కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 155
  • ఇవ్వడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇవ్వడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఎప్పుడు ఉంటాయి?
  • ఎలాంటప్పుడు ఇవ్వడం సరైంది కాదు?
  • ఇచ్చే స్వభావం మీకు ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • ఉదారంగా ఇచ్చేవాళ్లు సంతోషంగా ఉంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 155
ఒకతను గిఫ్ట్‌ బాక్సుని పట్టుకుని ఉన్నాడు

ఇవ్వడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

ఇష్టంగా ముందుకొచ్చి, సరైన ఉద్దేశంతో వేరేవాళ్లకు ఏమైనా ఇవ్వడాన్ని బైబిలు ప్రోత్సహిస్తుంది. అలా ఇస్తే తీసుకున్నవాళ్లకే కాదు ఇచ్చినవాళ్లకు కూడా ప్రయోజనాలు ఉంటాయి. (సామెతలు 11:25; లూకా 6:38) యేసు ఇలా చెప్పాడు: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”—అపొస్తలుల కార్యాలు 20:35.

  • ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఎప్పుడు ఉంటాయి?

  • ఎలాంటప్పుడు ఇవ్వడం సరైంది కాదు?

  • ఇవ్వడం గురించిన కొన్ని బైబిలు వచనాలు

ఇవ్వడం వల్ల ప్రయోజనాలు ఎప్పుడు ఉంటాయి?

స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు ప్రయోజనాలు ఉంటాయి. “ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం” అని బైబిలు చెప్తుంది.—2 కొరింథీయులు 9:7.

హృదయపూర్వకంగా ఇవ్వడం, దేవునికి ఇష్టమైన ఆరాధనలో ఒక భాగం. (యాకోబు 1:27) అవసరంలో ఉన్నవాళ్లకు ఉదారంగా ఇచ్చేవాళ్లు దేవునితో చేయిచేయి కలిపి పనిచేస్తారు, ఆయన అలాంటి ఉదారతను తనకు అప్పు ఇచ్చినట్లుగా భావిస్తాడు. (సామెతలు 19:17) అలా ఇచ్చేవాళ్లకు దేవుడే తిరిగి చెల్లిస్తాడు అని బైబిలు చెప్తుంది.—లూకా 14:12-14.

ఎలాంటప్పుడు ఇవ్వడం సరైంది కాదు?

స్వార్థంతో ఇవ్వడం సరైంది కాదు. ఉదాహరణకు:

  • వేరేవాళ్లను మెప్పించడానికి ఇవ్వడం.—మత్తయి 6:2.

  • తిరిగి ఏదైనా ఆశించి ఇవ్వడం.—లూకా 14:12-14.

  • రక్షణను లేదా దేవుని ఆమోదాన్ని కొనడానికి ఇవ్వడం.—కీర్తన 49:6, 7.

దేవునికి ఇష్టంలేని పనులకు మద్దతుగా ఇవ్వకూడదు. ఉదాహరణకు జూదం ఆడేవాళ్లకు, మత్తు పదార్థాలు, లేదా తాగుడుకు బానిసలైన వాళ్లకు డబ్బులు ఇవ్వడం తప్పు. (1 కొరింథీయులు 6:9, 10; 2 కొరింథీయులు 7:1) అలానే, ఏదైనా పని చేసుకుని ఆర్థికంగా తనను తాను చూసుకోగలిగిన స్థితిలో ఉండి కూడా పనిచేయకుండా ఉండేవాళ్లకు ఇవ్వడం సరైంది కాదు.—2 థెస్సలొనీకయులు 3:10.

కుటుంబాన్ని చూసుకోకుండా ఇతరులకు ఇవ్వడం సరైంది కాదు. కుటుంబ పెద్దలు ఇంట్లో అవసరాలు చూసుకోవాలని బైబిలు చెప్తుంది. (1 తిమోతి 5:8) కానీ సొంత కుటుంబాన్ని చూసుకోకుండా వేరేవాళ్లకే ఎక్కువగా ఇవ్వడం సరైంది కాదు. అలానే, ఆస్తులన్నీ “దేవునికి సమర్పించిన కానుక” అని చెప్పి వయసుపైబడిన తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి నిరాకరించినవాళ్లను యేసు తప్పుపట్టాడు.—మార్కు 7:9-13.

ఇవ్వడం గురించిన బైబిలు వచనాలు

సామెతలు 11:25: “ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును.”

అర్థం: వేరేవాళ్లకు ఇవ్వడం వల్ల తీసుకున్నవాళ్లకే కాదు ఇచ్చినవాళ్లకు కూడా ప్రయోజనాలు ఉంటాయి.

సామెతలు 19:17: “బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.”

అర్థం: ఆపదలో ఉన్నవాళ్లకు సహాయం చేసేవాళ్లు స్వయంగా దేవునికే అప్పు ఇచ్చినవాళ్లు, అలాంటి ఉదారతను తిరిగి ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు.

మత్తయి 6:2: “నువ్వు దానధర్మాలు చేస్తున్నప్పుడు నీ ముందు బాకా ఊదించుకోవద్దు, వేషధారులు మనుషులచేత మహిమ పొందడం కోసం . . . అలా చేస్తుంటారు.”

అర్థం: వేరేవాళ్లు మనల్ని గొప్పగా చూడాలనే ఉద్దేశంతో ఇవ్వకూడదు.

అపొస్తలుల కార్యాలు 20:35: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.”

అర్థం: హృదయపూర్వకంగా ఉదారత చూపిస్తే సంతోషంగా ఉంటాం.

2 కొరింథీయులు 9:7: “ప్రతీ ఒక్కరు అయిష్టంగానో బలవంతంగానో కాకుండా తమ మనసులో ఎంత ఇవ్వాలని తీర్మానించుకుంటారో అంత ఇవ్వాలి. ఎందుకంటే సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం.”

అర్థం: ఎవరి బలవంతం లేకుండా ఇవ్వడమంటే దేవునికి ఇష్టం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి