కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • od పేజీలు 193-205
  • 2వ భాగం: క్రైస్తవ జీవితం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • 2వ భాగం: క్రైస్తవ జీవితం
  • యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీలాగే మీ పొరుగువాళ్లను ప్రేమిస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • క్రైస్తవులు తమ వివాహబంధాన్ని ఎలా సంతోషమయం చేసుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
od పేజీలు 193-205

బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లకోసం ప్రశ్నలు

2వ భాగం: క్రైస్తవ జీవితం

యెహోవా మీ నుండి ఏమి కోరుతున్నాడో, అలాగే ఆయన నీతి ప్రమాణాలను మీరు ఎలా పాటించాలో బైబిలు అధ్యయనం ద్వారా తెలుసుకున్నారు. మీరు నేర్చుకున్న వాటికి అనుగుణంగా మీ ప్రవర్తనలో ఎన్నో మార్పులు చేసుకుని ఉంటారు, జీవితం విషయంలో మీ వైఖరి మార్చుకుని ఉంటారు. ఇప్పుడు మీరు యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం జీవించాలని తీర్మానించుకున్నారు కాబట్టి, మంచివార్త ప్రచారకులుగా ఉండడానికి అర్హులయ్యారు.

ఇప్పుడు చర్చించబోయే ప్రశ్నలు, మీరు యెహోవా నీతి ప్రమాణాలను మనసులో స్పష్టంగా ముద్రించుకోవడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు, మీరు దేవుని సమర్పిత సేవకుల్లో ఒకరిగా ఉండాలంటే ఇంకా ఏమి చేయవచ్చో కూడా అవి మీకు గుర్తుచేస్తాయి. ప్రతీ పనిని మంచి మనస్సాక్షితో, యెహోవాను ఘనపర్చేలా చేయడం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకోవడానికి ఈ సమాచారం మీకు సహాయం చేస్తుంది.—2 కొరిం. 1:12; 1 తిమో. 1:19; 1 పేతు. 3:16, 21.

అధ్యయనం చేస్తూ మీరు ఇక్కడి దాకా వచ్చారు కాబట్టి మీరు తప్పకుండా యెహోవా పరిపాలనకు లోబడడానికి, ఆయన సంస్థలో భాగం కావడానికి ఉత్సాహంగా ఉండివుంటారు. సంఘంలో, కుటుంబంలో లేదా ఈ లోక వ్యవస్థలోని ప్రభుత్వాలకు సంబంధించి యెహోవా చేసిన ఏర్పాటుకు చూపించాల్సిన విధేయతను మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారో పరిశీలించుకోవడానికి కింది ప్రశ్నలు, లేఖనాలు మీకు సహాయం చేస్తాయి. తన ప్రజలకు ఆధ్యాత్మిక విద్యను అందించడానికి, వాళ్లను బలపర్చడానికి యెహోవా చేసిన ఏర్పాట్ల పట్ల మీ మెప్పుదల ఇంకా పెరుగుతుంది.

మీ పరిస్థితులు అనుమతించిన మేరకు మీరు హాజరై, భాగం వహించాలనుకునే సంఘ కూటాలు కూడా ఆ ఏర్పాట్లలో ఒక భాగమే. అంతేకాదు, ఇతరులు యెహోవాను తెలుసుకునేలా, మనుషుల కోసం ఆయనేమి చేస్తున్నాడో గ్రహించేలా వాళ్లకు సహాయం చేస్తూ రాజ్య ప్రకటనా పనిని క్రమంగా చేయడం ఎంత ప్రాముఖ్యమో ఈ భాగంలో పరిశీలిస్తాం. (మత్త. 24:14; 28:19, 20) చివరిగా, యెహోవా దేవునికి మీరు చేసుకునే సమర్పణ, మీరు తీసుకునే బాప్తిస్మం గంభీరతను మీరు ఎప్పుడూ గుర్తుంచుకునేలా కూడా ఈ భాగం సహాయం చేస్తుంది. యెహోవా మీ పట్ల చూపించిన అపారదయకు మీరు మనస్ఫూర్తిగా స్పందించడం ఆయన చూసినప్పుడు, ఆయన దాన్ని విలువైనదిగా ఎంచుతాడనే నమ్మకంతో మీరు ఉండవచ్చు.

1. పెళ్లి విషయంలో క్రైస్తవ ప్రమాణం ఏమిటి? లేఖనాధారంగా విడాకులు తీసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణమేమిటి?

• “మీరు ఇది చదవలేదా? దేవుడు మొదట్లో వాళ్లను సృష్టించినప్పుడు పురుషునిగా, స్త్రీగా సృష్టించి ఇలా అన్నాడు: ‘అందుకే, పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెట్టి తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు.’ కాబట్టి వాళ్లు ఇక ఇద్దరుగా కాదుగానీ ఒకే శరీరంగా ఉంటారు. అందుకే దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు. . . . లైంగిక పాపం అనే కారణాన్ని బట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.”—మత్త. 19:4-6, 9.

2. భార్యభర్తల్లా కలిసి జీవిస్తున్నవాళ్లు ఎందుకు చట్టబద్ధంగా పెళ్లిచేసుకొని ఉండాలి? మీకు పెళ్లయితే, మీ పెళ్లి చట్టబద్ధమైనదేనా, దానికి ప్రభుత్వ గుర్తింపు ఉందా?

• “ప్రభుత్వాలకు, అధికారాలకు లోబడమని, విధేయులుగా ఉండమని . . . వాళ్లకు గుర్తుచేస్తూ ఉండు.”—తీతు 3:1.

• “వివాహాన్ని అందరూ గౌరవప్రదమైనదిగా చూడాలి, భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకద్రోహం చేసుకోకూడదు. లైంగిక పాపం చేసేవాళ్లకు, వ్యభిచారం చేసేవాళ్లకు దేవుడు తీర్పుతీరుస్తాడు.”—హెబ్రీ. 13:4.

3. కుటుంబంలో మీ పాత్ర ఏమిటి?

• “నా కుమారుడా, మీ నాన్న క్రమశిక్షణను స్వీకరించు, మీ అమ్మ ఉపదేశాన్ని విడిచిపెట్టకు.”—సామె. 1:8.

• “సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సుగా, రక్షకుడిగా ఉన్నట్టే, భర్త కూడా తన భార్యకు శిరస్సుగా ఉన్నాడు. భర్తలారా, క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు . . . అలాగే మీరు కూడా మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి.”—ఎఫె. 5:23, 25.

• “తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి; బదులుగా యెహోవా నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను, ఉపదేశాన్ని ఇస్తూ వాళ్లను పెంచండి.”—ఎఫె. 6:4.

• “పిల్లలారా, ప్రతీ విషయంలో మీ అమ్మానాన్నల మాట వినండి. ఇది ప్రభువుకు ఇష్టం.”—కొలొ. 3:20.

• “భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడివుండండి.”—1 పేతు. 3:1.

4. జీవం పట్ల మనం ఎందుకు గౌరవం చూపించాలి?

• “[దేవుడు] అందరికీ ప్రాణాన్ని, ఊపిరిని, అన్నిటినీ ఇస్తున్నాడు. ఆయన వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం.”—అపొ. 17:25, 28.

5. మనం కడుపులో ఉన్న బిడ్డతో సహా, ఎవ్వర్నీ ఎందుకు చంపకూడదు?

• “మనుషులు పోట్లాడుకుంటున్నప్పుడు ఒక గర్భిణీ స్త్రీకి దెబ్బ తగిలి . . . ప్రాణాపాయం జరిగితే, ప్రాణానికి ప్రాణం చెల్లించాలి.”—నిర్గ. 21:22, 23.

• “నేను పిండంగా ఉన్నప్పుడే నీ కళ్లు నన్ను చూశాయి; దాని భాగాల్లో ఏ ఒక్కటీ తయారవ్వకముందే, అవన్నీ రూపొందిన రోజుల గురించి నీ గ్రంథంలో రాయబడింది.”—కీర్త. 139:16.

• ‘యెహోవా అమాయకుల రక్తం చిందించే చేతుల్ని ద్వేషిస్తాడు.’—సామె. 6:16, 17.

6. రక్తం విషయంలో దేవుని ఆజ్ఞ ఏమిటి?

• “రక్తానికి, గొంతు పిసికి చంపినవాటికి . . . దూరంగా ఉండండి.”—అపొ. 15:29.

7. మన క్రైస్తవ సహోదర సహోదరీలను ఎందుకు ప్రేమించాలి?

• “నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.”—యోహా. 13:34, 35.

8. ప్రాణాంతకమైన అంటువ్యాధులు ఇతరులకు సోకకుండా ఉండేందుకు: (ఎ) ఆ వ్యాధికి గురైన వ్యక్తి ఇతరుల్ని కౌగలించుకోవడం, ముద్దులు పెట్టడం లాంటివి ఎందుకు చేయకూడదు? (బి) ఎవరైనా తమ ఇంటికి అతన్ని ఆహ్వానించకపోతే అతను ఎందుకు తప్పుగా అనుకోకూడదు? (సి) అంటువ్యాధికి గురైన వ్యక్తి కోర్ట్‌షిప్‌ మొదలుపెట్టే ముందు రక్త పరీక్ష చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ఎందుకు ముందుకు రావాలి? (డి) అంటువ్యాధి ఉన్న వ్యక్తి బాప్తిస్మానికి ముందే ఆ విషయాన్ని పెద్దల సభ సమన్వయకర్తకు ఎందుకు తెలియజేయాలి?

• “ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో తప్ప ఎవ్వరికీ ఏమీ రుణపడి ఉండకండి; . . . ‘నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని ప్రేమించాలి’ . . . ప్రేమ సాటిమనిషికి హాని తలపెట్టదు.”—రోమా. 13:8-10.

• “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.”—ఫిలి. 2:4.

9. మనం ఇతరుల్ని క్షమించాలని యెహోవా ఎందుకు ఆశిస్తున్నాడు?

• “ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి. ఇతరుల మీద ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నాసరే అలా క్షమించండి. యెహోవా మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.”—కొలొ. 3:13.

10. ఒక సహోదరుడు మీ గురించి లేనిపోనివి కల్పించి చెప్తే లేదా మిమ్మల్ని మోసం చేస్తే మీరేం చేయాలి?

• “నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా పాపం చేస్తే, నువ్వు వెళ్లి, మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి. అతను నీ మాట వింటే, నువ్వు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నట్టే. కానీ అతను నీ మాట వినకపోతే, నీతోపాటు ఒకరిద్దర్ని తీసుకెళ్లు. అలా ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా ప్రతీ విషయం నిర్ధారించబడుతుంది. అతను వాళ్ల మాట వినకపోతే, సంఘానికి ఆ విషయం తెలియజేయి. అతను సంఘం మాట కూడా వినకపోతే, అతన్ని నీకు అన్యజనుల్లో ఒకడిగా, పన్ను వసూలుచేసేవాడిగా ఉండనీ.”—మత్త. 18:15-17.

11. యెహోవా ఈ కింది పాపాల్ని ఎలా పరిగణిస్తాడు?

▪ లైంగిక పాపం

▪ ఆరాధనలో విగ్రహాల్ని ఉపయోగించడం

▪ ఆడవాళ్లు ఆడవాళ్లతో, మగవాళ్లు మగవాళ్లతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం

▪ దొంగతనం

▪ జూదం

▪ తాగుబోతుతనం

• “మోసపోకండి. లైంగిక పాపం చేసేవాళ్లు, విగ్రహాల్ని పూజించేవాళ్లు, వ్యభిచారులు, ఆడంగివాళ్లు, స్వలింగ సంపర్కులైన పురుషులు, దొంగలు, అత్యాశపరులు, తాగుబోతులు, తిట్టేవాళ్లు, దోచుకునేవాళ్లు దేవుని రాజ్యానికి వారసులు అవ్వరు.”—1 కొరిం. 6:9, 10.

12. లైంగిక పాపం విషయంలో, అంటే వివాహజతతో కాకుండా వేరేవాళ్లతో పెట్టుకునే రకరకాల లైంగిక సంబంధాల విషయంలో మీరేమి తీర్మానించుకున్నారు?

• “లైంగిక పాపానికి దూరంగా పారిపోండి!”—1 కొరిం. 6:18.

13. వైద్య కారణాన్నిబట్టి కాకుండా, వ్యసనంగా ఉపయోగించే లేదా మెదడుపై ప్రభావం చూపించే అన్నిరకాల మత్తు పదార్థాలకు క్రైస్తవులు ఎందుకు దూరంగా ఉండాలి?

• “మీ శరీరాల్ని సజీవమైన, పవిత్రమైన, దేవునికి ఇష్టమైన బలిగా అప్పగించండి, మీ ఆలోచనా సామర్థ్యాల్ని ఉపయోగించి పవిత్రసేవ చేయండి. ఇకమీదట ఈ వ్యవస్థ మిమ్మల్ని మలచనివ్వకండి. బదులుగా మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి. అలా మీరు మంచిది, ఆమోదయోగ్యమైనది, సంపూర్ణమైనది అయిన దేవుని ఇష్టాన్ని పరీక్షించి తెలుసుకోగలుగుతారు.”—రోమా. 12:1, 2.

14. చెడ్డదూతలకు సంబంధించిన ఎలాంటి ఆచారాలను దేవుడు నిషేధిస్తున్నాడు?

• “ఇలాంటివాళ్లు నీ మధ్య ఉండకూడదు: . . . సోదె చెప్పేవాడు, ఇంద్రజాలం చేసేవాడు, శకునాలు చూసేవాడు, మంత్రగాడు, మంత్రం వేసి ఇతరుల్ని బంధించేవాడు, చనిపోయినవాళ్లతో మాట్లాడేవాణ్ణి గానీ భవిష్యత్తు చెప్పేవాణ్ణి గానీ సంప్రదించేవాడు, చనిపోయినవాళ్ల దగ్గర విచారణ చేసేవాడు.”—ద్వితీ. 18:10, 11.

15. ఒక వ్యక్తి గంభీరమైన పాపం చేసి యెహోవా అనుగ్రహం తిరిగి పొందాలనుకుంటే అతను వెంటనే ఏం చేయాలి?

• “నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకున్నాను; నా తప్పును దాచిపెట్టలేదు. ‘నా అపరాధాల్ని యెహోవా దగ్గర ఒప్పుకుంటాను’ అని అనుకున్నాను.”—కీర్త. 32:5.

• “మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? అతను సంఘ పెద్దల్ని పిలవాలి, వాళ్లు యెహోవా పేరున అతనికి నూనె రాసి, అతని కోసం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో చేసే ప్రార్థన ఆ రోగిని బాగుచేస్తుంది, యెహోవా అతన్ని లేపుతాడు. అంతేకాదు, ఒకవేళ అతను పాపాలు చేసివుంటే, క్షమాపణ పొందుతాడు.”—యాకో. 5:14, 15.

16. తోటి క్రైస్తవుడు గంభీరమైన తప్పు చేశాడని మీకు తెలిస్తే మీరేమి చేయాలి?

• “జరిగిన ఒక తప్పు గురించి సాక్ష్యం చెప్పమనే పిలుపు వచ్చినప్పుడు, ఆ తప్పు విషయంలో సాక్షిగా ఉన్న, లేదా దాన్ని చూసిన, లేదా దాని గురించి తెలిసిన ఒక వ్యక్తి దాని గురించి చెప్పకుండా పాపం చేస్తే, అతను తన తప్పుకు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.”—లేవీ. 5:1.

17. ఒక వ్యక్తి ఇకమీదట యెహోవాసాక్షిగా ఉండడు అనే ప్రకటన చేసినప్పుడు మనం అతనితో ఎలా వ్యవహరించాలి?

• “ఒక సహోదరుడు లైంగిక పాపి గానీ, అత్యాశపరుడు గానీ, విగ్రహాల్ని పూజించేవాడు గానీ, తిట్టేవాడు గానీ, తాగుబోతు గానీ, దోచుకునేవాడు గానీ అయితే అతనితో సహవాసం మానేయాలి, కనీసం అతనితో కలిసి భోజనం కూడా చేయకూడదు.”—1 కొరిం. 5:11.

• “ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఆ బోధలకు అనుగుణంగా బోధించకపోతే, అతన్ని మీ ఇంట్లోకి రానివ్వకండి, అతన్ని పలకరించకండి.”—2 యోహా. 10.

18. యెహోవాను ప్రేమించేవాళ్లను మాత్రమే ఎందుకు దగ్గరి స్నేహితులుగా చేసుకోవాలి?

• “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు.”—సామె. 13:20.

• “మోసపోకండి. చెడు సహవాసాలు మంచి అలవాట్లను పాడుచేస్తాయి.”—1 కొరిం. 15:33.

19. యెహోవాసాక్షులు రాజకీయాల్లో ఎందుకు ఎవ్వరి పక్షం వహించరు?

• “నేను [యేసు] లోకసంబంధిని కానట్టే వాళ్లు కూడా లోకసంబంధులు కారు.”—యోహా. 17:16.

20. మీరు ప్రభుత్వానికి ఎందుకు లోబడాలి?

• “ప్రతీ ఒక్కరు పై అధికారాలకు లోబడివుండాలి, ఎందుకంటే అధికారాలన్నీ దేవుని అనుమతితోనే ఉనికిలో ఉన్నాయి; ఇప్పుడున్న అధికారాల్ని దేవుడే వాటివాటి స్థానాల్లో ఉంచాడు.”—రోమా. 13:1.

21. దేవుడు పెట్టిన నియమానికి మనుషుల చట్టం అడ్డు వస్తే మీరేమి చేస్తారు?

• “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.”—అపొ. 5:29.

22. ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు లోకానికి దూరంగా ఉండడానికి ఏ లేఖనాలు మీకు సహాయం చేయవచ్చు?

• “దేశం మీదికి దేశం ఖడ్గం ఎత్తదు, వాళ్లిక యుద్ధం చేయడం నేర్చుకోరు.”—మీకా 4:3.

• “నా ప్రజలారా, మీరు ఆమె [మహా బబులోను] పాపాల్లో భాగస్థులు అవ్వకూడదని, ఆమె తెగుళ్లలో పాలుపంచుకోకూడదని అనుకుంటే అక్కడి నుండి బయటికి రండి.”—ప్రక. 18:4.

23. మీరు ఎలాంటి వినోదాన్ని, ఉల్లాస కార్యకలాపాల్ని ఎంచుకుంటారు? వేటిని తిరస్కరిస్తారు?

• “యెహోవా[కు] . . . హింసను ప్రేమించేవాళ్లంటే అసహ్యం.”—కీర్త. 11:5.

• “చెడ్డదాన్ని అసహ్యించుకోండి; మంచిదాన్ని అంటిపెట్టుకొని ఉండండి.”—రోమా. 12:9.

• “ఏవి నిజమైనవో, ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి నీతిగలవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ప్రేమించదగినవో, ఏవి గౌరవప్రదమైనవో, ఏవి మంచివో, ఏవి పొగడదగినవో వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి.”—ఫిలి. 4:8.

24. యెహోవాసాక్షులు ఇతర మత గుంపులతో కలిసి ఎందుకు ఆరాధించరు?

• “మీరు యెహోవా గిన్నెలోది తాగుతూ, చెడ్డదూతల గిన్నెలోది తాగలేరు.”—1 కొరిం. 10:21.

• “‘మీరు వాళ్ల మధ్య నుండి బయటికి వచ్చేసి, వేరుగా ఉండండి,’ ‘అపవిత్రమైనదాన్ని ముట్టకండి,’ అని యెహోవా చెప్తున్నాడు”; “‘అప్పుడు, నేను మిమ్మల్ని స్వీకరిస్తాను.’”—2 కొరిం. 6:17.

25. ఒక వేడుకలో భాగం వహించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ఏ సూత్రాలు మీకు సహాయం చేస్తాయి?

• “దేశాల ప్రజలతో కలిసిపోయి వాళ్ల పద్ధతులు అనుసరించారు. వాళ్ల విగ్రహాల్ని సేవించడం మొదలుపెట్టారు, అవి వాళ్లకు ఉరిగా తయారయ్యాయి.”—కీర్త. 106:35, 36.

• “చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు.”—ప్రసం. 9:5.

• “నేను లోకసంబంధిని కానట్టే వాళ్లు కూడా లోకసంబంధులు కారు.”—యోహా. 17:16.

• “గతంలో మీరు లెక్కలేనట్టు ప్రవర్తిస్తూ, అదుపులేని వాంఛలు తీర్చుకుంటూ, అతిగా తాగుతూ, విచ్చలవిడి విందులు చేసుకుంటూ, తాగుబోతుల విందుల్లో పాల్గొంటూ, అసహ్యమైన విగ్రహపూజలు చేస్తూ లోక ప్రజల ఇష్టప్రకారం జీవించారు. అవన్నీ చేయడానికి గతంలో మీరు వెచ్చించిన సమయం చాలు.”—1 పేతు. 4:3.

26. పుట్టినరోజులు జరుపుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే విషయంలో బైబిలు ఉదాహరణలు మీకెలా సహాయం చేస్తాయి?

• “మూడో రోజు ఫరో పుట్టినరోజు. ఆ రోజు అతను తన సేవకులందరికీ విందు ఏర్పాటుచేశాడు. అప్పుడు తన సేవకుల సమక్షంలో ఫరో ఆ ప్రధాన పానదాయకుణ్ణి, ప్రధాన వంటవాణ్ణి చెరసాల నుండి బయటికి రప్పించాడు. తర్వాత ప్రధాన పానదాయకుడికి అతని ఉద్యోగాన్ని తిరిగిచ్చాడు. . . . ప్రధాన వంటవాణ్ణి కొయ్యకు వేలాడదీయించాడు.”—ఆది. 40:20-22.

• “హేరోదు పుట్టినరోజు వేడుక జరుగుతున్న సమయంలో, హేరోదియ కూతురు నాట్యం చేసి హేరోదును చాలా సంతోషపెట్టింది. కాబట్టి ఆమె ఏది అడిగినా ఇస్తానని అతను ప్రమాణం చేశాడు. అప్పుడు ఆమె వాళ్లమ్మ చెప్పినట్టు, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి ఇవ్వు” అని అడిగింది. ఒక భటుణ్ణి పంపించి, చెరసాలలో యోహాను తలను నరికించాడు.”—మత్త. 14:6-8, 10.

27. మీరు సంఘ పెద్దల నిర్దేశాల్ని ఎందుకు పాటించాలని అనుకుంటున్నారు?

• “మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత చూపిస్తూ, వాళ్లకు లోబడివుండండి. ఎందుకంటే వాళ్లు మీ ప్రాణాలకు కాపలాగా ఉన్నారు, ఈ విషయంలో వాళ్లు దేవునికి లెక్క అప్పజెప్పాలి. మీరు అలా లోబడివుంటే వాళ్లు దుఃఖంతో కాకుండా సంతోషంతో ఆ పని చేయగలుగుతారు. ఒకవేళ వాళ్లు దుఃఖంతో ఆ పని చేయాల్సివస్తే మీకే నష్టం.”—హెబ్రీ. 13:17.

28. మీరు, మీ కుటుంబం బైబిలు చదవడానికి, అధ్యయనం చేయడానికి క్రమంగా కొంత సమయం వెచ్చించడం ఎందుకు ముఖ్యం?

• “అతను యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ, పగలూ రాత్రీ దాన్ని ధ్యానిస్తాడు. అతను నీటి కాలువల పక్కనే నాటబడి, దాని కాలంలో ఫలాలు ఇచ్చే పచ్చని చెట్టులా ఉంటాడు. అతను చేసే ప్రతీది సఫలమౌతుంది.”—కీర్త. 1:2, 3.

29. కూటాలకు హాజరై వాటిలో పాల్గొనడం మీకు ఎందుకు ఇష్టం?

• “నేను నీ పేరును నా సహోదరులకు ప్రకటిస్తాను; సమాజం మధ్యలో నిన్ను స్తుతిస్తాను.”—కీర్త. 22:22.

• “ప్రేమ చూపించేలా, మంచిపనులు చేసేలా పురికొల్పుకోవడానికి మనం ఒకరి గురించి ఒకరం ఆలోచిద్దాం. కూటాలు మానేయడం కొందరికి అలవాటు, కానీ మనం అలా మానేయకుండా ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ఉందాం, ఆ రోజు దగ్గరపడే కొద్దీ ఇంకా ఎక్కువగా ఇవన్నీ చేద్దాం.”—హెబ్రీ. 10:24, 25.

30. యేసు మనకు అప్పగించిన అతి ప్రాముఖ్యమైన పని ఏమిటి?

• “మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి; . . . వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి; నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.”—మత్త. 28:19, 20.

31. రాజ్య పనికి విరాళాలు ఇస్తున్నప్పుడు లేదా మన సహోదరసహోదరీలకు సహాయం చేస్తున్నప్పుడు మనకు ఎలాంటి వైఖరి ఉంటే యెహోవాకు నచ్చుతుంది?

• “నీకున్న విలువైన వాటితో, . . . యెహోవాను ఘనపర్చు.”—సామె. 3:9.

• “ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకున్నారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.”—2 కొరిం. 9:7.

32. క్రైస్తవులకు ఎలాంటి కష్టాలు ఎదురౌతాయని ఆశించవచ్చు?

• “నీతి కోసం హింసించబడేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది. మీరు నా శిష్యులు అనే కారణంతో ప్రజలు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ గురించి అబద్ధంగా అన్నిరకాల చెడ్డమాటలు మాట్లాడినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం వేచివుంది కాబట్టి సంతోషించండి, ఆనందంతో గంతులు వేయండి; ఎందుకంటే వాళ్లు అంతకుముందున్న ప్రవక్తల్ని కూడా ఇలాగే హింసించారు.”—మత్త. 5:10-12.

33. యెహోవాసాక్షుల్లో ఒకరిగా బాప్తిస్మం తీసుకోవడం ఒక ప్రత్యేకమైన అవకాశమని ఎందుకు చెప్పవచ్చు?

• “నీ మాటలు నాకు సంతోషాన్ని, నా హృదయానికి ఉల్లాసాన్ని ఇచ్చాయి, ఎందుకంటే సైన్యాలకు దేవుడివైన యెహోవా, నేను నీ పేరుతో పిలవబడుతున్నాను.”—యిర్మీ. 15:16.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి