కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 8 పేజీలు 18-19
  • యేసు చనిపోవడం వల్ల మనకెలా మేలు జరుగుతుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు చనిపోవడం వల్ల మనకెలా మేలు జరుగుతుంది?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగం 8
    దేవుడు చెప్పేది వినండి
  • దేవుని రాజ్యం అంటే ఏంటి?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • దేవుని రాజ్యం అంటే ఏమిటి?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • దేవుని రాజ్యం గురించి ఆయనేమి బోధించాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 8 పేజీలు 18-19

భాగం 8

యేసు చనిపోవడం వల్ల మనకెలా మేలు  జరుగుతుంది?

మనం బ్రతికుండడం కోసం యేసు చనిపోయాడు. యోహాను 3:16

యేసు సమాధి ఖాళీగా ఉండడం చూస్తున్న స్త్రీలు

యేసు చనిపోయిన మూడు రోజులకు కొంతమంది స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్లి చూశారు, కానీ అది ఖాళీగా ఉంది. అప్పటికే యెహోవా యేసును తిరిగి బ్రతికించాడు.

యేసు తన అపొస్తలులకు కనిపించాడు, తర్వాత పరలోకానికి వెళ్లిపోయాడు

తర్వాత యేసు తన అపొస్తలులకు కనిపించాడు.

యెహోవా యేసును ఒక బలమైన దేవదూతగా బ్రతికించాడు, ఆయన ఇక ఎప్పటికీ చనిపోడు. యేసు పరలోకానికి వెళ్లడం ఆయన శిష్యులు చూశారు.

  • పాపం వల్ల వచ్చే “జీతం” ఏంటి?—రోమీయులు 6:23.

  • యేసు నిరంతర జీవితానికి మార్గం తెరిచాడు.—రోమీయులు 5:21.

దేవుడు యేసును తిరిగి బ్రతికించి, దేవుని రాజ్యానికి రాజుగా చేశాడు. దానియేలు 7:13, 14

రాజ్యంలో యేసు తన సింహాసనం నుండి భూపరదైసులో ఉన్న ప్రజల్ని పరిపాలిస్తున్నాడు

మనుషుల్ని పాపం నుండి విడిపించడానికి యేసు తన ప్రాణాన్ని ఇచ్చాడు. (మత్తయి 20:28) అలా యేసు ద్వారా, దేవుడు మనకు నిరంతరం జీవించడానికి మార్గాన్ని తెరిచాడు.

యెహోవా యేసును భూమికి రాజుగా చేశాడు. భూమ్మీద నమ్మకంగా సేవచేసిన 1,44,000 మంది ఆయనతో పాటు పరిపాలిస్తారు. పరలోకంలో జీవించేలా దేవుడు వాళ్లను తిరిగి బ్రతికిస్తాడు. యేసు, ఆ 1,44,000 మంది ఉండే నీతిగల పరలోక ప్రభుత్వమే దేవుని రాజ్యం.—ప్రకటన 14:1-3.

దేవుని రాజ్యం భూమిని పరదైసుగా మారుస్తుంది. అప్పుడు యుద్ధం, నేరం, పేదరికం, కరువు ఉండవు. ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు.—కీర్తన 145:16.

  • దేవుని రాజ్యం ఎలాంటి ఆశీర్వాదాలు తెస్తుంది?—72వ కీర్తన.

  • దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్థించాలి.—మత్తయి 6:10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి