కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 7 పేజీలు 16-17
  • యేసుక్రీస్తు ఎవరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసుక్రీస్తు ఎవరు?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగం 7
    దేవుడు చెప్పేది వినండి
  • యేసుక్రీస్తు ఎవరు?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • యేసుక్రీస్తు ఎవరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యేసుక్రీస్తు ఎవరు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 7 పేజీలు 16-17

భాగం 7

యేసుక్రీస్తు ఎవరు?

యెహోవా యేసును భూమ్మీదికి పంపించాడు. 1 యోహాను 4:9

పరలోకంలో దేవుని కుడివైపున యేసు

మనం యెహోవాను సంతోషపెట్టాలంటే, ఆయన కుమారుడు చెప్పేది కూడా వినాలి. ఆదామును సృష్టించడానికి చాలాకాలం ముందే యెహోవా పరలోకంలో ఒక బలమైన దేవదూతను సృష్టించాడు.

యేసు పుట్టకముందు, పుట్టిన తర్వాత మరియ

తర్వాత యెహోవా ఆయన్ని ఒక మనిషిగా భూమ్మీదికి పంపించాడు, ఆయన బేత్లెహేములో మరియ అనే కన్యకు పుట్టాడు. ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టారు.—యోహాను 6:38.

యేసు ఇతరులకు యెహోవా గురించి బోధిస్తున్నాడు

యేసు భూమ్మీద ఉన్నప్పుడు దేవుని లక్షణాలు పూర్తిగా చూపించాడు. ఆయన దయగా, ప్రేమగా ఉండేవాడు, ప్రజలు ఆయన దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడేవాళ్లు. ఆయన యెహోవా గురించిన సత్యాన్ని ధైర్యంగా బోధించాడు.

యేసు మంచి చేశాడు, కానీ చాలామంది ఆయన్ని ఇష్టపడలేదు. 1 పేతురు 2:21-24

యేసు ఒక అమ్మాయిని తిరిగి బ్రతికించాడు, అనారోగ్యంతో ఉన్న ఒకతన్ని బాగుచేశాడు

అంతేకాదు యేసు రోగుల్ని బాగుచేశాడు, చనిపోయినవాళ్లను బ్రతికించాడు.

యేసు మతనాయకుల అబద్ధ బోధల్ని, చెడుతనాన్ని బయటపెట్టేవాడు కాబట్టి వాళ్లకు ఆయనంటే కోపం.

యేసును కొట్టి, చంపుతున్నారు

మతనాయకులు యేసు గురించి అబద్ధాలు చెప్పి రోమన్ల చేత ఆయన్ని కొట్టించి, చంపించారు.

  • యేసు గురించి ఎందుకు తెలుసుకోవాలి?—యోహాను 17:3.

  • భూమ్మీదికి రాకముందు యేసు పరలోకంలో ఏం చేశాడు?—కొలొస్సయులు 1:15-17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి