసీయులు 1:7

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    7/2016, పేజీ 27

    కావలికోట,

    10/15/2009, పేజీ 28

    6/15/2004, పేజీలు 16-17

    6/15/2002, పేజీ 6

    5/1/1992, పేజీ 11

ఎఫెసీయులు 1:8

అధస్సూచీలు

  • *

    లేదా “మంచి గ్రహింపు.”

ఎఫెసీయులు 1:9

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు (2019), 6/2019, పేజీ 3

    కావలికోట,

    10/15/2009, పేజీ 28

    2/15/2006, పేజీలు 17-18

    6/15/2002, పేజీ 6

ఎఫెసీయులు 1:10

అధస్సూచీలు

  • *

    అక్ష., “గృహ నిర్వహణను.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    సన్నిహితమవండి, పేజీలు 146-147

    క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌,

    6/2019, పేజీ 3

    కావలికోట,

    7/15/2012, పేజీలు 27-28

    10/15/2009, పేజీ 28

    4/1/2008, పేజీ 27

    2/15/2006, పేజీలు 16-20, 21-25

    6/15/2002, పేజీలు 4-5, 6-7

    5/15/1997, పేజీలు 15, 17-18, 20

    ప్రకటన ముగింపు, పేజీలు 125-126

    దేవుణ్ణి ఆరాధించండి, పేజీలు 186-191

ఎఫెసీయులు 1:11

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    6/1/2006, పేజీలు 23-24

ఎఫెసీయులు 1:13

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    1/1/2007, పేజీ 31

ఎఫెసీయులు 1:14

అధస్సూచీలు

  • *

    లేదా “బయానా (అడ్వాన్సు); చేయబోయే దానికి పూచీ (టోకెన్‌).”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట (అధ్యయన),

    1/2016, పేజీ 18

    కావలికోట,

    1/1/2007, పేజీ 31

ఎఫెసీయులు 1:21

అధస్సూచీలు

  • *

    లేదా “ఈ యుగంలో.” పదకోశం చూడండి.

ఎఫెసీయులు 1:22

అధస్సూచీలు

  • *

    లేదా “తలగా.”

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/2007, పేజీలు 21-22

ఎఫెసీయులు 1:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    4/1/2007, పేజీలు 21-22

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.
  • క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
  • కొత్త లోక అనువాదంలో చదవండి
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
క్రైస్తవ గ్రీకు లేఖనాల కొత్త లోక అనువాదం
ఎఫెసీయులు 1:1-23

ఎఫెసీయులు

1 దేవుని ఇష్టప్రకారం క్రీస్తుయేసుకు అపొస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పవిత్రులకు, క్రీస్తుయేసు నమ్మకమైన శిష్యులకు రాస్తున్న ఉత్తరం.

2 మన తండ్రైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు మీకు అపారదయను, శాంతిని ప్రసాదించాలి.

3 మన ప్రభువైన యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవునికి స్తుతి కలగాలి; ఆయన క్రీస్తు శిష్యులమైన మనకు పవిత్రశక్తి ద్వారా పరలోకంలో ప్రతీ వరాన్ని ఇచ్చి దీవించాడు. 4 ఎందుకంటే, మనం క్రీస్తుతో ఐక్యంగా ఉండాలని ప్రపంచం పుట్టకముందే* దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. మనం ప్రేమ చూపిస్తూ ఆయన ముందు పవిత్రులుగా, మచ్చలేనివాళ్లుగా ఉండాలని అలా చేశాడు. 5 ఆయన తన సంతోషం కోసం, తన ఇష్టప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనల్ని సొంత పిల్లలుగా దత్తత తీసుకోవాలనే ఉద్దేశంతో మనల్ని ముందే ఎంచుకున్నాడు. 6 ఆయన తన ప్రియ కుమారుడి ద్వారా మనపై అపారదయ చూపించినందుకు ప్రజలు తనను స్తుతించాలని అలా చేశాడు. 7 ఆ కుమారుడి ద్వారా మనం విడుదల పొందే మార్గం తెరవబడింది. అవును, ఆయన రక్తం ద్వారానే దేవుడు విమోచన క్రయధనం చెల్లించాడు. దాని ద్వారానే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. దేవుని అపారదయ నిజంగా ఎంతో గొప్పది!

8 దేవుడు ఆ అపారదయను తెలివి, అవగాహన* రూపంలో మనకు పుష్కలంగా ఇచ్చాడు, 9 తన సంకల్పం గురించిన పవిత్ర రహస్యాన్ని మనకు తెలియజేశాడు. ఈ రహస్యం ఆయన ఇష్టానికి, ఆయన సంకల్పానికి అనుగుణంగా ఉంది. 10 నియమిత కాలం ముగిసినప్పుడు, అన్నిటినీ అంటే అటు పరలోకంలో ఉన్నవాటిని, ఇటు భూమ్మీద ఉన్నవాటిని క్రీస్తులో ఐక్యం చేసే ఒక వ్యవహార నిర్వహణను* ఏర్పాటు చేయాలనేది ఆయన సంకల్పం. అవును, క్రీస్తులోనే అన్నీ ఐక్యమౌతాయి. 11 యూదులమైన మేము ఆయనలో ఐక్యమై ఉన్నాం, వారసులుగా నియమితులమయ్యాం. ఎందుకంటే దేవుడు తన సంకల్పం ప్రకారం మమ్మల్ని ముందే ఎంచుకున్నాడు. ఆయన ప్రతీది తన ఇష్టప్రకారం చేస్తాడు. 12 క్రీస్తు మీద విశ్వాసం ఉంచినవాళ్లలో మేము మొదటివాళ్లం. మా ద్వారా స్తుతి, మహిమ పొందాలని దేవుడు మమ్మల్ని అలా ఎంచుకున్నాడు. 13 అయితే అన్యులైన మీరు కూడా సత్యాన్ని విన్నాక అంటే, మీ రక్షణ గురించిన మంచివార్తను విన్నాక క్రీస్తు మీద విశ్వాసం ఉంచారు. మీరు ఆయన్ని నమ్మిన తర్వాత, దేవుడు తాను వాగ్దానం చేసిన పవిత్రశక్తితో మీకు ముద్ర వేశాడు. దీని కోసం ఆయన క్రీస్తును ఉపయోగించుకున్నాడు. 14 మనం తప్పకుండా వారసత్వాన్ని పొందుతామనడానికి దేవుడు మనకు ముందుగా ఇచ్చిన గుర్తే* ఆ పవిత్రశక్తి. దేవుడు మూల్యం చెల్లించి తన ప్రజల్ని విడిపించడానికి అలా ముద్ర వేశాడు. దానివల్ల ఆయనకు ఎంతో స్తుతి కలుగుతుంది.

15 ప్రభువైన యేసు మీద మీకున్న విశ్వాసం గురించి, పవిత్రులందరి మీద మీరు చూపించే ప్రేమ గురించి నేను విన్నాను. కాబట్టి నేను కూడా 16 మీ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్తూనే ఉన్నాను. నా ప్రార్థనల్లో మీ గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాను. 17 మన ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడు, తేజోమయుడైన తండ్రి మీకు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. అప్పుడు మీరు తెలివిగల వాళ్లుగా ఉంటారు, దేవుడు వెల్లడిచేసే విషయాల్ని అర్థం చేసుకుంటారు, అలా మీరు ఆయన గురించిన సరైన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. 18 మీరు స్పష్టంగా చూడాలని ఆయన మీ హృదయాల్ని తెరిచాడు. దీనివల్ల, ఆయన దేనికోసం మిమ్మల్ని పిలిచాడో, దేనికోసం మీరు ఎదురుచూస్తున్నారో, పవిత్రులకు వారసత్వంగా ఇవ్వడానికి ఆయన ఏ గొప్ప సంపదల్ని సిద్ధం చేశాడో మీరు తెలుసుకోగలుగుతారు. 19 విశ్వాసులమైన మనమీద పనిచేసే ఆయన శక్తి ఎంత గొప్పదో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఆ శక్తి ఎంత గొప్పదనే విషయం 20 ఆయన క్రీస్తును బ్రతికించి, పరలోకంలో తన కుడివైపున కూర్చోబెట్టుకున్నప్పుడు రుజువైంది. 21 దేవుడు క్రీస్తుకు ఇచ్చిన ఆ స్థానం ప్రభుత్వాలన్నిటి కన్నా, అధికారాలన్నిటి కన్నా, శక్తులన్నిటి కన్నా, పరిపాలనలన్నిటి కన్నా, పేర్లన్నిటి కన్నా ఎంతో ఉన్నతమైనది. ఈ వ్యవస్థలో* ఉన్నవే కాదు రానున్న వ్యవస్థలో ఉండే అన్నిటికన్నా కూడా అది ఉన్నతమైనది. 22 అంతేకాదు దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘానికి సంబంధించిన వాటన్నిటికీ ఆయన్ని శిరస్సుగా* నియమించాడు. 23 సంఘం ఆయన శరీరం; అది ఆయన లక్షణాలతో నిండివుంది. ఆయనే అన్నిటినీ సంపూర్ణం చేస్తాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి