కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w13 8/15 పేజీ 8
  • పాఠకుల ప్రశ్న

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్న
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • బహిష్కరించబడిన వ్యక్తితో ఎలా ప్రవర్తించాలి?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • మీ సొంతవాళ్ళు బహిష్కరించబడినప్పుడు క్రైస్తవ విశ్వసనీయతను కనబర్చండి
    మన రాజ్య పరిచర్య—2002
  • కుటుంబం కన్నా యెహోవాను ఎక్కువగా ప్రేమించాలి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • నేడు దేవుని కనికరమును అనుకరించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
w13 8/15 పేజీ 8

పాఠకుల ప్రశ్న

సంఘకూటాల్లో క్రైస్తవ తల్లిదండ్రులు, బహిష్కృతుడైన తమ పిల్లవాడితో కలిసి కూర్చోవడం సరైనదేనా?

బహిష్కృతుడైన వ్యక్తి రాజ్యమందిరంలో ఎక్కడ కూర్చోవాలనే దానిగురించి మనం అనవసరంగా చింతించాల్సిన పనిలేదు. ఇంట్లో ఇంకా తమతోనే కలిసి నివసిస్తున్న బహిష్కృతుడైన పిల్లవాడికి కావాల్సిన ఆధ్యాత్మిక సహాయాన్ని అందించడం సముచితమని తల్లిదండ్రులకు అనిపిస్తే, అలా చేయమని వాళ్లను ప్రోత్సహించడానికి ఈ పత్రిక అన్నివిధాలా ప్రయత్నించింది. కావలికోట అక్టోబరు 1, 2001 సంచికలోని 16-18 పేజీలు సూచించినట్లుగా, తమతోనే కలిసి నివసిస్తున్న బహిష్కృతుడైన మైనరు బాలుడితో తల్లిదండ్రులు బైబిలు అధ్యయనం కూడా చేయవచ్చు. అలా ఆ పిల్లవాడుa తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని పొందుతాడని ఆశించవచ్చు.

రాజ్యమందిరంలో కూర్చునే ఏర్పాట్ల విషయానికొస్తే, బహిష్కృతుడైన మైనరు పిల్లవాడు కూడా తల్లిదండ్రులతో మౌనంగా కూర్చోవడం సహేతుకంగానే ఉంటుంది. బహిష్కృతుడైన వ్యక్తి రాజ్యమందిరంలో వెనకాలే కూర్చోవాల్సిన అవసరం లేదు కాబట్టి, తల్లిదండ్రులు ఎక్కడ కూర్చుంటే అక్కడ బహిష్కృతుడైన పిల్లవాడు వాళ్లతో కలిసి కూర్చోవడంలో అభ్యంతరమేమీ ఉండకూడదు. ఆధ్యాత్మిక విషయాల్లో పిల్లవాడి పట్ల శ్రద్ధ తీసుకునేది తల్లిదండ్రులే కాబట్టి, వాళ్లు తమ పిల్లవాడు కూటాల నుండి పూర్తి ప్రయోజనం పొందేటట్లు చూసుకోవాలి. ఆ పిల్లవాడిని పట్టించుకోకుండా ఎక్కడో కూర్చోనిచ్చే బదులు తమ పక్కనే కూర్చోబెట్టుకోవడం సహాయకరంగా ఉంటుంది.

మరి బహిష్కృతుడైన పిల్లవాడు తల్లిదండ్రులతో నివసించకపోతుంటే, అప్పుడేంటి? అలాంటప్పుడు ఆ పిల్లవాడు కూటాల్లో తల్లిదండ్రులతో పాటు కూర్చోకూడదా? ఇంట్లో తమతోపాటు నివసించని బహిష్కృతుడైన కుటుంబ సభ్యునితో సహవసించే విషయంలో క్రైస్తవులు కలిగి ఉండాల్సిన సరైన దృక్పథం ఏంటో గతంలో మన ప్రచురణలు స్పష్టంగా పేర్కొన్నాయి.b అయితే, బహిష్కృతుడైన వ్యక్తిని, తన కుటుంబ సభ్యులు తమతో కలిసి మౌనంగా కూర్చోనివ్వడానికీ, వాళ్లు అతనితో సహవసించేందుకు అనవసరంగా ప్రయత్నించడానికీ మధ్య చాలా తేడా ఉంది. బహిష్కృతుడైన ఆ సభ్యునిపట్ల సత్యంలో ఉన్న కుటుంబ సభ్యులకు సరైన వైఖరి ఉండి, అతనితో సహవసించే విషయంలో లేఖన ఉపదేశాన్ని పాటించడానికి వాళ్లు ప్రయత్నిస్తుంటే, ఆయన ఎక్కడ కూర్చోవాలనే విషయం గురించి అతిగా చింతించాల్సిన అవసరం లేదు.—1 కొరిం. 5:11, 13; 2 యోహా. 11.

కాబట్టి బహిష్కృతుడైన వ్యక్తి రాజ్యమందిరంలో సరైన విధంగా ప్రవర్తిస్తున్నంత వరకు, ఆయన తన కుటుంబ సభ్యుల పక్కన కూర్చున్నా లేదా వేరేవాళ్ల పక్కన కూర్చున్నా ఆ విషయం గురించి చింతించకూడదు. ఒక వ్యక్తి ఎక్కడ కూర్చోవాలనే దాని గురించి నియమాలు విధిస్తే, అది ఆయా పరిస్థితులను బట్టి ఇతర సమస్యలకు దారితీయవచ్చు. కూటానికి వచ్చిన బహిష్కృత సభ్యునితో సహా ఆ కుటుంబ సభ్యులందరూ బహిష్కరణ ఏర్పాటుకు సంబంధించిన బైబిలు సూత్రాలను గౌరవించడానికి కృషి చేస్తూ, సహోదరులకు ఎలాంటి అభ్యంతరాన్ని కలగజేయకుండా ఉంటే, క్రైస్తవ కూటాలకు వచ్చినవాళ్లు ఎక్కడ కూర్చోవాలనే దాని గురించి రాద్ధాంతం చేయనవసరం లేదు.c

a ఈ ఆర్టికల్‌ అంతటిలో బహిష్కృతుడైన మైనరును అబ్బాయిగానే ప్రస్తావించినా, ఇందులోని విషయాలు బహిష్కృతులైన మైనరు అమ్మాయిలకు కూడా వర్తిస్తాయి.

b ‘దేవుని ప్రేమలో నిలిచివుండండి’ పుస్తకంలోని 237-239 పేజీలు చూడండి.

c ఇది, కావలికోట ఏప్రిల్‌ 1, 1953 ఆంగ్ల సంచికలోని 223వ పేజీలో వచ్చిన సమాచారాన్ని సవరిస్తోంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి