కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
  • ఈ రోజు

మంగళవారం, ఏప్రిల్‌ 14

“భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది చేయడా?”—ఆది. 18:25.

ఒక వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడా లేదా అనేది అతను ఎప్పుడు చనిపోతాడు అనే దానిమీద ఆధారపడిలేదు. యెహోవా తిరుగులేని న్యాయాధిపతి కాబట్టి ఆయన తీర్పులకు కూడా తిరుగుండదు. (కీర్త. 33:4, 5) “భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనదే” చేస్తాడని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు. ఒక వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడా లేదా అన్నది అతను జీవిస్తున్న ప్రాంతం మీద కూడా ఆధారపడి ఉండదని మనం చెప్పవచ్చు. మంచివార్త వినే అవకాశం దొరకని ప్రాంతాల్లో ఉన్న లక్షలమందిని యెహోవా “మేకలుగా” తీర్పు తీరుస్తాడని మనం అస్సలు ఊహించుకోలేం. (మత్త. 25:46) భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు వాళ్లలో ప్రతీఒక్కరిని మన కన్నా ఎక్కువగా పట్టించుకుంటాడు. మహాశ్రమ కాలంలో జరిగే సంఘటనల్ని యెహోవా ఎలా మలుపు తిప్పుతాడో మనకు తెలీదు. ఆ సంఘటనల్ని చూసినప్పుడు బహుశా కొంతమంది ప్రజలు యెహోవా గురించి నేర్చుకుని, ఆయన మీద విశ్వాసం ఉంచే అవకాశం ఉంది. అంతేకాదు, యెహోవా దేశాల ముందు తననుతాను పవిత్రపర్చుకుంటున్నప్పుడు వాళ్లు ఆయన పక్షాన నిలబడవచ్చు.—యెహె. 38:16. w24.05 12 ¶14-15

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2026

బుధవారం, ఏప్రిల్‌ 15

“ఒకరినొకరు ప్రేమించుకోవాలి.”—యోహా. 15:12.

యెహోవా ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ముందుంటారు. (2 కొరిం. 8:4) అయితే, అలా చేయాలంటే కొన్నిసార్లు చాలా ధైర్యం కావాలి. ఉదాహరణకు, యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రదర్స్‌సిస్టర్స్‌కి ప్రోత్సాహం, మద్దతు అవసరం. అంతేకాదు బహుశా వాళ్లకు బైబిళ్లు, ప్రచురణలు, తలదాచుకోవడానికి ఒక చోటు, ఆహారం, బట్టలు కావాలని స్థానిక సంఘపెద్దలు గుర్తించవచ్చు. గొర్రెల మీదున్న ప్రేమతో వాళ్లకు అవసరమైంది ఇవ్వడానికి సంఘపెద్దలు తమ ప్రాణాన్ని కూడా పణంగా పెడతారు. అలాంటి పరిస్థితిలో ఐక్యంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి స్థానిక బ్రాంచి కార్యాలయం ఇచ్చే నిర్దేశాల్ని పాటించండి. (హెబ్రీ. 13:17) ఏదైనా విపత్తు వస్తే ఎలా సిద్ధంగా ఉండాలో, దానికోసం ఏమేం చేయాలో అని సంస్థ ఇచ్చే నిర్దేశాల్ని సంఘపెద్దలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. (1 కొరిం. 14:33, 40) ధైర్యం చూపిస్తూనే జాగ్రత్తలు పాటించండి. (సామె. 22:3) కాస్త తెలివిగా ఉండండి. అనవసరమైన సాహసాలు చేయకండి. యెహోవా మీద ఆధారపడండి. బ్రదర్స్‌సిస్టర్స్‌ సురక్షితంగా ఉండడానికి మీరు చేసే ప్రతీ పనిలో ఆయన తోడు ఉంటాడు. w24.07 4 ¶8; 5 ¶11

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2026

గురువారం, ఏప్రిల్‌ 16

“నా శ్రమలో నేను యెహోవాకు ప్రార్థించాను, . . . సహాయం కోసం నేను పెట్టిన మొర ఆయన దగ్గరికి చేరింది.”—కీర్త. 18:6.

దావీదు రాజుకు యెహోవా అంటే ఏంటో తెలుసు. అందుకే ఆయన యెహోవా మీద ఆధారపడ్డాడు. రాజైన సౌలు అలాగే వేరే శత్రువులు ఆయన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సహాయం కోసం దావీదు యెహోవాకు ప్రార్థించాడు. దేవుడు తన ప్రార్థన విని, ఆయన్ని కాపాడినప్పుడు దావీదు ఇలా అన్నాడు: “యెహోవా సజీవుడు!” (కీర్త. 18:46) ఆ మాటలు అనడం ద్వారా దావీదు కేవలం దేవుడు ఉన్నాడని మాత్రమే చెప్పడంలేదు. ఒక రెఫరెన్సు పుస్తకం చెప్తున్నట్టు యెహోవా “జీవంగల దేవుడు, తన ప్రజల తరఫున ఆయన ఎప్పుడూ చర్య తీసుకుంటాడు” అనే నమ్మకాన్ని దావీదు ఇక్కడ చూపించాడు. తనకు ఎదురైన సంఘటనల్ని బట్టి దేవుడు సజీవుడని దావీదు అర్థం చేసుకున్నాడు. ఆ నమ్మకంతోనే ఏదేమైనా యెహోవాను సేవిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ ఉండాలని దావీదు గట్టిగా నిర్ణయించుకున్నాడు. (కీర్త. 18:28, 29, 49) యెహోవా జీవంగల దేవుడని మనం నమ్మినప్పుడు తన సేవను ఉత్సాహంగా చేస్తాం. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోవడానికి కావాల్సిన బలం పొందుతాం. అంతేకాదు, ఆయన సేవలో కష్టపడి పనిచేస్తూ ఉండాలనే తపన పెరుగుతుంది, యెహోవాకు దగ్గరగా ఉండాలనే మన నిర్ణయం బలపడుతుంది. w24.06 20-21 ¶3-4

ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2026
సుస్వాగతం.
ఇది యెహోవాసాక్షులు వేర్వేరు భాషల్లో రూపొందించిన ప్రచురణల పరిశోధనా పరికరం.
ప్రచురణలను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, దయచేసి jw.orgచూడండి.
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి