కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwbq ఆర్టికల్‌ 156
  • నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?
  • బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు ఇచ్చే జవాబు
  • వాస్తవమా, కట్టుకథా?
  • జలప్రళయం ఎందుకు వచ్చింది?
  • జలప్రళయం వస్తుందని అప్పటి ప్రజలకు తెలుసా?
  • నోవహు ఓడ ఎలా ఉండేది?
  • ఓడ కట్టడానికి నోవహుకు ఎంతకాలం పట్టింది?
  • నోవహు ఓడ
    నా బైబిలు పుస్తకం
  • జలప్రళయం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వినలేదు?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • జలప్రళయం—వాస్తవమా, కల్పితమా?
    తేజరిల్లు!—1997
  • నోవహు విశ్వాసం లోకంపై నేరస్థాపన చేస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
బైబిలు ప్రశ్నలకు జవాబులు
ijwbq ఆర్టికల్‌ 156
ఏనుగులు, జిరాఫీలు, సింహాలు, పక్షులు ఓడలోకి వెళ్లడం

నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?

బైబిలు ఇచ్చే జవాబు

జలప్రళయం నిజంగా వచ్చింది. దుష్టుల్ని నాశనం చేయడానికి దేవుడే దాన్ని రప్పించాడు. అయితే మంచివాళ్లను, జంతువుల్ని కాపాడడానికి ఆయన నోవహుతో ఓడ కట్టమన్నాడు. (ఆదికాండము 6:11-20) జలప్రళయం నిజంగా వచ్చిందని మనం నమ్మవచ్చు, ఎందుకంటే ‘దేవుడు ప్రేరేపించి’ రాయించిన బైబిల్లో దాని గురించి ఉంది.—2 తిమోతి 3:16.

  • వాస్తవమా, కట్టుకథా?

  • జలప్రళయం ఎందుకు వచ్చింది?

  • జలప్రళయం వస్తుందని అప్పటి ప్రజలకు తెలుసా?

  • నోవహు ఓడ ఎలా ఉండేది?

  • ఓడ కట్టడానికి నోవహుకు ఎంతకాలం పట్టింది?

  • జలప్రళయం గురించిన కథలు, కట్టుకథలు, పుక్కిటి పురాణాలు

వాస్తవమా, కట్టుకథా?

నోవహు ఒక నిజమైన మనిషి అని, జలప్రళయం కట్టుకథ కాదు నిజమైన సంఘటన అని బైబిలు చెప్తుంది.

  • బైబిలు రాసినవాళ్లు నోవహు నిజమైన మనిషని నమ్మారు. ఉదాహరణకు, బైబిల్లోని కొంతభాగం రాసిన ఎజ్రా, లూకా అనే నైపుణ్యంగల చరిత్రకారులు ఇశ్రాయేలీయుల వంశావళి పట్టికల్లో నోవహు పేరు రాశారు. (1 దినవృత్తాంతములు 1:4; లూకా 3:36) సువార్త రచయితలైన మత్తయి, లూకా కూడా నోవహు గురించి, జలప్రళయం గురించి యేసు చెప్పిన మాటల్ని రాశారు.—మత్తయి 24:37-39; లూకా 17:26, 27.

    యెహెజ్కేలు ప్రవక్త, అపొస్తలుడైన పౌలు కూడా విశ్వాసం విషయంలో, నీతి విషయంలో నోవహు మంచి ఆదర్శమని పేర్కొన్నారు. (యెహెజ్కేలు 14:14, 20; హెబ్రీయులు 11:7) నోవహు నిజమైన మనిషి కాకపోతే, ఆయన ఆదర్శాన్ని పాటించమని వాళ్లు రాసివుండేవాళ్లా? నోవహు, విశ్వాసం చూపించిన ఇతర స్త్రీపురుషులు నిజమైన మనుషులు కాబట్టే వాళ్లు మనకు ఆదర్శంగా ఉన్నారు.—హెబ్రీయులు 12:1; యాకోబు 5:17.

  • జలప్రళయం గురించిన నిర్దిష్ట వివరాలు బైబిల్లో ఉన్నాయి. బైబిలు జలప్రళయం గురించి చెప్పేటప్పుడు, “అనగనగనగా” అంటూ కట్టుకథలా మొదలుపెట్టలేదు. బదులుగా, జలప్రళయానికి సంబంధించిన సంఘటనలు ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తేదీన జరిగాయో బైబిలు చెప్తుంది. (ఆదికాండము 7:11; 8:4, 13, 14) అంతేకాదు, నోవహు కట్టిన ఓడ కొలతలు కూడా అందులో ఉన్నాయి. (ఆదికాండము 6:15) కాబట్టి, బైబిలు ప్రకారం జలప్రళయం ఒక కట్టుకథ కాదు వాస్తవ సంఘటన అని తెలుస్తోంది.

జలప్రళయం ఎందుకు వచ్చింది?

జలప్రళయానికి ముందు “నరుల చెడుతనము ... గొప్పది” అని బైబిలు చెప్తోంది. (ఆదికాండము 6:5) అంతేకాదు, భూమి హింసతో, లైంగిక పాపాలతో నిండిపోయి “దేవుని సన్నిధిని చెడిపోయియుండెను” అని అది చెప్తోంది.—ఆదికాండము 6:11; యూదా 6, 7.

ఈ సమస్యకు ముఖ్య కారణం, చెడ్డదూతలు మానవ స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి పరలోకాన్ని విడిచిరావడమే అని బైబిలు చెప్తోంది. దానివల్ల వాళ్లకు నెఫీలీయులు అనే పిల్లలు పుట్టారు, వీళ్లు అప్పట్లో భూమ్మీద విధ్వంసం సృష్టించారు. (ఆదికాండము 6:1, 2, 4) కాబట్టి దేవుడు భూమ్మీది నుండి దుష్టత్వాన్ని తుడిచేసి, మంచివాళ్లు కొత్త జీవితం ఆరంభించేలా చేయాలనుకున్నాడు.—ఆదికాండము 6:6, 7, 17.

జలప్రళయం వస్తుందని అప్పటి ప్రజలకు తెలుసా?

తెలుసు. జలప్రళయం రాబోతుందని, తమ కుటుంబాన్నీ జంతువుల్నీ కాపాడడానికి ఒక ఓడ కట్టమని దేవుడు నోవహుకు చెప్పాడు. (ఆదికాండము 6:13, 14; 7:1-4) రాబోతున్న ఆ నాశనం గురించి నోవహు ప్రజల్ని హెచ్చరించాడు, కానీ వాళ్లు లెక్కచేయలేదు. (2 పేతురు 2:5) వాళ్ల గురించి బైబిలు ఇలా చెప్తోంది: “జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ కొట్టుకొనిపోయే వరకు వాళ్లు ఏమీ పట్టించుకోలేదు.”—మత్తయి 24:37-39.

నోవహు ఓడ ఎలా ఉండేది?

ఓడ దీర్ఘచతురస్రాకారంలో పెద్ద పెట్టెలా ఉండేది. దాని పొడవు దాదాపు 133 మీటర్లు (437 అడుగులు), వెడల్పు 22 మీటర్లు (73 అడుగులు), ఎత్తు 13 మీటర్లు (44 అడుగులు).a దాన్ని చితిసారకపు మ్రానుతో చేసి లోపల, బయట కీలు పూశారు. అందులో మూడు అంతస్థులు, చాలా గదులు ఉండేవి. దానికి ఒకవైపు తలుపు ఉండేది; పైకప్పుకు దగ్గర్లో, దాని పొడవునా ఒక కిటికీ ఉండవచ్చు. ఓడ మీద పడే నీళ్లు కారిపోయేలా, ఆ పైకప్పు మధ్యలో కాస్త ఎత్తుగా, అంచుల వైపు ఏటవాలుగా ఉండివుండవచ్చు.—ఆదికాండము 6:14-16.

నోవహు ఓడ, జెట్‌ ప్లేన్‌, ఏనుగు పొడవు చూపించే చార్టు

ఓడ కట్టడానికి నోవహుకు ఎంతకాలం పట్టింది?

ఓడ కట్టడానికి నోవహుకు ఎంతకాలం పట్టిందో బైబిలు చెప్పట్లేదు, అయితే దానికి కొన్ని దశాబ్దాలు పట్టివుండొచ్చు. నోవహుకు 500 ఏళ్లు దాటాక అతని మొదటి కొడుకు పుట్టాడు, జలప్రళయం వచ్చినప్పుడు నోవహు వయసు 600 ఏళ్లు.b—ఆదికాండము 5:32; 7:6.

నోవహు ముగ్గురు కొడుకులు ఎదిగి, వాళ్లకు పెళ్లిళ్లు అయ్యాక, దేవుడు నోవహును ఓడ కట్టమన్నాడు; దానికి దాదాపు 50 లేదా 60 ఏళ్లు పట్టివుంటుంది. (ఆదికాండము 6:14, 18) అదే నిజమైతే, ఓడ కట్టడానికి 40 లేదా 50 ఏళ్లు పట్టివుంటుందనే ముగింపుకు రావచ్చు.

జలప్రళయం గురించిన కథలు, కట్టుకథలు, పుక్కిటి పురాణాలు

జలప్రళయం గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా కథలు వాడుకలో ఉన్నాయి; అవి బైబిలు చెప్పేదానికి భిన్నంగా ఉన్నా, కొన్ని అంశాల్లో మాత్రం పోలికలు ఉన్నాయి. నోవహు వంశస్థులు భూమంతటికీ విస్తరించినప్పుడు వాళ్లు జలప్రళయం కథను మళ్లీమళ్లీ చెప్పివుంటారు. కొంతకాలానికి ఆ కథ మార్పులకు గురై, దాన్నుండి రకరకాల కథలు పుట్టుకొచ్చాయి. కొన్ని ఉదాహరణలు గమనించండి.

గ్రీకు పురాణం: జలప్రళయం నుండి తప్పించుకున్న ఒక పురుషుణ్ణి, స్త్రీని తమ వెనక్కి రాళ్లు విసరమని, అలా భూమిని మళ్లీ ప్రజలతో నింపమని ఆదేశిస్తారు. తర్వాత ఆ రాళ్లు పురుషులుగా, స్త్రీలుగా మారిపోతాయి.

హిందూ పురాణం: జలప్రళయం మానవజాతిని నాశనం చేస్తుందని చేప ఒకతణ్ణి హెచ్చరిస్తుంది. ఆ చేప ఒక పడవ కట్టమని అతనికి చెప్తుంది. చేప ఆ పడవను సురక్షితంగా నడిపించడంతో ఆ మనిషి తప్పించుకుంటాడు.

బబులోను పురాణం: జలప్రళయం నుండి తప్పించుకున్న ఒక పురుషుడు, స్త్రీ అమర్త్యతను పొంది దేవుళ్లు అవుతారు.

సెంట్రల్‌ అమెరికా పురాణం: ఒకతను, అతని భార్యాపిల్లలు జలప్రళయాన్ని తప్పించుకుంటారు; మిగతా మనుషులందరూ చేపలుగా మార్చబడతారు.

a బైబిలు ఓడ కొలతల్ని మూరల్లో చెప్తుంది. “ప్రామాణిక హీబ్రూ మూర 17.5 అంగుళాలు (44.45 సెంటీమీటర్లు) ఉండేది.”—ద ఇలస్ట్రేటెడ్‌ బైబిల్‌ డిక్షనరీ, రివైజ్డ్‌ ఎడిషన్‌, 3వ భాగం, 1635వ పేజీ.

b నోవహు లాంటి వాళ్ల ఆయుష్షు గురించి తెలుసుకోవడానికి, తేజరిల్లు! అక్టోబరు – డిసెంబరు 2007 సంచికలోని “వారు నిజంగా అంతకాలం జీవించారా?” అనే ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి