దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2015 ఫిబ్రవరి 23తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
సెలోపెహాదు కుమార్తెలు ఎలాంటి మాదిరినుంచారు? (యెహో. 17:3, 4) [జన. 5, w08 2/15 4వ పేజీ, 10వ పేరా]
యెహోషువ 23:14లోని మాటల్ని యెహోషువ ఎలా పూర్తి నమ్మకంతో చెప్పాడు, యెహోవా వాగ్దానాలపై మనమెందుకు పూర్తి నమ్మకం ఉంచవచ్చు? [జన. 12, w07 11/1 26వ పేజీ, 19వ పేరా]
తమకివ్వబడిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే మొదటి గోత్రం యూదా ఎందుకు అయ్యింది? (న్యాయా. 1:2, 4) [జన. 19, w05 1/15 24వ పేజీ, 5వ పేరా]
దెబోరా ప్రవక్త్రిని తనతోపాటు యుద్ధరంగానికి రావాలని బారాకు ఎందుకు పట్టుపట్టాడు? (న్యాయా. 4:8) [జన. 19, w05 1/15 25వ పేజీ, 5వ పేరా]
గిద్యోను దేవదూతను ఒక సూచన అడగడం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 6:17-22, 36-40) [జన. 26, w05 1/15 26వ పేజీ, 6వ పేరా]
గిద్యోను చూపించిన వినయం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 6:11-15; 8:1-3, 22, 23) [ఫిబ్ర. 2, w05 1/15 26వ పేజీ, 5వ పేరా]
యెఫ్తా యెహోవాకు మొక్కుకున్నప్పుడు మానవ బలి అర్పించాలని తలంచాడా? (న్యాయా. 11:30, 31) [ఫిబ్ర. 9, w05 1/15 26వ పేజీ, 1వ పేరా]
న్యాయాధిపతులు 11:35-37 ప్రకారం తండ్రి ప్రమాణాన్ని నెరవేర్చేలా యెఫ్తా కుమార్తెకు ఏది సహాయం చేసింది? [ఫిబ్ర. 9, w11 12/15 20-21 పేజీలు, 15-16 పేరాలు]
ఇశ్రాయేలులో ఏ రాజూ లేని పరిస్థితిలో ‘ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించడం’ అల్లకల్లోలాన్ని సృష్టించిందా? వివరించండి. (న్యాయా. 17:6) [ఫిబ్ర. 16, w05 1/15 27వ పేజీ, 8వ పేరా]
విపరీతంగా ప్రవర్తించిన బెన్యామీను గోత్రం చేతిలో రెండు సార్లు ఓడిపోయిన ఇశ్రాయేలీయుల నుండి ప్రార్థిస్తూ ఉండడం గురించి మనమేమి నేర్చుకోవచ్చు? (న్యాయా. 20:14-48) [ఫిబ్ర. 23, w05 1/15 27వ పేజీ, 8వ పేరా]