కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • es26 పేజీలు 98-108
  • అక్టోబరు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అక్టోబరు
  • ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2026
  • ఉపశీర్షికలు
  • గురువారం, అక్టోబరు 1
  • శుక్రవారం, అక్టోబరు 2
  • శనివారం, అక్టోబరు 3
  • ఆదివారం, అక్టోబరు 4
  • సోమవారం, అక్టోబరు 5
  • మంగళవారం, అక్టోబరు 6
  • బుధవారం, అక్టోబరు 7
  • గురువారం, అక్టోబరు 8
  • శుక్రవారం, అక్టోబరు 9
  • శనివారం, అక్టోబరు 10
  • ఆదివారం, అక్టోబరు 11
  • సోమవారం, అక్టోబరు 12
  • మంగళవారం, అక్టోబరు 13
  • బుధవారం, అక్టోబరు 14
  • గురువారం, అక్టోబరు 15
  • శుక్రవారం, అక్టోబరు 16
  • శనివారం, అక్టోబరు 17
  • ఆదివారం, అక్టోబరు 18
  • సోమవారం, అక్టోబరు 19
  • మంగళవారం, అక్టోబరు 20
  • బుధవారం, అక్టోబరు 21
  • గురువారం, అక్టోబరు 22
  • శుక్రవారం, అక్టోబరు 23
  • శనివారం, అక్టోబరు 24
  • ఆదివారం, అక్టోబరు 25
  • సోమవారం, అక్టోబరు 26
  • మంగళవారం, అక్టోబరు 27
  • బుధవారం, అక్టోబరు 28
  • గురువారం, అక్టోబరు 29
  • శుక్రవారం, అక్టోబరు 30
  • శనివారం, అక్టోబరు 31
ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం—2026
es26 పేజీలు 98-108

అక్టోబరు

గురువారం, అక్టోబరు 1

“యెహోవా కోసం కనిపెట్టుకొనివుంటాను.”—మీకా 7:7.

మనకు పెద్దల ద్వారా, ప్రాంతీయ పర్యవేక్షకుల ద్వారా, బ్రాంచి కార్యాలయం నుండి, పరిపాలక సభ నుండి ఎప్పటికప్పుడు నిర్దేశాలు వస్తుంటాయి. వాటివల్ల మనం యెహోవా సేవచేస్తూ ముందుకెళ్లగలుగుతాం. అయితే ఏదోక సందర్భంలో మనకు వచ్చిన నిర్దేశం సరిగ్గా అర్థం కాకపోతే, ఏంటి పరిస్థితి? బహుశా ఆ నిర్దేశం సరైంది కాదేమో అనే అనుమానాలు మనకు రావచ్చు. అంతేకాదు, ఆ నిర్దేశం ఇచ్చిన బ్రదర్స్‌లో ఉన్న లోపాల మీదే మనసుపెట్టడం మొదలుపెట్టే అవకాశం ఉంది. మనం విశ్వాసాన్నిబట్టి నడుచుకుంటే సంస్థను యెహోవా నడిపిస్తున్నాడని, మన పరిస్థితులు ఆయనకు తెలుసని నమ్ముతాం. దానివల్ల మంచి మనసుతో, వెంటనే లోబడతాం. (హెబ్రీ. 13:17) మనం లోబడి ఉంటే సంఘ ఐక్యతకు అది సహాయపడుతుందని గుర్తిస్తాం. (ఎఫె. 4:2, 3) నాయకత్వం వహించే బ్రదర్స్‌ అపరిపూర్ణులైనాసరే, మనం లోబడి ఉంటే యెహోవా అందర్నీ దీవిస్తాడని నమ్ముతాం. (1 సమూ. 15:22) ఈలోపు, దేన్నైనా నిజంగా సరిదిద్దాల్సిన అవసరం ఉంటే, యెహోవా సరైన సమయంలో దాన్ని చేస్తాడు. w25.03 23-24 ¶13-14

శుక్రవారం, అక్టోబరు 2

‘దేవుడు రహస్యాల్ని వెల్లడిచేస్తాడు.’—దాని. 2:28.

మనం చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగే కాలంలో జీవిస్తున్నాం. ప్రతీరోజు బైబిలు ప్రవచనాలు మన కళ్లముందే నెరవేరుతున్నాయి. ఉదాహరణకు, “దక్షిణ రాజు . . . ఉత్తర రాజు” ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ఒకరితోఒకరు యుద్ధం చేస్తున్నారు. (దాని. 11:40) దేవుని రాజ్యం గురించిన మంచివార్త ప్రపంచ నలుమూలల ప్రకటించబడుతుంది. ఇంకా లక్షలమంది ప్రజలు యెహోవాను సేవించడానికి తరలి వస్తున్నారు. (యెష. 60:22; మత్త. 24:14) అంతేకాదు, “తగిన సమయంలో” మనకు బోలెడంత ఆధ్యాత్మిక ఆహారం అందుతుంది. (మత్త. 24:45-47) అతి త్వరలో జరిగే ముఖ్యమైన సంఘటనల్ని బాగా అర్థం చేసుకోవడానికి యెహోవా మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. (సామె. 4:18) మహాశ్రమ మొదలయ్యే సమయానికల్లా దాన్ని తట్టుకుని నిలబడడానికి, కలిసికట్టుగా ఉండడానికి మనకు తెలియాల్సిన విషయాలన్నీ తెలుస్తాయనే నమ్మకంతో ఉండవచ్చు. మరోవైపు, భవిష్యత్తు గురించి మనకు కొన్ని విషయాలు తెలీదని ఒప్పుకోవల్సిందే. w24.05 8 ¶1-2

శనివారం, అక్టోబరు 3

“అతను తన నాలుకతో లేనిపోనివి కల్పించి చెప్పడు.”—కీర్త. 15:3.

లేనిపోనివి కల్పించి చెప్పడం గురించి కీర్తనకర్త ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇంతకీ లేనిపోనివి కల్పించి చెప్పడం అంటే ఏంటి? సాధారణంగా ఒక వ్యక్తికి ఉన్న మంచిపేరును పాడుచేయడానికి చెప్పే అబద్ధాలను అది సూచిస్తుంది. యెహోవాకు అతిథిగా ఉండే వ్యక్తి, “తన పొరుగువానికి ఏ కీడూ చేయడు, తన స్నేహితుల పేరు చెడగొట్టడు” అని కూడా కీర్తన 15:3 గుర్తుచేస్తుంది. (కీర్త. 15:1) దానర్థం ఏంటి? ఒక వ్యక్తికి సంబంధించిన విషయాల్ని వ్యాప్తి చేయడంవల్ల మనం తెలీకుండానే అతనికున్న మంచిపేరును పాడుచేసే అవకాశం ఉంది. ఉదాహరణకు: (1) ఒక సిస్టర్‌ పయినీరు సేవను ఆపేసి ఉండవచ్చు, (2) ఒక జంట బెతెల్‌ సేవను ఆపేసి ఉండవచ్చు, (3) ఒక సహోదరుడు సంఘపెద్దగా గానీ సంఘ పరిచారకునిగా గానీ తొలగించబడి ఉండవచ్చు. ఇలా ఎందుకు జరిగిందా అని వాటిగురించి ఏవేవో ఊహించుకుని, వేరేవాళ్లకు చెప్పడం సరైనదే అంటారా? బహుశా అలాంటి మార్పులు జరగడం వెనుక మనకు తెలియని కొన్ని కారణాలు ఉండవచ్చు. అంతేకాకుండా, యెహోవా గుడారంలో అతిథిగా ఉండే వ్యక్తి “తన పొరుగువానికి ఏ కీడూ చేయడు, తన స్నేహితుల పేరు చెడగొట్టడు.” w24.06 11 ¶11-13

ఆదివారం, అక్టోబరు 4

“నేను ఎప్పుడూ యెహోవాను నా ముందు ఉంచుకుంటాను. ఆయన నా కుడిపక్కన ఉన్నాడు కాబట్టి నేను ఎప్పటికీ కదిలించబడను.”—కీర్త. 16:8.

యెహోవాకు భయపడితే మనం తీసుకునే ప్రతీ నిర్ణయంలో ఆయన్ని సంతోషపెట్టాలని ఆలోచిస్తాం. మీరు బైబిలు వృత్తాంతాల్ని చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి: ‘ఆ పరిస్థితుల్లో నేనే ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాను?’ ఉదాహరణకు, పదిమంది ప్రధానులు యెహోవా ఇశ్రాయేలీయులకు ఇస్తానని మాటిచ్చిన దేశాన్ని వేగు చూసి వచ్చిన తర్వాత, ఇశ్రాయేలీయులు కనానీయుల్ని ఓడించలేరని చెప్పడం మీరు విన్నట్లు ఊహించుకోండి. మీరు ఆ మాటల్ని నమ్మి, మనుషులకు భయపడతారా లేదా యెహోవా మీద ప్రేమతో ఆయన్ని సంతోషపెట్టాలనే కోరికను చూపిస్తారా? ఇశ్రాయేలీయులందరూ యెహోషువ, కాలేబు చెప్పిన సత్యాన్ని గుర్తించలేకపోయారు. దానివల్ల వాళ్లు వాగ్దాన దేశంలోకి వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు.—సంఖ్యా. 14:10, 22, 23. w24.07 10 ¶7

సోమవారం, అక్టోబరు 5

“హృదయాల్ని పరిశీలించేది యెహోవాయే.”—సామె. 17:3.

హోషేయ ప్రవక్త భార్య గోమెరు హోషేయను వదిలేసి వేరేవాళ్లతో వెళ్లిపోయింది. అప్పుడు యెహోవా ఏం చేశాడు? హృదయాల్ని చదివే యెహోవా, హోషేయతో ఇలా చెప్పాడు: ‘నువ్వు ఇంకొకసారి వెళ్లి పరాయి పురుషుడు ప్రేమించిన ఆ స్త్రీని, వ్యభిచారం చేస్తున్న ఆ స్త్రీని ప్రేమించు. ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు వేరే దేవుళ్ల వైపు తిరిగినా యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడు.’ (హోషే. 3:1; సామె. 16:2) గమనించారా, ఆమె ఇంకా ఘోరమైన పాపం చేస్తుండగానే ఆమెను క్షమించి, మళ్లీ తన భార్యగా తెచ్చుకోమని యెహోవా ఆ ప్రవక్తకు చెప్పాడు. అదేవిధంగా, తన ప్రజలు తనను మొండిగా వదిలేసి వెళ్లిపోయినా, యెహోవా వాళ్లమీద ఆశ వదులుకోలేదు. వాళ్లు ఘోరమైన పాపాలు చేస్తున్నా యెహోవా వాళ్లను ఇంకా ప్రేమించాడు, పశ్చాత్తాపపడి మారేలా సహాయం చేయడానికి ప్రవక్తల్ని పంపిస్తూనే ఉన్నాడు. అంటే, ఘోరమైన పాపం చేస్తున్న వ్యక్తి ఇంకా తప్పు చేస్తుండగానే అతను పశ్చాత్తాపపడేలా, ‘హృదయాల్ని పరిశీలించే యెహోవా’ సహాయం చేస్తాడని ఆ ఉదాహరణ చూపిస్తుంది. w24.08 10 ¶7

మంగళవారం, అక్టోబరు 6

“ధర్మశాస్త్రం రాబోయే మంచివాటికి నీడ మాత్రమే.”—హెబ్రీ. 10:1.

తొలి క్రైస్తవుల్లో కొందరు ఒకప్పుడు యూదులుగా ఉన్నారు. వాళ్లు క్రైస్తవులుగా మారినప్పుడు చేసుకున్న మార్పులు అంతాఇంత కాదు. ఇదివరకు, యూదులే యెహోవా ఎంచుకున్న ప్రజలు. ఎన్నో ఏళ్లపాటు యెరూషలేము చాలా ప్రాముఖ్యమైన నగరంగా ఉంది. అక్కడి నుండి పరిపాలించిన రాజులు యెహోవాకు ప్రతినిధులుగా ఉండేవాళ్లు. అంతేకాదు అక్కడున్న ఆలయం స్వచ్ఛారాధనకు కేంద్రం. నమ్మకమైన యూదులందరూ మోషే ధర్మశాస్త్రాన్ని, తమ మతనాయకులు బోధించిన నియమాల్ని తూ.చా. తప్పకుండా పాటించేవాళ్లు. ఆహారం, సున్నతి, అన్యులతో స్నేహం . . . ఇలా ప్రతీ విషయంలో వాళ్లకు నియమాలు ఉండేవి. కానీ యేసు మరణం తర్వాత యెహోవా యూదులు అర్పించిన బలుల్ని అంగీకరించడం ఆపేశాడు. ధర్మశాస్త్రాన్ని పాటించే ఆ యూదా క్రైస్తవులకు అదొక పెద్ద సవాలు. (హెబ్రీ. 10:1, 4, 10) అపొస్తలుడైన పేతురు లాంటి పరిణతి సాధించిన క్రైస్తవులకు కూడా ఆ మార్పులకు అలవాటు పడడం కష్టమైంది. (అపొ. 10:9-14; గల. 2:11-14) అంతేకాదు వాళ్ల నమ్మకాల్లో వచ్చిన ఈ మార్పుల వల్ల ఆ క్రైస్తవులు యూదా మతనాయకుల చేతుల్లో ఎన్నో హింసల్ని ఎదుర్కొన్నారు. w24.09 9 ¶4

బుధవారం, అక్టోబరు 7

“మీకు దేవుని వాక్యాన్ని బోధించి, మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి.”—హెబ్రీ. 13:7.

యెహోవా ఎవరికైనా ఏదైనా ఒక నియామకాన్ని ఇచ్చాడంటే, దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలని ఆశిస్తాడు. (1 కొరిం. 14:33) ఉదాహరణకు, భూమ్మీదున్న ప్రతీఒక్కరికి మంచివార్త ప్రకటించబడాలనేది దేవుని ఇష్టం. (మత్త. 24:14) ఆ పనిని చూసుకునే బాధ్యతను యెహోవా యేసు భుజాల మీద పెట్టాడు. యేసు ఆ పని పద్ధతి ప్రకారం జరిగేలా చూసుకుంటున్నాడు. మొదటి శతాబ్దంలో చాలా సంఘాలు స్థాపించబడ్డాక, ఆ సంఘాలకు నిర్దేశాలు ఇవ్వడానికి, ముందుండి నడిపించడానికి సంఘపెద్దలు నియమించబడ్డారు. (అపొ. 14:23) యెరూషలేములో ఉన్న కొంతమంది పెద్దలు అలాగే అపొస్తలులు కలిసి పరిపాలక సభగా ఏర్పడ్డారు. వాళ్లు సంఘాల ప్రయోజనం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకునేవాళ్లు. ఆ నిర్ణయాల్ని ఆయా సంఘాల్లో ఉన్న పెద్దలు బ్రదర్స్‌-సిస్టర్స్‌కి తెలియజేసేవాళ్లు. (అపొ. 15:2; 16:4) సంఘంలో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ వాటిని పాటించినప్పుడు వాళ్లు “విశ్వాసంలో స్థిరపడుతూ” ఉన్నారు. వాళ్ల “సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.”—అపొ. 16:5. w24.04 8 ¶1

గురువారం, అక్టోబరు 8

“మగ్దలేనే మరియ వెళ్లి, ‘నేను ప్రభువును చూశాను!’ అని శిష్యులతో చెప్పింది.”—యోహా. 20:18.

నీసాను 16 తెల్లవారుజామున కొంతమంది నమ్మకమైన స్త్రీలు యేసు సమాధి దగ్గరికి వెళ్లారు. (లూకా 24:1, 10) వాళ్లలో ఒకరైన మగ్దలేనే మరియ గురించి ఆలోచిద్దాం. ఆమె సమాధి దగ్గరికి వెళ్లేసరికి సమాధి ఖాళీగా ఉంది. ఈ విషయాన్ని ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి పేతురుకు, యోహానుకు చెప్పింది. వాళ్లు కూడా ఆమెతోపాటు వచ్చి, సమాధి ఖాళీగా ఉండడం చూసి తిరిగి వాళ్ల ఇంటికి వెళ్లిపోయారు. కానీ మరియ మాత్రం అక్కడే ఏడుస్తూ ఉండిపోయింది. యేసు ఆమెను గమనిస్తున్నాడని ఆమెకు తెలీదు. ఆమె కార్చిన కన్నీరు యేసు హృదయాన్ని ఎంతో కదిలించింది. అందుకే యేసు ఆమెకు కనిపించి, ఆమెకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక చిన్న పని చేశాడు. ఆయన ఆమెతో మాట్లాడాడు, ఒక ముఖ్యమైన పనిని ఆమెకు అప్పగించాడు. తాను తిరిగి బ్రతికాననే విషయం తన సహోదరులకు చెప్పమన్నాడు.—యోహా. 20:17, 18. w24.10 13 ¶7

శుక్రవారం, అక్టోబరు 9

“ఐగుప్తు దేశంలో ఇంకా ఎక్కువ సూచనల్ని, అద్భుతాల్ని చేస్తాను.”—నిర్గ. 7:3.

మోషే ప్రవక్తగా, న్యాయమూర్తిగా, నాయకునిగా, రచయితగా సేవచేశాడు. బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బయటికి నడిపించాడు. యెహోవా చేసిన ఎన్నో అద్భుతాల్ని కళ్లారా చూశాడు. బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాల్ని, 90వ కీర్తనను రాయడానికి యెహోవా ఆయన్ని ఉపయోగించుకున్నాడు. బహుశా 91వ కీర్తనను, యోబు పుస్తకాన్ని కూడా మోషేనే రాసుంటాడు. మోషే చనిపోకముందు అంటే 120 ఏళ్లు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులందర్నీ పిలిపించి, వాళ్లు చూసిన వాటన్నిటి గురించి ఒకసారి గుర్తుచేశాడు. వాళ్లు యెహోవా చేసిన ఎన్నో అద్భుతాల్ని, ఐగుప్తు మీద తెచ్చిన తీర్పుల్ని స్వయంగా చూశారు. (నిర్గ. 7:4) ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసినప్పుడు వాళ్లు ఆరిన నేలమీద నడిచారు, ఫరో సైన్యం నాశనమవ్వడం చూశారు. (నిర్గ. 14:29-31) ఎడారిలోనైతే యెహోవా కాపుదలను, శ్రద్ధను చూశారు. (ద్వితీ. 8:3, 4) ఇప్పుడు వాళ్లు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోతున్నారు. వాళ్లను ప్రోత్సహించడానికి తనకున్న ఈ చివరి అవకాశాన్ని మోషే ఉపయోగించుకున్నాడు. w24.11 8-9 ¶3-4

శనివారం, అక్టోబరు 10

“ఈ ఆహారాన్ని తినేవాళ్లు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు . . . లోకం జీవించేలా నేనిచ్చే ఆహారం నా శరీరమే.”—యోహా. 6:51.

ప్రభువు రాత్రి భోజనమప్పుడు యేసు తన అపొస్తలులకు చెప్పిన మాటలకు, గలిలయలో ఆయన చెప్పిన మాటలకు తేడా ఉందని అర్థమౌతుంది. అదేంటంటే, యెరూషలేములో యేసు చెప్పిన మాటలు కొంతమందికే వర్తిస్తాయి, గలిలయలో ఆయన చెప్పిన మాటలు ఎక్కువమందికి వర్తిస్తాయి. గలిలయలో ఉన్న ఎక్కువశాతం మంది ప్రజలకు, యేసు నుండి కేవలం ఆహారం మాత్రమే కావాలి. కానీ దానికన్నా ముఖ్యమైన విషయం ఒకటుందని యేసు చెప్పాలనుకున్నాడు. అది వాళ్లను శాశ్వత జీవితానికి నడిపిస్తుంది. చనిపోయినవాళ్లు చివరి రోజున తిరిగి బ్రతికించబడతారని, శాశ్వతకాలం జీవిస్తారని కూడా యేసు చెప్పాడు. అయితే యేసు ఇక్కడ కేవలం కొంతమంది గురించే చెప్పట్లేదు. బదులుగా అందరూ పొందగలిగే దీవెనల గురించి చెప్తున్నాడు. w24.12 11 ¶10-11

ఆదివారం, అక్టోబరు 11

“భర్తలారా, మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి.”—కొలొ. 3:19.

క్రూరంగా ఉండేవాళ్లంటే యెహోవాకు చీదర. (కీర్త. 11:5) ముఖ్యంగా భార్యల్ని కొట్టే భర్తలంటే ఆయనకు పరమ అసహ్యం. (మలా. 2:16) భర్త భార్యను బాగా చూసుకోకపోతే దేవునితో అతనికి ఉన్న సంబంధం కూడా బాగుండదని అర్థం. ఆఖరికి యెహోవా అతని ప్రార్థనలు కూడా వినడు. (1 పేతు. 3:7) కొంతమంది భర్తలు భార్యల మీద అరుస్తారు, తిడతారు, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారు. కానీ యెహోవాకు “కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం” అసహ్యం. (ఎఫె. 4:31, 32) భార్యతో కఠినంగా మాట్లాడే భర్త తన కాపురాన్నే కాదు యెహోవాతో ఉన్న బంధాన్ని కూడా తగలబెట్టుకుంటాడు. (యాకో. 1:26) అశ్లీల చిత్రాలు చూసే భర్త కూడా అంతే. అతను యెహోవాతో తనకున్న బంధాన్ని పాడుచేసుకుంటాడు. అంతేకాదు, తన భార్య గౌరవాన్ని దిగజార్చినవాడౌతాడు. ఒక భర్త తన భార్యకు పనుల్లోనే కాదు, ఆలోచనల్లో కూడా నమ్మకంగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. పరాయి స్త్రీని అదేపనిగా తప్పుగా చూస్తూ ఉండే వ్యక్తి అప్పటికే “తన హృదయంలో” ఆమెతో వ్యభిచారం చేశాడని యేసు చెప్పాడు.—మత్త. 5:28, 29. w25.01 9 ¶6-8

సోమవారం, అక్టోబరు 12

“యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్పు పొందుతాడు.”—గల. 2:16.

నీతిమంతులుగా తీర్పు తీర్చబడడం అంటే మనం చేసిన పాపాలు కొట్టేయబడడం, మన పాపపు మరకలు పూర్తిగా తుడిచేయబడడం. ఇలా చేసినంతమాత్రాన యెహోవా తన న్యాయ ప్రమాణాల్ని మీరినట్టేమీ అవ్వదు. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చేది మనం చేసిన మంచి పనుల వల్ల కాదు. అలాగని మన పాపాల్ని ఆయన చూసీచూడనట్టు వదిలేయడు కూడా. ప్రాయశ్చిత్త ఏర్పాటు మీద, విమోచన క్రయధనం మీద మనం విశ్వాసం చూపిస్తున్నాం కాబట్టి యెహోవా మన అప్పుల్ని మాఫీ చేస్తున్నాడు లేదా మన పాపాల్ని క్షమిస్తున్నాడు. (రోమా. 3:24) యెహోవా మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? యేసుక్రీస్తుతో పాటు పరలోకంలో రాజులుగా పరిపాలించడానికి ఎంపిక చేయబడినవాళ్లు, ఇప్పటికే దేవుని పిల్లలుగా నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. (తీతు 3:7; 1 యోహా. 3:1) వాళ్ల పాపాలు క్షమించబడ్డాయి. ఇక వాళ్లపై ఎలాంటి పాపపు మరకలు లేవు. అలా వాళ్లు దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హులయ్యారు. (రోమా. 8:1, 2, 30) భూనిరీక్షణ ఉన్నవాళ్లు దేవుని స్నేహితులుగా స్వీకరించబడి, నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డారు. వాళ్ల పాపాలు కూడా క్షమించబడ్డాయి.—యాకో. 2:21-23. w25.02 5 ¶17; 7 ¶18

మంగళవారం, అక్టోబరు 13

“నువ్వు దేవుని ఆలోచనల మీద కాకుండా మనుషుల ఆలోచనల మీద మనసు పెడుతున్నావు.”—మత్త. 16:23.

ఒకసారి, అపొస్తలుడైన పేతురు యెహోవాలా ఆలోచించలేకపోయాడు. యేసు యెరూషలేముకు వెళ్లాలని, అక్కడ మత నాయకులు ఆయన్ని బంధిస్తారని, ఎన్నో హింసలు పెట్టి, చంపేస్తారని తన అపొస్తలులకు చెప్పాడు. (మత్త. 16:21) ఇశ్రాయేలీయులకు ఆశాకిరణం, వాగ్దానం చేయబడిన మెస్సీయ చనిపోయేలా యెహోవా అనుమతిస్తాడనే విషయం పేతురు జీర్ణించుకోలేకపోయాడు. (మత్త. 16:16) అందుకే పేతురు యేసును పక్కకు తీసుకెళ్లి: “ప్రభువా, అలా మాట్లాడొద్దు. నీకు అలా జరగనే జరగదు” అని అన్నాడు. (మత్త. 16:22) ఈ విషయంలో పేతురు యెహోవాలా ఆలోచించలేదు కాబట్టి యేసు ఆలోచనను కూడా అందుకోలేకపోయాడు. పేతురు ఉద్దేశాలు మంచివే అయ్యుండవచ్చు. కానీ పేతురు ఇచ్చిన సలహాను యేసు తీసుకోలేదు. ఎందుకంటే తన విషయంలో యెహోవా ఇష్టమేంటో యేసుకు బాగా తెలుసు. అందుకే ఈ సందర్భంలో పేతురు యెహోవా ఆలోచనను తన ఆలోచనగా చేసుకోవాలనే ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. మనకు కూడా ఇందులో ఒక పాఠం ఉంది. w25.03 9 ¶5-6

బుధవారం, అక్టోబరు 14

“విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు; నలిగిన మనస్సుగలవాళ్లను ఆయన కాపాడతాడు.”—కీర్త. 34:18.

మీరు బాగా నమ్మిన ఒకవ్యక్తి మిమ్మల్ని నిరాశపరిస్తే, వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ అంతాఇంత ఉండదు. ఎదుటివ్యక్తి మీతో ఎలా ఉన్నా, మీ పరలోక తండ్రి మాత్రం మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఎవరైనా నమ్మకద్రోహం చేసినప్పుడు ఈ రోజు దినవచనంలోని దావీదు మాటలు మనకు ఎంతో ఊరటను ఇస్తాయి. “నలిగిన మనస్సుగలవాళ్లు” అనే మాట, “జీవితంలో ఇక ఏ ఆశా లేదన్నట్టు” అనిపించే వాళ్లను సూచిస్తుందని ఒక రెఫరెన్స్‌ పుస్తకం చెప్తుంది. అలాంటి వాళ్లకు దేవుడు ఎలా సహాయం చేస్తాడు? ప్రేమగల తల్లిదండ్రులు ఏడుస్తున్న తమ పిల్లల్ని ఎలా దగ్గరికి తీసుకుని ఓదారుస్తారో, యెహోవా కూడా మనం బాధలో ఉన్నప్పుడు మనకు “దగ్గరగా” ఉంటాడు. అంటే ఇంకా ఎక్కువ కనికరం, ప్రేమ చూపిస్తాడు. మనకు సహాయం చేయడానికి రెడీగా ఉంటాడు. నలిగిపోయిన, విరిగిపోయిన మన హృదయానికి కట్టుకట్టడానికి ఆయన అస్సలు వెనకాడడు. అంతేకాదు ముందుముందు మంచి రోజులు వస్తాయనే ఆశను నింపుతాడు. అది ఇప్పుడున్న మన కష్టాల్ని సహించడానికి సహాయం చేస్తుంది.—యెష. 65:17. w24.12 23 ¶13-14

గురువారం, అక్టోబరు 15

‘మీరు యెహోవా నుండే బహుమతిని పొందుతారు.’—కొలొ. 3:24.

ఈరోజుల్లో పెద్దలు చేస్తున్న పనుల్ని యెహోవా చూస్తున్నాడని, విలువైనదిగా ఎంచుతున్నాడని వాళ్లు నమ్మకంతో ఉండవచ్చు. చాలామంది పెద్దలు కాపరి సందర్శనాలు చేయడం, బోధించడం, ప్రీచింగ్‌ చేయడంతోపాటు నిర్మాణ ప్రాజెక్టుల్లో, విపత్తు సహాయక పనుల్లో సేవ చేస్తున్నారు. ఇంకొంతమంది రోగి సందర్శన గుంపుల్లో లేదా ఆసుపత్రి అనుసంధాన కమిటీల్లో సేవచేస్తున్నారు. ఈ పనులన్నీ చేయడానికి ముందుకొస్తున్న పెద్దలు, సంఘం యెహోవాది అని గుర్తిస్తున్నారు. మనస్ఫూర్తిగా తమ పనుల్ని చేస్తూ, తాము చేసే వాటన్నిటికీ యెహోవా ప్రతిఫలం ఇస్తాడనే నమ్మకంతో ఉంటున్నారు. (కొలొ. 3:23, 24) అందరూ సంఘపెద్దలుగా ఉండలేకపోవచ్చు. కానీ యెహోవాకు ఇవ్వడానికి మనందరి దగ్గర ఏదోకటి ఉంది. తన సేవలో మనం చేయగలిగినదంతా చేసినప్పుడు మన దేవుడు మెచ్చుకుంటాడు. ప్రపంచవ్యాప్త పనికోసం ఏ కొంత విరాళం ఇచ్చినా ఆయన దాన్ని అపురూపంగా చూస్తాడు. ఎవరైనా మనల్ని బాధపెట్టినప్పుడు దాన్ని మర్చిపోయి, వాళ్లను క్షమిస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. యెహోవా కోసం మీరు చేస్తున్నదాన్ని ఆయన చాలా విలువైనదిగా చూస్తాడని నమ్మండి. మీరు చేస్తున్నదానికి ఆయన మిమ్మల్ని చాలా ప్రేమిస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు.—లూకా 21:1-4. w24.06 23 ¶12-13

శుక్రవారం, అక్టోబరు 16

“నీ హృదయాన్ని ఆమె మార్గాల వైపు తిరగనివ్వకు. దారితప్పి ఆమె త్రోవల్లోకి వెళ్లకు.”—సామె. 7:25.

యెహోవాను ఆరాధించే ఎవ్వరికైనా ఏం జరగవచ్చో ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఒక వ్యక్తి ఘోరమైన పాపం చేసి ఆ తర్వాత ఇదంతా “ఉన్నట్టుండి,” “అనుకోకుండా జరిగింది” అని అనుకోవచ్చు. కానీ అతను చేసిన పాపం గురించి ఒకసారి వెనక్కెళ్లి ఆలోచిస్తే, దానికన్నా ముందు అతను కొన్ని తెలివితక్కువ పనులు చేసుండొచ్చు. అతను యెహోవాను ప్రేమించని వాళ్లతో స్నేహం చేయడం, చెడ్డ వినోదాన్ని ఎంచుకోవడం లేదా కొన్నిరకాల వెబ్‌సైట్‌లు చూడడం, క్రైస్తవులకు తగని చోట్లకు వెళ్లడం లాంటివి చేసి ఉండవచ్చు. అంతేకాదు, బహుశా అతను ప్రార్థన చేయడం, బైబిలు చదవడం, మీటింగ్స్‌కి-ప్రీచింగ్‌కి వెళ్లడం ఆపేసివుండవచ్చు. సామెతలు పుస్తకంలో చర్చించుకున్న యువకునిలాగే ఇతను చేసిన పాపం కూడా “ఉన్నట్టుండి” చేసింది కాదు. మనకేంటి పాఠం? మనం పాపాన్నే కాదు పాపానికి నడిపించే పనుల్ని కూడా చేయకుండా ఉండాలి. సొలొమోను ఆ విషయాన్నే చెప్పాడు.—మత్త. 5:29, 30. w24.07 16 ¶10-11

శనివారం, అక్టోబరు 17

“మట్టి పాత్రల్లో ఈ సంపద మాకు ఉంది.”—2 కొరిం. 4:7.

ఇంతకీ ఆ చెప్పిన సంపద ఏంటి? ప్రజల్ని కాపాడే పని. అంటే రాజ్యం గురించి ప్రకటించే పని. (2 కొరిం. 4:1) ఆ మట్టి పాత్రలు ఎవరు? మంచివార్తను ఇతరులకు చెప్పే దేవుని సేవకులు. పౌలు రోజుల్లో వ్యాపారం చేసేవాళ్లు ఆహారం, ద్రాక్షారసం, డబ్బు లాంటి విలువైనవాటిని మట్టి పాత్రల్లో పెట్టి రవాణా చేసేవాళ్లు. అదేవిధంగా మంచివార్తను ప్రకటించే విలువైన పనిని యెహోవా మనకు అప్పగించాడు. యెహోవా మన వెన్నంటే ఉంటూ ఆ సందేశాన్ని ప్రకటించడానికి కొండంత ధైర్యాన్నిస్తాడు. కొన్నిసార్లు ప్రీచింగ్‌లో వ్యతిరేకత వస్తుందేమో అని లేదా ప్రజలు వినరేమో అని మనం భయపడుతుండవచ్చు. మరి, అలాంటి భయాన్ని ఎలా పోగొట్టుకోవచ్చు? ప్రీచింగ్‌ చేయొద్దని అపొస్తలుల్ని ఆజ్ఞాపించినప్పుడు వాళ్లు చేసిన ప్రార్థన గుర్తుతెచ్చుకోండి. వాళ్లు భయపడి ప్రీచింగ్‌ ఆపేసే బదులు, వాక్యాన్ని ధైర్యంతో ప్రకటిస్తూ ఉండేలా సహాయం చేయమని యెహోవాను అడిగారు. ఆ ప్రార్థనకు యెహోవా చిటికెలో జవాబిచ్చాడు. (అపొ. 4:18, 29, 31) అలాంటి భయాల వల్ల కొన్నిసార్లు మీరు బిగుసుకుపోతే, ప్రజల మీదున్న ప్రేమ ఆ భయాల్ని ఓడించేలా చేయమని యెహోవాను అడగండి. w24.04 16 ¶8-9

ఆదివారం, అక్టోబరు 18

“పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.”—మత్త. 6:9.

మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఆయన పేరును పవిత్రపర్చాలని కోరుకుంటాం. సాతాను యెహోవా పేరుమీద వేసిన నిందలన్నిటినీ తీసేయాలని కోరుకుంటాం. (ఆది. 3:1-5; యోబు 2:4; యోహా. 8:44) అందుకే మనం ప్రీచింగ్‌లో యెహోవా గురించి నిజాలు చెప్తూ ఆయన పక్షాన ఉంటాం. యెహోవాకున్న గొప్ప లక్షణం ప్రేమ అని, ఆయన పరిపాలన నీతిగా-న్యాయంగా ఉంటుందని, అతి త్వరలోనే ఆయన తన రాజ్యం ద్వారా కష్టాల్ని తీసేసి మనుషులందరికీ శాంతి-సంతోషాల్ని ఇస్తాడని మనం అందరికీ చెప్తాం. (కీర్త. 37:10, 11, 29; 1 యోహా. 4:8) అలా మనం యెహోవా గురించి చెప్పినప్పుడు ఆయన పేరును పవిత్రపరుస్తాం. అంతేకాదు, మన పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నాం అన్న తృప్తి కూడా మనకు ఉంటుంది. w24.05 18 ¶12

సోమవారం, అక్టోబరు 19

“నువ్వు విందు ఏర్పాటు చేసినప్పుడు పేదవాళ్లను, కుంటివాళ్లను, గుడ్డివాళ్లను, వికలాంగుల్ని ఆహ్వానించు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే, నీకు తిరిగివ్వడానికి వాళ్ల దగ్గర ఏమీ ఉండదు. నీతిమంతుల పునరుత్థానంలో నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది.”—లూకా 14:13, 14.

బ్రదర్స్‌, మీరు ఇతరులకు మంచి పనులు చేసినప్పుడు, ముఖ్యంగా మీ దగ్గరి స్నేహితులు కానివాళ్లకు కూడా అలా చేసినప్పుడు మీరు “ఆతిథ్యమిచ్చే” వాళ్లని చూపించుకుంటారు. (1 పేతు. 4:9) ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి గురించి ఒక బైబిలు డిక్షనరీ ఇలా చెప్తుంది: “అతని ఇంటి తలుపులు, మనసు తలుపులు పరిచయం లేనివాళ్లతో సహా అందరికీ తెరిచే ఉంటాయి.” ఇలా ప్రశ్నించుకోండి: ‘సంఘానికి వచ్చే కొత్తవాళ్లను ఆహ్వానించే విషయంలో నాకెలాంటి పేరుంది?’ (హెబ్రీ. 13:2, 16) ఆతిథ్య స్ఫూర్తి ఉన్న వ్యక్తి పేదవాళ్ల మీద, వేరే సంఘాల నుండి ప్రసంగాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్లమీద, బ్రదర్స్‌సిస్టర్స్‌ని ప్రోత్సహించడానికి కష్టపడి పనిచేసే ప్రాంతీయ పర్యవేక్షకుల్లాంటి వాళ్లమీద, ఇలా అందరి మీద దయ చూపిస్తాడు.—ఆది. 18:2-8; సామె. 3:27; అపొ. 16:15; రోమా. 12:13. w24.11 21 ¶6

మంగళవారం, అక్టోబరు 20

“సిద్ధంగా ఉన్న కన్యలు అతనితో కలిసి పెళ్లి విందు కోసం లోపలికి వెళ్లారు.”—మత్త. 25:10.

కన్యల ఉదాహరణలో, పెళ్లి కుమారున్ని కలుసుకోవడానికి వెళ్లిన పదిమంది కన్యల గురించి యేసు మాట్లాడాడు. (మత్త. 25:1-4) వాళ్లు పెళ్లి కుమారునితో కలిసి పెళ్లి విందుకు వెళ్లాలని అనుకున్నారు. వాళ్లలో ఐదుగురిని “బుద్ధిగల” కన్యలని, మరో ఐదుగురిని “బుద్ధిలేని” కన్యలని యేసు పిలిచాడు. అయితే బుద్ధిగల కన్యలు పెళ్లి కుమారుడు కోసం ఎంతసేపైనా వేచివుండడానికి, చివరికి ఆయన ఏ అర్ధరాత్రి వచ్చినా సిద్ధంగా ఉన్నారు. అందుకే వాళ్లు దీపాల్నే కాదు, అదనంగా బుడ్డిలో నూనె కూడా తెచ్చుకున్నారు. అలా వాళ్లు తమ దీపాలు ఆరిపోకుండా ప్లాన్‌ చేసుకున్నారు. (మత్త. 25:6-10) పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధిగల కన్యలు ఆయనతోపాటు పెళ్లి విందు జరుపుకోవడానికి లోపలికి వెళ్లారు. అదేవిధంగా అభిషిక్త క్రైస్తవులు, క్రీస్తు వచ్చేంతవరకు నమ్మకంగా, అలర్ట్‌గా ఉండడం ద్వారా పెళ్లి కుమారుడైన యేసుతోపాటు పరలోక రాజ్యంలో ఉండే బహుమానం పొందుతారు.—ప్రక. 7:1-3. w24.09 21 ¶6

బుధవారం, అక్టోబరు 21

‘నేను చూసినప్పుడు, అన్నిదేశాల నుండి వచ్చిన ఒక గొప్పసమూహం కనిపించింది.’—ప్రక. 7:9.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పని జోరు అందుకోవడం చూసినప్పుడు, ప్రీచింగ్‌ ఉత్సాహంగా చేయడానికి ముందుకొస్తాం. ప్రతీ సంవత్సరం లక్షలమంది ఆసక్తిగలవాళ్లు జ్ఞాపకార్థ ఆచరణకు వస్తున్నారు, బైబిలు స్టడీలు తీసుకుంటున్నారు. వేలమంది బాప్తిస్మం తీసుకుని ప్రీచింగ్‌లో మనతోపాటు అడుగులు కలుపుతున్నారు. అయితే, మన ప్రీచింగ్‌కి ఎంతమంది స్పందిస్తారో మనకు తెలీదు. కానీ రాబోయే మహాశ్రమ తప్పించుకోవడానికి యెహోవా ఒక గొప్ప సమూహాన్ని సమకూరుస్తున్నాడని మాత్రం మనకు తెలుసు. (ప్రక. 7:9, 14) కోత యజమానియైన యెహోవా, ప్రకటనా పనికి స్పందించేవాళ్లు చాలామంది ఉంటారనే నమ్మకంతో ఉన్నాడు. మనం కూడా అదే నమ్మకంతో ప్రీచింగ్‌ చేద్దాం! (లూకా 10:2) యేసు శిష్యులు పరిచర్యలో ఉత్సాహానికి మారుపేరుగా నిలిచారు. ప్రజలు అపొస్తలుల ధైర్యాన్ని చూసినప్పుడు వాళ్ల వెనుక యేసు ఉన్నాడని “గ్రహించడం మొదలుపెట్టారు.” (అపొ. 4:13) పరిచర్యలో ప్రజలు మనల్ని కూడా గమనించినప్పుడు మనలో యేసులాంటి ఉత్సాహం కనిపించేలా చేద్దాం! w25.03 18 ¶15; 19 ¶17-18

గురువారం, అక్టోబరు 22

“యెహోవా, నువ్వు మనిషిని గమనించడానికి అతను ఏపాటివాడు?”—కీర్త. 144:3.

నలుగురిలో అంత ప్రాముఖ్యంకాని వాళ్లను కూడా యెహోవా గమనిస్తాడని బైబిలు చెప్తుంది. ఉదాహరణకు ఇశ్రాయేలీయుల కోసం రాజును అభిషేకించడానికి, యెహోవా సమూయేలు ప్రవక్తను యెష్షయి ఇంటికి పంపించినప్పుడు ఏం జరిగిందో గుర్తుచేసుకోండి. యెష్షయి తన ఎనిమిదిమంది కుమారుల్లో ఏడుగురిని పిలిచాడు కానీ, అందరికన్నా చిన్నవాడైన దావీదును పిలవలేదు. అయితే యెహోవా ఎంచుకున్నది దావీదునే. (1 సమూ. 16:6, 7, 10-12) ఎందుకంటే దావీదు నిజంగా ఎలాంటివాడో యెహోవాకు తెలుసు. దావీదుకు తన మీద చాలా ప్రేమ ఉందని యెహోవా గమనించాడు. యెహోవా మిమ్మల్ని ఇప్పటికే గమనిస్తున్నాడు అనడానికి గల రుజువుల గురించి ఆలోచించండి. మీ పరిస్థితులకు తగ్గట్టు ఆయన మీకు సలహాలు ఇస్తున్నాడు. (కీర్త. 32:8) మీ గురించి ఏమీ తెలియకపోతే అలాంటి సలహాలు ఇవ్వగలడా? (కీర్త. 139:1) ఆ సలహాల్ని పాటించి, అవి ఎంత ఉపయోగపడ్డాయో అర్థం చేసుకున్నప్పుడు యెహోవా మిమ్మల్ని పట్టించుకుంటున్నాడనే నమ్మకం మీలో పెరుగుతుంది. (1 దిన. 28:9; అపొ. 17:26, 27) యెహోవా మీరు చేసే ప్రతీ చిన్న ప్రయత్నాన్ని చూస్తున్నాడు. మీ మంచి లక్షణాల్ని బట్టి ఆయన మీకు దగ్గరవ్వాలనుకుంటున్నాడు.—యిర్మీ. 17:10. w24.10 25-26 ¶7-9

శుక్రవారం, అక్టోబరు 23

“వాళ్లు కాపరిలేని గొర్రెల్లా ఉండడంతో వాళ్లమీద జాలిపడ్డాడు.”—మార్కు 6:34.

మీకు యెహోవా మీద ప్రేమ ఉంది, ఇతరులకు సేవ చేయాలని కూడా ఉంది. మరి సేవ చేయాలనే మీ కోరికను ఎలా పెంచుకోవచ్చు? బ్రదర్స్‌సిస్టర్స్‌కి సేవ చేయడంలో వచ్చే ఆనందం గురించి ఒకసారి ఆలోచించండి. యేసు ఇలా అన్నాడు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొ. 20:35) తను చెప్పడమే కాదు దాన్ని చేసి చూపించాడు. ఇతరులకు సేవచేయడంలో ఆయన ఎంతో ఆనందాన్ని పొందాడు. మార్కు 6:31-34 లో ఉన్న ఉదాహరణ గమనించండి. ఆ సందర్భంలో యేసు, అపొస్తలులు బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి ఎవరూలేని ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తున్నారు. కానీ యేసు మాటలు వినడానికి, వాళ్లకన్నా ముందే ప్రజలు అక్కడికి పెద్ద గుంపుగా చేరుకున్నారు. నిజానికి యేసుకు, ఆయన శిష్యులకు అప్పుడు కనీసం “తినడానికి కూడా తీరిక లేకపోయింది.” కాబట్టి యేసు కావాలనుకుంటే వాళ్లను పంపించేయవచ్చు. లేదంటే, రెండు-మూడు విషయాలు చెప్పి ఊరుకోవచ్చు. కానీ ప్రేమతో “ఆయన వాళ్లకు . . . బోధించడం మొదలుపెట్టాడు,” “సాయంత్రం” అయ్యేవరకు బోధిస్తూనే ఉన్నాడు.—మార్కు 6:35. w24.11 16 ¶9-10

శనివారం, అక్టోబరు 24

“మీ పనికి ప్రతిఫలం దొరుకుతుంది.”—2 దిన. 15:7.

తల్లిదండ్రులారా, బైబిలు గురించి వేరేవాళ్లతో మాట్లాడడానికి అవకాశాల కోసం చూడమని పిల్లల్ని ప్రోత్సహించండి. (రోమా. 10:10) వేరేవాళ్లకు బైబిలు గురించి చెప్పడానికి చేసే ప్రయత్నాన్ని పియానో లేదా గిటార్‌ నేర్చుకోవడంతో పోల్చవచ్చు. మొదట్లో ఎవరైనా సింపుల్‌గా ఉండే పాటల్ని వాయించడం నేర్చుకుంటారు. కాలం గడిచేకొద్దీ బాగా వాయించగలుగుతారు. అదేవిధంగా ఎవరితోనైనా బైబిలు గురించి మాట్లాడేటప్పుడు మొదట్లో మీ పిల్లలు సింపుల్‌ పద్ధతుల్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వాళ్లు తమ క్లాస్‌మేట్‌ను ఇలా అడగొచ్చు: “చాలాసార్లు ఇంజనీర్లు ప్రకృతిలో ఉన్న డిజైన్‌లను కాపీ కొడతారని నీకు తెలుసా? ఒక మంచి వీడియో చూపించనా?” తర్వాత వాళ్లు సృష్టిలో అద్భుతాలు సిరీస్‌ నుండి ఒక వీడియో చూపించి ఇలా అడగొచ్చు: “ప్రకృతిలో ఉన్నవాటిని చూసి వస్తువులను తయారు చేసినందుకే ఇంజనీర్లను మెచ్చుకుంటే, మరి ప్రకృతిని చేసినందుకు ఎవర్ని మెచ్చుకోవాలి?” ఇలా సింపుల్‌గా మాట్లాడితే చాలు, బహుశా తన క్లాస్‌మేట్‌ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని అనుకోవచ్చు. w24.12 19 ¶17-18

ఆదివారం, అక్టోబరు 25

“ఒక మనిషి ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించాయి.”—రోమా. 5:12.

పాపం నుండి, మరణం నుండి మనల్ని విడిపించడానికి యెహోవా యేసును పంపించి, విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్క పరిపూర్ణ వ్యక్తి చనిపోతే ఎంతోమంది ప్రజలు ఎలా విడుదల పొందుతారు? అపొస్తలుడైన పౌలు ఇలా వివరించాడు: “ఒక్క మనిషి [ఆదాము] అవిధేయత ద్వారా అనేకులు పాపులైనట్టే, ఒక్క మనిషి [యేసు] విధేయత ద్వారా అనేకులు నీతిమంతులౌతారు.” (రోమా. 5:19; 1 తిమో. 2:6) ఇంకోమాటలో చెప్పాలంటే, ఒక్క పరిపూర్ణ వ్యక్తి అవిధేయత చూపించడం వల్ల మనుషులందరికీ పాపం, మరణం వచ్చాయి. కాబట్టి ఒక్క పరిపూర్ణ వ్యక్తి విధేయత చూపించడం వల్ల అందరూ విడుదల పొందుతారు. సింపుల్‌గా యెహోవా తన మాట వినే ఆదాము పిల్లల్ని శాశ్వతకాలం జీవించడానికి అనుమతించేయొచ్చు కదా? అలా చేసినా బాగుండేదని మనకు అనిపించవచ్చు. కానీ అలా చేస్తే, యెహోవా న్యాయానికి అది సరితూగదు. ఎందుకంటే ఆదాము చేసిన తప్పును యెహోవా చూసీచూడనట్టు వదిలేయలేడు. w25.01 21 ¶3-4

సోమవారం, అక్టోబరు 26

“మనం కనిపించేవాటిని బట్టి కాదుగానీ విశ్వాసంతో నడుచుకుంటున్నాం.”—2 కొరిం. 5:7.

అపొస్తలుడైన పౌలుకి జీవితంలో ఒక టైం వచ్చింది. అప్పుడు చావు ఆయన కళ్లముందు కనిపిస్తుంది. అయితే, ఆయన సంతృప్తితో కన్ను మూయడానికి మంచి కారణాలున్నాయి. ఎందుకంటే, ఆయన జీవితాన్ని ఒక్కసారి తిరగేసుకుంటూ ఇలా చెప్పాడు: “పరుగుపందెంలో చివరిదాకా పరుగెత్తాను, విశ్వాసాన్ని అనుసరించాను.” (2 తిమో. 4:6-8) అవును, పౌలు యెహోవా సేవలో ఎన్నో మంచిమంచి నిర్ణయాలు తీసుకున్నాడు. వాటినిబట్టి యెహోవా సంతోషించాడని కూడా ఆయనకు తెలుసు. మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకుని, యెహోవా మనసు గెలుచుకోవాలని అనుకుంటాం. మరి దాన్నెలా చేయవచ్చు? పౌలు తన గురించి, ఇతర నమ్మకమైన క్రైస్తవుల గురించి ఇలా చెప్పాడు: “మనం కనిపించేవాటిని బట్టి కాదుగానీ విశ్వాసంతో నడుచుకుంటున్నాం.” బైబిల్లో ‘నడుచుకోవడం’ అనే పదం కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో నిర్ణయించుకోవడాన్ని సూచిస్తుంది. విశ్వాసంతో నడుచుకునే వ్యక్తి యెహోవా దేవుని మీద నమ్మకంతో నిర్ణయాలు తీసుకుంటాడు. దేవుడు తనకు ప్రతిఫలం ఇస్తాడని, బైబిల్లో యెహోవా ఇచ్చిన సలహాలు పాటిస్తే తనకే మంచిదని ఆయన తన పనుల్లో చూపిస్తాడు.—కీర్త. 119:66; హెబ్రీ. 11:6. w25.03 20 ¶1-2

మంగళవారం, అక్టోబరు 27

“మీ ఆలోచనాతీరులో మార్పులు చేసుకుంటూ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోండి.”—రోమా. 12:2.

యెహోవా పవిత్రశక్తి సహాయంతో, ఒకప్పుడు క్రూర జంతువు లాంటి స్వభావం ఉన్న చాలామంది శాంతిగా మారి తమ జీవితంలో ఊహించని మార్పులు చేసుకున్నారు. (యెష. 65:25) తమలో ఉన్న అవలక్షణాల్ని తీసేసుకోవడానికి వాళ్లు చాలా గట్టిగా కృషిచేశారు. (ఎఫె. 4:22-24) నిజమే, దేవుని ప్రజలుగా మనం ఇంకా అపరిపూర్ణులం కాబట్టి పొరపాట్లు చేస్తుంటాం. అయితే ప్రేమ, శాంతి అనే బంధంలో యెహోవా “అన్నిరకాల” ప్రజల్ని ఐక్యం చేశాడు. దాన్ని తెంచేయడం ఎవ్వరి తరంకాదు! (తీతు 2:11) ఎందుకంటే, అలాంటి ఐక్యత సర్వశక్తిగల దేవుడు మాత్రమే చేయగల అద్భుతం! ఆయన ఏదైనా మాటిస్తే అది ఖచ్చితంగా నిజమౌతుంది! (యెష. 55:10, 11) ఇప్పటికే మనం ఆయన మాటిచ్చిన ఆధ్యాత్మిక పరదైసులో ఉన్నాం. ఎవ్వరికీ లేని ఒక అందమైన కుటుంబాన్ని యెహోవా మనకు ఇచ్చాడు. మనం ఆ కుటుంబంలో ఒకరిగా ఉన్నాం కాబట్టి క్రూరమైన ఈ లోకంలో కూడా శాంతిభద్రతలను అనుభవించగలుగుతున్నాం. (కీర్త. 72:7) అందుకే, మన కుటుంబంలోకి వీలైనంత ఎక్కువమంది రావాలని కోరుకుంటాం. దానికోసమే శిష్యుల్ని చేసే పని మీద మనం మనసుపెడతాం.—మత్త. 28:19, 20. w24.04 23 ¶13, 15

బుధవారం, అక్టోబరు 28

“మనకైతే క్రీస్తు మనసు ఉంది.”—1 కొరిం. 2:16.

యేసు నిండుమనసుతో యెహోవాను ప్రేమించాడు. తను ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో యేసుకు బాగా తెలుసు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పని చేసి తీరాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఇష్టం చేయడం మీదే ఆయన మనసుపెట్టాడు కాబట్టి తన ధ్యాస పక్కకు మళ్లేలా దేన్ని అనుమతించలేదు. పేతురు అలాగే మిగతా అపొస్తలులు యేసు పక్కనే ఉంటూ, ఆయన ఎలా ఆలోచిస్తాడో దగ్గరుండి చూడగలిగారు. పేతురు తన మొదటి ఉత్తరాన్ని రాస్తున్నప్పుడు క్రీస్తు ఆలోచనను ‘ఆయుధంలా ధరించమని’ క్రైస్తవుల్ని ప్రోత్సహించాడు. (1 పేతు. 4:1) “ఆయుధంగా ధరించండి” అనే మిలిటరీకి సంబంధించిన ఒక పదాన్ని పేతురు రాశాడు. కాబట్టి క్రైస్తవులు క్రీస్తులా ఆలోచించడం నేర్చుకుంటే తమ పాపపు కోరికలతో, సాతాను లోకంతో పోరాడేందుకు వాళ్ల దగ్గర ఒక శక్తివంతమైన ఆయుధం ఉన్నట్టే!—2 కొరిం. 10:3-5; ఎఫె. 6:12. w25.03 8-9 ¶1-3

గురువారం, అక్టోబరు 29

“మనిషి హృదయంలోని ఆలోచనలు లోతైన నీళ్లలాంటివి, వివేచన గలవాడు వాటిని పైకి చేదుతాడు.”—సామె. 20:5.

పెళ్లి చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం కోసం కలిసి సమయం గడుపుతున్నప్పుడు, వాళ్లమీద మీకున్న ఫీలింగ్స్‌ ఇంకా పెరగక ముందే, కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి అంటే వాళ్ల లక్ష్యాలు ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకోవచ్చు. వాళ్లు లోపల ఎలాంటివాళ్లో మనకెలా తెలుస్తుంది? వాళ్లతో నిజాయితీగా మనసువిప్పి మాట్లాడాలి. ప్రశ్నలు వేయాలి, వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినాలి. (యాకో. 1:19) దానికోసం మనం కొన్ని పనులు చేయవచ్చు. అంటే వాళ్లతో కలిసి భోజనం చేయడం, ప్రజలు ఎక్కువగా ఉండే చోట్ల వాళ్లతో కలిసి నడవడం, ఇంకా వాళ్లతో కలిసి ప్రీచింగ్‌లో పాల్గొనడం వంటివి చేసినప్పుడు మీరిద్దరూ ఫ్రీగా మాట్లాడుకోగలుగుతారు. ఫ్రెండ్స్‌తో, కుటుంబంతో కలిసి సమయం గడిపినప్పుడు కూడా ఒకరి గురించి ఒకరికి ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా వాళ్లు వేర్వేరు వ్యక్తులతో అలాగే వేర్వేరు సమయాల్లో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి సరదాగా ఏమైనా పనులు కలిసి చేయండి. w24.05 27-28 ¶6-7

శుక్రవారం, అక్టోబరు 30

“దేవునికి ప్రియమైన పిల్లల్లా ఆయన్ని అనుకరించండి.”—ఎఫె. 5:1.

ముందుముందు, ఎప్పుడూ లేనంతగా యెహోవా మీద ఆధారపడాల్సినన్ని కష్టాలు మనకు వస్తాయి. బైబిలు వృత్తాంతాలు అలాగే మనకాలంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ అనుభవాలు, తన సేవకుల్ని కాపాడడానికి యెహోవా ఎలా ఒక బండరాయిలా ఉన్నాడో, ఎలాంటి లక్షణాల్ని చూపించాడో అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఆ వృత్తాంతాల గురించి లోతుగా ఆలోచించండి. అలా చేసినప్పుడు యెహోవాను మీ బండరాయిగా చేసుకోగలుగుతారు. అలాగే సంఘాన్ని ఎంతో బలపర్చగలుగుతారు. ఉదాహరణకు, యేసు సీమోనుకు కేఫా అనే పేరు పెట్టాడు (దాన్ని అనువదిస్తే, “పేతురు”) అంటే “రాయి” అని అర్థం. (యోహా. 1:42) పేతురు సంఘంలో ఉన్నవాళ్లను ఓదార్చేలా, వాళ్ల విశ్వాసాన్ని స్థిరపరిచేలా తయారౌతాడని సూచిస్తుంది. సంఘపెద్దలు కూడా ‘పెద్ద బండ నీడలా ఉన్నారు’ అని బైబిలు చెప్తుంది. వాళ్లు సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ని ఎంతలా కాపాడతారో ఆ పదచిత్రం చూపిస్తుంది. (యెష. 32:2) నిజమే, సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ అందరూ యెహోవాకున్న బండరాయి లాంటి లక్షణాల్ని చూపిస్తే సంఘం కళకళలాడుతుంది. w24.06 28 ¶10-11

శనివారం, అక్టోబరు 31

“యెహోవా . . . సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు.”—ద్వితీ. 4:24.

నమ్మకస్థులని యెహోవా పిలిచిన ఇశ్రాయేలు రాజులు సత్యారాధనను అంటిపెట్టుకుని ఉన్నారు. నమ్మకంగా లేరని యెహోవా తీర్పుతీర్చిన చాలామంది రాజులు ఆయన ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి, అబద్ధ ఆరాధన వైపు తిరిగిన వాళ్లే. (1 రాజు. 21:25, 26; 2 దిన. 12:1) రాజులు సత్యారాధనను అంటిపెట్టుకుని ఉండడం యెహోవాకు ఎందుకంత ప్రాముఖ్యం? ఎందుకంటే, ప్రజల్ని సత్యారాధనలో నడిపించే బాధ్యత రాజులకు ఉంది. అంతేకాదు, అబద్ధ ఆరాధన వేరే ఘోరమైన పాపాలకు, అన్యాయాలకు దారితీస్తుంది. (హోషే. 4:1, 2) దాంతోపాటు ఇశ్రాయేలు రాజులు అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సమర్పించుకున్నవాళ్లు. కాబట్టి వాళ్లు అబద్ధ ఆరాధన చేస్తే, అది వ్యభిచారంతో సమానమని బైబిలు చెప్తుంది. (యిర్మీ. 3:8, 9) వ్యభిచారం చేసే వ్యక్తి తన జీవిత భాగస్వామి హృదయానికి మానని గాయం చేస్తాడు. అలాగే తనకు సమర్పించుకున్న వ్యక్తి అబద్ధ ఆరాధన చేస్తే, యెహోవాను విపరీతంగా బాధపెట్టినట్టు అవుతుంది.—ద్వితీ. 4:23. w24.07 22-23 ¶12-15

    తెలుగు ప్రచురణలు (1982-2027)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి